
సాక్షి,తాడేపల్లి : పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. జ్యోతి కాశినాయున క్షేత్రంలో కూల్చివేతలను పరిశీలించారు.
ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేయడం దారుణం. విధ్వంస పాలన అంటే ఇది. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్ళాడు..? ఆయన సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరుమెదపడం లేదు..? అటవీ అనుమతులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు మిన్నకున్నారు..? ఈ కూల్చివేతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment