ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు.
ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు
‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్‌కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు.
#WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7
— TIMES NOW (@TimesNow) September 25, 2024
పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి
మంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.
వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతం
ఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు.
చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
Comments
Please login to add a commentAdd a comment