పవన్‌ను పట్టించుకోవాల్సిన పనిలేదు: మిథున్‌ రెడ్డి  | YSRCP MP Mithun Reddy Political Counter To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ను పట్టించుకోవాల్సిన పనిలేదు: మిథున్‌ రెడ్డి 

Published Sat, Apr 13 2024 1:59 PM | Last Updated on Sat, Apr 13 2024 4:07 PM

YSRCP MP Mithun Reddy Political Counter To Pawan Kalyan - Sakshi

సాక్షి, కాకినాడ: ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి. పవన్‌ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. 

కాగా, మిథున్‌ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్‌ కల్యాణ్‌ రాక ముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్‌ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. 

పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్‌. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్‌ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడటం విడ్డూరం ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్‌ కల్యాణ్‌’ అంటూ కౌంటరిచ్చారు. 

ఈనెల 19వ తేదీన కాకినాడ రూరల్‌లో మేమంతా సిద్దం సభ ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో పాల్గొంటారు. రాజకీయాల్లో మేమంతా సిద్ధం యాత్ర ఒక గేమ్‌ ఛేంజర్‌. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement