Farm Laws
-
‘క్షమించండి’ అని వేడుకున్నా.. కంగనాపై ఆగని విమర్శలు
ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు. #WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7— TIMES NOW (@TimesNow) September 25, 2024పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలిమంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతంఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు. చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు -
కాషాయ పార్టీని ఇరుకునపెట్టిన కంగనా.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ
సిమ్లా: కేంద్రం రద్దు చేసిన సాగు చట్టాలపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు.బీజేపీ ఎంపీ కంగనా తాజాగా మండి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను కేంద్రం తీసుకువచ్చి అమలుచేయాలి. దేశ అభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే రైతుల కోసం ఉపయోగపడే మూడు చట్టాలను తీసుకురావాల్సిందే. ఇందుకు రైతులే చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో కంగనా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో, తన వ్యాఖ్యలపై ఆమె మళ్లీ స్పందించారు. అవి కేవలం తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంగనా కామెంట్స్ బీజేపీకి సంకటంగా మారాయి. "All three farm laws should be reinstated." -- BJP MP Kangana RanautIs BJP bringing back those 3 Black Farmers law?why BJP is anti-Farmers? pic.twitter.com/OPw5kgaBZC— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) September 24, 2024 ఈ నేపథ్యంలోనే కంగనా వ్యాఖ్యలను బీజేపీ సీరియస్‌గానే తీసుకుంది. బీజేపీకి డ్యామేజ్ కాకుండనే ఉద్దేశ్యంతో కాషాయ పార్టీ కంగనాకు దూరం పాటించింది. కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. #WATCH | BJP leader Gaurav Bhatia says, "On the social media platforms, BJP MP Kangana Ranaut's statement on the farm bills that was withdrawn by central govt, is going viral. I want to make it clear that this statement is a personal statement of her. Kangana Ranaut is not… pic.twitter.com/hZmJ8j7Qf8— ANI (@ANI) September 24, 2024 అయితే, కంగనా ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో కేంద్రంలోకి బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెడుతూనే ఉంది. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. ఈ సమయంలో పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని ఘాటుగానే చెప్పారు. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో ఆమె ఇంకా ఏ విషయాలపై స్పందిస్తారో అనే టెన్షన్ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. ఇది కూడా చదవండి: ఆ సొమ్ము సోనియా రిలీఫ్ ఫండ్‌కు : కంగనా ఆరోపణ -
రైతుల గోడు కేంద్రం వినాలి
చండీగఢ్: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించారు. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద పంజాబ్ రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనోద్యమం శనివారం 200వ రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్తోపాటు ఖనౌరీ బోర్డర్ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలాల వద్ద బైఠాయించి వారికి వినేశ్ ఫొగాట్ మద్దతు పలికారు. రైతు కుటుంబంలో పుట్టిన వినేశ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. డిమాండ్లు ఇంకా నెరవేర్చనందుకే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 200 రోజులుగా ఉద్యమిస్తున్న వీళ్లను చూస్తే బాధేస్తోంది. రెజ్లర్లుగా మేం రైతులకు మావంతుగా ఏమీ చేయలేకపోయామని ఒక్కోసారి అనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మేము ఇక్కడ సొంత కుటుంబం కోసం ఏమీ చేయలేక నిస్సహాయులమయ్యాం. వీళ్ల బాధను ఇప్పటికైనా ప్రభుత్వం వినాలి. రైతన్న అన్నం పెట్టకపోతే మనమెలా బతుకుతాం?. ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోయినా నిస్వార్థంగా రైతులు పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్లది పెద్ద మనసు. ప్రభుత్వం కూడా తమది పెద్దమనసు అని చాటిచెప్పాలి. డిమాండ్లను నెరవేర్చాలి. హరియాణాలో రైతులు ఉద్యమిస్తే వారికీ నేను మద్దతు పలుకుతా. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిందే. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతుల ఉద్యమం వృథా కాకూడదు’’ అని అన్నారు. హరియాణాలోని ఛర్ఖీ దాద్రీ జిల్లాకు చెందిన మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా ‘‘ నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు. నాకు రాజకీయ అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రాబోను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది రైతుల ఉద్యమస్థలి. ఇక్కడ రైతన్నల సమస్యల గురించే మాట్లాడదాం. చర్చిద్దాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనోద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంయుక్తంగా అక్కడే ‘కిసాన్ మహాపంచాయత్’ ఏర్పాటుచేశాయి. -
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. కుల్విందర్ కౌర్ అరెస్ట్
బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌ను కానిస్టేబుల్ చెంపదెబ్బ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఆపై ఆమెను అరెస్ట్ చేసింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..బీజేపీ నేత, మండీ లోక్‌సభ ఎంపీ కంగన రనౌత్ చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగు పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న కంగనను కుల్విందర్ కౌర్ చెంప పగలగొట్టింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా2020లో మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమేనని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చెపట్టారు. దీంతో తలొగ్గిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.సింగర్ రిహానా మద్దతుఆ సమయంలో ప్రముఖ సింగర్ రిహానా భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని రిహానా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో పలువురు ప్రముఖ ఆమెకు మద్దతుగా నిలిచారు. నోరు పారేసుకున్న కంగనా రనౌత్రిహానా ట్వీట్‌పై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీగా మార్చాలని అనుకుంటున్నారు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. మేం మాదేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు’ అంటూ రిహానాపై కంగానా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు.టైమ్ మ్యాగజైన్లో బిల్కిస్దీనికి తోడు టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఆయా దేశాలకు 100మంది అత్యంత ప్రభావశీలురు జాబితాను విడుదల చేస్తోంది. 2019లో టైమ్ మ్యాగజైన్ .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్ బాగ్‌లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్ బాగ్ దాదీగా పేరొందిన 82 ఏళ్ల (నాడు) బిల్కిస్ ముందుండి నడిపించారు. బిల్కిస్‌ను ప్రస్తావిస్తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో బిల్కిస్ పాల్గొన్నారని, ఆమె రోజువారీ కిరాయి ప్రాతిపదికన అందుబాటులో ఉంటారని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఉద్యోమంలో పాల్గొనందుకు ఆమెకు ఆహారం, బట్టలు, అవార్డ్లు, పాకెట్ మనీ ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆట్వీట్‌ను కంగాన రీట్వీట్ చేస్తూ “హ హ హ ఆమె అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో కనిపించిన అదే దాదీ. ఆమె రూ.100 రూపాయలకే ధర్నాలో పాల్గొన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రతీకారం తీర్చున్న కుల్విందర్ కౌర్ఈ నేపథ్యంలో నాడు కంగానా చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్‌ఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఎయిర్ పోర్ట్‌లో ప్రతీకారం తీర్చున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్ పోర్ట్‌లోకి వచ్చిన కంగనాను కుల్విందర్ కౌర్ చెంప చెళ్లుమనిపించారు.అందుకే కొట్టాఅనంతరం రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది. కాగా, కంగనాను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ విభాగం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధుల నుంచి తొలగించింది. -
‘ఎంఎస్పీ’ కమిటీపై రగడ.. కేంద్రం ఏమందంటే?
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించాయి. రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్థించిన కుహానా రైతు నేతలకు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధి లేమిని బయట పెట్టుకుందంటూ ధ్వజమెత్తాయి. ఆ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకే కమిటీ వేశారని ఆరోపించాయి. ఇదో బోగస్ కమిటీ అని ఎస్కేఎం సభ్యుడు దర్శన్ పాల్ ఆరోపించారు. మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం వెనక ఉద్దేశం ఇదేనని రైతు నేతలు అంటున్నారు. పలు అంశాలను చేర్చడం ద్వారా మద్దతు ధర అంశం ప్రాధాన్యతను తగ్గించారని హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్‌సింగ్ దుయ్యబట్టారు. రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ ప్యానల్లో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్ చెప్పారు. మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఎంఎస్పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామన్నారు. ఇదీ చదవండి: PM Kisan: అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..! -
అగ్నిపథ్‌పై ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్
అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. అగ్నిపథ్‌పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువత డిమాండ్‌కు తలొగ్గుతారు. గత ఎనిమిదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం 'జై జవాన్, జై కిసాన్' విలువలను అవమానపరిచింది. సాగు చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే" అని పోస్టులో పేర్కొన్నారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఎలా రద్దు చేశారో.. అలాగే సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆదివారం(జూన్ 19వ తేదీన) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. నిరసనలు చేపడుతున్న యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహం చేయనున్నట్టు తెలిపారు. 8 सालों से लगातार भाजपा सरकार ने ‘जय जवान, जय किसान' के मूल्यों का अपमान किया है। मैंने पहले भी कहा था कि प्रधानमंत्री जी को काले कृषि कानून वापस लेने पड़ेंगे। ठीक उसी तरह उन्हें ‘माफ़ीवीर' बनकर देश के युवाओं की बात माननी पड़ेगी और 'अग्निपथ' को वापस लेना ही पड़ेगा। — Rahul Gandhi (@RahulGandhi) June 18, 2022 ఇది కూడా చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం -
మీసం మెలేసేది రైతన్నే!
దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల రూపకల్పనలో తనకూ భాగస్వామ్యం కావాలని గొంతెత్తున్నాడు. తనను పక్కనపెట్టినా, తక్కువ చేసినా తగ్గేదేలే అని హెచ్చరిస్తున్నాడు. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత యూపీ రాజకీయాల్లో పెరిగిన రైతుల పాత్ర ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అక్కడంతా రైతు ఎజెండా, రైతు నేతల మద్దతు చుట్టూతే రాజకీయం గిర్రున తిరుగుతోంది. యూపీ జనాభాలో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రతి సీటు గెలుపులోనూ వీరిపాత్రే కీలకంగా ఉండనుంది. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రైతులను చట్టసభలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో సుమారు 250కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండటంతో రైతు నేపథ్యం గల రాజకీయ నేతలను పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వివిధ రంగాలకు చెందిన వారిలో రైతులే ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తున్నారు. గత 2017 ఎన్నికల్లో చట్టసభలో ఏకంగా 161 మంది రైతులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 90 మందికి పైగా ఉండడం విశేషం. రైతుల తర్వాత అధిక సంఖ్యలో వ్యాపారులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలు ప్రకటించిన జాబితాల్లో 45శాతం మంది రైతులు ఉన్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. రైతు ఎజెండాతోనే రాజకీయం మరోవైపు యూపీ ఎన్నికల్లో రైతు అజెండాతోనే రాజకీయ పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు, వాటిపై యూపీ రైతుల నుంచే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కావడం, పుండుపై కారం చల్లినట్లుగా లఖీమ్‌పూర్ ఖేరీ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనకు బాధ్యుడైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తేనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ తమ ప్రభుత్వం చేసిన రైతు అనుకూల చర్యలను పదేపదే వల్లెవేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం రూ.36 వేల కోట్ల రుణాలు అందించామని, పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.2.21 కోట్ల మంది రైతులను చేర్చి ఇప్పటికే 28 లక్షల మందికి రూ.2,400 కోట్లు పరిహారం అందించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక పీఎం కిసాన్ కింద యూపీ రైతులకు రూ.41 వేల కోట్లు జమ అయ్యాయని, ఎరువుల బస్తాల ధరలను రూ.2,400 నుంచి రూ.1200కి తగ్గించిందని తమ ప్రచారాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోపక్క ఇటీవల జాట్ నేతలతో సమావేశం అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులకు రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, చెరకు రైతులకు రూ.1.40 లక్షల కోట్ల చెల్లింపులు చేశామని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి తాగు, సాగునీటి వసతిని పెంచేలా కెన్–బెత్వా నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క రైతుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని సమాజ్‌వాదీ పార్టీ–ఆర్ఎల్డీ కూటమి తన అస్త్రంగా మలుచుకుంటోంది. రైతులపై నమోదు చేసిన కేసులు, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో కేసులను మాఫీ చేయడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు చెరకు రైతులకు బకాయిల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇందులో ఎవరి హామీలు, ఎవరి మాటలను రైతులు నమ్ముతారన్నది బ్యాలెట్ తేల్చనుంది. బీజేపీకి కంట్లో నలుసుగా.. అధికార బీజేపీకి రైతు సంఘాల ప్రతినిధులు కంట్లో నలుసులా తయారయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై తాజా కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం, రైతు నేతలపై కేసుల ఉపసంహరణకు సంబంధించి నాన్చుడు ధోరణితో విసుగు చెందిన రైతు సంఘాల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ధోరణి ఇక చెల్లదని, హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు పనిచేయవని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే వారికే ప్రజలు పట్టం కడతారని తేల్చిచెప్పారు. ’మిషన్ యూపీ’ ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఇటీవల వెల్లడించారు. ఈ ప్రకటనలు ఎంతమేర ప్రభావం చూపుతాయన్న దానిపై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ -
కేంద్రమంత్రి యూ టర్న్..‘ ఆ చట్టాలు మళ్లీ తెచ్చే ప్రశ్నే లేదు’
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట మార్చారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటన తర్వాత పార్లమెంట్ సాక్షిగా రద్దయిన సాగు చట్టాలను భవిష్యత్‌లో అమల్లోకి తెస్తామని నర్మగర్భంగా మాట్లాడిన మంత్రి రెండ్రోజులకే యూ టర్న్ తీసుకున్నారు. ఉపసంహరించుకున్న ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన లేదని ఆయన ఆదివారం స్పష్టంచేశారు. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక వ్యవసాయ సంబంధ కార్యక్రమంలో శుక్రవారం తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని, అసలు ఈ గందరగోళానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ వ్యవసాయ కార్యక్రమంలో నేను మాట్లాడింది వేరు. ‘రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గాం. రైతు సంక్షేమం విషయంలో ముందడుగు వేస్తాం’ అని మాత్రమే నేను అన్నాను. చట్టాల విషయంలో కాదు. ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన మోదీ సర్కార్‌కు ఎంత మాత్రం లేదు’’ అని తోమర్ వివరణ ఇచ్చారు. ‘ రైతు సంక్షేమానికి మేలుబాటలు పరుస్తూ 2006లో స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులను పట్టించుకోని వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఇలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్‌పై తోమర్ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆ చట్టాల తరహాలో కొత్త చట్టాలను తేవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని కాంగ్రెస్ విమర్శించడం తెల్సిందే. ఎన్నికల తర్వాత దొడ్డిదారిన తెస్తారు: కాంగ్రెస్ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటుందని పేర్కొంది. అందుకే, ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చింది. -
కేటీఆర్ కౌంటర్ ట్వీట్
Telangana Minister KTR Counter Tweet On Agri Minister Farm Laws Bring Comments: సాగు చట్టాల రద్దుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సవరణలతో చట్టాలను ఎలాగైనా తెచ్చితీరతామంటూ తోమర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. గౌరవనీయులైన ప్రధాని క్షమాపణలు, సాగుచట్టాల రద్దు,.. కేవలం ఎన్నికల స్టంటే అనుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రధాని నరేంద్రగారేమో(మోదీ) చట్టాల్ని రద్దు చేశామని చెప్తున్నారు.. వ్యవసాయ మంత్రి నరేంద్రగారేమో(తోమర్) ప్రతిపాదన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అంటూ సెటైర్ వేశారు. బీజేపీ రాజకీయాలు, ఆ ప్రభుత్వం పట్ల దేశ రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. I guess the apology of Hon’ble PM and subsequent repeal of Farm laws was all an election stunt then?! PM Narendra Ji disposes and Agri Minister Narendra Ji re proposes! Classic 👏 Indian farmers need to be wary of the politics of BJP and it’s Govt’s #AntiFarmerLaws https://t.co/FyXjmVGazI — KTR (@KTRTRS) December 25, 2021 సంబంధిత వార్త: వ్యవసాయం చట్టం తెచ్చి తీరతాం.. నరేంద్ర సింగ్ తోమర్ -
వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం : నరేంద్ర సింగ్ తోమర్
-
సాగుచట్టాలు మళ్లీ తెస్తాం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
దాదాపు ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం, రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ప్రకటించిన కొద్దిరోజులకే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో శుక్రవారం అగ్రో విజన్ ఎక్స్‌పోలో పాల్గొన్న వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్నట్లు తెలిపారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారాయన. కొందరి వల్లే చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయి. కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తాం. ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తాం. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారాయన. Will farm laws make a come-back??? Union agri minister Narendra Tomar @nstomar drops hint during the inauguration of Agro Vision Expo in Nagpur on Friday. @ndtv pic.twitter.com/HDvateXQ6h — Mohammad Ghazali (@ghazalimohammad) December 25, 2021 రైతులు దేశానికి వెన్నెముక. అలాంటి రైతుల కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. 70 ఏళ్లలో దేశానికి ఎవరూ చేయలేనంత చేసి చూపించారు అని ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు తోమర్. ఇదిలా ఉంటే స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ప్రధాని. సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలపగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం, వెనువెంటనే సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ముద్ర పడింది. చదవండి: రైతు ధర్మాగ్రహ విజయం -
ఒక రోజు ముందే..
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్‌తో సమావేశమయ్యారు. అంశాలపై విబేధాలను చర్చల్లో చూపాలి కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్, శీతోష్ణస్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్‌సభ సమావేశాల్లో ఉత్పాదకత 82 శాతమన్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆరు బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు. రాజ్యసభ పనితీరుపై వెంకయ్య ఆవేదన బుధవారం రాజ్యసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సభలో ఆందోళనలు అధికమై పనితీరు బాగా తగ్గడంపై సభాపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరకు సమావేశాలు జరగాల్సిఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సామర్ధ్యం కన్నా తక్కువ పనితీరును సభ కనబరిచిందని బుధవారం సభారంభం కాగానే వెంకయ్య సభ్యులకు వివరించారు. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే మరింత మెరుగ్గా సమావేశాలు జరిగి ఉండేవన్నారు. అందరూ సభా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన తప్పులను గుర్తించి ఇకపై జరగకుండా జాగ్రత్తపడాలని హితవు పలికారు. రాబోయే పండుగలకు సంబంధించి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ జరిగింది. విపక్షాల ఆందోళన నడుమ కీలక బిల్లులకు సభ ఆమోద తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. విపక్షాలు 2019 ప్రజాతీర్పును తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. వీరి కారణంగా రాజ్యసభ ఉత్పాదకత 48 శాతానికి క్షీణించిందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నా ప్రభుత్వం 12మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా కృత్తిమ మెజారిటీ సంపాదించి బిల్లులు పాస్ చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరవధిక వాయిదా తర్వాత బయటికొస్తున్న సభ్యులు -
రైతుల విజయోత్సవం ... సింఘు నుంచి సొంతూళ్లకు..
న్యూఢిల్లీ/చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా నిరసనలకు ప్రధాన వేదికగా కొనసాగిన ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని సింఘు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు, వారి ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతులు ఇళ్లకు మరిలారు. ఈ సందర్భంగా రైతులు కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయ జెండాలు, రైతు సంఘాల జెండాలు, రంగుల విద్యుత్ దీపాలతో ట్రాక్టర్ ట్రాలీలను అందంగా అలంకరించారు. (చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!) ఇప్పటి వరకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ నిరసన శిబిరాల్లో ఉపయోగించుకున్న టెంట్లు, ఇతర సామగ్రిని ట్రాలీల్లో వేసుకుని పంజాబ్, హరియాణా, యూపీ రైతులు తిరుగు పయనమయ్యారు. సింఘు ప్రాంతం భాంగ్రా నృత్యాలు, పాటలు, కీర్తనలతో మారుమోగింది. ఏడాదిపాటు ఇక్కడ గడిపిన తమకు ఈ ప్రాంతంతో, ఇక్కడి వారితో అనుబంధం ఏర్పడిందని కొందరు రైతులు అన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లడం కొంతబాధాకరంగానే ఉందని ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయరహదారులపై పండుగ వాతావరణం డిమాండ్లను సాధించుకుని ఇళ్లకు వస్తున్న రైతులకు పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ–కర్నాల్–అంబాలా, ఢిల్లీ–హిసార్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ప్రజలు వారికి ఎదురెళ్లి పూల వర్షం కురిపించి, స్వీట్లు తినిపించి, పూలమాలలతో సత్కరించారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన సింఘు, టిక్రి, ఘాజీపూర్, షాజహాన్పూర్లు హిందువుల పుణ్యక్షేత్రాలైన చార్‌ధామ్‌లుగా స్వరాజ్ ఇండియా సంస్థ అధ్యక్షుడు యోగీంద్రయాదవ్ అభివర్ణించారు. కాగా, రైతుల నిరసనల కారణంగా నిలిచిపోయిన ఈ నాలుగు ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని జాతీయరహదారుల అధికారులు తెలిపారు. ఇద్దరు రైతులు మృతి టిక్రి నుంచి ఇళ్లకు వెళ్తున్న రైతుల ట్రాలీ ఒకటి హరియాణాలోని హిసార్ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొనడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే చివరికి!!) -
అన్నదాతల ఆందోళన విరమణ
న్యూఢిల్లీ: రైతు చట్టాల రద్దు సహా పలు డిమాండ్ల సాధనకు ఏడాదిగా చేస్తున్న ఆందోళనను నిలిపివేస్తున్నట్లు 40 రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. డిసెంబర్ 11 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాలను ఆందోళన చేస్తున్న రైతులు ఖాళీ చేస్తారని తెలిపింది. జనవరి 15న తిరిగి రైతు నేతలు సమావేశమవుతారని, ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతవరకు నెరవేర్చిందో చర్చిస్తారని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి యత్నిస్తామని కేంద్రం నుంచి లేఖ అందడంతో ఎస్కేఎం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కేంద్రం తరఫు వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ఈ లేఖను పంపారని ఎస్కేఎం సభ్యుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు, రైతులపై కేసుల ఉపసంహరణ తదితర డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఎంఎస్పీపై నిర్ణయం తీసుకునేవరకు పంటధాన్యాల సేకరణపై యథాతధ స్థితి కొనసాగుతుందన్నారు. ఎంఎస్పీపై రైతులు లేవనెత్తిన డిమాండ్ పరిష్కరించేందకు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, ఈ నిరసనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు ఉంటారని తెలిపింది. రైతులపై పెట్టిన పోలీసు కేసుల్ని ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం పంపిన లేఖలో వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాలు, రైల్వేలు పెట్టిన కేసులనూ ఉపసంహరిస్తామని తెలిపింది. ఎస్కేఎంతో చర్చల అనంతరమే విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. నిరసనల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు హరియాణా, యూపీ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని తెలిపింది. పంటపొల్లాల్లో దుబ్బులను తగలబెట్టడాన్ని ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణించరని పేర్కొంది.. డిసెంబర్ 11న రైతులు తమతమ ప్రాంతాలకు విజయయాత్ర చేపడుతూ వెళ్తారు. దేశవ్యాప్తంగా నిరసన స్థలాల వద్ద ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తామని ఎస్కేఎం తెలిపింది. రైతులు వెనుదిరిగినా, ఎస్కేఎం మనుగడలోనే ఉంటుందని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టాం.. క్షమించండి! తమ నిరసనల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి ఎస్కేఎం క్షమాపణలు చెప్పింది. తమది చారిత్రాత్మక విజమన్న ఎస్కేఎం నేత శివకుమార్ కాకా, తమ వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు, ప్రజలను మన్నింపు కోరారు. రైతు నిరసనలతో దేశ రాజధాని సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే! రైతులు తమ తమ శిబిరాలను తొలగించడం ఆరంభించారు. తమ నిరసనలకు ఫలితం దక్కడంతో రైతులు శనివారం ఉదయం సింఘు, టిక్రీ ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీని చేపట్టనున్నట్లు తెలిసింది. తమ ఆందోళన విజయవంతం కావడంతో నిరసన ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతులు స్వీట్లు పంచుకుంటూ, పాటలు పాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన విరమించాలన్న రైతు సంఘాల నిర్ణయాన్ని కేంద్రం, పలు రాజకీయపార్టీలు స్వాగతించాయి. ఎందుకీ ఆందోళన? ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం నవంబర్ 26 నుంచి రైతులు ఆందోళనలకు దిగారు. సంవత్సరకాలంగా జరిపిన నిరసనలకు కేంద్రం దిగివచ్చి సదరు చట్టాలను రద్దు చేసింది. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గత నెల స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. అయితే తమ మిగతా ఆరు డిమాండ్లను కూడా కేంద్రం పరిష్కరించాలంటూ రైతు సంఘాలు నిరసనలు కొనసాగించాయి. దీనిపై కేంద్రానికి, ఎస్‌కేఎంకు మధ్య పలు దఫాలుగా సంప్రదింపుల జరిగాయి. ఎస్‌కేఎంకు కేంద్రం గురువారం ఒక ముసాయిదా ప్రతిపాదనను పంపింది. దీనిపై చర్చించిన అనంతరం ఎస్కేఎం ఆందోళన విరమణ ప్రకటన చేసింది. రాజకీయాల్లో చేరాలనుకునే వాళ్లు వెళ్లిపోండి! ఎస్‌కేఎంను జాతీయస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని సభ్యులు భావిస్తున్నారు. సంఘంలో ఎవరైనా రాజకీయాల్లో చేరాలనుకుంటే సంఘం నుంచి వెళ్లిపోవాలని ఎస్కేంఎ కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ తేల్చిచెప్పారు. రైతు సంఘాల సమాఖ్య ఎప్పటికీ రాజకీయేతరంగానే ఉంటుందన్నారు. పంజాబ్‌లో పరిస్థితులను ప్రభావితం చేసేలా రైతు సంఘాలు రాజకీయాలపై దృష్టి పెట్టవద్దన్నారు. జనవరి 15 సమావేశంలో జాతీయ స్థాయి మోర్చాగా ఎదగడంపై చర్చిస్తామన్నారు. -
రైతు ధర్మాగ్రహ విజయం
దాదాపు 15 నెలల సుదీర్ఘకాలం... 700 మందికి పైగా రైతుల ప్రాణత్యాగం... ఎండనకా వాననకా, ఆకలిదప్పులను భరిస్తూ వేలాది రైతులు చూపిన ధర్మాగ్రహం... వృథా పోలేదు. రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అధికారిక లేఖ రూపంలో లిఖితపూర్వక హామీ దక్కింది. దాంతో, 3 నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలంటూ ఇన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు 40కి పైగా రైతు సంఘాలకు సారథ్యం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. అయితే, ‘ఆందోళనను విరమిస్తున్నామే తప్ప, ఉద్యమాన్ని విరమించడం లేదు. రైతు హక్కుల కోసం పోరు కొనసాగుతుంది’ అనడం గమనార్హం. జనవరి 15 దాకా గడువు పెట్టిన రైతులు, అప్పుడు ప్రభుత్వ హామీల పురోగతిని సమీక్షించి, కార్యాచరణ నిర్ణయించనున్నది అందుకే! ఏడాది పైగా ఇల్లూ వాకిలీ వదిలేసి, దేశ రాజధాని సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని ఉంటున్న రైతులు ఈ 11న విజయోత్సవ ర్యాలీతో స్వస్థలాలకు పయనం ప్రారంభిస్తారు. అయితే, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం లాంటి అన్నదాతల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరనే లేదు. రైతుల మొక్కవోని దీక్ష, ముంచుకొస్తున్న పంజాబ్ – యూపీ ఎన్నికలు... కారణం ఏమైతేనేం కేంద్రం తలొగ్గి, చటుక్కున రూటు మార్చి, వివాదాస్పద రైతు చట్టాలను ఉపసంహరించుకోవడం కనివిని ఎరుగని కథ. గురుపూర్ణిమ వేళ నవంబర్ 19న సాక్షాత్తూ ప్రధాని మోదీ రైతులకు టీవీలో క్షమాపణలూ చెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు తమ అనేక డిమాండ్లలో ఒకటి మాత్రమేనంటూ నిరసనను విరమించడానికి రైతులు ససేమిరా అన్నారు. ఆరు డిమాండ్లను ఏకరవు పెడుతూ ఎస్కేఎం నవంబర్ 21న ప్రధానికి లేఖ రాసింది. దానికి ప్రతిగా ఎస్‌కేఎంకు చెందిన అయిదుగురు సభ్యుల కమిటీకి కేంద్రం తన ముసాయిదా ప్రతిపాదనను బుధవారం పంపింది. రైతు సంఘాలు కోరిన మార్పులు చేర్పులతో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి లేఖ రూపంలో హామీ రావడంతో ఇప్పటికి రైతుల ఆందోళనకు తాత్కాలికంగా తెర పడింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సహా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన మొదలుపెట్టిన సరిగ్గా 380వ రోజున రైతులు ఇంటి దారి పట్టనున్నారు. వెనక్కి తిరిగి చూస్తే, కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత 2020 జూన్‌లో 3 వివాదాస్పద వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను సర్కారు పార్లమెంట్లో పాస్ చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ, పంజాబ్ గ్రామాల్లో చెదురుమదురుగా మొదలైన నిరసనలు క్రమంగా వేడెక్కి, పొరుగున ఉన్న హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. గత ఏడాది నవంబర్ 25న వేలాది రైతులు ఢిల్లీకి ప్రదర్శనగా రావడం, వారిని అనుమతించక పోవడంతో రాజధాని ప్రధాన ప్రవేశమార్గాలను ఆందోళనకారులు అడ్డగించడం కనివిని ఎరుగని చరిత్ర. రాజధాని వెలుపలే గుడారాలు వేసుకొని, నిరసన చేస్తున్న రైతు సంఘాల వారితో కేంద్రం 11 విడతల చర్చలు జరిపి, చట్టాల్లో మార్పులు చేస్తామంది. కానీ, చట్టాల రద్దు ఒక్కటే తమకు సమ్మతమని పట్టుబట్టి, రైతులు అనుకున్నది సాధించారు. నిజానికి, ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ రైతు ఆందోళనకారుల ర్యాలీలో పోలీసులతో హింసాకాండ చెలరేగింది. రైతు నిరసన దోవ తప్పినట్టు అనిపించింది. ఆ పైన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌ను బలవంతాన ఖాళీ చేయించడం లాంటి వాటితో మళ్ళీ ఉద్యమం ఊపందుకుంది. క్రమంగా నిరసనల కేంద్రం పంజాబ్, హర్యానాల నుంచి పశ్చిమ యూపీకి మారింది. ఒక దశలో సుప్రీమ్ కోర్టు సైతం జోక్యం చేసుకొని, సాగు చట్టాలపై ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాల్సి వచ్చింది. తీరా ఆ సంఘం సుప్రీమ్‌కు సమర్పించిన నివేదిక ఇప్పటికీ వెలుగు చూడలేదన్నది వేరే కథ. ఆ మాటకొస్తే సాగు చట్టాలు చేస్తున్నప్పుడు కానీ, వాటిని నవంబర్ 29న రద్దు చేస్తున్నప్పుడు కానీ పార్లమెంటులో చర్చ లేకుండా మెజారిటీతో నోరు నొక్కేశారనే అప్రతిష్ఠ మోదీ సర్కారు మూటగట్టుకుంది. చనిపోయిన రైతులకు నష్టపరిహారం మాటెత్తితే, మృతుల వివరాలు మా దగ్గర ఉండవంటూ మళ్ళీ విమర్శల పాలైంది. చివరకిప్పుడు– ఎంఎస్పీపై వేసే సంఘంలో ఎస్కేఎం నేతలకూ చోటిస్తామనీ, రైతులందరిపైనా కేసులు ఎత్తి వేసేలా చూస్తామనీ, విద్యుత్ సవరణ బిల్లులోని సెక్షన్లలో రైతు నేతలను సంప్రదించి మార్పులు చేస్తామనీ కేంద్రం హామీలు ఇవ్వాల్సి వచ్చింది. లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి బర్తరఫ్ డిమాండ్ ఒక్కటీ మిగిలిపోయింది. నిరసనకారులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం మొదటే చెప్పినా, 2016 నాటి జాట్ రిజర్వేషన్ల ఆందోళనల వేళ ఇలాగే ఇచ్చిన హామీలు నెరవేరలేదని రైతులు అనుమానించారు. అందుకు వారిని తప్పుపట్టలేం. హోమ్ మంత్రి గత వారం ఫోన్ చేసి మరీ చర్చించాల్సి వచ్చింది. హామీలిచ్చినా, అధికారిక లేఖ కావాలని రైతులు కోరారంటే, పాలకులపై పేరుకున్న అనుమానాలు అర్థమవుతున్నాయి. అయితే, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టాలని భావిస్తూ వచ్చిన రైతుల అనుమానాలు, కష్టాలు ఇంతటితో తీరేవి కావు. వారి సందేహాలను నివృత్తి చేసి, ఈ దేశంలో రైతే రాజు అనే విశ్వాసం నెలకొల్పాల్సింది పాలకులే. అందుకు ఇకనైనా ఓ సమగ్ర వ్యవసాయ విధానం దిశగా నడవక తప్పదు. ఆ ప్రయాణానికి ప్రేరేపించగలిగితే అన్నదాతల ధర్మాగ్రహ విజయం అపూర్వమవుతుంది. -
కేంద్రం లిఖిత పూర్వక హామీ.. ఆందోళన విరమించిన రైతు సంఘాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం విజయవంతంగా ముగిసింది. డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. శుక్రవారం బిపిన్‌రావత్ అంత్యక్రియలు ఉండడంతో.. 11వ తేదీ ఉదయం 9గంటలలోపు రైతులు సింఘా బార్డర్‌ను ఖాళీ చేయనున్నారు. ఈ మేరకు రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 13న పంజాబ్ రైతులంతా గోల్డెన్ టెంపుల్ సందర్శించనున్నారు. 15న కిసాన్ సంయుక్త మోర్చా మరోసారి సమావేశం కానుంది. కాగా, గతేడాది నవంబర్ 25న రైతు ఉద్యమం మొదలైంది. రైతు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలను రద్దు చేసింది. సాగుచట్టాల రద్దు బిల్లుకు నవంబర్ 29న పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. -
రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా
నిరంతర ప్రక్రియగా కొనసాగే ప్రజాచైతన్యం తోడైతే తప్ప కేవలం చట్టాలతో వ్యవస్థలను సమూలంగా మార్చడం సాధ్యం కాదన్న పరమసత్యం ఆలస్యంగానైనా ప్రధాని మోదీకి బోధపడినట్లుంది. పార్లమెంట్ ఆమోదిం చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరిం చుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఏడాదికి ముందు హడావుడిగా కేంద్రం తెచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని ఇప్పటికీ ప్రధాని భావించడం చూస్తే, కిందపడినా పైచేయి తమదేనని చెప్పుకోవడంగా కనిపిస్తుంది. వ్యవసాయ చట్టాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒంటెత్తుపోకడ పోయింది. ‘వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం కనుక.. ఈ రంగంలో కీలక చట్టాలు చేసేముందు ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించి ఉండాలి. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆ చొరవ చూపలేదు. రైతులతో, రైతు ప్రతినిధులతో ముసాయిదా బిల్లుల్లోని అంశాలకు సంబంధించిన మంచి చెడులపై సమగ్రంగా మాట్లాడలేదు. పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టినపుడు వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఈ అంశంపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు రాజ్యసభలో డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో ప్రభుత్వం బిల్లుల్ని ఆమోదింపజేసుకొంది. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు) ఈ చట్టాల లక్ష్యం కర్షకులకు మేలు చేయడానికి, వారి ఆదాయం పెంచడం కోసమేనని చెబుతూ వచ్చారు. మరి వాటిపై చర్చ జరగడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటన్నది ప్రశ్న. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగితే.. బడా కార్పొరేట్ల నుంచి, దళారుల నుంచి రైతులకు రక్షణ ఎలా లభిస్తుందనే అంశంపై బీజేపీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ సమంజసమైన వివరణ ఇవ్వలేకపోయాయి. అందుకే ఈ చట్టాల ఉపసంహరణ కోసం ఉత్తరాది ప్రాంత రైతులు రోడ్డెక్కి చారిత్రాత్మక పోరాటం చేశారు. 700 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో ఆశువులు బాసారు. ఉద్యమాన్ని అణచివేసేం దుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఉద్యమ సెగ చల్లారలేదు సరికదా.. మరింత ఉవ్వెత్తున సాగింది. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో.. దేశ రైతాంగానికి కొత్త శక్తి వచ్చినట్లయింది. తాజాగా వారు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధతతో కూడిన కనీస మద్దతు ధర కోసం పట్టుబడుతున్నారు. పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర పొందడం అన్నది తమకు చట్టబద్ధ హక్కుగా సంక్రమించాలనేది రైతాంగం కోరిక. ఎప్పట్నుంచో రైతాంగం కోరుతున్నది, ఆశిస్తున్నదే. పస్తుతం కేంద్ర ప్రభుత్వం 14 పంట లకు కనీస మద్ధతు ధర ప్రకటిస్తోంది. ఈ పంటల ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వ ఏజన్సీలు జోక్యం చేసుకొని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. అయితే.. రైతులు 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతున్నారు. దేశ ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. సంప్రదాయకంగా విస్తృతంగా పండిస్తున్న వరి, గోధుమలకు డిమాండ్ తగ్గుతోది. సిరి ధాన్యాలుగా పిలుస్తున్న మిల్లెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, పౌష్టికతను పెంచే పంటల పెంపకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలను దిగుమతులు చేసుకోవడం తగ్గించి వాటి ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. అందుకు రైతులు సిద్ధం కావాలంటే వారు డిమాండ్ చేస్తున్నట్లు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధంగా కనీస మద్ధతు ధరలను ప్రకటించాలి. రానున్న కాలంలో రైతాంగ సమస్యల పరిష్కారమే రాజకీయ పార్టీలకు ప్రధాన ఎజెండా కానున్నది. ఇదొక శుభపరిణామం కూడా. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే భయంతోనే భారతీయ జనతాపార్టీ 3 వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం ఇందుకు ఓ ప్రధాన సంకేతం. 2004లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతాంగ సమస్యల్నే ప్రధాన ఎన్నికల ఎజెండాగా తీసుకొన్నారు. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ.. ఈ రెండు వాగ్దానాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాయి. అంతేకాదు.. వ్యవసాయం దండగమారి అని, ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికలలో బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చినందునే చంద్రబాబు స్వల్ప వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. ఆ హామీని నిలబెట్టుకోనందుకే 2019లో తగిన మూల్యం చెల్లించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నేడు రైతాం గంలో ఎనలేని చైతన్యం వెల్లివిరిస్తోంది. వ్యవసాయ రంగాన్ని విస్మరించే, దెబ్బతీసే రాజకీయ పార్టీలకు రైతాంగం శాశ్వతంగా దూరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంస్కరణలపేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేసేవారిని, లాండ్ పూలింగ్ పేరుతో వ్యవసాయ భూముల్ని సేకరించి వాటితో రియల్ వ్యాపారం చేయాలనుకొన్న చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ నాయకులకు ఇకపై చీకటి రోజులే. రైతాంగానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని వారు.. ఇకపై జరిగే ఎన్నికలలో రైతుల ఓట్లు పొందడం దుర్లభం. వ్యవసాయరంగ ప్రగతి మీదనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మి.. అందుకు అనుగుణంగా వ్యవసాయరంగం మెరుగుదలకు పటిష్టమైన కార్యాచరణ చేపడతారో.. వారినే రైతులు ఆదరిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగానికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. రైతు సంక్షేమమే ప్రాధాన్యాంశంగా చేసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి రైతుల ఎజెండాయే ప్రధానాంశం అవుతుంది. రైతు వ్యతిరేకులకు రాజకీయ మనుగడ శూన్యం. ఉత్తరాది రైతులు సాగించిన ఉద్యమం తెలియబర్చిన వాస్తవం ఇదే. - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్
ముంబై: సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన తన అభిప్రాయాలను కొందరు తీవ్రంగా వ్యతిరేకించి, చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళవారం వెల్లడించారు. ఈ తరహా హెచ్చరికలు ఎక్కువైపోయాయని, చర్యలు తీసుకోండంటూ పంజాబ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పంజాబ్‌లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సంబంధిత ఎఫ్ఐఆర్ ప్రతిని కంగన తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా. తుక్డే తుక్డే గ్యాంగ్‌లనూ విమర్శిస్తా. విదేశాల్లో కూర్చుని భారత్‌లో ఖలిస్తాన్ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతా. అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్‌లో బహిరంగంగా ప్రకటించాడు ’ అని కంగనా పోస్ట్‌చేశారు. ‘ సోనియా గాంధీజీ మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిర గాంధీ ఇదే ఉగ్రవాదులపై తుదిశ్వాస వరకూ పోరాడారు. నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌లోని మీ(కాంగ్రెస్) ముఖ్యమంత్రికి సూచించండి’ అని కంగన విజ్ఞప్తిచేశారు. -
వేడెక్కిస్తున్న సభాసమయం!
ప్రజాసమస్యలు చర్చించడానికి అత్యున్నత వేదిక. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయడానికి వీలు కల్పించే పవిత్ర భూమిక. చట్టసభలకు, సభ్యులకు మహోన్నత లక్ష్యం, లక్షణాలు చాలానే! కానీ, పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం మొదలైన తీరు చూసినప్పుడు ఆవేదన కలగక మానదు. సమస్యలనూ, చేయాల్సిన చట్టాలనూ చర్చించాల్సిన వేదిక ఆ బాధ్యతలో విఫలమవు తోందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. వివాదం రేపిన నూతన సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును చర్చ లేకుండా పార్లమెంట్ ఆమోదించిన తీరు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోపక్క గడచిన వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ 12 మంది రాజ్య సభ సభ్యులను ఈ సమావేశాలు మొత్తానికీ సస్పెండ్ చేయడం సైతం చర్చనీయాంశమైంది. బల్లల మీదెక్కి, కాగితాలు చించి విసిరికొట్టి, మార్షల్స్‌తో అనుచిత ప్రవర్తనకు పాల్పడడమే కాక ఎదురు పాఠాలు చెబుతారేమిటని రాజ్యసభ ఛైర్మన్ ప్రశ్నిస్తున్నారు. సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఏకతాటి మీదకు వచ్చి, మంగళవారం రాజ్యసభను బాయ్‌కాట్ చేశాయి. క్షమాపణ చెబితే తప్ప, సస్పెన్షన్ ఎత్తివేయమన్నది ప్రభుత్వ వాదన. బిగుస్తున్న పీటముడిని చూస్తుంటే, ఈ పార్లమెంట్ సమావేశాలూ కృష్ణార్పణమేమోనన్న భయం కలుగుతోంది. చట్టసభల్లో చర్చల కన్నా వాదోపవాదాలు, గందరగోళాలే ఎక్కువ జరుగుతున్నాయన్న అప్రతిష్ఠకు ఆజ్యం పోస్తోంది. అధికారపక్షం నుంచి ప్రతిపక్షాల దాకా అందరికీ ఈ తిలాపాపం తలా పిడికెడు. గత సమావే శాల్లో పెగసస్ సహా అనేక అంశాలు సభ ముందున్నాయి. ఆ సమయంలో ఆవేశాలు పెరిగిన ఆగస్టు 11న పెద్దలసభలో సభ్యుల ప్రవర్తనకు... అప్పుడు కాక, ఈ సమావేశాల్లో కొరడా ఝళిపించడం ఏమిటన్నది ప్రశ్న. శిక్ష విధించే ముందు నిందితుల వాదనా వినడం ధర్మం. కానీ, సస్పెన్షన్ విధించే ముందు సదరు సభ్యులకు సమాచారమివ్వలేదు, వాదనను వినలేదన్నది మరో బలమైన విమర్శ. ఈ మొత్తంలో పార్లమెంటరీ పద్ధతులనే పాటించలేదన్న ఆరోపణకు జవాబులు వెతకాల్సి ఉంది. ఇక, ఏడాది పాటు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనకు కూర్చోవడానికి కారణం – కొత్త సాగు చట్టాలు. వాటిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదిస్తున్నప్పుడు జరిగిన చర్చ శూన్యం. ఇప్పుడా చట్టాల్ని రద్దు చేస్తూ సోమవారం బిల్లు ప్రవేశపెట్టినప్పుడూ, చర్చ హుళక్కి. దాదాపు 750 మంది దాకా రైతుల బలిదానానికి కారణమైన చట్టాలపై చర్చ అప్పుడూ లేదు, ఇప్పుడూ చేయలేదేమిటన్న ఆవేదన సమంజసమైనదే. బయటి వేదికలపై ఏడాదికి పైగా చర్చోపచర్చలు జరిగిన అంశంపై ప్రజా ప్రతినిధుల సభలో చర్చే లేకపోవడం దేనికి సంకేతం? చట్టాల రద్దు బిల్లునూ చర్చే లేకుండా నాలుగే నిమిషాల్లో లోక్‌సభలో ఆమోదించడం ఎలా చూసినా ప్రశ్నార్హమే. ఏకంగా 11 విడతల చర్చలు జరిపినా, రైతు నిరసనకారులను ప్రభుత్వం ఒప్పించలేకపోయిన చట్టాలవి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిన అంశం అది. జాతీయ ప్రయోజనాల రీత్యా ప్రధాని వాటిని వెనక్కితీసుకోవడం హర్షణీయమంటూ మంత్రులు సోషల్ మీడియాలో ప్రకటించారు. కానీ, ఆ ప్రయోజనాలేమిటో చట్టసభలో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? పంటలకు రైతులు కోరుతున్న కనీస మద్దతు ధర చట్టం, లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన లాంటì వాటిపై చర్చించాలన్న కోరిక న్యాయం కాదా? జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ క్షమాపణలు చెప్పడం, ట్వీట్లు పెట్టినంత మాత్రాన అవి పార్లమెంటులో జరగాల్సిన చర్చకు ప్రత్యామ్నాయం అవుతాయా? అయినా మెజారిటీ ఉంది కాబట్టి, చర్చలతో పని లేదనుకుంటే, పార్లమెంటరీ సూత్రాలకే అది దెబ్బ! ఎలాంటి చట్టమైనా చేసే ముందు దానిపై క్షుణ్ణంగా చర్చే ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ ఉన్న పెద్ద తేడా. అందుకోసమే సభలో చర్చించడమే కాక, అవసరాన్ని బట్టి సెలక్ట్ కమిటీలు, పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపే ఏర్పాటు కూడా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ, ఇప్పుడు అలా జరుగుతోందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తొలి విడత పాలనలో కేవలం 25 శాతం బిల్లులు, రెండో విడతలో 10 శాతం బిల్లులే ఆ అదృష్టానికి నోచుకున్నాయట. అందుకే రాజ్యాంగం పవిత్రం, పార్లమెంట్ దేవాలయం అనడం బాగున్నా, దాన్ని ఏ మేరకు ఆచరిస్తున్నామో అఖిలపక్ష సమావేశానికి సైతం రాని పాలకులు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఇక సహచర రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో ఈ శీతకాల సమావేశాల్ని పూర్తిగా బహిష్కరించాలని కూడా కొన్ని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు వార్త. ఇది మరింత బాధాకరం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చేమో కానీ, ప్రజా ప్రతినిధులు పదే పదే బహిష్కరణ మంత్రం పఠిస్తే... అది బాధ్యతను విస్మరించడమే. అలాగే, చట్టసభలో అనుచిత ప్రవర్తనను ఎవరూ సమర్థించరు. అలాంటివారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. అలాగని కక్ష సాధించినట్టు ఉండకూడదు. అధికారంలో ఉన్నవారే పెద్ద మనసుతో, పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, ఇరుపక్షాలూ భీష్మించుకొని పార్లమెంటరీ ప్రతిష్టంభనకు కారణమైతే, 26 బిల్లులు సభ ముందుకు రానున్న ఈ సమావేశాలూ వృథాగా ముగిసిపోతే అది మరింత శోచనీయం. దాని వల్ల ఆర్థిక నష్టం పదుల కోట్లలో ఉంటుందేమో కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కలిగే నష్టం మాత్రం కంటికి కనిపించనంత! కొలిచి చెప్పలేనంత!! అన్ని పక్షాలూ ఆలకించి తీరాల్సిన ప్రజాస్వామ్యవాదుల మొర ఇది!! -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది. చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్‌సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్‌లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే. చర్చకు విపక్షాల పట్టు సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్‌సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది. చర్చ ఎందుకు?: తోమర్ మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్‌సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు. ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్‌ను కట్ చేశారు. తోమర్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు. టీఎంసీ, ఆప్ డుమ్మా సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి. రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్‌తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి. – సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ జడిసే... చర్చ పెట్టలేదు పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు. బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్‌పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ -
రైతు అభీష్టానికి... రాజ్యం తలొగ్గిన వేళ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్‌సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ రద్దు ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్‌గార్ మోర్చా(ఎస్ఎస్కేఎం) ఆధ్వర్యంలో కిసాన్–మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు. పంట వ్యర్థాల దహనం నేరం కాదు కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. -
ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పగడ్బందీ వ్యూహంతో, వాస్తవిక దృష్టితో దేశం ముందుకు తెచ్చిన నూతన వ్యవసాయ సాగుచట్టాలను అనూహ్యంగా రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆయన మద్దతుదారులనూ, వ్యతి రేకులనూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దాదాపు సంవత్సరం రోజులు రైతుల పేరుతో ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం రైతు సంఘాల పేరుతో నడిచిందే గానీ, పొలం మీద తమ చెమట ధారపోసే రైతులు చాలామంది ఈ ఉద్యమంలో లేరన్నది అక్షర సత్యం. ఈ ఉద్యమాన్ని నడిపింది అంతా బడా నాయకులూ, పంజాబ్, హరి యాణా రాష్ట్రాల్లో మండీలను నిర్వహించేవారు, వారి అనుయాయులు. సంవత్సరం కాలంపాటు ప్రపంచంలో ఏ ఉద్యమం ఇంత ఖరీదుతో నడవలేదు. అగ్నికి ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సర్వశక్తులూ ఒడ్డి, పాకిస్తాన్ అనుకూలవాదులనూ, చైనా అనుకూలవాదులనూ ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట పరిసరాల్లో ఎంత హింస చెలరేగింది? రైతుల పేరుతో నడిచే ఉద్యమం 68 మంది పోలీసుల తలలు పగలగొట్టే స్థితికి ఎలా చేరింది? దీని వెనుక ఎవరున్నారు? రైతుల ప్రయోజనాల కంటే దేశాన్ని అస్థిర పరచడం, దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులను సృష్టించడం, మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి వేయడం ఉద్యమ నాయకులకు అజెండాగా ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టును అందించాయి. సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటుపై ఆశలు చంపుకోలేని కొందరు నాయకులు ఈ ఉద్యమానికి ఆర్థిక నిధులను ఇబ్బడిముబ్బడిగా అందిస్తున్నారనే విషయాన్ని మోదీ ప్రభుత్వం అప్పటికే పసిగట్టింది. నూతన సాగు చట్టాలు వాస్తవిక దృష్టితో చూస్తే, రైతులకు మేలు చేసేవే. కానీ మండీలు నిర్వహిస్తూ, కమిషన్లను కోటాను కోట్లుగా దండుకునే బ్రోకర్లకు, వారి వెనుక ఉండే నాయకులకు ఈ నూతన సాగు చట్టాలు ఇబ్బందికరమే. ప్రకృతిని, తన శ్రమను నమ్ముకుని జీవించే రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాక అనేక కడగండ్లను దిగమింగుకుంటూ, బతుకు బండిని లాగుకొస్తున్న రైతులకు నూతన సాగుచట్టాల వల్ల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని, కొన్ని అపోహలను, ఈ రైతు సంఘం నాయకుల ముసుగులో ఉన్న మోదీ వ్యతిరేకులు నూరిపోశారు. పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోని కొద్దిమంది రైతులు మాత్రమే ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉద్యమాన్ని నడిపే నాయకులను నమ్మి, దాదాపు 750 మంది రైతులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడం దేశ దురదృష్టం. ఉద్యమాన్ని నడిపిన నాయకులెవరూ ప్రాణాలను బలి తీసుకోలేదనేది గమనార్హం. ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో రైతుల పేరుతో నడిచిన ఉద్యమం అంతా మోదీ వ్యతిరేకులు చేసిందే. ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో రైతుల పేరుతో నడిచిన ఉద్యమం అంతా మోదీ వ్యతిరేకులు చేసిందే. స్వాతంత్య్రానంతరం నుండి నేటి వరకు అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాల వలన వేలాది రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులు తీర్చలేక తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. పాత చట్టాలు రైతులకు మేలు చేసేవే అయితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నట్లు? నూతన సాగు చట్టాల్లోని ప్రయోజనాలను వ్యవతిరేకించే వారి దగ్గర ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. నూతన సాగు చట్టాల్లోని ప్రయోజనాలను రైతులకు వివరించడంలో జాతీయవాద సంస్థల ప్రతి నిధులూ, ఆ సంస్థల కార్యకర్తలూ, పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. ఈ విషయంలో వారి ఉదాసీన వైఖరి విస్పష్టమైంది. పెద్దనోట్ల రద్దు, త్రిపుల్ తలాక్, సీఏఏ చట్టాలు, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య సమస్య పరిష్కారం వంటి విషయాలలో లభించిన సానుకూలతతో, నూతన సాగు చట్టాల ద్వారా వచ్చే వ్యతిరేకతను పూడ్చాలనే వ్యూహం బెడిసికొట్టింది. ఇక మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కొన్నిచోట్ల ఓటమిపాలైంది. యూపీ శాసన సభకు జరుగబోయే ఎన్నికల్లో కొన్ని స్థానాలు కోల్పోవలసి ఉంటుందని రిపోర్టులు రావడంతో నూతన సాగు చట్టాలను రద్దును ప్రధాని ఆకస్మికంగా ప్రకటించారని కొందరు వాదించడం, ఇది రైతుల విజయం ఉంటూ కాంగ్రెస్, వామపక్ష నాయకులు ప్రకటించడం పూర్తిగా నిజం కాదు. సిఏఏచట్టం అమలు, ఎన్ఆర్సీ అమలు పాక్‌లోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్ వంటి సాహసోపేతమైన చర్యల విషయంలో మోదీ ప్రభుత్వం సీట్లు, ఓట్లు లెక్కించలేదు. రైతుల పేరుతో నడిచిన ఉద్యమం ద్వారా, హిందువులకు సిక్కులకు మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నాన్ని కొందరు నిర్మాణం చేశారు. దేశ అంతర్గత, బాహ్య శత్రువుల ప్రయత్నాలకు చెక్ పెట్టడంకోసమే నూతన సాగు చట్టాలను రద్దు చేసి ఉండవచ్చు. పైగా గురునానక్ జయంతి సిక్కులకు అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నూతన సాగు చట్టాల రద్దును ప్రకటిం చడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రద్దు వెనుక దేశ విశాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇక రైతుల పేరుతో ఉద్యమం నడిపి, రైతులను రెచ్చగొట్టి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని తల పూసే వారి ఆశలు అడియాసలయ్యాయి. వారి నిజస్వరూపాన్ని దేశ ప్రజల ముందు ఉంచడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్ని మోదీ ప్రభుత్వం జారవిడుకోదు. ఉల్లి బాల రంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మొబైల్ : 94417 37877 -
అన్నదాత హక్కు గెలిచినట్లే...!
కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతులు సాధించిన అద్భుత విజయానికి మూలాలు గురునానక్ బోధనల్లో ఉన్నాయి. రైతుల హక్కుల కోసం సిక్కులు సాగిస్తున్న పోరాట సంప్రదాయాన్ని ఆరెస్సెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేశాయి. వ్యవసాయ రంగాన్ని మొత్తంగా భారత గుత్తపెట్టుబడిదారుల పరం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సిక్కులు గ్రహించలేరని వీరు భావించారు. కానీ, చరిత్రలో ఏ దశలో కంటే ఇప్పుడే పంజాబ్ రైతులు దేశాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడారు. కేంద్ర ప్రభుత్వ అమేయ శక్తిని ఢీకొని వ్యవసాయ రంగాన్ని కాపాడిన సిక్కు రైతులకు జాతి మొత్తంగా సెల్యూట్ చేస్తోంది. పోరాడి గెలిచిన రైతులు మన స్కూళ్లు, కాలేజీ పుస్తకాల్లో శాశ్వతంగా ఉండిపోయే గొప్ప చరిత్రను లిఖింపజేసుకున్నారు. నవంబర్ 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. తన ప్రభుత్వం ఏడాదిక్రితం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సిక్కు రైతులు యుద్ధం ప్రకటించారు. లక్షలాది రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివెళ్లారు. సంవత్సరం పైగా సాగిన ఈ ఆందోళనల క్రమంలో 750 మంది రైతులు ప్రాణత్యాగాలు చేశారు. ప్రభుత్వం వందలాదిమంది రైతులపై నానా రకాల కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టింది. సిక్కురైతుల్లోని మిలిటెంట్ విభాగం, నిరంకారీలు ఈ జనవరి 26న సాక్షాత్తూ ఎర్రకోటపైకి ఎక్కి విజయధ్వానం చేశారు. ఈ క్రమంలో పలువురు జర్నలిస్టులపై, రచయితలపై పలు కేసులు పెట్టారు, పోలీసులు ఉద్యమకారులను, ఇతరులను దారుణంగా హింసించారు. అయినా సరే ఆరెస్సెస్, దాని రాజకీయ పక్షమైన పాలక బీజేపీ ఏమాత్రం చలించలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు విస్తరించాయి. అదే సమయంలో రాకేష్ తికాయత్ నేతృత్వంలో సిక్కుయేతర భారీ రైతు ఉద్యమం మొదలైంది. యూపీలోని గ్రామాలు సైతం రైతుల ఉనికికోసం సాగిస్తున్న పోరాటంలో భారీఎత్తున పాల్గొన్నాయి. ఎట్టకేలకు విజయం సిద్ధించింది. ప్రధాని నరేంద్రమోదీ అన్నదాతల ముందు తలవంచి క్షమాపణ చెబుతూ సాగు చట్టాలను ఉపసంహరిం చుకుంటున్నట్లు చెప్పాల్సివచ్చింది. ఏదేమైనా, గురునానక్ నుంచీ, సిక్కు సమాజం నుంచీ హిందుత్వ శక్తులు నైతిక పాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. ఆరెస్సెస్ తీసుకొచ్చిన మరో గురువు హెగ్డేవార్ బోధనలతో పోలిస్తే గురునానక్ బోధనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. హిందూ వర్ణ ధర్మ సంస్కృతి, ముస్లిం పీడక పాలనతో కూడిన సంక్లిష్ట కాలంలో గురునానక్ తన ఆధ్యాత్మిక భావాలను వెలువరించారు. ఈయన 1469లో ఖాత్రిలో పట్వారీ కటుంబంలో పుట్టినప్పటికీ, మానవ మనుగడకు వ్యవసాయ ఉత్పత్తే ప్రాణాధారమని గుర్తిం చారు. ఈ ఉత్పాదక శ్రామికుల రూపకర్త దేవుడని గ్రహించారు. ఆయన దృష్టిలో దేవుడు యుద్ధ వీరుడు కాదు. జాతి అంటే మానవ సంకుచితత్వంలో ఇరుక్కుపోయిన నేల కాదని ఆయన భావన. ఈ భావనతోటే నానక్ అనుయాయులు శ్రమించే హస్తాలతోనే ప్రపంచం నలుమూలలకు విస్తరించారు. అక్కడి ఉత్పాదక క్షేత్రాల్లో పనిచేసి మనుగడ సాగించారు. వీరు భారతీయ వ్యవసాయాన్ని సానుకూల ఉత్పాదితంగా చేయడమే కాదు... కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇదే స్ఫూర్తితో వారు పనిచేశారు. తమ జాతీయవాదాన్ని ఇతరులకు వ్యతిరేకంగా సిక్కులు ఎన్నడూ ప్రోత్సహించలేదు ఆహారధాన్యాలను ఉత్పత్తిచేసే రైతులకోసం సిక్కులు సాగించే పోరాట సంప్రదాయాన్ని ఆరెస్సెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేశాయి. వ్యవసాయ ఉత్పత్తిని మొత్తంగా భారత గుత్త పెట్టుబడిదారుల పరం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సిక్కులు గ్రహించలేరని ఆరెస్సెస్, బీజేపీ పాలక శక్తులు భావించాయి. ప్రతిరంగంలోనూ అనైతిక ధనాన్ని కొల్లగొడుతూ ఆ రంగాల వెనుకబాటుతనాన్ని, బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడమే భారతీయ గుత్తపెట్టుబడి వర్గం లక్షణం. కేంద్రప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కల్లోలంలో ముంచెత్తినప్పుడు పంజాబ్ రైతులు తమ హక్కుల కోసం పోరాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్రలో ఏ దశలో కంటే ఇప్పుడే పంజాబ్ రైతులు దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. భారతీయ వ్యవసాయాన్ని అణగదొక్కడానికి పార్లమెంటులో మంద మెజారిటీని దుర్వినియోగపర్చదలిచిన పాలకవర్గాన్ని పంజాబ్ రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పార్లమెంటరీ పంథానుంచే దేశం పక్కకు వెళ్లే ప్రమాదం ఉందని పంజాబ్ రైతులు చాలా త్వరగా గ్రహించారు. ఢిల్లీ స్థాయిలో అనేక సందర్భాల్లో రిజర్వేషన్ వ్యతిరేక ధోరణులు ప్రబలుతూ వచ్చిన విషయం తెలిసిందే. వీటిని నిరోధించే క్రమంలో, తమిళనాడు బీసీ వర్గాలు ఓబీసీల హక్కులకోసం నిత్యం పోరాడుతూ వచ్చాయి. అదేవిధంగా, పంజాబ్ రైతులు తమ వ్యావసాయిక హక్కులకోసం తుదికంటా పోరాడారు. ఇక దళిత హక్కుల విషయానికి వస్తే మహారాష్ట్ర దళిత శక్తులు దేశానికే దారి చూపాయి. గురునానక్, పెరి యార్ రామస్వామి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, బహుళ సంస్కృతిని పరిరక్షించే శక్తులను దేశంలో నిర్మిస్తూ వచ్చారు. కానీ ఈ ముగ్గురి భావాలను ఆమోదిస్తున్నట్లు పైకి నటిస్తూ ఆచరణలో సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో నడిచేటటువంటి సంస్థను ఆరెస్సెస్, హెగ్డేవార్ ఏర్పర్చారు. దేన్నయినా సరే వ్యతిరేకించే ఆధ్యాత్మిక, సామాజిక భావజాలాన్ని గురునానక్ సృష్టించలేదు. ఆరెస్సెస్‌కి చెందిన హెగ్డేవార్ మాత్రం ముస్లిం వ్యతిరేక, గొడ్డు మాంసం వ్యతిరేక భావజాలాన్ని, హిందూ ధర్మ పరంపర పేరుతో స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకంగా నిలిచే సంస్థాగత నిర్మాణాలను ఏర్పర్చారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులను, వ్యవసాయ ఉత్పత్తిని కైవసం చేసుకోవాలన్నదే హిందుత్వ శక్తుల ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అమేయ శక్తిని ఢీకొని భారతీయ వ్యవసాయ రంగాన్ని కాపాడిన సిక్కు రైతులకు జాతి మొత్తంగా సెల్యూట్ చేస్తోంది. భారతీయ సిక్కులకు మతం కేంద్రంగా ఉండే రాజకీయపార్టీ అకాలీదళ్ ఉంది. కానీ మనకు తెలిసినంత వరకు అది పంజాబ్‌లో నివసిస్తున్న ఏ ఇతర మతాల ప్రజలకూ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అక్కడి ఏ ఇతర సామాజిక వర్గాల ఆహార హక్కుల్లోనూ అకాలీదళ్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. కేరళలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న ఆరెస్సెస్, బీజేపీ లాగా, 12 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న మహిళలను గురుద్వారాల్లోకి ప్రవేశించకుండా అకాలీదళ్ ఎన్నడూ అడ్డుకోలేదు. సమాజాన్ని విభజించడం కాకుండా, సమానత్వ ప్రాతిపదికన సమాజాన్ని స్థాపించడానికి ఆధ్యాత్మిక నైతికత అనేది రాజకీయాల ద్వారానే కదలాల్సి ఉంటుంది. అత్యంత నిరాశాపూరిత పరిస్థితులగుండా సాగిన రైతుల ఉద్యమం, వారి ఈ అద్భుత విజయం జాతికి నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. రైతుల నిరవధిక పోరాటం చివరకు ఏమౌతుందని గత సంవత్సర కాలంగా మొత్తం ప్రపంచం వేచి చూస్తుండి పోయింది. రైతు ఉద్యమం తుది విజయం వరకు కొనసాగుతుందని ఎట్టకేలకు ఆరెస్సెస్ బీజేపీ కూటమికి అర్థమైపోయింది. ఢిల్లీలో సాగిన సిక్కు రైతుల ఉద్యమం వారు ఎంత శాంతికాముకులో ప్రపంచానికి చూపించింది. తమ గురుద్వారాల్లో ఆకలిగొన్న ప్రతి స్త్రీకీ, పురుషుడికీ వారు ఎలా తిండి పెడతారో, చివరకు తమను రోడ్లపై దారుణంగా కొట్టిన పోలీసులకు కూడా వారు ఎలా తిండి పెట్టారో ఈ ఉద్యమం ప్రపంచానికి విడమర్చి చూపింది. ఇది తమ గురువు గురునానక్ నుంచి వారు పొందిన కారుణ్య దృష్టి. ఏ మతమైనా సరే ఇతర మతాలను, ఇతర జీవన పద్ధతులనూ తప్పక గౌరవించాలని, భారతదేశంలో సిక్కు రైతులు ప్రదర్శించి చూపారు. మతం అంటే పొలాల్లో శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడమే తప్ప మరే అర్థమూ దానికి లేదని సిక్కులు యావత్ ప్రపంచానికి ప్రదర్శించి చూపారు. హిందుత్వ శక్తులతోపాటు, భారతదేశంలోని ఇతర మతాలు అన్నీ సిక్కులు, వారి గురువుల నుంచి దీన్నే తప్పక నేర్చుకోవాలి. ఉత్పత్తి చేయని వారు ఆహార ఉత్పత్తిదారులపై తీర్పు చెప్పకూడదు. ఈ ఉద్యమంలో పోరాడి గెలిచిన రైతులు... మన స్కూళ్లు, కాలేజీ పుస్తకాల్లో శాశ్వతంగా ఉండిపోయే గొప్ప చరిత్రను తమ పేరిట లిఖింపజేసుకున్నారు. వ్యాసకర్త: కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
తొలిరోజే ఉపసంహ‘రణం’
న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఉపసంహరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించింది. అలాగే కోవిడ్–19 మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తీర్మానించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, అధిర రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, మాణిక్కం ఠాగూర్, రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సాగు చట్టాలను పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజే రద్దు చేసేలా పట్టుబట్టాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్దత కల్పించాలని ఉభయ సభల్లో డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను అరెస్టు చేయాలన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. డిమాండ్ల సాధనకు ఇతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని తెలిపారు. -
మలి సమరం మొదలు!
ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్రానికీ మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలిగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. కార్పొరేట్ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! మూడు చట్టాల రద్దు, దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వ్యవసాయ సంస్కరణల్ని వెనక్కి నెట్టినట్టా? ఇదేం అవాంతరం కాదా? ఇప్పుడిదొక చర్చనీయాంశం. దేశ రైతుల్ని ఉద్ధరించే సంస్కరణల బాటలో పెద్ద ముందడుగు అని చెప్పిన చట్టాల్ని ఉపసంహరించే ప్రక్రియ కేంద్రం ప్రారంభించింది. ప్రధాని ప్రకటన బాటలోనే బిల్లు ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రేపు పార్లమెంటు సమావేశాల్లో రద్దు బిల్లును ఆమోదిస్తారు. తదుపరి ఏంటి? కోరినట్టే చట్టాల రద్దు సాధించిన రైతు సంఘాలు తమ అసలు డిమాండ్‌తో స్వరం పెంచుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్దత వచ్చే వరకు ఆందోళన విరమించమంటున్నారు. మార్కెట్ వ్యవస్థ బలోపేతం డిమాండ్ కూడా ఉంది. ఈ మేరకు 40 సంఘాలతో శనివారం ఢిల్లీలో సమావేశమై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది. రైతాంగం కోరుతున్నట్టు చర్చల ప్రక్రియ చేపట్టాలా? కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకోవాలా? వేర్వేరు అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నారు. ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. లాబీయింగ్‌లో సిద్ధహస్తులైన కార్పొరేట్లకు కాకుండా వ్యవసాయ సంస్కరణలు రైతుకు మేలు చేయాలి. విశాల ఆర్థిక సంస్కరణల్లో భాగమైన వ్యవసాయ సంస్కరణలే కాకుండా సంస్కరణల ప్రక్రియలోనూ మార్పు రావాలి. చట్టబద్ధతే కీలకం వ్యవసాయ సంస్కరణల్ని స్థూల దృష్టితో చూడాలి. ప్రభుత్వంతో పాటు రైతు నాయకులకు పట్టువిడుపులు అవసరం. ఉభయత్రా నిర్మాణాత్మక ప్రతిపాదనలు, ఆచరణాత్మక అంగీకారాలు కుదరాలి. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, దానికో చట్టబద్ధత కావాలని ఇప్పుడు రైతాంగం కోరుతోంది. మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థా కొనసాగుతాయని, దానికి ప్రయివేటు కొనుగోలు వ్యవస్థ తోడవుతుందని ప్రభుత్వం చెబుతోంది. చట్టబద్ధత కల్పిండానికి కొన్ని ఇబ్బందులున్నాయనేది ప్రభుత్వ వాదన. ప్రపంచ వాణిజ్య సంఘం (డబ్లుటీవో) ఒప్పందాల రీత్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాల వల్ల ఈ విషయంలో భిన్నమైన ఒత్తిళ్లున్నాయి. వారేమో, ఏ సబ్సిడీలైనా పది శాతాన్ని మించొద్దంటారు. అందుకు అంగీకరించకుండా, వాయిదాలు వేస్తూ వచ్చింది ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, ఎగుమతి–దిగుమతుల వంటి అంశాల దృష్ట్యా ఈ అంకానికి తెర తీసే ఆలోచన ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం చేస్తోంది. కానీ, కనీస మద్దతు ధర ప్రకటనకు, ఖచ్చితమైన అమలుకు చట్టబద్ధత ఉంటేనే మేలని రైతాంగం కోరిక. దాంట్లోనూ లోపాలున్నాయి. కొన్ని (23) పంటలకే ఎమ్మెస్పీ ప్రకటన, రెండు పంటలకే ప్రభుత్వం ధాన్యం సేకరణ, దానికీ భరోసానిచ్చే స్థాయి మార్కెట్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యలు. చిరుధాన్యాలకూ ఎమ్మెస్పీ ఉండాలి, గణింపు శాస్త్రీయంగా జరగాలి, సగటు పద్ధతిన కేంద్ర స్థాయిలో కాకుండా.. పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రాల వారీ ఎమ్మెస్పీ ఉండాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్‌లో ఉన్నట్టు ప్రతి 25 చ.కి.మీ పరిధికి ఒక మార్కెట్ యార్డ్ ఉండాలనేది వారి వాదన. ఎమ్మెస్పీ ఉల్లంఘనలకు శిక్షలుండాలి. చట్టబద్ధతకు కొత్తగా కమిటీ వేసి కాలాయాపన చేయడంకన్నా, లోగడ ముఖ్యమంత్రుల బృందం ఇచ్చిన ప్రతిపాదన ఆమోదించాలని రైతు నేతలంటారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ బృందం ఎమ్మెస్పీ చట్ట ముసాయిదా ప్రతిపాదించింది. రెట్టింపు ఆదాయం ఎలా? వచ్చే జనవరి నాటికి రైతుకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేయడం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఆ దిశలో రైతు ఆదాయం పెరగపోగా పడిపోతోంది. మార్కెట్ మాయాజాలంలో పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుంది రైతు పరిస్థితి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు లేక, నువ్వా–నేనా అనే కేంద్ర–రాష్ట్ర వివాదాల్లో రైతు నిత్యం నలుగుతున్నాడు. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలు కూడా వ్యవసాయంపై మొదలయ్యాయి. ఒక సర్వే (ఎస్యేఎస్) ప్రకారం కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన రూ.277 (ఉపాధిహామీ దినకూలీ సమానం) గా తేలింది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో రైతుల సగటు నెలసరి రాబడి రూ. 4–10 వేల మధ్య ఉంది. దేశంలో 80 శాతం సన్న చిన్నకారు రైతులే! ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిల్ల వ్యయాలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున 2000 మంది వ్యవసాయం నుంచి ఇతరేతర వృత్తులకు మళ్లుతున్నారు. ఎమ్మెస్పీనే కాక... భూమి, కూలీలు, పెట్టుబడి, విత్తనం, రుణం, వాతావరణం, ఉత్పత్తి, ధర, మార్కెట్... అన్నీ సమస్యలే! ఇంతటి దయనీయ స్థితిలో దేశానికి అన్నం పెట్టే రైతు కోలుకోలేకుండా ఉంటే, మన ఒప్పందాలు, సంస్కరణలు అతన్ని ఆదుకునేలా కాక మార్కెట్ శక్తులకు దన్నుగా ఉంటే ఎలా? అన్న ప్రశ్న రైతు ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెంచింది. రైతుల ఆర్థిక స్వేచ్ఛ కోరిన దివంగత శరద్ జోషి (శెట్కారీ సంఘటన్) తన పుస్తకంలో రెండు విలువైన మాటలు చెప్పారు. మార్కెట్‌తో ఒప్పందపు షరతులు రైతు పక్షంలో ఉండాలి. పట్టణ, పల్లె ఉత్పత్తులు–సేవల ధరల్లో సామ్యం పుండాలంటారు. రైతు ఆదాయాన్ని పెంచేలా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. దాదాపు ఏడువేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో పదివేల రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీఓ) ఏర్పాటును కేంద్రం ప్రకటించింది. కానీ, కార్యాచరణలో చిత్తశుద్ధి లేదు. స్థానిక సహకార సంఘాల్ని ప్రోత్సహించాలి. వ్యవసాయోత్పత్తులు పెరిగిన చోట, ప్రభుత్వం చొరవతో.. విలువపెంచే ప్రక్రియను, అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. రైతు రాబడి పెంచాలి. నేలకిప్పుడు సాంత్వన కావాలి రైతాంగం సాగు పద్ధ తులు మార్చుకోవాలి. సాగు వ్యయాన్ని రమారమి తగ్గించుకొని, కనీస మద్దతు ధరపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చూసుకోవాలి. విష రసాయనాల వాడకం తగ్గించి క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. ఫలితంగా రైతుపై ఒత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. లాభసాటి ప్రకృతి సాగుతో పుడమి తల్లికి సాంత్వన కూర్చాలి. రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులకు ప్రభుత్వం సబ్సిడీలివ్వాలి. రైతాంగం అదే డిమాండ్ చేయాలి. సంబంధీకులతో సంప్రదించకుండా, కార్పొరేట్ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి సంస్కరణల్ని రైతు హితంలోనే చేపట్టాలని ఇకపై కేంద్రంపై నిరంతర ఒత్తిడి ఉంటుంది. 1992 నుంచి వ్యవసాయ సంస్కరణలపై గొంతెత్తుతున్న ఉదారవాదులు, రైతుకు లభించే సంస్థాగత మద్దతుకు ఎసరు పెడుతున్నారు. 1960–80ల నడుమ ఈ మద్దతే వ్యవసాయాన్ని అదుకుంది. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ అంశాల్లోనూ జోక్యంతో ఏకపక్షంగా చట్టాలు తెచ్చి, సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం భంగం కలిగించిందని విమర్శ ఉంది. ఆ మచ్చ తొలగించుకునేందుకైనా తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! దిలీప్ రెడ్డి -
27న భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి
ఘజియాబాద్: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ బుధవారం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలపై కూడా మోదీ సర్కారును నిలదీస్తామన్నారు. ‘శనివారం మేము సమావేశం కానున్నాం. అక్కడ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అదెలా చేస్తారో చెప్పాలని మేము ఆయన్ని అడుగుతాం’ అని తికాయత్ ట్వీట్ చేశారు. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. -
సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ ఈ నెల 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్ ఠాకూర్ సమాధానమివ్వలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమై, డిసెంబర్ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 80 కోట్ల మందికి లబ్ధి పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద ఇచ్చే రేషన్ సరుకులకు ఇవి అదనం. ‘ఓ–స్మార్ట్’కు రూ.2,177 కోట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్), సముద్ర పరిశీలక నెట్వర్క్ (ఓఓఎస్), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ)–చెన్నై, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్)–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీవోఆర్)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి. ఏసీఆర్‌ఓఎస్‌ఎస్ కొనసాగింపు 14వ ఆర్థిక సంఘం నుంచి తదుపరి 2021–2026 ఆర్థిక సంఘం వరకూ అట్మాస్పియర్ క్లైమేట్ రీసెర్చ్–మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్, సర్వీసెస్ (ఏసీఆర్‌ఓఎస్‌ఎస్) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనికి రూ.2,135 కోట్లు అవసరమని అంచనా వేసింది. విద్యార్థులకు రూ.3,054 కోట్ల స్టైపెండ్ కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్(నాట్స్)లో భాగంగా 2021–22 నుంచి 2025–26 వరకూ శిక్షణ పొందే అప్రెంటీస్లకు స్టైపెండ్ కింద రూ.3,054 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. విద్యుత్ పంపిణీ ప్రైవేట్‌కు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ(డీఎన్‌హెచ్), డయ్యూ డామన్(డీడీ)లో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారుకు కొత్తగా ఏర్పాటైన కంపెనీ తాలూకూ ఈక్విటీ షేర్లు విక్రయించడంతోపాటు ఉద్యోగులు బాధ్యతలు నెరవేర్చడం కోసం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ డీఎన్‌హెచ్, డీడీకి చెందిన 1.45 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తోడ్పడుతుందని కేబినెట్ ఆశిస్తోంది. -
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ రద్దను బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత వారం, ప్రధాన మంత్రి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసన తెలుపుతున్న రైతులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, మూడు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు వేచి ఉంటారని రైతు నాయకుడు రాకేష్ టికైత్ అన్నారు. అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం మరో నాలుగు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు పంపిణీ చేశారు. దీన్ని మరో నాలుగు నెలలు పొడిగించారు. గడిచిన 15 నెలల కాలానికి గాను ఈ పథకానికి కేంద్రం 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. చదవండి: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు -
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. చదవండి: ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్ కొట్టివేత ఉభయసభల్లో చేపట్టనున్న బిల్లుల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్లాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు కూడా ఉండటం గమనార్హం. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పెంచేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా తాత్కాలికంగా దఖలుపడిన అధికారాలను చట్టరూపంలో శాశ్వతం చేయనుంది. చదవండి: సాగు చట్టాల నివేదిక విడుదల చేయండి నాలుగునెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎస్టీ, ఎస్సీ కులాల జాబితాలో మార్పుచేర్పులు చేసే చట్టాన్ని కూడా కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. త్రిపుర ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది. హైకోర్టు– సుప్రీంకోర్టు జడ్జీల (సర్వీసు నిబంధనలు, వేతనాలు) సవరణ బిల్లు–2021ను కూడా కేంద్రం రాబోయే సమావేశాల్లో ఉభయసభల ముందుంచనుంది. మనుషుల అక్రమ రవాణా (నిరోధం, రక్షణ, పునరావాసం) బిల్లు–2021 కూడా ఈ 26 బిల్లుల జాబితాలో ఉంది. నవంబరు 29న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు డిసెంబరు 23వ తేదీదాకా జరిగే విషయం తెలిసిందే. -
సాగు చట్టాల నివేదిక విడుదల చేయండి.. సుప్రీంకోర్టుకు లేఖ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రూపొందించిన నివేదిక త్వరగా విడుదలయ్యేలా చూడాలని ఆ చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ సభ్యుడు, షెట్కారీ సంగటన్ నేత అనిల్ ఘన్వత్ కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వచ్చే రెండు నెలల పాటు ధర్నా చేస్తామని, ఇందుకోసం లక్ష మంది రైతులను ఢిల్లీకి తీసుకొస్తానని తెలిపారు. చదవండి: సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని, అన్ని పంటలకు ఎంఎస్పీకే కొనుగోలు చేయాలన్న రైతుల డిమాండ్లు అమలుచేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంటే ప్యానెల్ ఇచ్చిన నివేదిక అసంబద్ధం అవుతుందని, ప్రజా ప్రయోజనార్థం సలహాలు ఉపయోగపడతాయని వివరించారు. సాగు చట్టాలపై కొంతమంది నేతలు రైతులను తప్పుదోవ పట్టించారని, ఈ నివేదిక ద్వారా వారికి అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ ప్యానెల్ తన నివేదికను సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్‌ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్‌లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
ఇప్పుడు గుర్తొచ్చిన జాతీయ ప్రయోజనం!
వ్యవసాయ సంస్కరణ చట్టాల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో భారత రైతాంగం చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. పంజాబ్, హరియాణాతో పాటు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగబోతున్నందున రైతు ఉద్యమం కొనసాగితే అసలు ఉనికి కే ప్రమాదం అని కేంద్రం గ్రహించింది. దాని ఫలితమే– కొత్త సాగు చట్టాల రద్దు నిర్ణయం. కానీ వచ్చే పార్లమెంటు సమావేశంలో చట్టాల ఉపసంహరణ బిల్లు అనంతరం తమ నిర్ణయం అమలులోకి వస్తుందని మోదీ పేర్కొన్నారు. దీంతో ఆందోళనల రద్దుకు రైతులు ససేమిరా అన్నారు. ఎన్నికలకూ, సమస్యలకూ ముడిపెట్టడం అలవాటైపోయిన దేశం కాబట్టి రైతుల అప్రమత్తతే వారికి శ్రీరామరక్ష. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాలక పార్టీ నాయకులిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రసిద్ధ వ్యంగ్య చిత్ర కారుడు మంజుల్ ఎలా నమోదు చేశాడో చూడండి: ‘జాతీయ ప్రయో జనాల దృష్ట్యా మనం చట్టాల్ని రూపొందించాం కదా! అదే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆ చట్టాల్ని తిరిగి మనమే రద్దు చేద్దాం! ఏమంటావ్?’ అని! ఇంక అనేదేముంది– అది ‘నాలుక గాదు, తాటిమట్ట’ అంటారు! ఎందుకంటే మడతపడిన నాలుకను సరిచేయడం అంత తేలిక కాదు. కాబట్టే సంవత్సరం పైగా ఒక్క పంజాబ్, హరియాణా రైతులే కాకుండా యావద్భారత రైతాంగ ప్రతినిధులు... బీజేపీ పాలకులు తలపెట్టిన రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని « జరుపుతున్న ధర్నాలు జయప్రదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడానికి పాలకులు రైతుల నెత్తిన మోపిన ప్రమాదకర షరతు ఒకటుంది. వచ్చే పార్లమెంటు సమావేశంలో చట్టాల ఉపసంహరణ బిల్లు అనంతరం తమ నిర్ణయం అమలులోకి వస్తుందని! మధ్యలో ఈ ఆ షరతు ఎందుకు? అంటే పంజాబ్, హరియాణాతో పాటు తమ ఉనికిని ప్రాణం పోస్తున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగ బోతున్నాయి. ఈ తరుణంలో 2019 ఎన్నికల తరువాత ఎన్నడూ లేనంత ఫికరు బీజేపీ పాలకులను అతలాకుతలం చేస్తోంది! దానికితోడు బీజేపీలోనే తమ భవిష్యత్తుపై అలుముకుంటున్న చీకట్లను తొలగించుకోవడానికి ఒక వర్గం పార్టీ ఉనికికోసం ఎత్తుగడలు మార్చుకొనే యత్నంలో ఉంటోంది. మరొకవర్గం మొండిగా రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోడానికి ఇప్పటికీ ససేమిరా అంటోంది. ఈ వైరుధ్యాల మధ్య నుంచే ప్రధాని నరేంద్రమోదీ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించారు. పైగా ఇంతవరకూ రైతాంగాన్ని తాను మనోవేదనకు గురిచేసినందుకు ‘క్షమాపణ’ వేడుకుంటున్నానని చెప్పడం హర్షించదగిన పరిణామం. అయితే పాలకుల మొండి వైఖరి ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతు ఆందోళనకారుల్ని గురించి మాత్రం ప్రధానమంత్రి ప్రకటనలో కనీస విచారం కూడా వ్యక్తం కాకపోవడం ఆశ్చర్యకరం. అందుకనే చట్టాల ఉపసంహరణ ప్రకటనను తమ విజయంగా ఆహ్వానించిన రైతాంగ ప్రజలు పోరాట బాట వీడేది లేదని తేల్చిచెప్పారు. తమ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ ప్రత్యేక చట్టాన్ని పాలకులు ప్రకటించేదాకా, ఇతర రైతాంగ సమస్యల పరిష్కారం గురించి సంతృప్తికరమైన వివరణను పార్లమెంటులో ప్రకటించేదాకా తాము విశ్రమించేది లేదనేశారు. ‘మనల్ని పాలిస్తున్న పాలకులేమీ రుషి తుల్యులు ఏమీ కారు. వారెప్పుడూ తమ రాజకీయలబ్ధిని లాభనష్టాల కోణం నుంచే ఆలోచిస్తూంటార’ని వీరు వ్యాఖ్యానించారు. ఈ లాభనష్టాల నాణానికి విరుద్ధంగా వారి ఆలోచనా పంధా కొనసాగి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలు కోల్పోయేదాకా పాలకులు గుడ్లప్పగించి చూస్తుండేవారు కాదు. అందుకే ప్రధాని తాజా ప్రకటనను మంచివైపుగా పడిన ఒక అడుగు అనిమాత్రమే పరిగణించాలని రైతు ఉద్యమ ప్రతినిధుల్లో ఒకరైన ధర్మేంద్ర మాలిక్ చెప్పారు. కాగా బీజేపీ పాలనకు సైద్ధాంతిక నాయకత్వం వహిస్తున్న ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న ‘భారతీయ కిసాన్ సంఘ్’ వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. రైతాంగ ప్రయోజ నాలకు దీర్ఘకాలంలో నేటి ప్రభుత్వ నిర్ణయం (చట్టాల ఉపసంహరణ) నష్టం కలిగిస్తుందని ఆరెస్సెస్ వాదించింది. అందువల్ల పాలక వ్యవస్థకు పట్టుకున్న ప్రధా నమైన చీడ అంతా వేరే ఉందని రైతాంగ ఉద్యమకారులు భావించ డమే కాదు... పార్లమెంటులో పాలకుల తుది నిర్ణయం వెలువడేదాకా తాము సమ్మెను మాత్రం ఉపసంహరించబోమని స్పష్టం చేశారు. ఎందుకంటే, దీపం పేరు చెప్పి, కొవ్వొత్తుల ‘మహిమ’ చూపి ప్రజల్ని మోసగించే రోజులు పోయాయి. ‘తీతువుపిట్ట’ల్లాంటి మధ్య వర్తుల రాయబారాలకూ, మోసాలకూ లోనయ్యేకాలమూ అంతరి స్తోంది. దీపం పేరు చెబితే చీకటి పోదు! అయిదు దశాబ్దాలుగా రైతన్నల వెతల్ని దగ్గరగా గమనిస్తున్నానని’ ప్రధాని మోదీ చెబుతూనే ఇంకోవైపునుంచి ‘అన్నదాతల సాధికారత కోసమే సాగు చట్టాలు తీసుకొచ్చామ’ని సమర్థించుకున్నారు. కాబట్టి, పార్లమెంటులో సాగు చట్టాలను ఉపసంహరించే దాకా రైతాంగం విశ్రమించబోదని అర్థ మవుతోంది! అర్ధంతరంగా వ్యవసాయం, రైతాంగం నడ్డి విరిచే మూడు చట్టాలను రద్దు చేస్తూనే మరోవైపునుంచి అదే ప్రకటనలో మోదీ ‘వాస్తవానికి ఎన్నెన్నో రైతుసంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన భావాలుగల రైతులు కొత్తసాగు చట్టాలకు అండగా నిలిచారన్నారు. ఒక వర్గం రైతులు మాత్రమే వ్యతి రేకిస్తూ వచ్చారనీ, కాని వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదే పదే ప్రయత్నించామనీ, చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేస్తామనీ చెప్పారేగాని, వాటి పూర్తి ఉపసంహరణకు సిద్ధమని మాత్రం చెప్ప లేదు! అందుకనే పాలకుల పరస్పర విరుద్ధ ప్రకటనల దృష్ట్యా రైతాంగ ప్రజలు తిరుగులేని హామీని పాలకులు ప్రకటించి ఆచరణలో అమలుపరిచేంతవరకూ విశ్రమించబోరని రైతాంగ సంయుక్త కిసాన్ మెర్చా ప్రకటించాల్సివచ్చింది. ఆ మాట కొస్తే నిజానికి దేశ రాజ్యాంగ చట్టం ఆదేశిక సూత్రాల విభాగంలో అధికరణలు 38 నుంచి 45వరకూ పౌర హక్కులలో అంతర్భాగమైన రైతాంగ సాగు ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించినవే నని మరచిపోరాదు! అంతేగాదు, రాజ్యాంగంలోని ‘పౌరబాధ్యత’ల అధ్యాయంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోమని, మూఢవిశ్వా సాలకు హారతి పట్టవద్దనీ చెప్పిందేగాని మరోలా ప్రవర్తించమనీ చెప్పలేదు! మరొకమాటలో చెప్పాలంటే 2014లో బీజేపీ అధికార పీఠాలు అలంకరించినప్పటి నుంచీ ఈ రోజుదాకా తీసుకున్న చర్య లలో హెచ్చుభాగం దేశ మౌలిక ప్రయోజనాలకు, రాజ్యాంగ ఆదేశా లకూ విరుద్ధమైనవిగానే భావించాలి. ఒక వైపున యూపీలో బీజేపీ పాలనా ప్రయోజనాల కోసం పెద్దకరెన్సీ నోట్లను ఆకస్మికంగా రద్దు చేసి కరెన్సీ సంక్షోభానికి తెరలేపారు. దీంతో గ్రామీణస్థాయిలోని, పట్టణాలలోని బ్యాంకులవద్ద దేశ పౌరులు గంటలు, రోజుల తరబడి పడిగాపులు పడి వృద్ధులు కూడా సాయంత్రం దాకా క్యూలలో నిల బడి సొమ్మసిల్లిపడిపోయిన ఫలితంగా దాదాపు 200 మంది దాకా ప్రాణాలు విడిచిన దారుణ పరిస్థితుల్నీ చూశాం! ఈ సంక్షోభం ఫలి తాల్ని నేటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌ని నమ్మి పెగసస్ గూఢచర్యంతో వియ్యమంది దేశప్రజల ముందు చులకనైపోయారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికే చిక్కిపోయారు! ఈ లోగా దేశ ఆర్థిక పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. విదేశీ బ్యాంకులలో దాచుకున్న భారత మోతుబరుల దొంగఖాతాలను దేశానికి రప్పించడం ద్వారా కోట్లాది రూపాయలను కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున పంచి దారిద్య్ర భారాన్ని రూపుమాపేస్తానని బీరాలు పలికిన బీజేపీ పాల కులు తీరా ఆచరణలో నోరెళ్లబెట్టుకోవలసి వచ్చింది! చివరికి దేశ పాలనా వ్యవస్థ ఒకనాటి వెర్రిబాగుల సంస్థానంగా మారిన ‘పుంగ నూరు’ సంస్థానంగా తయారైంది. కొన్ని దేశాలలోని ప్రభుత్వాలకు ఒక్కోదానికి ఒక్కో అవివేకపు ఖ్యాతి ఉంటుంది! ‘సంచి లాభాన్ని కాస్తా చిల్లి కూడదీసినట్టుగా పాలకుడు ఎంత గొప్పవాడనుకున్నా పాలన దిబ్బ రాజ్యంగా మారకూడదు! కవి సినారె అన్నట్టు ‘ఏది పలి కినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం? ఏది ముట్టినా బంగారమే అయితే ఏది శ్రమశక్తికి మూల్యం?’’! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్–సౌదీ ఆరామ్కో ఒప్పందానికి బ్రేక్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 25న) ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1051 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయాయి. కార్పొరేట్ల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించినప్పటికీ.., అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా మార్కెట్లో కన్సాలిడేషన్(స్థిరీకరణ)కొనసాగుతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. అమ్మకాలు జరిగితే 17,500 వద్ద మరో మద్దతు స్థాయి ఉంది. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. ట్రేడింగ్‌పై వ్యవసాయ చట్టాల రద్దు ప్రభావమెంత..? కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర శుక్రవారం మోదీ ప్రకటించారు. ‘‘వాస్తవానికి మూడు చట్టాలు వ్యాపార అనూకూలమైనవి. ఈ చట్టాలు అమల్లో లేనందున ట్రేడింగ్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గడం, మార్కెట్లో నెలకొన్న అస్థిరత పరిస్థితుల దృష్ట్యా చట్టాల రద్దు అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ కు మంగళం రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందానికి మరోసారి బ్రేక్ పడింది. సౌదీ అరామ్కోకు తన 20 శాతం వాటా విక్రయ ఒప్పందాన్ని మరోసారి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది. ఒప్పంద రద్దు ధీర్ఘకాలంలో రిలయన్స్ షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చని అయితే స్వల్పకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులను లోనుకావచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ భావించిన సంగతి తెలిసిందే. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 25న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
24న కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఆ బిల్లుల ఉపసంహరణ..
న్యూఢిల్లీ: ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ ప్రతిపాదనను మంత్రి వర్గం ఆమోదించనుంది. ఇక నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. చదవండి: (Heavy Rains, Floods: సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
తదుపరి కార్యాచరణ ఏంటి?
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద సమావేశం కానుంది. ఎంఎస్పీతోపాటు ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీపై చర్చించనున్నట్లు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శనివారం చెప్పారు. సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంట్లో పూర్తయ్యేదాకా రైతుల పోరాటం ఆగదని అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ వరకూ ప్రతిరోజూ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని విరమించుకోలేదని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు ప్రారంభించిన పోరాటానికి నవంబర్ 26న ఏడాది పూర్తి కానుంది. ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ పోరాట కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండబోదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 26న ఢిల్లీ శివార్లలోని నిరసన కేంద్రాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కేసులను ఉపసంహరించాలి: మాయావతి కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టాన్ని తీసుకురావాలని బహుజన సమాజ్‌పార్టీ అధినేత మాయావతి శనివారం డిమాండ్ చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. -
కేసీఆర్ ధర్నా వల్లే వ్యవసాయ చట్టాలు వెనక్కి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేసిన ధర్నా వల్లే కేంద్రం దిగొచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిం దని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ (పీయూసీ), ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను అద్భుత చట్టాలు అంటూ ఇన్నాళ్లూ కీర్తించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్విం ద్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తరహాలోనే ధాన్యం కొనుగోలు విషయంలోనూ బీజేపీతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. -
Farm Laws: రద్దు’ ఇప్పుడే ఎందుకు?
Reason Behind Farm Law Repeal In Telugu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఈ సమయాన్నే ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై ఈ నెల 26తో ఏడాది పూర్తవుతుంది. ఈలోగా తమ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) ప్రకటించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్ అంశంపై అనునిత్యం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికి వర్షాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరో నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను మరింతగా పెంచుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. డిసెంబర్ 23 దాకా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. రైతుల నిరసనలు, నల్ల చట్టాల అంశమే నిత్యం వార్తల్లో ఉంటే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్షాలూ ఎలాగూ దీన్ని అందిపుచ్చుకొని ప్రధానాస్త్రంగా చేసుకుంటాయి. వెరసి కాషాయ పార్టీపై ప్రజావ్యతిరేకత ప్రబలుతుంది. అందుకే బీజేపీ వ్యూహకర్తలు పట్టువిడుపులు ప్రదర్శించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సాగు చట్టాలు, పెట్రోధరల లాంటి అంశాలను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలకు ఎక్కితే అది కచ్చితంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రతికూల సంకేతాలను పంపుతుంది. ఇది కాషాయ దళానికి అభిలషణీం కాదు. ఏడాది కాలంగా ఏమీ పట్టించుకోకున్నా ఇప్పుడిక ‘సమయం’ లేదు కాబట్టే సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్రం మొగ్గుచూపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల ప్రధానాస్త్రాలు మూడింటి విషయంలోనూ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వానికి ‘దాటవేత’ ధోరణిని అధిగమించి ఎదురునిలిచి బదులిచ్చే వెసులుబాటు కలిగింది. ఎదురుదాడి ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల్లో తేడాకొట్టిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అన్నట్లుగా బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తూ గంటల వ్యవధిలో పోటీలు పడి ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడిదే అంశాన్ని పట్టుకొని బీజేపీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల నోరునొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మీ రాష్ట్రాల్లో వ్యాట్‌ను ఎందుకు తగ్గించట్లేదని ఎదురుదాడికి దిగుతుంది. ఇతర ఏ అంశాన్ని విపక్షాలు ప్రస్తావించినా బీజేపీ మాత్రం వ్యాట్ ఎందుకు తగ్గించలేదనే అంశాన్నే తెరపైకి తెస్తూ తప్పించకోజూస్తుంది. కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని సెంట్రల్ పూల్ కింద తక్కువగా చూపుతూ సెస్‌ల రూపంలో అధికంగా పిండుకుంటోంది. అసలే రాష్ట్రాలకు ఆదాయ వనరులు తక్కువని, కోవిడ్–19 వ్యాప్తితో రాబడి మరింత దెబ్బతిందని, ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గింపు సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. వ్యాట్ తగ్గింపు అంశాన్ని ప్రతిరోజూ హైలైట్ చేయడం ద్వారా ఇతర అంశాలను మరుగున పడేయడానికి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తప్పకుండా ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా ప్రజా వ్యతిరేకతను వీలైనంత తగ్గించుకొని, విపక్షాలకు అస్త్రాలేవీ లేకుండా చేయాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా ఉపశమనం సదుద్దేశంతో రైతుల మేలుకోరి మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చినా కొందరినీ ఒప్పించలేక వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈనెల 19న ప్రకటించారు. దేశానికి క్షమాçపణ చెప్పారు. ఉపసంహరణ æప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామన్నారు. రైతు ఆందోళనల్లో కీలక భూమిక పోషిస్తున్న జాట్లు 136 స్థానాలున్న పశ్చిమ యూపీలో బీజేపీయేతర ఓటును ఏకతాటిపైకి చేర్చకుండా చూసుకోవాలంటే రైతు చట్టాలను రద్దు చేయాలి. పంజాబ్ జనాభాలో 21 నుంచి 25 శాతం జాట్ సిక్కులు ఉన్నారు. ఇతర సిక్కుల్లోనూ రైతులే అధికం. వీరి ఆగ్రహాన్ని చల్లార్చాలి. ఈ రెండింటినీ బీజేపీ ఆశించింది. ఇప్పుడిక కాంగ్రెస్, మిగతా విపక్షాలు రైతు ఎజెండాపై ఇదివరకటిలా మోదీ సర్కారుపై ముప్పేట దాడికి దిగలేవు. ‘కనీస మద్దతు ధర’ అంశం ఇకపై ఇరుపక్షాల నడుమ సంఘర్షణకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఊరట విపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్‌తో (ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారీ) నిఘా పెట్టారని, ఫోన్లను ట్యాప్ చేశారని, దీనిపై ప్రభుత్వం విస్పష్టమైన సమాధానం ఇవ్వాలని విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేశాయి. సీనియర్ జర్నలిస్టులు కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. చట్టవిరుద్ధంగా తామేమీ నిఘా పెట్టలేదని, దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని మోదీ సర్కా రు సుప్రీంకోర్టులో వాదించింది. ఇందులోని నిజా నిజాలను నిగ్గుతేల్చడానికి మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సాంకేతిక నిపుణులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అంటే పెగాసస్‌పై కేంద్రానికి తాత్కాలిక ఊరట లభించినట్లే. విపక్షాలు దీన్ని లేవదీసినా అంశం కోర్టు పరిధిలో ఉందని, ఏమైనా ఉంటే సాంకేతిక కమిటీకి విన్నవించుకోవాలంటూ కేంద్రం చేతులు దులుపుకునే అవకాశం ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
కేంద్రంతో అమీతుమీ.. కేసీఆర్ రెండు రోజుల హస్తిన పర్యటన
వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రైతులు ఏ పంట వేసుకోవాలో చెబుతాం రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలుపై మాట్లాడతామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినట్లు మొన్న ఓ గాలివార్త వచ్చింది. ఇది అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని నిర్ణయించాం. ఆయా కుటుంబాలను కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల సాయం చొప్పున మొత్తం రూ. 22.5 కోట్లు అందిస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణతోపాటు నీటి వాటాలు, ఇతర సమస్యలపై కేంద్రంతో తేల్చుకునేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వెళ్లి.. ఢిల్లీ రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ చట్టాలు తదితర అంశాలపై ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తామని వెల్లడించారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని తేల్చుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్లో పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యంపై ఉలుకూపలుకు లేదు.. ‘తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఎటువంటి సమాధానం వస్తలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి సంవత్సరంలో ఎంత సేకరిస్తారో టార్గెట్ ఇవ్వమని అడుగుతున్నం. దాన్నిబట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొన్న ధర్నా చేసిన రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. ఏం మాట్లాడలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, ఎంపీల బృందంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల కార్యదర్శుల బృందంతో ఢిల్లీకి వెళ్తున్నం. కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరుతం. అవసరమైతే రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాం. ఆ తరువాత రైతులకు మా విధానం ఏంటో చెపుతం..’అని సీఎం వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలి..వేధింపులు ఆపాలి ‘భద్రతా బలగాల నిర్బంధం, ఒత్తిళ్లు, కేసుల నడుమ 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటం అద్భుత విజయం సాధించింది. చట్టాలను వెనక్కు తీసుకోవడంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఈ ఉద్యమ సమయంలో రైతులపై దేశద్రోహం సహా వేలాది కేసులు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి కేసులను వెంటనే ఎత్తివేసి, రైతులపై వేధింపులను ఆపివేయాలి. కేంద్రం అనుసరించిన దుర్మార్గ విధానాలతో సుమారు 750 మంది రైతులు పోరాటంలో భాగంగా ఆత్మార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం క్షమాపణలతో చేతులు దులుపుకోకుండా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఇచ్చి ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలి. రైతులపై కేసుల ఎత్తివేత, రూ.25 లక్షల సాయంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర చట్టం కోసం పార్లమెంటులో కొట్లాడుతం..’అని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి ‘దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర కోసం దేశంలోని 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రధాని ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్’తరహాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆత్మ కృషి నిర్భర్’పథకాన్ని తీసుకురావాలి. వ్యవసాయ చట్టాల తరహాలోనే పార్లమెంటులో పెట్టిన విద్యుత్ చట్టాన్ని కూడా కేంద్రం వెనక్కు తీసుకోవాలి. నూతన కరెంటు చట్టం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల మెడపై కత్తి పెట్టడంతో ప్రజలు, విద్యుత్ కార్మికులలో ఆందోళన నెలకొంది. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నియంతృత్వ పోకడలకు వెళితే రైతులు రోడ్లెక్కుతారు..’అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ట్రిబ్యునల్ వేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకెవడు? ‘నదీజలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కొత్త రాష్ట్రానికి నీటి వాటాతో పాటు అనేక అంశాల్లో కేంద్రం తాత్సారం చేస్తోంది. 8 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటా తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకుంటున్న ప్రణాళికలు ఆలస్యమై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసినప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కోరడంతో పాటు మూడు నాలుగు నెలల కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చాలని అడుగుతం. ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడంలో కేంద్రానికి ఏం అడ్డం పడుతోంది. కేంద్రం రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకు ఎవడు? కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ఆందోళనకు దిగుతాం..’అని చెప్పారు. బీసీ కుల గణన జరపాలి ‘గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభ తీర్మానాలు చేసి పంపింది. దేశంలో బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలే కులం సర్టిఫికెట్లు ఇస్తున్న నేపథ్యంలో కులాల లెక్కలు దాచిపెట్టుడెందుకు ? కుల గణన చేపట్టకుంటే పెద్ద వివాదానికి దారితీస్తుంది..’అని కేసీఆర్ పేర్కొన్నారు. పిచ్చిమాటలు వినొద్దు.. రైతులు ఆగం కావొద్దు ‘స్థానిక బీజేపీ నాయకులు పిచ్చిమాటలు కట్టిపెట్టాలి. మీ బండారం బయటపడింది. మీరు చేసిన తప్పులకు ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలి. చిల్లరగాళ్లు చెప్పే మాటలకు రైతులు ఆగం కావద్దు. ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చే క్రమంలో తొందరపడవద్దు. వానాకాలం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు 6,600 కేంద్రాలు ఏర్పాటు చేసి డబ్బులు ఇస్తున్నం. వర్షాలు పడుతున్నందున కోతలు కోయనివారు రెండు మూడు రోజులు ఆగాలి. లేదంటే ధాన్యం రంగు మారి నష్టపోవలసి వస్తుంది. కోసిన వారు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. యాసంగిలోనూ రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు సిద్ధం చేస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఏ పంటలు వేసుకోవాలో రైతులకు చెపుతం..’అని అన్నారు. ఎన్నికలు ఉన్నందునే వ్యవసాయ చట్టాలు వెనక్కి ‘దేశంలోని ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశంలో బియ్యం తినే జనం ఎక్కువ. మన రాష్ట్రంలోనే పీడీఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యం అవసరం. 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్రమే చెపుతోంది. కేంద్రంపై పోరాటంలో ఏ సమయంలో ఎవరిని కలుపుకొనిపోవాలో వారిని కలుపుకొనివెళతాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. దేశంలో ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు..’అని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం
సిక్కుల ఆరాధ్య గురువు గురునానక్ 552వ జయంతి గురుపూరబ్ (కార్తీక పౌర్ణమి) సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాల వల్ల లభించే ప్రయోజనాల గురించి రైతుల్లో ఒక సెక్షన్ సమాధానపడక పోవడంతోనే తన ప్రభుత్వం సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని మోదీ విచారం వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను మేం మొదలుపెడతామని ప్రధాని పేర్కొన్నారు. ఒక సంవత్సరం పైగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగ నిరసనలకు కేంద్రబిందువుగా మారిన పంజాబ్ మొత్తం ఉద్యమానికి ప్రతీకగా మారింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని చేసిన ఈ ఆకస్మిక ప్రకటనతో పంజాబ్ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ప్రభావ ఫలితాలను చూద్దాం. బీజేపీకి ఉపశమనం దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న రైతాంగం ఆందోళన ముగింపునకు చేరువవడం కాషాయ పార్టీకి పెద్దగా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ సంవత్సర కాలంలో పంజాబ్‌లో క్షేత్రస్థాయిలో బీజేపీ రైతుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూసింది. మిత్రపక్షాలతో కనీసం చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాల కారణంగా 24 సంవత్సరాలుగా శిరోమణి అకాలీదళ్‌తో కొనసాగిన ఎన్నికల పొత్తు బదాబదలైపోయింది. ఈ మూడు సాగు చట్టాలకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ గత సంవత్సరమే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకుంది. సుదీర్ఘమైన పొత్తు రద్దుతో గ్రామీణ పంజాబ్ రైతాంగ ఆగ్రహానికి కేంద్రాన్నే లక్ష్యంగా చేయడంలో శిరోమణి అకాలీదళ్ విజయం సాధించింది. ఇప్పుడు మోదీ ఆకస్మిక నిర్ణయం ప్రభావంతో పంజాబ్‌లో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. పాకిస్తాన్‌కి సిక్కు భక్తులు వెళ్లడానికి వీలుగా కర్తార్‌పూర్ కారిడార్‌ని తిరిగి తెరవడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రెండురోజుల్లోపే ప్రధాని మోదీ సాగు సంస్కరణ చట్టాల రద్దు గురించి ప్రకటించారు. దీంతో సిక్కు నియోజకవర్గాల్లో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. పరపతి యుద్ధంలో కాంగ్రెస్‌కు పైచేయి పంజాబ్‌లో పాలక కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ సంస్కరణ చట్టాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించడమే కాకుండా, కేంద్ర శాసనంపై రెండు సార్లు శాసనసభలో తీర్మానాలు ఆమోదించింది. మోదీ ప్రభుత్వం మెడలు వంచేలా చేసిన ఘనత పూర్తిగా తనదేనని పంజాబ్ ప్రభుత్వం వెంటనే ప్రకటించేసుకుంది. ఇప్పటికే గ్రామీణ ఓట్ల కోసం జనరంజక పథకాలను వరుసగా ప్రకటిం చిన పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగును తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేగంగా పథకాలు పన్నుతోంది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే రైతులకు విజయం దక్కేలా చేయడంలో తమ పాత్ర కూడా ఉందని చెబుతూ కాంగ్రెస్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. పంజాబ్‌లో నూతన రాజకీయ సమీకరణలు సాగుచట్టాల రద్దుతో పంజాబ్‌లో నూతనంగా రాజకీయ ఏకీకరణలు, పొత్తులకు అవకాశాలు ఏర్పడ్డాయి. బీజేపీతో పొత్తును తెంచుకుని ప్రతిష్ఠను పెంచుకున్న శిరోమణి అకాలీదళ్‌కు పెద్ద ఉపశమనం కలిగినట్లయింది. మొదట్లో వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సులను బలపర్చి రైతాంగం నుంచి పెనువిమర్శలకు గురైన శిరోమణి అకాలీదళ్‌కు ఆ చట్టాల రద్దుతో నెత్తిన పాలు పోసినట్లయింది. ఎన్నికల లెక్కలు సరిచేసుకోవడానికి వెంపర్లాటలో అకాలీలు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని 117 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లను తన జూనియర్ భాగస్వామికి ఇవ్వడానికి అంగీకరించింది. అయితే చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో బీఎస్పీ ద్వారా కులం కార్డును ప్రయోగించాలనుకున్న శిరోమణి అకాలీదళ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రైతుల సాంప్రదాయిక కంచుకోటల్లో తాను కోల్పోయిన రాజ కీయ భూమికను తిరిగి చేజిక్కించుకోవడంపై అకాలీలు ఆశలు పెట్టుకోవచ్చు. అయితే పంజాబ్ రాజకీయాల్లో ఇప్పుడు కీలకప్రశ్న ఏమిటంటే శిరోమణి అకాలీదళ్, బీజేపీ తమ సంబంధాలు పునరుద్ధరించుకుని, మళ్లీ పొత్తు కుదుర్చుకుం టాయా అన్నదే! ఈ రెండు పార్టీల పొత్తు వల్ల సిక్కులు, హిందువులు మెజారిటీ ఉండే నియోజకవర్గాల్లో ఈ కూటమికి గట్టి పునాది పాతుకుపోయిన విషయం తెలిసిందే. అలాంటి అవకాశాన్ని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు కూడా! కెప్టెన్–బీజేపీ పొత్తుకు మార్గం కుదిరినట్లే! వ్యవసాయ చట్టాల రద్దుతో, కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను నెలకొల్పిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు, బీజేపీకి మధ్య పొత్తుకు ద్వారాలు తెరిచినట్లయింది. రైతుల సమస్యలు పరిష్కారమైతే బీజేపీతో స్థానాలు పంచుకుంటానని అమరీందర్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే కెప్టెన్ కొత్త పార్టీ ఇంకా పుంజుకోనప్పటికీ, తనకు ఇప్పటికీ రాజకీయ ప్రాధాన్యం ఉంది. పంజాబ్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమరీందర్‌కి పట్టు ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో వేగిపోతున్న నేతలను అమరీం దర్ తమ కూటమి వైపు ఆకర్షించగలడని కూడా నమ్ముతున్నారు. రైతు సంఘాలు అదనపు కారణం సంయుక్త కిసాన్ మోర్చాలోని 32 రైతు సంస్థల్లో చాలా వాటికి పంజాబ్‌లో మూలాలున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దుతో ఈ సంఘాలు ఇప్పుడు విజయోత్సాహంతో ఉన్నాయి. కానీ తమ ఈ విజయాన్ని ఎన్నికల రూపంలో ఇవి క్యాష్ చేసుకోగలవా అన్నదే ప్రశ్న. అయితే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఇవి ఇప్పటికే తోసిపుచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చాకు పట్టు ఉన్న కొన్ని నియోజక వర్గాల్లో భారతీయ కిసాన్ యూనియన్‌కి చెందిన రాజేవాల్ ఫ్యాక్షన్‌కి రాజకీయ ఆకాంక్షలు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్ – రెండు పార్టీలూ ఈ ఫ్యాక్షన్ని ఆకర్షించగలవు కూడా. తమ సుదీ ర్ఘమైన మొండి పోరాటంలో విజయం సాధిం చిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న రైతు సంఘాలు పంజాబ్ ఎన్నికల్లో జయాపజయాలకు సంబంధించి అదనపు అంశంగా ఉండబోతున్నాయి. – రమేష్ వినాయక్, సీనియర్ జర్నలిస్ట్ -
'ఆ రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు'
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సంవత్సరం టార్గెట్ ఇవ్వమంటే స్పందించడం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. కేంద్ర మంత్రులు, అధికారులను కలుస్తాం. అవకాశముంటే ప్రధానమంత్రిని కలుస్తాం. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని వార్త వచ్చింది. అది గాలివార్తా లేక నిజమా అనేది తెలుసుకుంటాం. రైతులకు ప్రధాని సారీ చెప్తే సరిపోదు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి. సాగుచట్టంపై పోరాటంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. రైతు ఆందోళనలో చనిపోయిన ప్రతిరైతు కుటుంబానికి తెలంగాణప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందిస్తాం. కేంద్రం కూడా ప్రతిరైతు కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తాం అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం. ఆ చట్టాలను కూడా కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యుత్ చట్టం తెచ్చి రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారు. మా రాష్ట్రంలో మీటర్లు పెట్టే ఉద్దేశం లేదు. మాపై ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీటర్లు పెట్టుకుంటె ఇబ్బంది లేదు. విద్యుత్ చట్టాలన్ని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలి. నదులలో నీటి వాటా కేటాయింపులపై రేపు మళ్ళీ జలశక్తి మంత్రిని కలుస్తా. టైం పిరియడ్ పెట్టి వాటా తేల్చాలని కోరుతాం. టైం పిరియడ్ పెట్టకుంటే.. పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేస్తాం ఇతర రాష్ట్రాల మద్దతు కూడా తీసుకుంటాం. రిజర్వేషన్లపై కేంద్ర తేల్చాలి గిరిజనుల రిజర్వేషన్లను కూడా కేంద్రం తేల్చాలి. లేదంటే పెద్ద ఎత్తున గిరిజన ఉధ్యమాలు మొదలవుతాయి. ఎస్సీ రిజర్వేషన్లు కూడా వీలైనంత త్వరగా తేల్చాలి. బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి. ఎందుకు బీసీ కుల గణన చేయట్లేదు. ఎస్సీ, ఎస్టీలాగే బీసీ కులగణన చేయాల్సిందే. ప్రభుత్వమే కులం సర్టిఫికెట్ ఇచ్చినపుడు.. బీసీ కులగణన చేయడానికి ఏం ఇబ్బంది. రాష్ట్ర బీజేపీ నేతల బండారు బయటపడ్డది. ప్రజల ముందు స్థానిక బీజేపీ నేతలు తప్పు ఓప్పుకొని క్షమాపణ కోరాలి. వర్షాకాల చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని ఎన్నికల స్టంట్ అంటున్నారు. బీజేపీని దేశంలో ఎవరు నమ్మడం లేదు. -
వ్యవసాయ చట్టాల రద్దుపై యూఎస్ కాంగ్రెస్ స్పందన
న్యూయార్క్: భారతదేశంలోని మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ లెవిన్ స్వాగతించారు. గతేడాది కాలంగా రైతుల నిరసనలకు కేంద్రంగా నిలిచిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..) ఈ నేపథ్యంలో ఒక సంవత్సరానికి పైగా నిరసనల తర్వాత భారత్‌లో ఇలా మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఆండీ లెవిన్ అన్నారు. అంతేకాదు కార్మికులు కలిసికట్టుగా ఉంటే కార్పొరేట్ ప్రయోజనాలను ఓడించగలరని చెప్పడానికి ఇదోక నిదర్శనం అని పైగా వారు యావత్ భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పురోగతిని సాధించగలరు అంటూ ఆండీ లెవిన్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: యాక్సిడెంట్ అయింది! వైద్యం చేయండి డాక్టర్: జింక) -
ఎన్ని‘కలవర’మేనా!
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు. కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించే దాకా వెళ్లారు. మరి ఇప్పుడు ఆకస్మాత్తుగా మోదీ ఎందుకు జాతిముందుకు వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా దేశానికి క్షమాపణ చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... అహంకారిగా ముద్రపడుతున్నా, ఒంటెత్తు పోకడలు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనా... ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కితగ్గిన ఉదంతాలు చూడలేదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి తాజా వెనుకడుగు మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేసిందేనని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి– మార్చి నెలల్లో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా రైతు ఆందోళనల్లో పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణా రైతులే ముఖ్య భూమిక పోషించారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో వెంటనే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం వెలువడింది. ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది సుస్పష్టం. సామాన్య ప్రజానీకంలో ధరాఘాతంతో పెల్లుబికిన ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించగలిగామని భావించిన బీజేపీ వ్యూహకర్తలు... రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపైకి దృష్టి మళ్లించారు. ఆజ్యం పోసిన హరియాణా హరిణాయా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులపై దాడులు చేయాల్సిందిగా పరోక్షంగా బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టడం, అరునెలలు జైలులో ఉండొస్తే నేతలు అవుతారని ఉద్భోదించడం... రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అయూష్ సిన్హా రైతుల తలలు పగలగొట్టండని పోలీసులు ఆదేశాలు ఇస్తున్న వీడియో వైరల్ కావడం... పోలీసు లాఠీచార్జీలో 10 మంది రైతులు రక్తమోడగా... తర్వాత అందులో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇవన్నీ బీజేపీపై రైతుల ఆగ్రహాన్ని పెంచుతూ పోయాయి. హిమాచల్ ఓటమి... మరో కనువిప్పు ఇటీవలి ఉప ఎన్నికల్లో కొంచెం అటుఇటుగా అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల హవాయే కనపడింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ దారుణంగా దెబ్బతింది. అంతుకుముందు నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గిన మండీ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయింది. అలాగే ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. ఇది కమలనాథులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్‌లో నాలుగు స్తంభాలాట! రైతు ఉద్యమంలో సిక్కులు ముందువరుసలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రైతు చట్టాలపై ఎన్డీయేతో తమ సుదీర్ఘ బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళితులు ఉండటంతో బీఎస్పీతో అకాలీదళ్ జట్టుకట్టింది. మరోవైపు కాంగ్రెస్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా, దళితుడైన చన్నీని సీఎంగా పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో జట్టు కడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ కొత్త కూటమి ఏమేరకు ప్రభావం చూపుతుందనే పక్కనబెడితే పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారనున్నాయి. అకాలీదళ్‌తో పాత అనుబంధం దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తే కెప్టెన్–బీజేపీ కూటమి ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్ పాత్రను ఆశించొచ్చు. పశ్చిమంతో మొదలై పాకుతుందని...! పశ్చిమ యూపీలోని ఆరు రీజియన్లలో (26 జిల్లాల్లో) మొత్తం 136 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 103 అసెంబ్లీ స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. (27 లోక్‌సభ స్థానాల్లో 20 కాషాయదళానికే దక్కాయి). మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా 312 చోట్ల నెగ్గి ఘన విజయం సాధించింది. రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాట్లు పశ్చిమ యూపీలో బలంగా ఉన్నారు. 18–20 శాతం దాకా ఉంటారు. 49 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల జనాభా 30 శాతం పైనే. 25 స్థానాల్లో ముస్లిం– జాట్లు కలిస్తే... జనాభాలో సగం కంటే ఎక్కువే ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 5న కిసాన్ సంయుక్త్ మోర్చా... ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌కు అనూహ్యంగా లక్షలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇదే వేదిక పైనుంచి రాకేశ్ తికాయత్ బీజేపీ విభజన రాజకీయాలను ఎండగడుతూ... రైతుల ప్రయోజనాల దృష్ట్యా హిందూ– ముస్లింలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని నినదించారు. ఇకపై రైతు వేదికల పైనుంచి ‘అల్లా హు అక్బర్’, ‘హరహర మహదేవ్’ నినాదాలను వినిపించి సామరస్యాన్ని చాటుతామని నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో పనిచేస్తామన్నారు. త్యాగిలతో కలిపి వెనుకబడినవర్గాలైన సైనీ, కశ్యప్, గుజ్జర్లను కలుపుకొనిపోతే రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావించారు. సమాజ్‌వాదితో ఆర్ఎల్డీ జతకట్టడం ఈ ప్రాంతంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు బీజేపీ వ్యూహకర్తలకు ఉలికిపాటుకు గురిచేశాయి. నష్టనివారణ చర్యలకు దిగారు. సెప్టెంబరు 14న ప్రధాని మోదీ జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట యూనివర్శిటీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ యూపీలో బలపడుతున్న రైతు ఐక్యతకు... సామాజికవర్గాల పునరేకీరణ తోడై... మొత్తం ఉత్తరప్రదేశ్‌కు పాకితే తట్టుకోవడం కష్టమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చారు. అసలే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తారు. అందుకే కాషాయదళం భేషజాలను పక్కనబెట్టి... పోల్ మేనేజ్మెంట్కుదిగింది. మృత చట్టాలే... ఖననం చేసేద్దాం! కార్పొరేట్ మిత్రులకు లబ్ధికొరకే వ్యవసాయ చట్టాలను తెచ్చారని... తీవ్ర అపవాదును మూటగట్టుకొన్న బీజేపీ నిజానికి వీటి ద్వారా సాధించింది ఏమీలేదు. 11 దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు జరిపిన కేంద్రం మొండిగా వ్యవహారించింది. ‘ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా... (చట్టాల రద్దు మినహా)’ ఏమైనా అడగండి... చర్చలకు సిద్ధం అంటూ పాడినపాటే పాడింది. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తప్ప తాము మరోటి కోరుకోవడం లేదని రైతులూ తేల్చిచెప్పడంతో చర్చల్లో ఏమీ తేలలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ఈ ఏడాది జనవరి 12నే ‘స్టే’ విధించింది. కోర్టులో వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న చట్టాల కోసం పార్టీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదనేది బీజేపీ పెద్దలు నిర్ణయానికి వచ్చి... మోదీ ‘ఇమేజ్’కు భిన్నంగా వెనక్కి తగ్గుతూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఊదరగొడుతున్న బీజేపీకి యూపీలో తాజా నిర్ణయం ఏమేరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి. –నేషనల్ డెస్క్, సాక్షి -
విజయ సారథులు వీరే
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు. రాకేశ్ తికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. దర్శన్పాల్ వృత్తిరీత్యా డాక్టర్ అయిన దర్శన్పాల్ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్ ఏక్తా జిందాబాద్ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్ పాల్ పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జోగిందర్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు అయిన జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్ సింగ్ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్లలో జోగిందర్ సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. బల్బీర్ సింగ్ రాజేవాల్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్ సింగ్ రాజేవాల్ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు. సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్ అయిన 71 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్‌దేవ్ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు. -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
అన్నదాతల అలుపెరుగని పోరాటం.. వ్యవసాయ చట్టాల కథేంటంటే
అన్నదాతల ఆగ్రహానికి కారణమైన... వారిని అలుపెరుగని పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన మోదీ సర్కారు తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలేమిటి? వాటిని కేంద్రం ఎలా సమర్థించుకుంది? రైతుల అభ్యంతరాలేమిటో చూద్దాం... 1. ది ఫార్మర్స్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్– ఎఫ్‌పీటీసీ) యాక్ట్ రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది. ప్రభుత్వ వాదన: రైతులు స్థానిక వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా... తమ ఉత్పత్తులను డిమాండ్ ఉన్నచోటికి తరలించి మంచి ధరకు అమ్ముకోవడానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ మార్కెట్ల (ఈ– మార్కెట్లు)లోనూ అమ్ముకోవచ్చు. ఎక్కడో హరియాణాలో ఉన్న వ్యాపారి కూడా ఆన్లైన్ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సరుకు కొనుగోలు చేయవచ్చు. ప్యాన్ కార్డులు, ఇతర చట్టబద్ధ ధ్రువపత్రాలు ఉన్నవారెవరైనా సులువుగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు. రైతుల అభ్యంతరం: స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. వ్యవసాయ మార్కెట్లు లేకపోతే కనీస మద్దతు గ్యారెంటీ ఏముంటుంది? అడిగే దిక్కెవరు? మూడు నుంచి ఐదెరకాల చిన్న కమతాలు ఉన్న రైతులు పంటను రవాణా ఖర్చులు భరించి ఎక్కడో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పనేనా? కొనుగోలు ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తినా సమస్య పరిష్కారం కోసం సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని చట్టంలో ఉంది... సామాన్య రైతులను ఆ స్థాయి అధికారిని కలుసుకొనే అవకాశం ఉంటుందా? నిర్ణీత వ్యాపార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేని వ్యక్తులు వ్యాపారంలోకి వస్తే... రైతులు మోసపోయే అవకాశాలుంటాయి. 2. ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, 2020 ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు. ప్రభుత్వ వాదన: రైతులు తమ పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకొనే వీలు కలుగుతుంది. ముందస్తు ఒప్పందాల ద్వారా ఎవరికైనా అమ్ముకోవచ్చు. చట్టాల చట్రం నుంచి రైతుకు విముక్తి లభిస్తుంది. రైతుల భయం: వ్యవసాయరంగం కార్పొరేటీకరణకు ఇది బాటలు వేస్తుంది. బడా కంపెనీలదే గుత్తాధిపత్యం అవుతుంది. కనీసం మద్దతు ధర అనే భావన ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టు వ్యవసాయ విధానంలో సన్న, చిన్నకారులు రైతులు దోపిడీకి గురయ్యే ఆస్కారం ఉంటుంది. రైతుకు లభించే అమ్మకపు ధర మీద నియంత్రణ లేకపోతే... రైతుల బతుకులు గాలిలో దీపాలవుతాయి. వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్ కంపెనీలను ఎదురించి సామాన్య రైతు నిలబడగలడా? 3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020 నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు. మొత్తానికి ఈ నిబంధన మూలంగా రైతులపై పెద్దగా ప్రభావం ఉండదు కాని వినియోగదారులకు చేటు చేసేదే. పరిమితి లేకపోతే భారీగా నిల్వలు చేయడం ద్వారా బడా వ్యాపారులు కృతిమ డిమాండ్‌ను సృష్టించి నిత్యావసరాల ధరలను పెంచే ముప్పు పొంచి ఉంటుంది. జూన్ 5 2020: మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది. సెప్టెంబర్ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
3 వ్యవసాయ చట్టాలు రద్దు
న్యూఢిల్లీ: రైతన్నల డిమాండ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్టు దిగొచ్చారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్ల డించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఒక వర్గం రైతులే వ్యతిరేకించారు ‘‘రైతులతోపాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చాం. దేశంలోని రైతులు.. ప్రధానంగా సన్నకారు రైతులు గరిష్టంగా లబ్ధి పొందుతారని ఆశించాం. కానీ, ఈ చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించలేకపోయాం. అనుమానాలను నివృత్తి చేసేందుకు పవిత్ర హృదయంలో మొదలుపెట్టిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొవ్వొత్తి కాంతి లాంటి స్పష్టమైన నిజాన్ని అర్థమయ్యేలా వివరించలేకపోయాం. సాగు చట్టాల వ్యవహారంలో దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. వాస్తవానికి ఎన్నెన్నో రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన దృక్పథం ఉన్న రైతులు కొత్త సాగు చట్టాలకు అండగా నిలిచారు. ఒక వర్గం రైతన్నలు మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదేపదే ప్రయత్నించాం. చట్టాల అమలును రెండేళ్లపాటు నిలిపివేస్తామని చెప్పాం. అభ్యంతరాలున్న అంశాల్లో సవరణలు చేస్తామని సూచించాం. సుప్రీంకోర్టు కూడా సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. మనమంతా కలిసి ముందుకు సాగుదాం నేడు గురు నానక్ జన్మించిన రోజు. ఒకరిపై నిందలు వేయడానికి ఇది సందర్భం కాదు. దేశ ప్రజలను నేను చెప్పేది ఏమిటంటే 3 సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. గురుపూరబ్ పర్వదినాన్ని పురస్కరించుకొని నా విన్నపాన్ని మన్నించి, రైతు సోదరులు ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలి. కుటుంబాలను కలుసుకోవాలి. జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలి. మనమంతా మళ్లీ కొత్తగా ముందుకు సాగుదాం. పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు దేశంలో రైతాంగం సాధికారతే లక్ష్యంగా వ్యవసా య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు చేపట్టబోతున్నాం. జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. ఈ తరహా వ్యవసాయంలో సహజ ఎరువులు, స్థానిక విత్తనాలే ఉపయోగిస్తారు. మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు తీసుకొస్తాం. కనీస మద్దతు ధర(ఎం ఎస్పీ)ను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ఎంఎస్పీతోపాటు జీరో బడ్జెట్ ఆధారిత సాగుపై నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారు. రికార్డు స్థాయిలో సేకరణ కేంద్రాలు ఐదు దశాబ్దాల నా ప్రజాజీవితంలో అన్నదాతల వెతలను దగ్గరగా గమనిస్తూనే ఉన్నాను. వారికి ఎదురవుతున్న సవాళ్లు, కష్టనష్టాలు నాకు తెలుసు. మూడు కొత్త సాగు చట్టాల లక్ష్యం ఏమిటంటే రైతులను బాగు చేయడమే. ప్రధానంగా సన్నకారు రైతులకు సాధికారత కల్పించాలని ఆశించాం. 2014లో ‘ప్రధాన సేవకుడి’గా ప్రజలకు సేవలు చేసుకునేందుకు దేశం నాకు అవకాశం ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అప్పటినుంచే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. సన్నకారు రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఏకంగా ఐదు రెట్లు పెంచేశాం. ప్రతిఏటా రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన ధర దక్కేలా చర్యలు తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయాలను బలోపేతం చేశాం. వెయ్యికి పైగా మండీలను (వ్యవసాయ మార్కెట్లు) ఈ–నామ్(ఎలక్ట్రానిక్–నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)తో అనుసంధానించాం. పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకోవడానికి రైతులకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలను మెరుగు పర్చడానికి కోట్లాది రూపాయలు వెచ్చించాం. పంటలకు కనీస మద్దతు ధరను పెంచడమే కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటల సేకరణ కేంద్రాల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచాం. దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని సేకరణ కేంద్రాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేవు. రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం తన కృషిని చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉంటుంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. -
రైతు నిరసనలు దక్షిణాదికి విస్తరిస్తాయనే..
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపట్ల టీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయచట్టాలపై ఆందోళనలు దక్షిణాదికి కూడా విస్తరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉనికికి ముప్పు ఏర్పడుతుందనే ప్రధాని నరేంద్రమోదీ వెనక్కి తగ్గారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి శుక్రవారం ఇక్కడి తెలంగాణభవన్‌లో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు దేశంలోనే అత్యంత ప్రజాదరణ, పాలనాప్రజ్ఞ, దక్షత ఉండటం, వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడంతో కేంద్రంలో చలనం వచ్చిందన్నారు. అన్నిభాషల మీద పట్టుకలిగిన కేసీఆర్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోదీ ప్రభుత్వానికి తెలుసని, అందుకే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజం వేసిందని, రైతుల పోరాటంలో కాంగ్రెస్పాత్ర ఇసుమంత కూడా లేదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల ద్వారా యువతను సాగు వైపు మళ్లించాలని సూచించారు. విద్యుత్ చట్టాలను కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమే వడ్లు కొనేలా చట్టం తేవాలి: ఎంపీలు కేంద్ర ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేసేలా చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు, నూతన వ్యవసాయచట్టాలపై సీఎం కేసీఆర్ ఆందోళనకు పూనుకోవడంతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు. లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్టీ ఎంపీలు రం జిత్‌రెడ్డి, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేతతో కలసి శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ చట్టాలపై కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి వడ్లను కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తీసుకురావాలన్నారు. -
రాజ్యం మెడలు వంచిన రైతు
ప్రజాసానుకూలత, ప్రజావ్యతిరేకత అన్నవే ప్రజాస్వామ్యంలో పాలకుల విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేవి. మానవేతిహాస గమనంలో, అట్టడుగు మట్టిమనుషుల్లో పుట్టి ఎదిగిన ప్రజా ఉద్యమాలు చరిత్ర గతినే మార్చిన సందర్భాలు కొల్లలు! భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని దేశ రైతాంగోద్యమం ఇవాళ సాధించింది. ఎన్నో ఏళ్ల నుంచి, అందునా దశాబ్ద కాలంగా పలు సమస్యలతో నలుగుతున్న ఈ దేశ రైతాంగం, ఏడాదికిపైబడి బలిదానాలతో సాగిం చిన పోరాటం చరిత్రలో నిలిచిపోయే గెలుపు నమోదు చేసింది. పాలకపక్షాలెంత బలోపేత శక్తులైనా, ఆధునిక శాస్త్ర–సాంకేతికతతో ఎన్ని మాయోపాయాలు చేసినా... రాజ్యాంగబద్దమైన తమ హక్కులను ఉద్యమించి సాధించుకోవచ్చని రైతులు నిరూపించిన ఘట్టం కార్తీక పౌర్ణమినాడు ఆవిష్కృతమైంది. ఈ శరత్కాల వెన్నెల.. పోరాటాల బాట పట్టిన వ్యవసాయ రంగానికో కొత్త ఆశా రేఖ! వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దు ప్రక్రియ చేపడతామన్నారు. జరిగిన పరిణామాలకు దేశప్రజలను ప్రధాని క్షమాపణలు కోరి, ఔన్నత్యం చాటారు. దేశ వ్యవ సాయ రంగాన్ని ఈ చట్టాలు మలుపుతిప్పుతాయని, విస్తృత సంస్కరణల్లో భాగమై రైతును రాజు చేస్తాయని, ఎత్తివేసే ప్రసక్తేలేదని... ఇంతకాలం నమ్మబలుకుతూ వచ్చిన పాలకపక్ష వాదనలు గాలికి పోయాయి. రైతు మరింత నలుగుతాడని, వ్యవసాయం, ఆహారోత్పత్తి–సరఫరా అన్నీ గంపగుత్తగా ఇక మార్కెట్‌ను శాసించే కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి జారిపోతాయనే చట్టాల రద్దు కోరిన ఉద్యమ కారుల మాట సత్యమై నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దుల్లో రహదారుల దిగ్బంధనంతో సాగించిన రైతాంగ ఉద్యమం ఎన్నో కడగండ్లను చూసింది. పోలీసు కాల్పులు, లాఠీ చార్జీలు, అక్కడ క్కడ చెలరేగిన అల్లర్లు, ప్రమాదాలు, ఇతరత్రా రేగిన హింస... ఏదైతేనేం, ఈ ఉద్యమ గర్భంలో దాదాపు 700 మంది ప్రాణత్యాగాలు న్నాయి. వాటికెవరు బాధ్యత వహిస్తారు? ఉద్యమ నాయకు లతో కేంద్రం సంప్రదింపులు, రాజకీయ పక్షాల సమాలోచనలు, సుప్రీంకోర్టు జోక్యం కూడా సమస్య పరిష్కరించి, నేరుగా న్యాయం అందించలేకపోయాయి. చివరకు, ప్రజావ్యతిరేకత నాడి పాలకు లకు దొరికాక, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో, పార్లమెంటు శీతాకాల భేటీ సమీపి స్తుంటే ఉన్నట్టుండి పరిష్కారం దొరకటమే బాధాకరం. చట్టాల్ని వ్యతిరేకించే వారినే కాక మద్దతు దారుల్నీ ఇది విస్మయపరచింది. ఈ తెలివిడి ఆనాడే ఉంటే, ఇన్ని అనర్థాలు జరిగుండేవి కాదనే వాదన ‘పాలకూర కట్ట దొంగిలించిన నాడే....’ సామెతను గుర్తుకు తెస్తోంది. శ్రమదమాదులకు ఓర్చి, వ్యూహాలను మార్చి, ప్రాణ త్యాగాలకు నిలిచి.. రైతులు సాధించిన గొప్ప గెలుపును తక్కువ చేయడం కాదు గానీ, ఇదే రైతాంగ సంపూర్ణ విజయం కాదు. ప్రమాదం పొంచే ఉంది! మౌలిక సమస్యలైన విత్తనం, రుణం, దిగుబడి, ధర, కొనుగోలు, మార్కెట్ వంటి అంశాల్లో సమస్యలు అపరిష్కృతమే! ఇందులో ఎన్నో సైద్దాంతిక వైరుధ్యాలు, మతలబులు, ఏకాభి ప్రాయం కుదరని అంశాలూ ఇమిడి ఉన్నాయి. రైతాంగం యావత్తు ముక్తకంఠంతో వద్దు మొర్రో అన్న చట్టాల్ని రద్దు చేసే తాజా వెనుకడుగు పాలకుల అవసరాల రీత్యా వచ్చిందే! వారి వ్యావ సాయిక ఆలోచనల్లో మార్పు ఫలితం కాదు. గొప్ప సంస్కరణలు తీసుకువస్తూ కూడా, రైతుల్లో ఒక వర్గానికి అవగాహన కలిగించలేకపోయామని ప్రధాని చెప్పిన మాటలు కీలకం! విడమర్చి చెప్ప డంలో విఫలమయ్యామన్నారే తప్ప రైతాంగం చెబు తున్నట్టు అవి వారి వ్యతిరేక విధానాలని అంగీ కరించలేదు. అందుకే, చట్టాలు వెనక్కి మళ్లినంత మాత్రాన, ఇవే అంశాలు ఇంకో రూపంలో వచ్చే ప్రమాదం లేదని నిశ్చింతంగా ఉండలేమని ఉద్య మకారులంటున్నారు. రైతాంగ అప్రమత్తతే అవసరం! ఢిల్లీ చుట్టూ అల్లుకున్న రైతాంగ ఉద్యమంలో బలంగా ఉన్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు రానున్నాయి. ఈ ఉద్యమ వాతా వరణం ప్రజావ్యతిరేకతకు భూమిక ఏర్పరిస్తే, రాబోయే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళనే, ఒక అడుగు వెనక్కి వేయించిన యుద్ధ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. నిజంగా చిత్తశుద్దే ఉంటే ఉన్నతస్థాయి కమిటీ వేయాలి. సంబంధీకులను భాగస్వాముల్ని చేసి, సమస్యలకి సామరస్య పూర్వక–శాశ్వత పరిష్కారాలు కనుక్కోవాలి. అప్పుడే రైతులది సంపూర్ణ విజయం. మొక్కవోని దీక్షతో రైతులు సాగించి, ఫలితం సాధించిన ఉద్యమం కేంద్ర పాలకపక్షానికే కాకుండా కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పార్టీలకూ గుణపాఠమే! కేంద్రంలో విపక్షమైన కాంగ్రెస్ తన వి«ధానాలపై పునరాలోచన చేయాలి. ప్రపంచ దృష్టినాకర్షించిన రైతాంగ ఉద్యమంలో కాంగ్రెస్ గానీ, మరో ఇతర పార్టీగానీ ఎందుకు భాగం కాలేకపోయాయి? ఏ రాజకీయ పక్షాన్నీ తమ వేదికల పైకి ఉద్యమనాయకత్వం రానీయలేదు. ఇందుకు రెండు బలమైన కారణాలు. ఒకటి, రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలు పిండుకునేందుకే యత్నిస్తాయి. ఉద్యమ ఉధృతిని అది తగ్గిస్తుంది. రెండు, వ్యవసాయరంగ మౌలిక సమస్యలపై విపక్ష పార్టీల ఆర్థిక– సామాజిక–రాజకీయ విధానాలు భిన్నమైనవేమీ కావు. ఈ విషయంలో అన్ని పాలకపక్షాలూ ‘ఒకే తాను ముక్కలు’ అన్న భావన రైతాంగ నాయకత్వానికుంది. ప్రజాపక్షం వహించడమే పార్టీల ఎజెండా కావాలి. ప్రజాభిప్రాయమే పాలనా నిర్ణయాలకు ప్రాతిపదిక కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, బలపడుతుంది. -
సాగు చట్టాల రద్దుపై కంగనా సెటైర్స్ : మోదీకి షాకిచ్చిందిగా!
సాక్షి, ముంబై: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై దేశవ్యాప్తంగా హర్ష వ్యక్తమవుతున్న తరుణంలో నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యాలు చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలు రద్దు చేయనున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంపై కంగనా రనౌత్ స్పందించింది. ఇది పూర్తిగా అన్యాయమంటూ పేర్కొంది. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటు న్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు, ఇటు రైతు ఆందోళనకారులు స్వాగతించారు. అయితే కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్ పోస్ట్‌ను షేర్ చేసిన కంగనా ఇది చాలా విచారకరం, అవమానం. పూర్తిగా అన్యాయం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ సెటైర్స్ వేసింది. (Repeal of farm laws:చారిత్రక విజయం, ఆందోళన కొనసాగుతుంది) కాగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చట్టాలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు -
చారిత్రక విజయం: మరి సంయుక్త కిసాన్ మోర్చా ఏమంది?
సాక్షి, హైదరాబాద్. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై బీజేపీ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఇది అన్న దాతల త్యాగాల ఫలితమని, చార్రితక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గురునానక్ జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రైతుల పోరాటంలో తీవ్రవాదులు, టెర్రరిస్టులు ప్రవేశించారనీ, దేశ ద్రోహులు, ఖలిస్తానీలు అంటూ రైతు ఆందోళనకారులపై విరుచుకుపడిన వారందరూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. జూన్ 2020లో ఆర్డినెన్స్‌లుగా తీసుకొచ్చిన మూడు రైతు-వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లజాతీయుల చట్టాలను రద్దు చేయడంపై రైతు సంఘాలు సంతోషం వ్యక్తం చేశారు.అయితే పార్లమెంటులో ఈ చట్టాలు రద్దు అయేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమల్లోకి వచ్చే వరకు వేచి ఉంటామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. చట్టాల రద్దు నిర్ణయం అమలైతే దేశంలో దాదాపు ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అవుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే లఖింపూర్ ఖేరీ హత్యలతోసహా ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని విమర్శించింది. మూడు నల్ల చట్టాల రద్దు కోసమే మాత్రమే కాకుండా, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల కోసం చట్టబద్ధమైన హామీ వచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతోపాటు రైతుల ఈ ముఖ్యమైన డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని వ్యాఖ్యానించింది. -
రాహుల్ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేంగా దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న దీక్షకు కేంద్రం తల వంచింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. కేంద్ర నిర్ణయంపై అన్నదాతలు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలపై గతంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ప్రస్తుతం మరోసారి వైరలవుతోంది. 2021, జనవరి 14న రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం తప్పక వెనక్కి తీసుకుంటుంది’’ అన్నారు. ఇక మోదీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. (చదవండి: పురిటి బిడ్డ పురోగమనం!) ఇక సాగు చట్టాల రద్దుపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘అన్నదాతలు తమ స్యతాగ్రహంతో కేంద్రం అహంకారాన్ని తలదించారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘సాగు చట్టాల రద్దుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ప్రకాశ్ దివాస్ నాడు శుభవార్త విన్నాం. రైతులకు వ్యతిరేకంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు నేడు తగిన ఫలితం లభించింది. దేశ రైతులకు సెల్యూట్’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Mark my words, the Govt will have to take back the anti-farm laws. pic.twitter.com/zLVUijF8xN — Rahul Gandhi (@RahulGandhi) January 14, 2021 (చదవండి: Three Farm Laws: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం) आज प्रकाश दिवस के दिन कितनी बड़ी ख़ुशख़बरी मिली। तीनों क़ानून रद्द। 700 से ज़्यादा किसान शहीद हो गए। उनकी शहादत अमर रहेगी। आने वाली पीढ़ियाँ याद रखेंगी कि किस तरह इस देश के किसानों ने अपनी जान की बाज़ी लगाकर किसानी और किसानों को बचाया था। मेरे देश के किसानों को मेरा नमन — Arvind Kejriwal (@ArvindKejriwal) November 19, 2021 ‘‘కేంద్ర క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన అన్నదాతలకు హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నా సానుభూతి’’ అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. My heartfelt congratulations to every single farmer who fought relentlessly and were not fazed by the cruelty with which @BJP4India treated you. This is YOUR VICTORY! My deepest condolences to everyone who lost their loved ones in this fight.#FarmLaws — Mamata Banerjee (@MamataOfficial) November 19, 2021 చదవండి: Blackday: దేశ జెండా మోసి అలసిపోయాం -
Three Farm Laws: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
PM Modi Announced Withdraws Three Farm Laws: రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘రైతులు ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదురెట్టు పెంచాం.తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. రైతులను ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలి. 2014లో నేను తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచీ మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించింది. మనదేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. రైతుల కష్టాలను దగ్గరుండి చూశాను. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నాం’ అని మోదీ తెలిపారు. 2020లో మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చింది. ఇవి వివాదాస్పదంగా ఉండటంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అదే సమయంలో ఈ చట్టాలు రైతులను కార్పొరెట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేశాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిన కేంద్రం.. రైతు చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. -
చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్ అల్టిమేటం
ఘజియాబాద్: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ తేల్చిచెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 దాకా గడువు ఇస్తున్నామని చెప్పారు. అప్పటిలోగా మూడు చట్టాలకు మంగళం పాడకపోతే ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఒకవేళ ఆ చట్టాలను ఈరోజే రద్దు చేస్తే పోరాటాన్ని ఇప్పుడే ఆపేస్తామని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి నవంబర్ 26న సంవత్సరం పూర్తికానుంది. -
11 నెలలకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్‌లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్‌కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్ బారికేడ్లను నిర్మించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్ ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్ గాంధీ రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ యూపీలోని లలిత్‌పూర్‌లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. -
Sonia Gandhi: నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని
సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై జీ–23 నేతలు ప్రశ్నలు లేవనెత్తడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కఠినవైఖరి ప్రదర్శించారు. తానే పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలినని, అందరూ అనుమతిస్తే ఉంటానని శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఐదున్నర గంటల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో కేంద్రప్రభుత్వ విధానాలు, మూడు వ్యవసాయ చట్టాలు– రైతు ఉద్యమం, లఖీమ్‌పూర్ ఖేరి ఘటన, జమ్మూకశ్మీర్‌లో మైనార్టీలపై దాడులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను, ఆందోళనలను తాము చూసీ చూడనట్లుగా ఎప్పుడూ వ్యవహరించలేదని, ప్రతీ అంశంపై చర్చించే నిర్ణయం తీసుకున్నామని, అయితే మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. కాగా సోనియా చేసిన ఈ ప్రకటన పార్టీ అసంతృప్త నేతల గ్రూప్ అయిన జీ–23కి తగిన సమాధానం ఇచ్చినట్లేనని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా సహా 23 మంది నాయకులు గత ఏడాది సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీలో కీలక మార్పులు జరగాలని, సమర్థవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు. అప్పటినుంచి ఏదో ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం కపిల్ సిబల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించే అంశంపై స్పష్టతనిచ్చారు. సోనియా నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు లేవని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేక స్వరంపై మాట్లాడిన సోనియాగాంధీ, ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, అయితే పార్టీలో ప్రతీ ఒక్కరు ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, ప్రతి సవాలును ఎదుర్కోగలమని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై ఈ ఏడాది జూన్ 30 లోపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రోడ్‌మ్యాప్ తయారు చేసినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియ గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పూర్తి సమాచారం ఇస్తారని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నాయకులకు సోనియా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలబడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐక్యత, పార్టీ ప్రయోజనాలను అగ్రస్థానంలో ఉంచడం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరింత అవసరమని సోనియా వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. ఈ ప్రస్తావనకు సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన అభిప్రాయానికి మద్దతు ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు సంస్థాగత ఎన్నికల వాయిదా విషయంలో కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మినహా ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకోని పరిస్థితుల్లో మరోసారి పార్టీలో అంతర్గత అలజడి చెలరేగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్గత పోరును బయటపడనీయకుండా ఉండేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వెంటనే అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని, అందుకే పార్టీలో ఒడిదుడుకుల కారణంగా సోనియా అలా చెప్పవలసి వచ్చిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగినప్పటికీ రాహుల్,ప్రియాంక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం జీ–23 నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో గెలిస్తే పార్టీపై గాంధీ కుటుంబం పట్టు మరింత బలపడుతుంది. లఖీమ్‌పూర్ హింస కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనస్తత్వాన్ని బహిర్గతం చేసిందని సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్లౖపైకెక్కినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ జరుగుతున్న ఉగ్ర దాడులకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సోనియా అన్నారు. దేశ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక సంస్కరణల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటోందని, ప్రతిదీ విక్రయించాలన్న ఒకే ఒక ఎజెండా ప్రస్తుతం కేంద్రానికి ఉందని సోనియా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఒక రాజకీయ తీర్మానాన్ని చేసింది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ ఆ తీర్మానంలో ప్రస్తావించింది. లద్దాఖ్ ఘటన జరిగి 18 నెలలు అయినప్పటికీ చైనా సైనికులు ఇప్పటికీ భారత భూభాగంలో ఆక్రమణలు కొనసాగిస్తున్నారని సీడబ్ల్యూసీ విమర్శించింది. పాకిస్తాన్ చొరబాట్లు జమ్మూకశ్మీర్ భద్రతను గణనీయంగా దిగజార్చాయని ఆరోపించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, మిజోరంలలో భద్రతకు ముప్పు పెరుగుతోందని, సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య అకస్మాత్తుగా అంతర్ రాష్ట్ర వివాదాలు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ పతనం చాలా ఆందోళన కలిగిస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మహమ్మారి కారణంగా కోల్పోయిన ఉద్యోగాల కల్పనపై కేంద్రం దృష్టి సారించలేదని, ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర అధిక ధరలతో కష్టాలను ఎదుర్కొంటున్నారని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది. సంస్థాగత షెడ్యూల్ ఇదీ.. సీడబ్ల్యూసీ నిర్ణయాలను సమావేశం అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా మీడియాకు వివరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి కార్యకర్తల వరకు పెద్దఎత్తున శిక్షణ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు చేస్తారు. ప్రాథమిక కమిటీలు, బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపికకు ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ఎన్నిక జరుగనుంది. వచ్చే ఏడాది జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు పీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి,íపీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీ్నరీ సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ధరల పెరుగుదలపై నవంబర్ 14 నుంచి 29 వరకు పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుందని పేర్కొన్నారు. పరివార్ బచావో వర్కింగ్ కమిటీ: బీజేపీ ఎద్దేవా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ‘పరివార్ బచావో(కుటుంబాన్ని కాపాడే) వర్కింగ్ కమిటీ’ అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అంతర్గత వైషమ్యాలకు ఈ సమావేశం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించింది. పార్టీ నాయకత్వ వైఫల్యంపై చర్చించడానికి బదులు అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికే సీడబ్ల్యూసీ భేటీ జరిగినట్లు బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. -
ప్రతిపక్షాలది దగాకోరు రాజకీయం
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు బూటకపు మేధోతనాన్ని, దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దశాబ్దాల క్రితమే అనేక ప్రయోజనాలు పొందాల్సిన ప్రజలకు ఇంతవరకు ఎలాంటి ఫలాలు అందలేదని, అలాంటివారికి సరైన ఫలితాలు అందించాలంటే భారీ, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలు, జీఎస్టీ అమలు, ఆధార్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణం తదితర అనేక అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటిపై తొలుత ఏకీభవించిన తర్వాత రాజకీయ కారణాలతో విపక్షాలు యూటర్న్ తీసుకొని ద్వేషపూరిత ప్రచారం ఆరంభించాయని ఆరోపించారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే ప్రజలకు బూటకపు మేధోతనం, దగాకోరుతనమంటే ఏమిటో తెలుస్తోందన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వాగ్దానమిచ్చి తర్వాత నెరవేర్చలేకపోవడం వేరని, కానీ సంస్కరణలపై ముందు ఏకీభవించి తర్వాత యూటర్న్ తీసుకొని దు్రష్పచారం చేయడం సహించరానిదని ఆరోపించారు. ఇప్పుడు తమ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే వారివారి మేనిఫెస్టోల్లో ఇవే అంశాలను పొందుపరిచారని, అయితే ప్రజామోదం పొందిన తమ పార్టీ వీటిని అమలు చేయడంతో సహించలేక అనైతికంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏది ప్రయోజనం అని ఆలోచించకుండా తమ రాజకీయాలకు ఏది ప్రయోజనమని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో భేష్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను కట్టడి చేయడంలో భారత్ ఎంతో మెరుగ్గా వ్యవహరించిందని మోదీ చెప్పారు. కోవిడ్ విషయంలో తమ ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. వీరి లక్ష్యం అంతర్జాతీయంగా భారత్ పేరును నాశనం చేయడమేనని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయని, మనం మాత్రం నెగిటివ్ ప్రచారాలను తట్టుకొని కరోనా కట్టడిలో మెరుగ్గా వ్యవహరించామని చెప్పారు. అవసరం వచి్చనప్పుడు ఇండియా ఐక్యంగా నిలబడుతుందనే పాఠాన్ని కోవిడ్ తెలియజేసిందన్నారు. ‘‘భారత్ టీకాను రూపొందించకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కోవిడ్ టీకా లభించడం లేదు. కానీ మనం వ్యాక్సినేషన్లో విజయవంతం అయ్యాము.’’అని చెప్పారు. స్వాలంబంన(ఆత్మనిర్భరత) ఇందుకు కారణమన్నారు. విమర్శలను తాను స్వాగతిస్తానని, ఆరోగ్యవంతమైన పురోగతికి ఇవి అవసరమని ఆయన చెప్పారు. కానీ అలాంటి నిజమైన విమర్శలు చాలా స్వల్పమని, అసంబద్ధ ఆరోపణలే అధికమని విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరే అవహేళన చేసుకుంటున్నారు నూతన పార్లమెంటు ఆవశ్యకతపై గొంతెత్తిన పారీ్టలే నేడు తాము నిర్మిస్తున్న నూతన భవన సముదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారిని వారు అవహేళన చేసుకోవడమేనని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఈ పార్టీల నేతలు కొత్త భవనం కావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. దాన్ని సాకారం చేయాలని యతి్నస్తుంటే ఏవో కుంటిసాకులతో వ్యతిరేకించడం ఎంతవరకు సబబన్నారు. నిజానికి దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు దశాబ్దాల క్రితమే అందాల్సిఉందని, కానీ ఇంతవరకు వీరికి సరైన ఫలాలు అందలేదని వివరించారు. అలాంటివారికి సత్ఫలితాలివ్వడానికి పనిచేస్తున్నామని, ఇందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని తమ ప్రభుత్వం తొలినుంచి చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికి అనేక మార్లు వారితో చర్చలు జరిపామని, కానీ నిజానికి చట్టాల్లో ఏం మార్చాలో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలన్నీ కాం గ్రెస్ గోత్రీకుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ప్రభుత్వాలన్నీ ఒకేవిధమైన రాజకీయ, ఆర్థిక ఆలోచనతో వ్యవహరించాయని, కానీ తొలిసారి వాజ్‌పేయికి ప్రజలు ప్రత్యామ్నాయ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తన హయాంలో తొలిసారి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారన్నారు. ప్రజలు సంపూర్ణ మార్పు కోరారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. -
Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేపట్టిన నిరసనలు బుధవారానికి 300 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చ సభ్యులు మాట్లాడుతూ.. లక్షలాది మంది రైతుల ఆవేదనను తమ నిరసనలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల్ని ఢిల్లీ సరిహద్దులకు చేర్చి 300 రోజులైందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులు తమ నిరసనను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని అన్నారు. తమ డిమాండ్లు ఏమిటో ప్రధాని మోదీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. దేశంలో జరిగే ఎన్నికల్లో రైతులు ఓట్లు వేసే వారే గెలుస్తున్నారని, అంత లోతుగా రైతులు వేళ్లూనుకొనిపోయిన వ్యవస్థ భారత్‌ది అని పేర్కొన్నారు. ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చ ‘భారత్ బంద్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపింది. చదవండి: కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు -
రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్, హరియాణా,యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కమిషన్ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తోందని తెలిపింది. శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ లెక్కించి అక్టోబర్ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్-19 ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది. గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. చదవండి: మళ్లీ రైతు రక్తం చిందింది.. సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది: రాహుల్ ఫైర్ -
పురిటి బిడ్డ పురోగమనం!
రైతాంగ పోరాటం దేశంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ రాజధాని, పరిసరాలను దాటి విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ (అనుబంధ అంశాల) చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం, ఇప్పటికే పలు ఆటుపోట్లను చవిచూసింది. దేశంలో ఎక్కడికక్కడ నిరసించినా... ఢిల్లీని చుట్టుముట్టి ఓ ఆందోళన నిరవధికంగా సాగుతోంది. ఏకరీతిన నవమాసాలు గర్భస్థ స్థితిలో ఢిల్లీ, శివార్లకే పరిమితమైన శైశవ దశ నుంచి... ఆందోళన తాజాగా గడపదాటుతోంది. మహాపంచాయతీల రూపంలో అడుగు బయటకు వేసింది. వారం కిందటి ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్), నిన్నా ఇవాళ్టి కర్నల్(హర్యానా) రైతు ఆందోళనలు సంకేతం. వారం కింద, మితిమీరిన పోలీసు లాఠీ దెబ్బకు ఒకరు మరణించి, పదిమంది రైతులు గాయపడ్డ దాష్టీకాన్ని నిరసించిన ఆందోళన, హర్యానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో రోజురోజుకు బలపడుతోంది. వివిధ రాష్ట్రాలకు, జిల్లా కేంద్రాలకు విస్తరించే రైతు ఉద్యమ కార్యాచరణ ఐక్య పోరాట వేదిక, ఇతర రైతు సంఘాల వ్యూహాల్లో రూపుదిద్దుకుంటోంది. పాలకపక్షమైన భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికినా... ఉద్యమాన్ని నిరాఘాటంగా సాగించిన రైతు సంఘాలు, ఇంతకాలం వ్యూహాత్మకంగా రాజకీయ పక్షాలను దూరం పెట్టాయి. తమ వేదికలనెక్కనివ్వలేదు! అందుకే, ఎంతో విశ్వసనీయత పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందీ ఉద్యమం. కానీ, ఉత్తరాది వివిధ రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తమౌతున్న ప్రస్తుత తరుణంలో... ఆయా పార్టీలు రైతాంగ ఉద్యమాంశాన్ని ఇప్పుడు తమ ప్రచారాస్త్రంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. చిత్రమేమంటే, పాలకపక్షం బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ రైతు విభాగమైన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కూడా దేశవ్యాప్త నిరస నల కార్యాచరణ ప్రారంభించింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కాలని, చట్టబద్దత కావా లని కోరుతూ, మచ్చుకి 500 జిల్లా కేంద్రాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. ఇది వ్యూహాత్మక చర్య అన్నది ప్రత్యర్థుల వాదన! ఒక మహాఉద్యమం నుంచి, మూడు చట్టాలు ఎత్తివేయాల్సిందేననే తమ ప్రధాన డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ అని, ఇన్నాళ్లు రైతు సంఘలెన్నింటినో ఏకీకృతం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) అంటోంది. వారు సెప్టెంబరు 27న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చి ఉన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి, మరోవైపు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఒత్తిడి పెరుగుతోంది. రైతు సంఘ నాయకులు, కేంద్ర ప్రభుత్వం... ఇరువురితో సంప్రదింపులు జరిపి, నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టే ఏర్పాటు చేసిన సంఘ సభ్యుడొకరు, సుప్రీం ప్రధాన న్యాయ మూర్తికి తాజాగా లేఖ రాసి సంచలనం సృష్టించారు. తామిచ్చిన నివేదికను బయటపెట్టాలని, ప్రతిష్టంభనను తొలగించి, సమస్యను పరిష్కరించేట్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయ స్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తగిన సంప్రదింపులు లేకుండా, తమ ప్రయోజనాలకు వ్యతి రేకంగా తెచ్చిన ఆ మూడు చట్టాలను ఎత్తివేయాల్సిందేనని రైతాంగం పట్టుబట్టడంతో పోరాటం తీవ్రరూపం దాల్చినపుడు, గత జనవరిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. చట్టాల అమలును పక్కనపెట్టమని కేంద్రాన్ని ఆదేశించింది. చట్టాలను మాత్రం ఎత్తివేసేది లేదని కేంద్రం భీష్మించి, ప్రతిష్టంభన ఏర్పడటంతో సుప్రీం ఒక కమిటీని నియమించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలంది. మార్చి 19న సీల్డు కవర్లో ఆ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను సుప్రీం ఇంతవరకు విప్పలేదు. చట్టాలు రైతు వ్యతిరేకమైనందున వాటిని పూర్తిగా ఎత్తివేయాలనేది ఒక వాదనైతే, అంత అవసరం లేదు సవరిస్తే చాలనేది మరోవాదన. మెజారిటీ రైతు సంఘాలు చట్టాలను ఎత్తివేయాలనే కోరుతున్నాయి. భారత్ కిసాన్ సంఘ్ మాత్రం, ఆ మేరకు సవరిస్తే చాలంటోంది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదనేది పాలకపక్షపు అనుకూల రైతు సంఘం వాదన. రైతుకు గిట్టుబాటు ధర (ఆర్పీ) లభించాలని, శాస్త్రీయంగా దాన్ని ఖరారు చేసి, వ్యవసాయో త్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియకు చట్టబద్ధత తీసుకురావాలని ఈ సంఘం కోరు తోంది. ప్రభుత్వమైనా, ప్రయివేటు వ్యాపారులైనా... రైతు ఉత్పత్తుల్ని ముందే ఖరారు చేసిన గిట్టు బాటు ధరకు తగ్గి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించి, ఆ మేర శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తోంది. పెరిగే పెట్టుబడి వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని సదరు గిట్టుబాటు ధర ఖరారు చేయాలనే వాదన సముచితం. అది లేక, దేశానికి అన్నం పెట్టే రైతు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది. రైతు ఆదాయం రెట్టింపేమో కానీ, ఉత్పత్తి వ్యయంలో 40, 50 శాతం కూడా లభించక రైతు అప్పుల్లో పడి కునారిల్లుతున్నాడు. తమనీ దుస్థితికి తెచ్చిన పాలకపక్షాల పట్ల ఆగ్రహమే కాకుండా తమ శ్రమశక్తిని దోచుకోజూస్తున్న కార్పొరేట్లపై కోపం కూడా రైతు ఉద్యమానికి కొత్త ఊపిరులు పోస్తోంది. కేంద్రం, అది తెచ్చిన కొత్త చట్టాలే ఊతంగా... వ్యవసాయోత్పత్తులతో పాటు, వాటి నిల్వ, మార్కెటింగ్ రంగాల్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వస్తున్న కార్పొరేట్ శక్తులనూ రైతు ఉద్యమాలు లక్ష్యం చేసుకుంటున్నాయి. మద్దతు పెరగటంతో బలోపేతమౌతున్నాయి. రేపటి పరిస్థితేమిటో వేచి చూడాల్సిందే! -
బీజేపీని ఓడిద్దాం
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల్ని అరాచక శక్తులుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ గడ్డ వారిని సహించలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆదివారం యూపీలోని ముజఫర్‌నగర్‌లో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన మహా పంచాయత్‌కు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ‘దేశాన్ని కాపాడుకుందాం’ అన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా సదస్సుకి ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 300 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బస్సులు, కారులు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో వేలాది మంది రైతులు రావడంతో నగర వీధులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా వచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఓట్లు కూడా రాలవని తికాయత్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని స్పష్టం చేశారు. ఇండియా ఫర్ సేల్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని అదే ప్రభుత్వ విధానమని మహాపంచాయత్ వేదికగా రాకేశ్ తికాయత్ ఆరోపించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, విద్యుత్, రోడ్లు, బ్యాంకులు ఇలా అన్నింటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. సేల్ ఆఫ్ ఇండియా బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారని అంబానీ, అదానీలే వాటిని కొనుగోలు చేస్తారని ఆరోపించారు. ‘‘మనం ఈ దేశాన్ని అమ్మకుండా అడ్డుకోవాలి. రైతులు, ఉద్యోగులు, యువత, వ్యాపారాలు ఇలా అన్నింటిని కాపాడు కోవాలి. అందుకే మహాపంచాయత్ ర్యాలీలు చేస్తున్నాం’’ అని తికాయత్ చెప్పారు. ‘‘9 నెలలుగా మేం ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యమం సమయంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం మౌనం పాటించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదు’’ అని తికాయత్ చెప్పారు. ప్రధానే లక్ష్యం: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రచారం చేస్తామని కిసాన్ మహాపంచాయత్ ప్రకటించింది. నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. వారణాసి వేదికగా ముజఫర్‌నగర్‌లో జరిగిన మెగా సదస్సుని మిషన్ ఉత్తరప్రదేశ్–ఉత్తరాఖండ్గా రైతు సదస్సు అభివర్ణించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మహాపంచాయత్‌లు నిర్వహిస్తామన్న రాకేశ్ తికాయత్ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి రెండో ప్రధాని కార్యాలయం వంటిదని తదుపరి సదస్సు అక్కడే జరుపుతామన్నారు. లక్నోలో సదస్సు నిర్వహించి రైతుల సత్తా చాటుతామన్నారు. -
రైతుల ఆందోళన: ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చని మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ నేత, ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు పలికారు. లక్షలాది మంది రైతులు ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఒక చోటచేరి నిరసన చేపట్టారు. ‘రైతులు దేశానికి రక్త మాంసాలు. రైతులతో మర్యాద పూర్వకమైన విధానంలో చర్చలు జరుపుతాం. రైతుల బాధను వారికోణంలోనే తెలుసుకొని, వారితో కలిసి పనిచేయడానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తాం’ అని ట్విటర్లో వరుణ్ గాంధీ పేర్కొన్నారు. చదవండి: జన్ ఆశీర్వాద యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు దీంతో పాటు ఆయన ముజఫర్‌నగర్‌లో వందలాది రైతులు ‘కిసాన్ మహాపంచాయత్’ చేపటట్టిన నిరసన వీడియోను ట్విటర్లో షేర్చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే ఎంపీ వరుణ్ గాంధీ తన చేసిన ట్విట్లో ఎక్కడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రస్తావించలేదు. అయినప్పటికీ అధికారపార్టీ నుంచి రైతుల నిరసనకు మద్దతు పలికిన మొదటి నేత వరుణ్ గాంధీ కావటం గమనార్హం. Lakhs of farmers have gathered in protest today, in Muzaffarnagar. They are our own flesh and blood. We need to start re-engaging with them in a respectful manner: understand their pain, their point of view and work with them in reaching common ground. pic.twitter.com/ZIgg1CGZLn — Varun Gandhi (@varungandhi80) September 5, 2021 చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి -
సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !
న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృత స్థాయికి తీసుకెళ్లాలని రైతు సంఘాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులోభాగంగా సెప్టెంబర్25వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించాయి. గురువారం ఢిల్లీ దగ్గర్లోని సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన అఖిలభారత రైతు సమ్మేళనం ఈ మేరకు తీర్మానించింది. సాగు చట్టాలపై పోరుకు 9 నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రెండ్రోజుల రైతు సమ్మేళనాన్ని గురువారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ లాంఛనంగా ప్రారంభించారు. ‘తొమ్మిది నెలలుగా ఉద్యమిస్తున్నా.. రైతులతో ఫలప్రదమైన చర్చలకు మోదీ సర్కార్ ముందుకు రాకపోవడం చాలా దారుణం. అయినా మేం మా ఉద్యమపథాన్ని వీడేదే లేదు. ఈ కాలంలో మేమేం కోల్పోయామో, మేం సంఘటితంగా ఏమేం సాధించామో సర్కార్‌కు తెలిసేలా చేస్తాం’ అని రాకేశ్ తికాయత్ అక్కడి రైతులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ రైతు సమ్మేళనంలో 22 రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికుల సంఘాలు, సంస్థల తరఫున నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 18 అఖిలభారత కార్మిక సంఘాలు, తొమ్మిది మహిళా సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాల తరఫున వందలాది మంది రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమ్మేళనంలో తొలి రోజున మూడు వేర్వేరు సెషన్స్ నిర్వహించినట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పేర్కొంది. పారిశ్రామిక రంగ కార్మికులు, వ్యవసాయ రంగ కార్మికులు, గ్రామాల్లోని పేదలు, గిరిజనుల సమస్యలనూ ఆయా సెషన్స్‌లో చర్చించారు. సమ్మేళనంలో నిర్వహణ కమిటీ కన్వీనర్ ఆశిష్ మిట్టల్ సంబంధిత ముసాయిదాను రైతు నేతల ముందుంచారు. ‘మోదీ సర్కార్ రైతుల డిమాండ్లకు తలొగ్గి వివాదాస్పద చట్టాలను రద్దుచేసేలా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతస్థాయికి తీసుకెళ్లాలి’ అని సమ్మేళనంలో తీర్మానించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు హానికరమని ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సూర్య నారాయణ, రావుల వెంకయ్య, ఝాన్సీ, తెలంగాణ నుంచి టి.సాగర్, ప్రభు లింగం, కె.రంగయ్య, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, రాంచందర్, గోపాల్ పాల్గొన్నారు. -
26న రైతుల జాతీయ సదస్సు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమై 9 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 26న జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం ప్రకటించింది. ఇందులో స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిల నుంచి వందలాది రైతు సంస్థలు పాల్గొంటాయని పేర్కొంది. ఈ సదస్సుకు సంబంధించిన వేదిక వివరాలను త్వరలో చెబుతామని రైతు సంఘాల నేత ఒకరు చెప్పారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పరిష్కారం కోసం ప్రభుత్వం, రైతు నాయకుల మధ్య 10 రౌండ్ల చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నర్మదా బచావో ఆందోళన్ జరిగి 36 ఏళ్లు పూర్తవుతున్నసందర్భంగా ఆగస్టు 17న నర్మదా కిసాన్ మజ్దూర్ జన్ సంసద్ జరగనుంది. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు హాజరయ్యే అవకాశం ఉంది. -
ఎన్నికల్లో తప్పని రైతుల సెగ
ఆగస్ట్ తొమ్మిదో తేదీని క్విట్ ఇండియా దినోత్సవంగా పాటిస్తున్నాం. 1942లో ఇదేరోజున బ్రిటిష్ పాలనకు వ్యతి రేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలై, అనంతర పరిణామాల్లో ఇంగ్లిష్ వారు భారతదేశాన్ని వదలడమూ, దేశం స్వాతంత్య్రం పొందడమూ జరిగాయి. అదే తరహాలో మొన్న ఆగస్ట్ 9న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తున్న రైతులు ‘మోదీ గద్దె దిగాలి’ అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవ కాశం ఉంది. వచ్చే ఏడాది వరుసగా మార్చి, మే నెలల్లో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటగా ఈ ప్రభావం పడనుంది. గతేడాది నవంబర్ 26న మొదలైన రైతుల నిరసన పోరాటం, తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ, రైతులకు ప్రాతినిధ్యం వహి స్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య జరిగిన పదకొండు దశల చర్చలు కూడా ఫలవంతం కాలేదు. వ్యవసాయ చట్టాలను అమలుచేసి తీరాలని కేంద్రమూ, వాటిని వెంటనే రద్దు చేయాలని రైతుసంఘాలూ– ఇరుపక్షాలూ కూడా తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ఏ రాజీకి రాలేకపోయాయి. పదకొండో దశ చర్చలు జనవరి 22న విఫలమయ్యాక మళ్లీ చర్చలకు కేంద్రం ఏ ముందడుగూ వేయలేదు; రైతులు తమ నిరసననూ వీడలేదు. తమను తాము ఐక్యంగా ఉంచుకుంటూనే, కేంద్ర ట్రేడ్ యూనియన్లు, ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొంటూ పద్ధతి ప్రకారం దశల వారీగా రైతులు తమ నిరసనను సజీవంగా ఉంచుతున్నారు. ఢిల్లీ మూడు సరిహద్దులు– సింఘు, తిక్రీ, ఘజియాబాదుల్లో ధర్నాలు కొనసాగిస్తూనే దేశంలోని అన్ని రాష్ట్రాలూ జిల్లాలూ బ్లాకు ల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిపారు. భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాలు జరుగుతున్న దేశ పార్లమెంటుకు కొన్ని వందల మీటర్ల దూరం లోనే, నిరసనగా జంతర్ మంతర్‌లో రైతుల పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రెండూ నేటితో ముగియనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రైతులు తమ పోరాటానికి కొత్త మలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ సారథ్యంలో సమావేశమై క్విట్ మోదీ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుమారు 40 రైతు సంఘాలు అందులో భాగమయ్యాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. రానున్న కాలంలో జిల్లాలవారీగా కూడా ఇవి ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయికీ పోరాటాన్ని చేర్చాలనేది వీరి లక్ష్యం. జాతీయ రాజకీయాలను రైతుల పోరు ఇదివరకే ప్రభావితం చేసింది. అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించి మనలేని స్థాయికి ఈ పోరాటం చేరింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటా కూడా రైతుల సమస్యలను లేవనెత్తడానికి విపక్షాలు ప్రయత్నించడం, సభా వ్యవహారాలకు చాలాసార్లు ఆటంకం కలగడం చూశాం. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతంగానే కొనసాగుతున్నప్పటికీ, రైతు సంఘాలు తమ డిమాండ్లు నెరవేరేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ సహా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని కూడా రైతులకు పిలుపునిచ్చాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ మూల్ కాంగ్రెస్‌ను ఓడించి, పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ విఫలం కావడం చూశాం. నిరసన చేస్తున్న రైతుల్లో సింహభాగం పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడంతో మోదీ వ్యతిరేక ఉద్యమం ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ప్రభావకారి కానుంది. గత ఎనిమిది నెలల నిరసన కాలంలో ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇది అంత సులభంగా వారి మనోఫలకాల్లోంచి తొలిగేది కాదు. ఇప్పటికే పంజాబ్ స్థానిక సంఘాల ఎన్నికల్లో రైతులు ఎలాంటి పాత్ర పోషించారో చూశాం. బీజేపీకి వ్యతిరేకంగా వారు ఇచ్చిన ఆగ్రహపూరిత ప్రకటనల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేకపోయారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చాక, బీజేపీకి సంప్రదాయ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి రైతుల సమస్యల మీద ప్రచారం చేస్తోంది. అలాగే ఇతర రెండు ప్రధాన పార్టీలు– అధికారంలో ఉన్న కాంగ్రెస్, విపక్షం ఆమ్ ఆద్మీ కూడా రైతులకు మద్దతిస్తున్నాయి. అంటే పంజాబ్ ఎన్నికల్లో రైతుల నిరసనోద్యమం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. – జ్ఞాన్ పాఠక్ -
రైతు వ్యతిరేక చట్టాలు వద్దేవద్దు
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని 14 ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా వారు శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కిసాన్ సంసద్‌లో (రైతుల పార్లమెంట్) పాల్గొన్నారు. అంతకముందు ప్రతిపక్ష నేతలంతా పార్లమెంట్ హౌస్ వద్ద కలుసుకొని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. అనంతరం బస్సులో జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ‘నల్ల’ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దేశంలోని రైతులందరికీ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. నల్ల సాగు చట్టాలపై కేవలం చర్చలతో కాలయాపన చేస్తే సరిపోదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెగసస్ నిఘా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజల ఫోన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కిసాన్ సంసద్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోకుమార్ ఝా, సీపీఎం నుంచి ఎలమారమ్ కరీమ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేత మహమ్మద్ బషీర్, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కిసాన్ సంసద్ వద్ద ప్రతిపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ -
నినాదాలు.. నిరసనలు
న్యూఢిల్లీ: వివాదాస్పద పెగసస్ స్పైవేర్, మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన పర్వం యథావిధిగా కొనసాగాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష సభ్యులు వెంటనే వెల్‌లోకి చేరుకొని నినాదాలు చేశారు. పెగసస్‌తోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. వెనక్కి వెళ్లి సీట్లల్లో కూర్చోవాలని, సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. 15 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’పై చర్చకు అనుమతించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపు మాట్లాడారు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించిన ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు–2021’పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. సీరియస్ విషయమని సుప్రీం చెప్పిందిగా.. పెగసస్ స్పైవేర్‌పై వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం లోక్‌సభలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’ను తీసుకొచ్చిందని, అదే న్యాయస్థానం పెగసస్ అనేది సీరియస్ విషయమని చెప్పిందని అన్నారు. ఇంతలో ఆయన మైక్రోఫోన్‌ను స్పీకర్ స్విచ్చాఫ్ చేశారు. తర్వాత ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టినప్పుడు అధిర్ రంజన్ మాట్లాడారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్పందిస్తూ.. వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలే అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు. రాజ్యసభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు ఎగువ సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. పెగసస్ అంశంతోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్‌లోకి దూసుకొచ్చి కాగితాలు వెదజల్లి, బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల కోసం సభ మళ్లీ ప్రారంభమయ్యింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న సురేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతిరోజూ ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఉభయ సభల్లో ఆందోళన సాగిస్తున్నాయి. -
మెట్టు దిగని విపక్షాలు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గురువారం సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ బిర్లా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. పలు క్రీడల్లో పతకాలు సొంతం చేసుకున్న భారత మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరుకొని నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుండగానే 10 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలను సభ్యులు అడిగారు. ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇందులో పాలుపంచుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంట్ సభా సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని సూచించారు. పార్లమెంట్ సమావేశాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, సభ ఎందుకు సాగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లెక్కచేయకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటనను సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత అధిర్ రంజన్ దీనిపై మళ్లీ మాట్లాడారు. దళిత బాలిక వ్యవహారంపై కాంగ్రెస్ వాదనను కేంద్ర సహాయ మంత్రి మేఘవాల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. ఇన్‌కం యాక్ట్ ఆఫ్ 1961, ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ 2012కు సవరణ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎగువ సభలో రెండు బిల్లులకు ఆమోదం తమ డిమాండ్లపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. పెగసస్, కొత్త సాగు చట్టాలపై సభలో చర్చించాలని పేర్కొన్నారు. వారి ఆందోళనలు, నినాదాల కారణంగా సభను సభాపతి పలుమార్లు వాయిదా వేశారు. ఒకవైపు విపక్షాల నినాదాలు కొనసాగుతుండగానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ‘ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను గురువారం లోక్‌సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై పర్యావరణ మంత్రి భూపేందర్ రాజ్యసభలో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వాయు కాలుష్యానికి కారణమైన వారికి సెక్షన్ 14 కింద జరిమానా విధిస్తారని, పంటల వ్యర్థాలను దహనం చేసే రైతులకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, సభలో మాత్రం శబ్ద కాలుష్యం ఉందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. -
పార్లమెంట్లో ప్రతిపక్షాల రగడ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే లోక్‌సభలో బుధవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన 8 మంది లోక్‌సభ మాజీ సభ్యులకు బుధవారం సభలో నివాళులర్పించారు. తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత వ్యవసాయ మంత్రి తోమర్ ‘కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తోమర్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. కొబ్బరి బోర్డులో ఇకపై ఆరుగురు సభ్యులను నియమిస్తారు. నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో జాయింట్ సెక్రటరీని నియమిస్తారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ సభలో.. పార్లమెంట్ ఎగువ సభలో ప్రతిపక్షాల ఆందోళనల పర్వం కొనసాగుతోంది. పెగసస్ నిఘా, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై విపక్ష సభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ఆమోదించారు. అంతకు ముందు దీనిపై స్వల్పంగా చర్చ జరిగింది. ఈ బిల్లు లోక్‌సభలో జూలై 29న ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (అమెండ్మెంట్) బిల్లు–2021, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021ను కూడా ఆమోదించారు. రాజ్యసభ వ్యవహారాలను కొందరు సభ్యులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండడాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఆందోళనను ఎంతకీ ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్ సభలో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య బుధవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) చెందిన ఆరుగురు ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. తమను రోజంతా బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రాజ్యసభ లాబీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజ్యసభ చాంబర్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఘటనపై రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రీ, అర్పితా ఘోస్, మౌసమ్ నూర్‌ను రాజ్యసభ నుంచి రూల్ 255 కింద సస్పెండ్ చేసినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో పేర్కొన్నారు. సస్పెండ్‌కు నిరసనగా సమావేశాల్లో మిగిలిన రోజుల్లో సభకు హాజరు కాబోమని ఆ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం 14 విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని 14 ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. ఈ మేరకు 14 విపక్ష పార్టీలకు చెందిన 18 మంది నేతలు బుధవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విపక్షాల డిమాండ్‌ను అంగీకరించేందుకు సర్కారు అంగీకరించకపోవడం దారుణమన్నారు. పెగసస్ అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు. కొత్త సాగు చట్టాలతోపాటు రైతు సమస్యలపైనా చర్చించాలని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎల్జేడీ తదితర పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. -
పార్లమెంట్ ప్రతిష్టంభనతో రూ.133 కోట్లు వృథా
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి విపక్షాల నిరసనతో సభలు సాగని పరిస్థితి ఏర్పడింది. పెగసస్, రైతు చట్టాలపై తొలుత చర్చించాలని విపక్షాలు, అవి తప్ప మిగిలిన అంశాలపై చర్చకు రెడీ అంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 107 గంటలు జరగాల్సిన సమావేశాలు కేవలం 18 గంటలకే పరిమితమయ్యాయి. అంటే మొత్తం సభా సమయంలో 83 శాతం వృధాగా పోయింది. ఈ వృథా ఖరీదు రూ. 133 కోట్లని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూలై 19న ఆరంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఇప్పటివరకు రాజ్యసభలో కేవలం 21 శాతం సభా సమయమే ఆందోళనలు లేకుండా సాగగా, లోక్‌సభలో కేవలం 13 శాతం సభా సమయం మాత్రమే జరిగింది. గంటల లెక్కన చూస్తే లోక్‌సభ 54 గంటలకు గాను 7 గంటల పాటు, రాజ్యసభ 53 గంటలకుగాను 11 గంటల పాటు జరిగాయి. సభ సాగిన కొద్ది సమయంలో మూజువాణి ఓటుతో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయసభల్లో నిరసన కారణంగా జరిగిన వృ«థా వల్ల ప్రజాధనం దాదాపు 133 కోట్లు నిరుపయోగంగా పోయినట్లయింది. సభా ప్రతిష్ఠంభనకు మీరంటే మీరే కారణమని ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ మొత్తం మీద ప్రజాధనాన్ని వృథా చేశాయని రాజకీయ నిపుణులు వాపోతున్నారు. ఎందుకీ నిరసన?: పెగసస్ అనే స్పైవేర్‌తో ప్రభుత్వం పలువురి ఫోన్లను హ్యాక్ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి సమాధానమిస్తూ పెగసస్ విషయం అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదని, హ్యాకింగ్ ఏమీ జరగలేదని విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు కొన్ని విపక్షాలు రైతు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే వీటిపై చర్చించామని, కావాలంటే సభలో సమయానుకూలతను బట్టి చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్షాలు తగ్గకుండా వెల్‌లోకి వచ్చి సభలను అడ్డుకుంటున్నాయి. కేవలం కొందరికి నివాళులు అర్పించడం, ఒలింపిక్ విజేతకు శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యకలాపాలు మినహా కీలకమైన కార్యకలాపాలేవీ ముందుకు సాగలేదు. విపక్షాల ధోరణిపై ఇటీవలే ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. విపక్షాలు ఇంతే దీటుగా బదులిచ్చాయి. పెగసస్ అంశం అమెరికాలో బయటపడ్డ వాటర్‌గేట్ కుంభకోణంలాంటిదని దుయ్యబడుతున్నాయి. ఇలా ఇరుపక్షాలు మొండిపట్టు పట్టడంతో సభలు సాగకుండా వాయిదాలు పడుతున్నాయి. -
సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఢిల్లీ శాసనసభ పునరుద్ఘాటించింది. ఈ మేరకు శుక్రవారం సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా దీనికి మద్దతు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా, ప్రస్తుతం ఆప్‌నకు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రైతన్నలు శాంతియుతంగా పోరాటం సా గిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని శాసనసభ విమర్శించింది. రైతుల డిమాండ్లను కేంద్రం అంగీరించాలని డిమాండ్ చేసింది. వారితో చర్చించాలని, సమస్యలను పరి ష్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొనేలా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న ఆన్నదాతల మద్దతు సంపాదించేందుకు ఢిల్లీలో శాసనసభలో తాజాగా తీర్మానం చేసినట్లు స్పష్టమవుతోంది. -
ఆందోళన ఆగలేదు.. సభ సాగలేదు
న్యూఢిల్లీ: పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు దిగిరాకపోవడంతో శుక్రవారం కూడా పార్లమెంట్ ఎలాంటి చర్చలు జరగకుండా సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ఆరంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులు యథాత«థంగా నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభాపతి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రతిపక్షాల ఆందోళనపై సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అసహనం వ్యక్తం చేశారు. పెగసస్‌పై వివాదం అనవసర రగడని, ప్రజా సంబంధ విషయాలపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. కానీ విపక్షాలు తమకు మరింత వివరణ కావాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ప్రవర్తన దురదృష్టకరమని జోషి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు బిల్లులు చర్చలేకుండా ఆమోదం పొందాయని, ఇకనైనా విపక్షాలు కీలక అంశాలపై చర్చకు రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్షాలు వినకపోవడంతో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ఆరంభమవగానే ప్రభుత్వం రెండు బిల్లుల(కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఎన్సీఆర్ బిల్ 2021, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్)ను సభలో ప్రవేశపెట్టింది. వీటిపై చర్చించాలని ప్రభుత్వం, సభాపతి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కానీ స్లోగన్లతో సభ సాగకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో సేమ్ సీన్ శుక్రవారం రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో చర్చలు సాగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సభారంభం కాగానే విపక్షాల నిరసనతో మధ్యాహ్నంలోపు రెండు మార్లు వాయిదా పడింది. పార్లమెంట్ మర్యాద, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని విపక్షాల తీరుపై సభాపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న మంత్రుల ముందు విజిళ్లు వేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం మర్యాదకాదన్నారు. ప్రతిఒక్కరూ సభా మార్యాద పాటించాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్ష సభ్యులు వినలేదు. అనంతరం ఆయన జీరో అవర్ ఆరంభించారు. కానీ విపక్షాలు సభను సాగనివ్వలేదు. తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ తిరిగి ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి స్లోగన్లతో సభను అడ్డుకున్నారు. దీంతో తిరిగి సభ మరలా వాయిదా పడింది. లంచ్ తర్వా త సభలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వీటిలో ఒక బిల్లును ప్రతిపక్ష ఆందోళన మధ్యనే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. తదనంతరం సభ సోమావారానికి వాయిదా పడింది. -
పట్టువీడని ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు పట్టువీడడంలేదు. వీటిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం సైతం ఉభయసభల్లో ఆందోళన కొనసాగించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను 11.30 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. జీరో అవర్ ప్రారంభించబోతున్నామని, నినాదాలు ఆపి, సీట్లలోకి వెళ్లాలంటూ స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ప్రతిపక్షాలను కోరారు. వారు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12.30 గంటలదాకా వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు యథావిధిగా ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెళ్లి మీ సీట్లలో కూర్చోండి అంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న కిరిట్ ప్రేమ్‌జీబాయ్ సోలంకీ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యే లోక్‌సభలో ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు, ఇన్లాండ్ వెస్సెల్స్ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. నిన్నటి ఘటన బాధించింది: స్పీకర్ లోక్‌సభలో సభాధ్యక్ష స్థానంపై కొందరు ప్రతిపక్ష సభ్యులు కాగితాలను చించి విసిరివేయడం తనను ఎంతగానో బాధించిందని స్పీకర్ ఓంబిర్లా గురువారం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కుర్చీపై కాగితాలు, ప్లకార్డులను చించి విసిరేసిన సంగతి తెలిసిందే. గురువారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ఇదే అంశంపై మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులంతా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలన్నారు. రాజ్యసభలోనూ అదే దృశ్యం పెగసస్ వ్యవహారం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపైచర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో డిమాండ్ చేశారు. వారు విరమించే పరిస్థితి కనిపించకపోవడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు, మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్(సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చించేందుకు ముందుకు రావాలంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు లెక్కచేయలేదు. బీజేపీ, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మద్దతుగా సభలో మాట్లాడారు. నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈసీ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం ఎన్నికల సంస్కరణల విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్ల డించారు. ఓటర్ల జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించాలన్న ప్రతిపాదనను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, తక్షణమే వాటిని రద్దు చేయాల్సిందేనని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏఐకేఎస్‌సీసీ, ఎస్‌ఎఎంల పిలుపుమేరకు శనివారం నిర్వహించిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఇందిరాపార్కు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరిన రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాలనేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ నా యకులు ఆజీజ్‌పాషా, సీపీఎం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు పశ్యపద్మ, పీవోడబ్ల్యూ సంధ్య, ఝాన్సీ, సీఐటీయూ రమ, వివిధ సంఘాల నేతలు ఎస్ ఎల్ పద్మ, అనురాధ ఉన్నారు. చదవండి: Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక -
రైతులతో మళ్లీ చర్చలకు సిద్ధం
న్యూఢిల్లీ/చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ శనివారం ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఆందోళనలను విరమించాలని రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచడంతోపాటు ఎంఎస్పీ ప్రకారం పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరిపిందని చెప్పారు. కాగా, మంత్రి తోమర్ పిలుపుపై 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పందించింది. ఆ ప్రకటనలు అస్పష్టంగాను, పరస్పర విరుద్ధంగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. వివాదాస్పద చట్టాలకు అర్థంలేని సవరణలు చేపట్టాలని తాము కోరుకోవడం లేదని తెలిపింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది నవంబర్ నుంచి వివిధ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయా చట్టాల్లోని వివాదాస్పద అంశాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 22వ తేదీ నాటికి 11 విడతలుగా జరిగిన చర్చలుæ పురోగతి సాధించలేకపోయాయి. ఆందోళనలు 8వ నెలకు చేరుకున్న సందర్భంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రైతులు గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో ఈశాన్య ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)ను కలిసేందుకు బయలుదేరగా పోలీసులు వారిని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలను విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ తేల్చిచెప్పారు. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో ఉన్న బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించి, అడ్డుకున్నారు. -
ఢిల్లీలో రైతుల ఆందోళన: భద్రత పెంచిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనకు దిగి ఏడు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా రైతులు శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాన్ని ముట్టడించి మెమోరాండం సమర్పించనున్నట్లు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వెలుపల భద్రతా బలగాలను పెంచారు. రాజ్‌భవన్ ముట్టడి నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రోస్టేషన్లు మూసివేశారు. అదే విధంగా టిక్రి, సింగ్, ఘాజీపూర్ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని ప్రధాన జాతీయ రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఆందోళనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. చదవండి: కరోనా సోకిన ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్ -
Blackday: దేశ జెండా మోసి అలసిపోయాం
సాక్షి, న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తైంది. కేంద్ర ప్రభుత్వం కిందటి ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నవంబర్ 26 తేదీ నుంచి రైతు సంఘాలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించాలని సంఘాలు నిర్ణయించుకున్నాయి కూడా. దీంతో దేశ రాజధానికి నలువైపులా భారీగా పోలీసులు మోహరించారు. మొద్దు ప్రభుత్వం బ్లాక్‌డే సందర్భంగా రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఉద్యమం చేయబట్టి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలలు దేశ జెండాను మోశాం. మా గళం వినిపించాం. కానీ, ఎవరూ స్పందించలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం మొద్దుగా వ్యవహరిస్తోంది’’ అని టికాయత్ మండిపడ్డాడు. నిరసనల సందర్భంగా ఎక్కడా గుంపులుగా చేరబోమని, బహిరంగ సమావేశాలు అసలే నిర్వహించమని ఆయన స్పష్టం చేశాడు. అయితే రైతులు మాత్రం ఎక్కడికక్కడే నల్ల జెండాల్ని ఎగరేసి నిరసన తెలపాలని టికాయత్ ఒక ప్రకటనలో పిలుపు ఇచ్చాడు. ఊరుకునేది లేదు రైతుల బ్లాక్ డే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో కరోనా విజృంభణ, లాక్డౌన్ అమలులో ఉన్నందున ఎవరైనా గుంపులుగా మీటింగ్‌లు పెట్టినా, అక్రమంగా చెక్పాయింట్ల నుండి చొరబడేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. శాంతియుతంగా.. మరోవైపు నేడు బుధ పూర్ణిమ కావడంతో శాంతియుతంగా బ్లాక్‌డే నిర్వహించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు ఇచ్చింది. సమాజంలో సత్యం, అహింస జాడ కరవైందని.. వాటిని పునరుద్ధరించేలా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే ఎక్కడికక్కడ శాంతియుతంగా బ్లాక్‌డే నిరసన తెలపాలని రైతులను కోరింది. ఈ నేపథ్యంలో ఇళ్లపైనే నల్లజెండాలు ఎగరేస్తూ రైతులు నిరసన తెలియజేస్తున్నారు. మద్ధతుగా ప్రతిపక్షాలు.. మే 26న బ్లాక్ డే నిర్వహించాలని వారం క్రితమే ఎస్కేఎం నిర్ణయించింది. ఈ నిరసనలకు తమ మద్ధతు ఉంటుందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈమేరకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక బ్లాక్‌డేకు మద్దతుగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలాలో, ఆయన కూతురు రబియా అమృత్‌సర్‌లో ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సర్కార్లకు నోటీసులు మరోవైపు, కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడంపై ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. -
చర్చలకు సిద్ధం: ప్రధానికి రైతు సంఘాల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య నాలుగు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన వీడే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఢిల్లీ సరిహద్దులో దీక్ష చేస్తున్న రైతులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆరు నెలలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ వద్ద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. బ్లాక్‌డేకి ముందు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్న 40 రైతు సంఘాలన్నీ కలిసి రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 26న బ్లాక్‌డేగా ప్రకటించాయి. ఆరోజు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో పాల్గొనేందుకు వేలాదిగా ట్రాక్టర్లతో రైతులు ఛలో ఢిల్లీ అంటూ వస్తున్నారు. మరోసారి ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు తప్పవని అంతా భావిస్తున్న తరుణంలో... రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చర్చలకు సిద్దమంటూ ముందుకు వచ్చింది. ఇప్పటికే 11 సార్లు ఇప్పటి వరకు ప్రభుత్వం, రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా... రద్దు చేయడం కుదరదని కేవలం సవరణలే చేస్తామంటూ ప్రభుత్వం భీష్మించుకుంది. దీంతో ఆరు నెలలు గడిచినా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. మరోవైపు ఢిల్లీలో ఉండే తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోవడంతో పాటు కరోనా సెకండ వేవ్ భయపెడుతున్నా సరే ... రైతులు ఢిల్లీని వీడకుండా ఆందోళన చేస్తూ తమ పట్టుదలను చాటుకున్నారు. -
సుప్రీంకు ‘సాగు చట్టాల’పై నివేదిక
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను మార్చి 19వ తేదీన సీల్డ్ కవర్లో అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ విషయాన్ని కమిటీలోని సభ్యుడు పి.కె.మిశ్రా బుధవారం బయటపెట్టారు. మూడు కొత్త సాగు చట్టాల అమలుపై జనవరి 11న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీటిని అమలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మార్చి 19న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశామని పి.కె.మిశ్రా పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను న్యాయస్థానమే నిర్దేశిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు కమిటీ రైతు సంఘాలు, నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, మార్కెటింగ్ బోర్డులు తదితర భాగస్వామ్య పక్షాలతో 12 దఫాలు చర్చలు జరిపి, పలుమార్లు అంతర్గతంగా సమావేశమై నివేదికను రూపొందించింది. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయెల్ అన్నదాతల ప్రయోజనాలను కాపాడడం కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం తేల్చిచెప్పారు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కొత్త చట్టాల గురించి రైతులు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. వీటివల్ల మండీ వ్యవస్థకు ఎలాంటి నష్టం ఉండదన్న సంగతి రైతులకు తెలిసిందన్నారు. పార్లమెంట్ దాకా పాదయాత్ర కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మున్ముందు మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను దాదాపు ఖరారు చేసినట్లు మోర్చా నేతలు బుధవారం తెలియజేశారు. మే నెలలో పార్లమెంట్ వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర తేదీని ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ యాత్రలో రైతులతోపాటు మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు సైతం పాల్గొంటారని, వారంతా తమ పోరాటానికి మద్దతిస్తున్నారని రైతు సంఘం నాయకుడు గుర్నామ్‌సింగ్ చాదునీ చెప్పారు. పార్లమెంట్ వరకూ శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘జనవరి 26’ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమన్నారు.