హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల ఫలితాల ట్రెండ్ వెలువడుతోంది. రాష్ట్రంలోని హాట్ సీట్ అయిన మండీపైనే అధికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హాట్ సీటు నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలిచారు.
ఆమె తొలిసారి ఎన్నికల పోరులో దిగారు. ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్‌లో వెనుకంజలో ఉన్నా, ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను ఆమె అధిగమిస్తూ వస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ జెండా ఎగురవేయనుంది. మండీ లోక్‌సభ సీటు నుంచి కంగనాకు గెలవనున్నారనే అంచనాలున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఒక సీటు కాంగ్రెస్‌కు దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో కంగనా విజయపథాన దూసుకుపోతుండటంతో ఆమె ఇంటిలో సంబరాల వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment