సాక్షి, న్యూఢిల్లీ: పోలవరంపై లోక్‌సభలో వంగా గీత ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. ‘‘భూసేకరణ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలో వేయాలని రాష్ట్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపలేదు’’ అని గజేంద్రసింగ్ తెలిపారు.
‘‘భూసేకరణ కింద 3,779 కోట్ల రూపాయల బిల్లులు రీయింబర్స్‌మెంట్ కోసం రాష్ట్రం సబ్మిట్ చేసింది. అందులో 3,431.59 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేసింది. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీ కింద 2,267 కోట్ల రూపాయల బిల్లులను రీయింబర్స్‌మెంట్ కోసం పంపారు. అందులో 2,110 కోట్ల రూపాయల బిల్లులకు చేశాం. పిఐఏ, సీడబ్ల్యూ సిఫారసుల ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులను వెరిఫై చేసి చెల్లిస్తున్నాం’’ అని లోక్‌సభలో గజేంద్రసింగ్ వెల్లడించారు.
చదవండి: కోతలు.. కొత్త పథకాలు
Comments
Please login to add a commentAdd a comment