సాక్షి, ముంబై: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై దేశవ్యాప్తంగా హర్ష వ్యక్తమవుతున్న తరుణంలో నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యాలు చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలు రద్దు చేయనున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంపై కంగనా రనౌత్ స్పందించింది. ఇది పూర్తిగా అన్యాయమంటూ పేర్కొంది. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు.
గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటు న్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు, ఇటు రైతు ఆందోళనకారులు స్వాగతించారు. అయితే కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్ పోస్ట్‌ను షేర్ చేసిన కంగనా ఇది చాలా విచారకరం, అవమానం. పూర్తిగా అన్యాయం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ సెటైర్స్ వేసింది. (Repeal of farm laws:చారిత్రక విజయం, ఆందోళన కొనసాగుతుంది)
కాగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చట్టాలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment