దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు.
మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.
#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM
— ANI (@ANI) June 1, 2024
Comments
Please login to add a commentAdd a comment