withdrawl
-
శిథిలాల కుప్ప ‘ఖాన్ యూనిస్’.. తిరిగి వస్తున్న ‘గాజా’ వాసులు
జెరూసలెం:పాలస్తీనా దక్షిణ గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భీకర యుద్ధం కారణంగా కొంత కాలంగా తమ ప్రాంతానికి దూరంగా తలదాచుకున్న ఖాన్ యూనిస్ వాసులు ఇంటిబాట పట్టారు. సైకిళ్లు వేసుకుని, కాలి నడకన తమ సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగల లేదు. భవనాలన్నీ ధ్వంసమై శిథిలాల కుప్పలు మిగిలాయి. ఒకప్పుడు భారీ భవంతులతో కళకళలాడిన ఖాన్ యూనిస్ నగరం ప్రస్తుతం శిథిలాల కుప్పలతో నిండిపోవడాన్ని చూసిన వారు తమ నగరం ఇలా అయిపోయిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన బాంబులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్‌యూనిస్ జనాభా 14 లక్షలు. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా డిసెంబర్లో ఖాన్ యూనిస్ నగరంపైకి సేనలను ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పంపింది. హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన నగరాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల జాడ కోసం మొత్తం జల్లెడ పట్టారు. దాడులతో లక్షలాది మంది ఖాన్ యూనిస్ వాసులు నగరం విడిచి వెళ్లిపోయారు. మరో వైపు ఖాన్‌యూనిస్‌పై జరిపిన దాడుల్లో వేల మంది హమాస్ ఉగ్రవాదులను హత మార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇదీ చదవండి.. సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు -
రూ.500 నోటు రద్దు, మళ్లీ చలామణిలోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే మధ్యలో ₹2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంహరణ తర్వాత రూ.500 నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగిన ఈ తరహా నోట్టు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్ల రద్దు.. కేంద్రం రిప్లై ఇదే ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్లో, రూ.500 నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థలో రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ బదులిచ్చింది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా,‘ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500) సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్యవస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్, అదనపు బెనిఫిట్స్ కూడా -
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్‌కు వెళ్లి డెబిట్ కార్డ్‌తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్‌పే (GPay), ఫోన్‌పే (PhonePe) మొదలైన యాప్‌లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్‌ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
సాగు చట్టాల రద్దుపై కంగనా సెటైర్స్ : మోదీకి షాకిచ్చిందిగా!
సాక్షి, ముంబై: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై దేశవ్యాప్తంగా హర్ష వ్యక్తమవుతున్న తరుణంలో నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యాలు చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలు రద్దు చేయనున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంపై కంగనా రనౌత్ స్పందించింది. ఇది పూర్తిగా అన్యాయమంటూ పేర్కొంది. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటు న్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు, ఇటు రైతు ఆందోళనకారులు స్వాగతించారు. అయితే కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్ పోస్ట్‌ను షేర్ చేసిన కంగనా ఇది చాలా విచారకరం, అవమానం. పూర్తిగా అన్యాయం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ సెటైర్స్ వేసింది. (Repeal of farm laws:చారిత్రక విజయం, ఆందోళన కొనసాగుతుంది) కాగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చట్టాలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు -
విత్ డ్రా ఫాంలకు ఇంతలా..
చిత్రంలో కనిపిస్తున్న ఖాతాదారులు నగదు కోసం ఎగబడటం లేదు. బ్యాంకులో ఇచ్చే విత్ డ్రా ఫామ్ కోసం ఈ విధంగా బ్యాంక్ సిబ్బంది వెంట పడుతున్నారు. కేవలం విత్ డ్రా ఫామ్ కోసమే ఇంత ఇబ్బంది పడుతుంటే ఇక నగదుకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయో అర్థం చేసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ పరిధి షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ వద్ద శుక్రవారం పోలీసుల సహకారంతో విత్ డ్రా ఫామ్‌లు పంపిణీ చేయాల్సి వచ్చింది. – కుత్బుల్లాపూర్ -
పీఎఫ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: పీఎఫ్ ఉపసంహరణ కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బెంగళూరులో భారీ స్థాయిలో కార్మికులు ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో కేంద్రం దిగొచ్చింది. పీఎఎఫ్ ఉపసంహరణపై కొత్త నిబంధనల అమలు అంశాన్ని జూలై 31 వరకు వాయిదా వేసింది. పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెలిక పెడుతూ ప్రకటన చేయడంతో బెంగళూరులోని కార్మికులంతా రోడ్లెక్కారు. వీరిలో గార్మెంట్ వర్కర్లే అధికంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. పలు ప్రధాన రహదారులను దిగ్బందించారు. కూడళ్ల వద్ద గుంపులుగా చేరుకుని మానవహారాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆందోళన ఉధృతంగా మారింది. హింసాత్మక రూపం దాల్చింది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది.