జెరూసలెం:పాలస్తీనా దక్షిణ గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భీకర యుద్ధం కారణంగా కొంత కాలంగా తమ ప్రాంతానికి దూరంగా తలదాచుకున్న ఖాన్ యూనిస్ వాసులు ఇంటిబాట పట్టారు. సైకిళ్లు వేసుకుని, కాలి నడకన తమ సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగల లేదు.
భవనాలన్నీ ధ్వంసమై శిథిలాల కుప్పలు మిగిలాయి. ఒకప్పుడు భారీ భవంతులతో కళకళలాడిన ఖాన్ యూనిస్ నగరం ప్రస్తుతం శిథిలాల కుప్పలతో నిండిపోవడాన్ని చూసిన వారు తమ నగరం ఇలా అయిపోయిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన బాంబులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్‌యూనిస్ జనాభా 14 లక్షలు. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా డిసెంబర్‌లో ఖాన్ యూనిస్ నగరంపైకి సేనలను ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పంపింది.
హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన నగరాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల జాడ కోసం మొత్తం జల్లెడ పట్టారు. దాడులతో లక్షలాది మంది ఖాన్ యూనిస్ వాసులు నగరం విడిచి వెళ్లిపోయారు. మరో వైపు ఖాన్‌యూనిస్‌పై జరిపిన దాడుల్లో వేల మంది హమాస్ ఉగ్రవాదులను హత మార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఇదీ చదవండి.. సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు
Comments
Please login to add a commentAdd a comment