Pithapuram Assembly Constituency
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్ క్లాస్ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్‌టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
నటుడు పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇది నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది పక్కనబెడితే తాజాగా వైఎస్సార్సీపీ నాయకురాలు, నటి శ్యామల.. పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని కూడా అన్నారు.(ఇదీ చదవండి: పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..)'వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కల్యాణ్.. మిగతా సినిమా వాళ్లని ఎందుకు తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. ఆమెని ఓడించడం ఎవరి వల్ల కాదు. గీత.. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చేశారో అందరికీ తెలుసు. అందుకే ఆమెకు భారీ మెజారిటీ రావాలని నేను కూడా ప్రచారం చేస్తున్నాను. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. ఆ అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యం' అని శ్యామల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు) -
పవన్‌ను పట్టించుకోవాల్సిన పనిలేదు: మిథున్ రెడ్డి
సాక్షి, కాకినాడ: ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి. పవన్ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. కాగా, మిథున్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్ కల్యాణ్ రాక ముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్ కల్యాణ్‌ను వాళ్ల కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం విడ్డూరం ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్ కల్యాణ్’ అంటూ కౌంటరిచ్చారు. ఈనెల 19వ తేదీన కాకినాడ రూరల్‌లో మేమంతా సిద్దం సభ ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో పాల్గొంటారు. రాజకీయాల్లో మేమంతా సిద్ధం యాత్ర ఒక గేమ్ ఛేంజర్. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం అని అన్నారు. -
పవన్ కల్యాణ్ మగాడే అయితే.. ముద్రగడ సవాల్
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ మగాడే అయితే నేరుగా తన మీద మాట్లాడాలంటూ ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దమ్ముంటే.. మగాడే అయితే నేరుగా నా మీద మాట్లాడాలి. పవన్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంత వరకు సబబు?. హైదరబాద్‌లో అవమానం జరిగినప్పుడు, ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్‌కు ఏమయ్యాయి. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? అంటూ ముద్రగడ పవన్‌ను నిలదీశారు. -
పవన్.. చిత్తశుద్ధే తారుమారు! పిఠాపురంలో కష్టాలే..
కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాన్ని ఏరి కోరి ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లోనూ కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకునే ఆయన బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ మొదటినుంచీ కాపు వ్యతిరేకి అయిన చంద్రబాబుతో అంటకాగడం వల్లనే కాపు మేథావులు పవన్ కల్యాణ్‌ను దూరం పెడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కాపుల ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగా హత్యకేసులో అన్నీ వేళ్లూ చంద్రబాబు నాయుడివైపే చూపిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఆ చంద్రబాబుతోనే జట్టు కట్టి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడంకోసం కాపుల రాజకీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై కాపుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తనకు కులాలు మతాలు లేవంటారు పవన్ కల్యాణ్. ఆ వెంటనే నేను రెల్లి కులస్థుడినంటారు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్లకోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తే.. కాపులకు రిజర్వేషన్లేంటి? కులాల పేరుతో ఉద్యమాలేంటి? అంటూ పోజు కొట్టారు పవన్ కల్యాణ్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు రిజర్వేషన్లు ఏమయ్యాయంటూ అమాయకంగా అడిగారు ఇదే పవన్. వంగవీటి రంగా అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఒకసారి.. ఓ సారి రంగా మా ఇంటికి వస్తే టీ ఇచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. వంగవీటి రంగా దారుణ హత్య వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని రంగా హత్య జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్న కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో కాపు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రంగాతో పాటు తనని కూడా హతమార్చడానికి చంద్రబాబు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నరాన్న అభియోగంపై జైలుకెళ్తే పవన్ కల్యాణ్ చాలా బాధపడ్డారట. రంగా హత్యోదంతం నేపథ్యంలో కాపులు చంద్రబాబును ఏవగించుకుంటున్నారని గమనించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని కాపులు - కమ్మలు కలిసి ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించాలంటే కాపులు - కమ్మలు చేతులు కలపాల్సిందేనని పవన్ థియరీని విడుదల చేశారు. కాపుల్లో రంగాకి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అటువంటినేతను చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకున్నారన్న కోపం కూడా కాపుల్లో ఉంది. కాపు ఓట్లతోనే గెలవగలను అనుకుంటోన్న పవన్ పిఠాపురం సీటును ఎంచుకున్నది చంద్రబాబు సలహాతోనే అంటున్నారు. అయితే కాపుల్లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని సంక్షోభంలో ఉన్న టీడీపీకి మద్దతు పలికారు పవన్ కల్యాణ్. అయినా ఎన్నికల పొత్తులో కనీసం ఓ 60 సీట్లు కూడా సాధించుకోకుండా ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి. అదికూడా చంద్రబాబును సీఎంని చేయడానికి పవన్ పరితపిస్తోన్న తీరు కాపులకు నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడి కోసం, కాపులకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలను సైతం పవన్ దూరం పెట్టేశారు. అంతే కాదు వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. మైక్ పట్టుకుని ఉపన్యాసాలు దంచేటపుడు తాను విశ్వమానవుడినని పవన్ చెబుతూ ఉంటారు. కొద్ది నిముషాల్లోనే అది మర్చిపోయి కులాల ప్రస్తావన తెస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డిపై ద్వేషంతో ఆయన నియోజక వర్గం అయిన పులివెందులను దూషిస్తూ పైశాచికానందాన్ని పొందుతూ ఉంటారు. కాపులకోసం పవన్ కల్యాణ్ ఏనాడూ చిత్తశుద్ధిగా పనిచేయలేదు కాబట్టే భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో కాపులు కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. అందుకే ఆయన ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ అదే రిపీట్ అవుతుందంటున్నారు పాలక పక్ష నేతలు. ఇవి చదవండి: నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త! -
PK: పిఠాపురం గోళీలు పని చేయట్లేదా?
కాకినాడ, సాక్షి: జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్నదంతా పదేళ్లుగా ఆ పార్టీని వెంటపెట్టుకుని తిరిగిన వాళ్లెవరికీ సహించడం లేదు. సీఎం అవుతాడని కలలుగన్న అభిమానుల ఆశలు పటాపంచల్ చేస్తూ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తుకు వెంపర్లాడడం.. ఇటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. గత ఎన్నికల్లో 130 ఫ్లస్ సీట్లకు పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం కావడాన్ని జనసేన కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. పోనీ ఆ 21 సీట్ల కేటాయింపులో అయినా జెన్యూన్‌గా ఉన్నాడా? అంటే అదీ లేదు. కనీసం రెండు పదుల స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఎంపిక చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు పవన్. అదే సమయంలో.. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్లకు.. అధికార వైఎస్సార్సీపీ ఫిరాయించిన వాళ్లకు సీట్లిచ్చి ఆయా స్థానాల్లో పాతుకుపోయిన జనసేన కేడర్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రాజీనామాల పర్వంతోనూ పవన్‌కు నిరసన తగిలింది. పోనీ తన సీటు విషయంలో అయినా కచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడా? అంటే అదీ లేదు. అసలు పిఠాపురంలో పోటీ చేయడం పవన్ నామినేషన్ వేసే దాకా అనుమానమే అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. భీమవరం, గాజువాక ఓటర్లకు భరోసా ఇవ్వలేకపోయిన పవన్.. ఇప్పుడు పిఠాపురం ఓటర్లకు ఏం భరోసా ఇస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారాహి పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి రెండ్రోజులు మామూలు హడావిడి చేయలేదు. బహిరంగ సభతో పాటు ఆటోలెక్కి రోడ్ల మీద ఓ హడావిడి చేశాడు. అదేంటో.. ఆ రెండ్రోజులు తిరగక మునుపే జ్వరం పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. పార్టీ నిర్వహణను నాదెండ్ల మనోహర్‌కు.. నియోజకవర్గ ప్రచార బాధ్యతలను తనపై గుర్రుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అప్పగించారు. అంటే పిఠాపురంలో గెలుపుపై పవన్ ఆశలు వదిలేసుకున్నట్లేనా?.. ఆ మాత్రం జ్వరానికి పవన్‌కు పిఠాపురంలో గోళీలు దొరకవా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. చంద్రబాబుకి బానిసత్వం ప్రదర్శించడంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. బాబు నుంచి వెన్నుపోటు రాజకీయం నేర్చుకుని దానిని జనసేన కేడర్‌పైనే ప్రయోగిస్తున్నారు. తన చుట్టూరా ఎప్పుడూ బౌన్సర్లను ఉంచుకునే పవన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ఎవరినీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది పార్టీ మీటింగ్‌లలో తనపై బ్లేడ్లతో దాడి జరిగిందంటూ ఆరోపణలకు దిగడం మరో కొసమెరుపు. ఈ ఆరోపణల్ని జనసేన శ్రేణులు సైతం స్వాగతించడం లేదు. పోనీ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు. ఇక.. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే ట్యాగ్‌లకు అదనంగా ఇప్పుడు అదనంగా బ్లేడ్ బాబ్జీ అంటూ పవన్‌కు మరో ట్యాగ్ తగిలించారు. అట్లుంటది ప్యాకేజీ స్టార్‌తో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలా పవన్ ఇటు జనాల్లో.. అటు జనసేన శ్రేణుల్లో రాజకీయంగా మరి చులకనైపోతున్నాడు. -
పవన్.. ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. చివరికి జనసేన కార్యకర్తలను ఆయన బ్లేడ్ బ్యాచ్‌లతో పోల్చుతున్నారు. ఇది అమాయకత్వంగా చేసినా లేక అహంభావంతో చేసినా పవన్‌కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలకు అర్దం అయిపోతోంది. జనం ఎక్కువ మంది తన వద్ద పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్ తీసుకు వచ్చి తనను, తన సిబ్బందిని గాయపరుస్తున్నారని దారుణమైన ఆరోపణ చేశారు. ప్రత్యర్ధి పార్టీ పన్నాగాలు తెలుసు కదా! అంటూ ముక్తాయింపు ఇచ్చారు. నిజానికి ఆయన వద్దకు వెళ్లేవారంతా మెజార్టీ సినిమా అభిమానులే. లేదా జనసేన కార్యకర్తలు. నిజంగానే వచ్చినవారు ఎవరితోనైనా ప్రమాదం ఉందని భావిస్తే, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకుని, ఎవరి వద్ద అయినా అభ్యంతరకర వస్తువులు ఉంటే తీసేసుకోవచ్చు. అలా చేయకుండా తనను అభిమానంతో చూడడానికి వచ్చినవారిని బ్లేడ్ బ్యాచ్‌తో పోల్చడం కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఈయన ఈ ప్రకటన చేశారో తెలుసా? కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ బస చేసిన చోట జనసేన కార్యకర్తలు కొంతమంది గుమికూడి ఆయనను కలవడానికి ప్రయత్నించారట. ఆయన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు వారిని అనుమతించలేదు. గంటల సేపు వేచి చూసినా తమ నాయకుడిని కలుసుకోలేకపోయారు. అంతలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తన అనుచరులతో కలిసి పవన్ కల్యాణ్ బసకు వచ్చారట. వెంటనే ఆయనను, అనుచరులను లోనికి పంపించేశారట. అది చూసి ఒళ్లు మండిన ఒక జనసేన కార్యకర్త తమకు ఇంత అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఒక ఆడియో టేప్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. ఆయన దృష్టికి కూడా అది వెళ్లి ఉండాలి. దాంతో ఆయన స్వరం మార్చి కొత్త రాగం ఆలపించారన్నమాట. 'నిజంగానే ఎవరైనా బ్లేడ్ తీసుకుని ఆయన చేతిమీదో, లేక సెక్యూరిటీ సిబ్బంది చేతుల మీదో కోస్తే గాయం అవుతుంది కదా! అప్పుడు రక్తం వస్తుంది కదా! లేదా బట్టలు చిరుగుతాయి కదా! ఇన్నాళ్లుగా ఒక్కసారైనా అలాంటివి జరిగినట్లు పవన్‌కల్యాణ్ చెప్పలేదే!' పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు జరిగిన అవమానం నుంచి దారి మళ్ళించేందుకు పవన్ ఈ కొత్త డ్రామా ఆడాడని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది. 'పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరిని కలవాలన్నది తన కోరిక అని, ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలన్నది తన అభిలాష' అని చెప్పారు. వచ్చిన జనసైనికులను కలవడానికి ఇష్టం ఉండదు కానీ, ఓట్ల కోసం పిఠాపురం ప్రజలందరితో ఫోటో దిగాలని ఉందని అంటే ఎవరు నమ్ముతారు? నిజంగానే అలా ఉంటే ప్రతీ ఊరుకు వెళ్లి అక్కడివారితో ఫోటో దిగండి. ఎవరు అడ్డుపడుతారు? అదే ఎన్నికల ప్రచారం అనుకోండి.. అప్పుడు పిఠాపురం అవసరాలు, సమస్యల గురించి తెలుసుకోవలసిన అవసరం లేకుండా పోతుందేమో! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 'టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మను ఇదే పవన్‌కల్యాణ్ 2019 ఎన్నికలలో పేకాట క్లబ్‌లు నడిపే వ్యక్తిగా అభివర్ణించి అవమానించారు. ఇప్పుడు అదే వర్మను తనను గెలిపించాలని వేడుకుంటున్నారు'. గతంలో సముద్రం ఎవరి వద్దకు రాదు.. పర్వతాలు ఎవరికి తలవంచవు అంటూ డైలాగులు చెప్పిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం నేతలను బతిమిలాడుకుంటున్నారు. తన జనసైనికుల మీద కన్నా టీడీపీ వారే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. తన గెలుపు బాధ్యత వర్మ చేతులలో పెడుతున్నానని ఆయన చెప్పారు. ప్లీజ్.. ఈ ఒక్కసారైనా తనను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నానని అంటున్నారు. ఎందుకింత బేలతనం! 'ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నలుగురిని గెలిపించాల్సిన తమ నేతే ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి సంకేతం పంపుతుంది'! జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ గురించి ఆయన మాట్లాడుతూ గ్లాస్ పగిలితే మరింత పదును తేలుతుందని ఓ పిచ్చి డైలాగు చెప్పారు. పగిలిన గ్లాస్ ఎవరికి ఉపయోగపడదు. జాగ్రత్తగా, ఎవరికీ ప్రమాదం లేకుండా ఆ ముక్కలను బయట పడేస్తారు. పగిలిన గ్లాస్ ముక్కను జనసేన కార్యకర్తలు పట్టుకున్నా, వారికి చేతులు తెగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఆ సంగతి కూడా తెలియకుండా సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం. 'పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ గతంలో భీమవరంలో పోటీచేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటే ఎవరు నమ్ముతారు?' సినిమా షూటింగ్‌లు మానుకుని ఇక్కడ ఉంటానంటే నమ్మడానికి ప్రజలు కాదు కదా, జనసైనికులు కూడా విశ్వసించరు. తమ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. సంతోషమే. కానీ 'పదేళ్ల జనసేన ప్రస్తానంలో ఎందరు నాయకులు తయారయ్యారు. చివరికి టీడీపీ నుంచి పొందిన ముష్టి 24 సీట్లలో మూడు తగ్గించుకుని, అందులో కూడా ఓ ఆరేడు సీట్లు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి'. పొత్తులో ఉన్న పార్టీల నుంచి నేతలను ఎవరైనా తీసుకుంటారా?అలా చేశారంటే ఏమిటి దాని అర్దం! జనసేనకు నేతలు లేరనే కదా? ఉన్న జనసేన నేతలు పనికిరారని పవన్ భావిస్తున్నట్లే కదా? జనసేనలో కొత్తగా చేరిన టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్‌కు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ సీటును కూడా జనసేనలో చేరిన టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు ఇవ్వబోతున్నారట. టీడీపీతో సన్నిహితంగా మెలిగిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి టిక్కెట్ ఇచ్చారు. భీమవరంలో టీడీపీ నేత పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి టిక్కెట్ ఇవ్వడంపై అక్కడి జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మచిలీపట్నం లోక్‌సభ సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి కేటాయించారు. ఇవన్నీ గమనిస్తే ఏమి తెలుస్తుంది? పదేళ్లలో పట్టుమని పది నియోజకవర్గాలలో జనసేన నుంచి నేతలను తయారు చేసుకోలేకపోయారనే కదా! ఈ పాటి దానికి ఇంత బిల్డప్ అవసరమా అని కొందరు సామాన్యులు ఎద్దేవ చేస్తున్నారు!. 'షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కానీ, తాను అలా చేయలేదని పవన్‌కల్యాణ్ అంటున్నారు. ఆమె పార్టీని విలీనం చేసినా, పవన్‌కల్యాణ్ టీడీపీలో విలీనం చేయకుండా ఆ పార్టీకి తాకట్టు పెట్టినా పెద్ద తేడా ఏముందన్నది విశ్లేషకుల ప్రశ్న'. 2019లో సుమారు 140 నియోజకవర్గాలలో పోటీచేసిన జనసేన 2024లో పద్దెనిమిది నియోజకవర్గాలలో సొంత నేతలను పోటీలో ఉంచలేకపోయింది. ఈ సంగతి ప్రజలకు తెలియదా! పవన్‌కల్యాణ్ ఎంతగా భయపడుతున్నారంటే, మతపరమైన రాజకీయాలు చేయడానికి వెనుకాడడం లేదు. గుడులలో ఏదో జరిగిందని, దోషులను పట్టుకోలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి వచ్చారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్ మొత్తం మీద తిరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తన గ్లాస్ పగిలిపోయిందని పవన్ కల్యాణే ఒప్పుకుంటున్నారు. తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్‌లు తిరుగుతున్నాయని ఆయనే చెబుతున్నారు కనుక, ఆయన అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండడమే బెటర్!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పిఠాపురంలో ‘సేనాని’ పిల్లి మొగ్గలు
చంద్రబాబుతో రాజకీయ సావాసం అంటే చీకట్లో వెళ్తూ దెయ్యాన్ని తోడుతెచ్చుకున్నట్లే.. ఈ విషయం గతంలో బీజేపీకి.. కమ్యునిస్టులకు.. కాంగ్రెసుకు.. అందరికీ అవగతమైంది. పవన్ కల్యాణ్‌కు కూడా కాసింత అర్థం అయినట్లు అప్పుడప్పుడు ప్రవర్తిస్తూనే.. తనకు తోడుగా ఆ దెయ్యమైనా ఉంది.. పూర్తి ఒంటరిని కాదు కదా అనుకుంటూ దాంతోనే సావాసం, ప్రయాణం అనివార్యమైంది. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. ఇదిలా ఉండగా టీడీపీ ఇంచార్జ్ వర్మ కూడా ఇప్పుడు పవన్‌కు పెద్ద నాయకుడైపోయారు. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన పవన్ గెలుపు ఇప్పుడు వర్మ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. వర్మ చేతిలో పాతికవేలకుపైగా ఓట్లున్నాయనేది ఒక అంచనా.. గతంలో ఆయనకు అన్ని ఓట్లు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళా అవి ఆయనకు వస్తాయా రావా అనేది వేరే ప్రశ్న. కానీ, ఇప్పుడు పవన్ గెలవాలంటే వర్మ ఒక్కరే మనస్ఫూర్తిగా పని చేయాలి. అలా ఆయన చేస్తేనే వంగా గీత మీద పవన్ గెలిచేందుకు కొంతమేరకు అవకాశాలు ఉంటాయి. కానీ, తన వేలితో తన కన్ను పొడుచుకునేందుకు వర్మ ఏమైనా అమాయకుడా? పవన్ కానీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడే పోటీ చేస్తారు. అంటే అప్పుడు కూడా వర్మకు పోటీ చేసే అవకాశం ఉండదు. ఆ విధంగా పవన్‌ను గెలిపించడం ద్వారా వర్మ తన కెరీర్‌ను ముగించుకునేందుకు సిద్ధపడతారా?. అందుకే వర్మ కూడా ఇప్పుడు పవన్‌ను గెలిపించేందుకు నిజాయితీగా పని చేస్తారని నమ్మడానికి లేదని జనసైనికులు అంటున్నారు. వర్మ కూడా చంద్రబాబు శిష్యుడే.. కాబట్టి చంద్రబాబు సూచనల మేరకు పవన్ గెలుపు కన్నా ఆయన కూటమికే పని చేస్తారన్న అనుమానాలున్నాయి. పవన్ గెలిస్తే అటు లోకేష్‌కు కూడా పోటీగా వచ్చే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తారని, అందుకే పవన్ కోసమే పని చేస్తున్నట్లు కనిపించాలి కానీ చివరికి ఓటమిని కానుకగా ఇవ్వాలని లోలోన వర్మకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ గెలుపు అంత వీజీ కాదని సైనికులు అంటున్నారు. గెలిపిస్తాను అని చెబుతూనే వర్మ చివరి నిమిషంలో తనవాళ్లను పక్కకు తప్పించి పవన్‌ను ఓటమి సముద్రంలో ముంచేసే ప్రమాదముందని అంటున్నారు. అందుకే పవన్ ఇప్పుడు పిఠాపురంలో పిల్లిమొగ్గలు వేయక తప్పడం లేదు. -సిమ్మాదిరప్పన్న. -
Pawan Kalyan: ప్లేటు మార్చిన పవన్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందా?.. తాజా పరిణామాలన్నీ అవుననే చెబుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై జనసేనాని తర్జనభర్జన పడుతున్నారు. తొలుత అక్కడి నుంచే బరిలో నిల్చుంటానని ప్రకటించి.. రెండ్రోజులు గడవక ముందే ప్లేట్ ఫిరాయించాడు. వరుసగా తగులుతున్న షాక్ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తాననే సాకు చూపించి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. పిఠాపురంలో మారిన సమీకరణాలు.. పవన్ వ్యవహార శైలి కారణంగా పిఠాపురంలో జనసేనకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక కాపు నేతలందరూ జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా పిఠాపురం జనసేన మాజీ ఇన్చార్జ్ మాకినీడు శేషు కుమారి వైఎస్సార్సీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శేషుకుమారి పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 28వేల ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు సిద్దాంతం లేదు.. నిబద్దత లేదు. జనసేనకి విధివిధానాలు లేవని మండిపడ్డారు. వర్మ వార్నింగ్.. మరోవైపు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ముందు నుంచి పిఠాపురంలో బలమైన నేతగా ఉన్నారు. ఈసారి పిఠాపురం టికెట్ తనకే వస్తుందనే ఆశ పెట్టుకున్నారు. కానీ, కూటమి పొత్తులో భాగంగా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వర్మ, ఆయన మద్దతుదారులు చంద్రబాబు, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు మంతనాల కారణంగా వర్మ కాస్తా చల్లబడ్డారు. కానీ, తాజాగా వర్మ మరో బాంబు పేల్చారు. పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’ అని వర్మ ట్విస్ట్ ఇచ్చారు. వంగా గీత కౌంటర్.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత.. పవన్‌కు కౌంటరిచ్చారు. పవన్ నన్ను జనసేనలోకి రావాలని కోరుతున్నారు. నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాను 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నానని.. చిరంజీవి గుర్తించి ప్రజారాజ్యంలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌వి అన్నీ దింపుడు కల్లం ఆశలే. పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఇక, పవన్ తీరుతో విసుగెత్తి ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పవన్ వ్యవహారశైలి, నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు ఒక్కొక్కరుగా సీఎం జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు. దీంతో, పవన్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది. పవన్ కొత్త స్టోరీ.. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటమి భయంతో పవన్ ఓ కొత్త స్టోరీ చెబుతున్నారు. ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. దీంతో, జనసైనికులు తలలు పట్టుకున్నారు. మరోవైపు అక్కడి పోటీ అభ్యర్థి వంగా గీతతో పాటు వైఎస్సార్సీపీ నేతలంతా పవన్‌ను ఏకిపారేస్తున్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలా?.. ఓ పార్టీ అధ్యక్షుడివి అయ్యి ఉండి ఇదేం ఖర్మ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా?.. ఓటమి భయంతోనే పవన్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారా? ఏది ఏమైనా ఆయన ఇస్తున్న వరుస ప్రకటనలు జనసేన వర్గాలకు అస్సలు సహించడం లేదు. -
పవన్‌కు వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో పోటీ చేసే అంశంపై మాట్లాడే క్రమంలో.. తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని పేర్కొన్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ నిన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ తాజాగా స్పందించారు. ‘‘నేను కూడా పవన్‌ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారామె. ‘2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ పోటీ వేళ జనసేనకు ఇవాళ పెద్ద షాకే తగలబోతోంది. నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆమె వైఎస్సార్సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. -
Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌కు చుక్కలే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆయన నాటకీయంగా వెల్లడించినా, అందులో ఆయన బలహీనతలను చెప్పకనే చెప్పేశారు. ఆయన ప్రకటన తర్వాత పిఠాపురంలో తెలుగుదేశం నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే కొంత రిస్కు ఉన్నట్లే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ పోటీచేసేది చివరి వరకు సస్పెన్స్ లో ఉంచాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పుడైతే వారాహి యాత్ర పిఠాపురం ప్రాంతం నుంచి ప్రారంభించారో, పిఠాపురం వెళ్లి అక్కడ వల్లభుడి గురించి ప్రస్తావించారో,అంతా అక్కడ నుంచే పోటీచేస్తారని భావించారు. కాకపోతే ఆయన అప్పట్లో ఆ విషయం చెప్పలేదు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఆ రెండింటిలో కాకుండా పిఠాపురం ఎంపిక చేసుకోవడం ద్వారా ఆయన ఆ రెండు చోట్లనుంచి పారిపోయారన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. దానికి ఆయన ఇచ్చిన బిల్డప్ తమాషాగా ఉంది. భీమవరం సీటును మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు కు ఇచ్చానని , గాజువాక టీడీపీ వాళ్లు తీసేసుకున్నారని అన్నారు. ఆ మద్య భీమవరం వెళ్లి మళ్లీ పోటీచేయాలన్న ఆలోచనపై అక్కడి ప్రముఖులతో చర్చలు కూడా జరిపారట.అయినా ఆయనకు నమ్మకం కుదరలేదు. దాంతో భీమవరంలో మళ్లీ పోటీకి భయపడ్డారని అంటారు. ఇక గాజువాక నుంచి తిరిగి పోటీచేసి ప్రతిష్టను నిలబెట్టుకుంటారని ఆయన అభిమానులు అనుకున్నారు. కాని ఆ వైపే వెళ్లడానికి ఈయన సందేహించారు. పైగా టీడీపీ వారు ఈయనకు చెప్పకుండానో, తెలియకుండానో లాగేసుకున్నట్లు మాట్లాడడం ద్వారా తన బలహీన పరిస్థితిని ఒప్పుకున్నారు.ఒక దశలో తిరుపతి వైపు కూడా చూడకపోలేదు. కాని దానిని కూడా వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. సొంత పార్టీ నేతలు ఎవరికి ప్రాధాన్యం ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకే పవన్ అవకాశం ఇవ్వడం లో కూడా చంద్రబాబు పాత్ర ఉందని, ఆయన ఏమి చెబితే దానిని జీ హుజూర్ అంటూ ఒప్పుకుంటున్నారన్న భావన జన సైనికులలో ఏర్పడింది. ఎంపీ సీటుకు పోటీచేయాలో, వద్దో అన్నది పెద్దలతో మాట్లాడి నిర్ణయిస్తానని అన్నారు.అంటే దాని అర్ధం బహుశా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీచేస్తారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురంలో తొంభై వేల మంది కాపులు ఉన్నారని, వారిలో మెజార్టీ తనకు మద్దతు ఇస్తారన్న ఆశతో పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు.లేకుంటే ఆయన కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునేవారేమో!ఎందుకంటే కాకినాడ వెళ్లి అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో దమ్ముంటే పవన్ వచ్చి కాకినాడ సిటీలో పోటీచేయాలని, తనను ఓడించాలని సవాల్ చేశారు. ఆ చాలెంజ్ ను పవన్ స్వీకరిస్తారని ఆయన అభిమానులు ఆశించారు.కాని పవన్ భయపడి అటు వైపు వెళ్లలేదు. చంద్రశేఖరరెడ్డి గురువారం నాడు మరోసారి అదే సవాల్ విసిరారు. అయినా పవన్ వైపు నుంచి స్పందన కొరవడింది. పిఠాపురంలో మామూలుగా అయితే పవన్ గెలవచ్చని జనసైనికులు భావించారు. కాని అక్కడ పరిస్తితులు మారడం, తెలుగుదేశం నేత వర్మ వర్గీయులు పవన్ కళ్యాణ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆయనను, చంద్రబాబును తీవ్రంగా దూషిస్తూ ఫ్లెక్సీలను దహనం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశం కూడా అయ్యారు. చివరికి తగ్గుతారో,లేదో కాని,పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుకూల వాతావరణాన్ని అయితే చెడగొట్టినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం ఆ పరిణామాలపై స్పందించకుండా మౌనంగా ఉండడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఇక.. వైఎస్సార్సీపీ అభ్యర్దిగా ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత గతంలో అక్కడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. జడ్పి చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఎంపీగా జనంలోనే ఉంటారు. ఆమెపై ప్రజలలో అసంతృప్తి లేదు. ఆమె పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ అవుతారని అనుకుంటే ఆమెనే కొనసాగించవచ్చు. మరో నేత ఎవరైనా అంతకన్నా తీవ్రమైన పోటీ ఇచ్చి పవన్ ను ఓడిస్తారని సర్వేలలో తేలితే అభ్యర్ధిని మార్చుతారేమో తెలియదు. వైఎస్సార్సీపీ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని సీరియస్ గానే తీసుకుని పవన్ ఓటమికి కృషి చేస్తోంది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చంద్రబాబు, లోకేష్ ల నుంచి ఒక్క ప్రకటన వచ్చినా పవన్ కు పోటీ తేలిక అయి ఉండేది. పవన్ సీఎం పదవికి తగడన్న చందంగా లోకేష్ మాట్లాడినా ఈయన నోరు విప్పలేదు. అదంతా అవమానంగా మారింది. 24 సీట్లు తీసుకోవడంతో జనసేన సత్తా ఇదేనా అన్న చర్చ ఆరంభం అయింది. దానిని 21 సీట్లకు తగ్గించుకోవడంతో మరింత అప్రతిష్టపాలయ్యారు. పైగా ఇచ్చిన 21 సీట్లలో కూడా కొన్నిటిని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కేటాయించడంతో ఈయన పార్టీ నడపడంలో అసర్ధులన్న అభిప్రాయం ఏర్పడింది. సహజంగానే దీని ప్రభావం ఎన్నికపై పడుతుంది. ఇదే టైమ్ లో పవన్ పై గెలిచే వైసిపి నేతకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ కూడా రావచ్చు. అది జరిగితే పోటీ మరింత పెరుగుతుంది. ఎందుకంటే పవన్ గెలిచినా ,ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయనకు వచ్చేది మంత్రి పదవే. వైఎస్సార్సీపీ గెలిచినా అదే మంత్రి పదవి వైఎస్సార్సీపీ అభ్యర్దికి కూడా వస్తుందన్న బావన ఏర్పడితే వైఎస్సార్సీపీ గెలిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన వివిద కార్యక్రమాల వల్ల కాపులతో సహా పేదవర్గాలన్నీ లబ్ది పొందాయి. కాపు నేస్తం కింద పిఠాపురంలోని వేలాదిమంది కాపు మహిళలకు ఆర్దిక సాయం అందింది.వారిలోమెజార్టీ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తే అది పవన్ కు గట్టి దెబ్బ అవుతుంది. పవన్ కళ్యాణ్ నోటి దురుసుతో వలంటీర్లను కించపరుస్తూ పలుమార్లు మాట్లాడారు. వారి ప్రభావం ఏదో రకంగా ప్రజలలో ఉంటుంది.వారు కూడా పవన్ కు వ్యతిరేకంగా తమ సత్తా చూపితే అది పవన్ కు పెద్ద తలనొప్పి అయ్యే అవకాశం ఉంటుంది.మిత్రపక్షమైన టిడిపి ఎంతవరకు సహకరిస్తుందనేది సందేహమే. అసలు చంద్రబాబే ఈయనను ఓడించడానికి పూనుకుంటారేమోనన్న డౌట్లు కూడా లేకపోలేదు. పవన్ కనుక ఇక్కడ ఓడిపోతే, తనకు రాజకీయంగా చికాకు ఉండదని ఆయన అనుకోవచ్చు. అదెలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కనుక రాజీపడకుండా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తే పవన్ పరిస్థితి క్లిష్టంగా మారవచ్చు.సాధారణంగా ఒక ప్రముఖుడు ఎవరైనా తమ నియోజకవర్గంలో పోటీచేస్తున్నారంటేనే, సంబందిత పార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి. అలాకాకుండా ఏకంగా పవన్ కు నిరసన తెలపడం తీవ్రమైన విషయమే. అంటే అంత సానుకూలత లేదన్న విషయం అర్దం అవుతుంది.పవన్ స్థానికుడు కాడని, ప్రజలకు అందుబాటులో ఉండడని, ఇప్పటికే స్థానిక నేతలు ప్రజలకు తెలియచేసే పనిలో ఉన్నారు.గోడలపై అలాంటి ప్రచారం కూడా చేసేశారు.నిజంగానే పార్టీ అధినేతగా ఉండే, నెలకు ఒకసారో,రెండుసార్లో వచ్చి వెళ్లే పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే అసలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ అబిప్రాయం ప్రబలితే కూడా నష్టం జరగవచ్చు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరితో సహా వైఎస్సార్సీపీలో చేరడం, ఆయనకు ఈ ప్రాంతం అంతా కొంత పట్టు ఉండడం కూడా పవన్ కు గండంగా మారవచ్చు. పవన్ కు ఉన్న ఒకేఒక్క సానుకూల అంశం కేవలం ఆయన సినీ నటుడు కావడమే. ఆ రకంగా కొంతమంది అభిమానులు ఉండడమే. కాని ఆయన ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబుకు పూర్థి స్థాయిలో లొంగిపోయారో, అప్పటి నుంచి కాపువర్గంలో కూడా ఆయనపై అయిష్టత మొదలైంది. ఈయనేదో ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తే, తనకు అర్హత లేదని చెప్పి పరువు తీసుకున్నారని, జనసేనకు అసలు నెట్ వర్క్ లేదని ఆయనే చెప్పేశారని,ఇంకేమి పార్టీ నడుపుతారన్న ప్రశ్న కాపులలో వచ్చింది. కాపు ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యతిరేక వైఖరిని కాపులు గుర్తుచేసుకుంటే ఆయనకు ఆ వర్గంలోకూడా ఆదరణ ఉండకపోవచ్చు. జనసేనకు బూత్ లెవెల్ కార్యకర్తలు లేరని, పోల్ మేనేజ్ మెంట్ తెలియదని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు.ఆయన ఎక్కడా పార్టీ వ్యవస్తను పెంపొందించుకోలేదు. పవన్ కు అవన్ని మైనస్ అయితే గెలుపుపై ప్రభావం చూపించవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తే పవన్ కు అంత ఈజీ కాదని అర్ధం అవుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘పొత్తు’ కడుపులో కత్తులు!.. 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే స్థానాలపై పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముందుంచిన ప్రతిపాదిత అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇటీవల బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తమ సీటు ఎలా అడుగుతారంటూ టీడీపీ నేతలు స్థానిక జనసేన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఒత్తిళ్లకు తలొగ్గే పవన్ ప్రతిపాదనలు పార్టీ నాయకులు, కొన్ని కుల సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తమ పార్టీ కోరే సీట్ల జాబితాను అందజేశారు. జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న స్థానాలనూ జనసేనకు కేటాయించారన్న అభిప్రాయం కలిగించేలా ఉండాలని బాబుకు పవన్ స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతోపాటు మరో రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. 68 అసెంబ్లీ స్థానాల జాబితాను ఇచ్చి వాటిలో 45 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని, 2019లో టీడీపీ గెలిచిన 23 అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండైనా తప్పనిసరిగా ఇవ్వాలని పవన్ ప్రతిపాదించారని సమాచారం. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన లేదా అత్యధిక ఓట్లు సాధించిన స్థానాలతోపాటు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీకి కలిపి ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలను గుర్తించి జాబితాను టీడీపీ ముందుంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవే జనసేనకు కేటాయించాలని పవన్ కోరినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి. బీజేపీ పేరు చెప్పి వేచి చూద్దామన్న బాబు పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకోవాలని తొలి నుంచి యోచిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు వేచి చూద్దామని చంద్రబాబు పవన్‌కు సూచించినట్టు తెలుస్తోంది. మరో పది పదిహేను రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, అప్పటిదాకా రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలోనూ, నియోజకవర్గాల స్థాయిలోనూ సీట్ల అంశంలో ఎలాంటి ప్రకటనలు, విభేదాలు లేకుండా చూద్దామని చెప్పినట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో సీట్ల పంపకాలపై ప్రస్తుతానికి ప్రతిష్టంభన కొనసాగుతోంది. పలుచోట్ల రచ్చకెక్కిన విభేదాలు ► రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అసలు ఈ నియోజకవర్గాన్ని జనసేన ఎలా అడుగుతుందని అక్కడి జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు తమ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ► పెందుర్తి నియోజకవర్గంలో అక్కడి టీడీపీ నాయకుడు బండారు సత్యానందరావు, స్థానిక జనసేన నేత పంచకర్ల రమేష్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ► కాకినాడ రూరల్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టికెట్ రేసులో ఉన్న టీడీపీ నాయకులు తమ స్థానాలను జనసేనకు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ► పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేన నాయకుల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సమయంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ తరహా అసంతృప్తులను కట్టడి చేసేందుకు బీజేపీని బూచిగా చూపి జనసేనను శాంతపరుస్తున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించాలని కోరుతూ పవన్‌కళ్యాణ్ ప్రతిపాదించిన నియోజకవర్గాల జాబితా ఇదీ.. ► ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ► ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ► ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక ► ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం ► ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట ► ఉమ్మడి కష్ణా, గుంటూరు జిల్లాలో..: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు ► ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో: దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం -
‘ఇదెక్కడి న్యాయం.. బాబుగారూ?’
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ముందు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ విలవిలలాడిపోతున్నాడా?.. ఒకవైపు పొత్తు అంటూనే.. మరోవైపు జనసేన స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్నే నిలబెట్టేందుకు దొడ్డిదారి యత్నాలు చేస్తున్నాడు యెల్లో బాస్. ఇప్పుడు సీట్ షేరింగ్ విషయంలోనూ జనసేనను పూర్తిగా ముంచేందుకు పావులు కదుపుతున్నాడు. అయితే తన సొంత పార్టీ నుంచే పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సీట్ల పంపకంపై తాడే పేడో తేల్చుకునేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కీలక చర్చల కోసం శనివారం రాత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నాడు. డిన్నర్ మీట్లో కలుసుకోనున్న ఈ ఇరువురు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు 40లోపు ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లను జనసేన ఆశిస్తోంది. కానీ, తెలుగు దేశం మాత్రం 20 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు భోగట్టా. అయితే దీనిపై జనసేన అభ్యంతరాలకు టీడీపీ సమాధానం కూడా ఇస్తోందట. తెలంగాణలో బీజేపీ కేవలం 8 సీట్లే ఇచ్చిన విషయాన్ని టీడీపీ ప్రస్తావించగా.. ఏపీ కథ వేరంటూ జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మావల్ల కాదు టీడీపీ పొత్తు విషయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను వైఎస్సార్సీపీ కోవర్టులుగా భావిస్తామంటూ జనసేన నేతలకు ఓ హెచ్చరిక చేశాడు పవన్. దీంతో నొచ్చుకున్న కొందరు జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు. కానీ, గత పదేళ్లుగా పార్టీ వెంట తిరిగితే టికెట్లు దక్కకపోవడాన్ని మాత్రం వాళ్లు భరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు వాళ్లు. దీంతో.. మాకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు? వెంటనే తేల్చేయాలనే డిమాండ్‌తో పవన్.. బాబుతో భేటీ అవుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: గందరగోళంలో తెలుగు దేశం! మావైపు రావొద్దు..! మరో వైపు పవన్ కల్యాణ్‌ను కొందరు టీడీపీ నేతలు కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పూల బోకేలు ఇస్తూ.. శాలువాలు కప్పుతూ చిరునవ్వులు చిందిస్తూనే.. మరోవైపు మా నియోజకవర్గాల వైపు చూడొద్దంటూ అల్టిమేటం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఉన్నాం.. ఇప్పుడు పొత్తుల పేరిట మావైపు రావొద్దని వాళ్లు పవన్‌ను కోరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల విషయంలోనూ పవన్‌కు అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపకంపై ఇంకా నాచ్చితే పూర్తిగా నష్టపోతామని భావిస్తున్న పవన్.. డిన్నర్ భేటీలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత అడగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ లేఖ నేపథ్యంలో ఆసక్తి రెండు రోజుల కిందట కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు ఆ భేటీ సారాంశాన్ని ఇవాళ లేఖ రూపంలో విడుదల చేశారాయన. ఈ భేటీలో పవన్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలిపిన హరిరామ జోగయ్య.. పవన్ ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారని, రెండున్నరేళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని, పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి వెళ్తే ఓటు బదిలీ అవుతుంది చెప్పారు. అయితే.. పొత్తులో భాగంగా సీట్ల దాకా అడగాలని తాను పవన్‌కు సూచిస్తే.. పవన్ 40 సీట్ల దాకా ఆశిస్తున్నట్లు తనతో చెప్పారని లేఖలో హరిరామ జోగయ్య వెల్లడించారు. అంతేకాదు.. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించినట్లు చెప్పారాయన. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుతో డిన్నర్ భేటీలో కాపు నేత సూచనలను పవన్ ప్రస్తావించే అవకాశమూ లేకపోలేదు. -
‘పార్టీ మారను.. సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’
సాక్షి, కాకినాడ జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘‘పార్టీ మారను.. రాజీనామా చేయను.. వైఎస్సార్సీపీ, సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’’ అని దొరబాబు స్పష్టం చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులతో పిఠాపురం ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇస్తారని సీఎం జగన్‌పై నమ్మకం ఉందన్నారు. తాను ఏ పార్టీని కలవలేదని దొరబాబు అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు