పవన్‌ కల్యాణ్‌ మగాడే అయితే.. ముద్రగడ సవాల్‌ | AP Politics: Mudragada Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ మగాడే అయితే.. ముద్రగడ సవాల్‌

Published Wed, Apr 10 2024 12:27 PM | Last Updated on Wed, Apr 10 2024 12:41 PM

AP Politics: Mudragada Fire on Pawan Kalyan - Sakshi

కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్‌ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ మగాడే అయితే నేరుగా తన మీద మాట్లాడాలంటూ ముద్రగడ సవాల్‌ విసిరారు.  

పవన్‌ కల్యాణ్‌​ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దమ్ముంటే.. మగాడే అయితే నేరుగా నా మీద మాట్లాడాలి. పవన్‌ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్‌ నుంచి పిఠాపురం వచ్చి పవన్‌ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంత వరకు సబబు?. 

హైదరబాద్‌లో అవమానం జరిగినప్పుడు, ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్‌కు ఏమయ్యాయి. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్‌ చేస్తారా? అంటూ ముద్రగడ పవన్‌ను నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement