సాక్షి, తాడేపల్లి: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తుదిశ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment