సవాల్‌కు కట్టుబడి ఉన్నా: ముద్రగడ | Mudragada Padmanabham Reacts on challenge Becoming Padmanabha Reddy | Sakshi
Sakshi News home page

సవాల్‌ ప్రకారం పేరును మార్చుకుంటున్నా: ముద్రగడ

Published Wed, Jun 5 2024 11:29 AM | Last Updated on Wed, Jun 5 2024 1:53 PM

Mudragada Padmanabham Reacts on challenge Becoming Padmanabha Reddy

కాకినాడ: జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌పై విసిరిన సవాల్‌పై తాను ఓడిపోయానని వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

 ‘‘ సవాల్‌ ప్రకారం నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా. దీని కోసం గెజిట్‌ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నాను. నన్ను ఉప్మా పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారు. 

వైఎస్‌ జగన్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలు ఎందుకు దీనిని స్వీకరించలేదు అనేది నా ప్రశ్న. ప్రజల కోసం కష్టపడిన జగన్‌ను గౌరవించకపోవడం చాలా బాధాకరం. నా రాజకీయ నడక వైఎస్ జగన్ వెనుకే ’’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్‌ కల్యాణ్‌  గెలిస్తే.. తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement