జనసేన అధినేత పవన్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ ఫై
కుటుంబం, వ్యక్తిగత విషయాలను నేనెప్పుడూ ప్రస్తావించలేదే
మీ భార్యలను వేదిక మీద పరిచయం చేయండి
మెగా ఫ్యామిలీలో పిల్లల పరిస్థితి ఏమిటో మీరే చెప్పాలి
కుమార్తెను అడ్డుపెట్టుకుని మాట్లాడితే బెదిరేది లేదు
పిఠాపురంలోనూ తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీకే దిక్కు లేదు. అటువంటి నువ్వు నా కుమార్తెకు సీటు ఇస్తావా? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు తానెప్పుడూ ప్రస్తావించకపోయినా.. తన కుమార్తెను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని అన్నారు. భీమవరం, గాజువాకల్లో తరిమేస్తే పిఠాపురం వచ్చి పడ్డారని, ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పవన్‌పై ధ్వజమెత్తారు.
ఇటీవల ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తాజాగా తుని సభలో పవన్‌ను క్రాంతి కలిసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తన కుమార్తెను తుని వేదికపై పరిచయం చేసినప్పుడు తన పేరు ఎందుకు ప్రస్తావించారని, ఆమె మామ పేరు ఎందుకు చెప్పలేదని ప్రశి్నంచారు. ఇది ఎదుటివారిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసినదే అని అన్నారు.
తుని సభలో తన కుమార్తెను తన ఇంటి పేరుతో పరిచయం చేసి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఆడపిల్లకు వివాహమైన తరువాత తండ్రి ఇంటి పేరు ఉండదనే విషయం తెలియదా అని ప్రశి్నంచారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేందుకు కుట్ర పన్నారని పవన్‌పై మండిపడ్డారు. ఇదంతా మీ గురువు ఆదేశాలతో పెట్టిన చిచ్చు కాదా? అని నిలదీశారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి, మళ్లీ సానుభూతిగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు.
రాజకీయాల్లో నటించడం మానేసి సినిమాల్లో మాత్రమే నటించాలని పవన్‌కు హితవు పలికారు. పైకి అతిగా గౌరవిస్తున్నట్టు నటిస్తూ, లోపల కుళ్లు, కుతంత్రాలతో తమ కుటుంబాన్ని విడదీయాలని పవన్ చూస్తున్నాడన్నారు. తన కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు, ప్రచారానికి, అలాగే టీవీ డిబేట్లకు, స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు తీసుకువెళ్లి ప్రచారానికి ఉపయోగించుకోండని సలహా ఇచ్చారు.
వారాహి సభలో నన్నెందుకు దూషించారు
పవన్‌ను కానీ, ఆయన అన్నయ్యను కానీ ఏ రోజూ ఒక్క మాట అనని తనను కాకినాడ వారాహి సభలో ఎందుకు దూషించారో చెప్పాలని ముద్రగడ నిలదీశారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలను తానెప్పుడూ ప్రస్తావించలేదన్నారు. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో పవన్ చెప్పాలన్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చి పబ్‌లో మద్యం సేవించి పట్టుబడిన అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయాలు కూడా చెప్పాలన్నారు.
పవన్ పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి, మూడో భార్యను సభలో పరిచయం చేసి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. నా కుమార్తెకు జనసేనలో టికెట్ ఇస్తామంటున్నారు.. అప్పటి ఎన్నికల వరకూ అసలు మీ పార్టీ ఉంటుందా? అని ముద్రగడ ప్రశి్నంచారు. అబద్ధాలు చెప్పడానికి పవన్ సిగ్గు పడడం లేదన్నారు. తనకు, తన భార్యకు అనారోగ్య పరిస్థితి వచి్చనా తన కుమార్తెను తన ఇంటికి పంపవద్దని పెద్దలకు మనవి చేస్తున్నానని అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment