
సాక్షి, తాడేపల్లి: వనజీవి రామయ్య మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది అంటూ ప్రశంసలు కురిపించారు.
వనజీవి రామయ్య మృతిపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకుపైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. వనజీవి రామయ్యగారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ నివాళులు’ అర్పించారు.

ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకుపైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయ… pic.twitter.com/5JjWgqnjf4
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2025