పవన్‌.. రెచ్చగొట్టడం మానేసి ముందు ఆ పని చూడు: ప్రకాశ్‌ రాజ్‌ | Prakash Raj Counter To Pawan Kalyan Tweet Over Tirupati Laddu Controversy | Sakshi
Sakshi News home page

పవన్‌.. కబుర్లు చెప్పడం మానేసి ఆ పని చూడు.. ప్రకాశ్‌ రాజ్‌​ కౌంటర్‌

Published Fri, Sep 20 2024 9:15 PM | Last Updated on Sat, Sep 21 2024 9:23 AM

Prakash Raj Counter To Pawan Kalyan Tweet Over Tirupati Laddu Controversy

తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తామని మరోసారి నిరూపించింది. అటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం చంద్రబాబు తానా అంటే తాను తందాన అంటున్నారు. 

దీనిపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఈ ఘటన జరిగింది. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. ఆ పని చేయడం మానేసి ఈ ఆందోళనలను జాతీయస్థాయిలో ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఉన్న మతకల్లోలాలు చాలవన్నట్లు దీన్ని ఎందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు? అని అసహనం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది?
2024 జూలై 12న ఆవు నెయ్యిని పరీక్షల కోసం టీటీడీ పంపింది. అది ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు)కి జూలై 17న చేరగా పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే! ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే అందులో వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసినట్లు ఉందే తప్ప ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదు. కానీ టీడీపీ.. జంతు మాంసం కలిసిందంటూ దుష్ప్రచారానికి తెరదీసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement