దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో పలువురు నేతల ప్రత్యర్థి అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన విక్రమాదిత్య సింగ్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కంగనా వెళుతున్న ఆలయాలను శుద్ధి చేయాల్సి న అవసరం ఉందన్నారు. టకోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేవ్ సమాజానికి చెందిన కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో ఆహారపు అలవాట్ల గురించి చెబుతుంటారని, ఇది దేవ్ సమాజంవారికి తలవంపులుగా మారాయన్నారు. ఆమె దేవ్ సమాజపు పరువు తీస్తున్నారని ఆరోపించారు. దేవభూమిలో ఉంటున్నవారికి ఇక్కడి దేవనీతిపై ఎంతో నమ్మకం ఉందన్నారు.
తన తండ్రి వీరభద్ర సింగ్ ఆరు సార్లు సీఎం అయ్యారని, అది ప్రజల ఆశీర్వాదమని, కంగనా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించే బదులు ప్రధాని మోదీని పదవి నుంచి తప్పుకోవాలని కోరాలన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు చాలా ఏళ్లుగా సీఎంగా ఉన్నారని, ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యానించారు.
నటి కంగనా ముంబైలో ఒక కాలు, హిమాచల్‌లో ఒక కాలు పెడుతూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారని, ఆమె అతి త్వరలో మునిగిపోతారన్నారు. కంగనాకు జూన్ 4 తర్వాత తిరిగి ముంబైలో సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment