కాషాయ పార్టీని ఇరుకునపెట్టిన కంగనా.. ట్విస్ట్‌ ఇచ్చిన బీజేపీ | 'Doesn't Reflect Partys Views': BJP Distances Itself From MP Kangana Farm Laws Remark | Sakshi
Sakshi News home page

కాషాయ పార్టీని ఇరుకునపెట్టిన కంగనా.. ట్విస్ట్‌ ఇచ్చిన బీజేపీ

Published Wed, Sep 25 2024 10:58 AM | Last Updated on Wed, Sep 25 2024 12:37 PM

BJP Distances Itself From MP Kangana Farm Laws Remark

సిమ్లా: కేంద్రం రద్దు చేసిన సాగు చట్టాలపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ట్విస్ట్‌ ఇచ్చింది. బీజేపీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా తెలిపారు.

బీజేపీ ఎంపీ కంగనా తాజాగా మండి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను కేంద్రం తీసుకువచ్చి అమలుచేయాలి. దేశ అభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే రైతుల కోసం ఉపయోగపడే మూడు చట్టాలను తీసుకురావాల్సిందే. ఇందుకు రైతులే చట్టాలను తీసుకురావాలని డిమాండ్‌ చేయాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఈ క్రమంలో కంగనా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో, తన వ్యాఖ్యలపై ఆమె మళ్లీ స్పందించారు. అవి కేవలం తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంగనా కామెంట్స్‌ బీజేపీకి సంకటంగా మారాయి.

 

 

ఈ నేపథ్యంలోనే కంగనా వ్యాఖ్యలను బీజేపీ సీరియస్‌గానే తీసుకుంది. బీజేపీకి డ్యామేజ్‌ కాకుండనే ఉద్దేశ్యంతో కాషాయ పార్టీ కంగనాకు దూరం పాటించింది. కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా.. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

 

 

అయితే, కంగనా ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో కేంద్రంలోకి బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెడుతూనే ఉంది. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. ఈ సమయంలో పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని ఘాటుగానే చెప్పారు. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో ఆమె ఇంకా ఏ విషయాలపై స్పందిస్తారో అనే టెన్షన్‌ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. 

ఇది కూడా చదవండి: ఆ సొమ్ము సోనియా రిలీఫ్‌ ఫండ్‌కు : కంగనా ఆరోపణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement