సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
లద్దాఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు.
లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024
వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్‌ల కుటుంబాలకు నా సంతాపం.
రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment