
నటుడు పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇది నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది పక్కనబెడితే తాజాగా వైఎస్సార్‌సీపీ నాయకురాలు, నటి శ్యామల.. పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని కూడా అన్నారు.
(ఇదీ చదవండి: పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..)
'వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కల్యాణ్.. మిగతా సినిమా వాళ్లని ఎందుకు తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. ఆమెని ఓడించడం ఎవరి వల్ల కాదు. గీత.. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చేశారో అందరికీ తెలుసు. అందుకే ఆమెకు భారీ మెజారిటీ రావాలని నేను కూడా ప్రచారం చేస్తున్నాను. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. ఆ అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యం' అని శ్యామల్ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు)