Gaurav Bhatia
-
కాషాయ పార్టీని ఇరుకునపెట్టిన కంగనా.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ
సిమ్లా: కేంద్రం రద్దు చేసిన సాగు చట్టాలపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు.బీజేపీ ఎంపీ కంగనా తాజాగా మండి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను కేంద్రం తీసుకువచ్చి అమలుచేయాలి. దేశ అభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే రైతుల కోసం ఉపయోగపడే మూడు చట్టాలను తీసుకురావాల్సిందే. ఇందుకు రైతులే చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో కంగనా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో, తన వ్యాఖ్యలపై ఆమె మళ్లీ స్పందించారు. అవి కేవలం తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంగనా కామెంట్స్ బీజేపీకి సంకటంగా మారాయి. "All three farm laws should be reinstated." -- BJP MP Kangana RanautIs BJP bringing back those 3 Black Farmers law?why BJP is anti-Farmers? pic.twitter.com/OPw5kgaBZC— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) September 24, 2024 ఈ నేపథ్యంలోనే కంగనా వ్యాఖ్యలను బీజేపీ సీరియస్‌గానే తీసుకుంది. బీజేపీకి డ్యామేజ్ కాకుండనే ఉద్దేశ్యంతో కాషాయ పార్టీ కంగనాకు దూరం పాటించింది. కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. #WATCH | BJP leader Gaurav Bhatia says, "On the social media platforms, BJP MP Kangana Ranaut's statement on the farm bills that was withdrawn by central govt, is going viral. I want to make it clear that this statement is a personal statement of her. Kangana Ranaut is not… pic.twitter.com/hZmJ8j7Qf8— ANI (@ANI) September 24, 2024 అయితే, కంగనా ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో కేంద్రంలోకి బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెడుతూనే ఉంది. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. ఈ సమయంలో పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని ఘాటుగానే చెప్పారు. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో ఆమె ఇంకా ఏ విషయాలపై స్పందిస్తారో అనే టెన్షన్ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. ఇది కూడా చదవండి: ఆ సొమ్ము సోనియా రిలీఫ్ ఫండ్‌కు : కంగనా ఆరోపణ -
కోల్‌కతా డాక్టర్ కేసు: ‘నిందితుల రక్షణకు దీదీ ప్రయత్నం’
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపోతుంది. దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీ, ఆస్పత్రి విద్యార్థులు, జూనియార్ డాక్టర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం బీజేపీ నేత, అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడారు. ‘‘ పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత కల్పించటంలో సీఎం మమత విఫలం అయ్యారు. మీరు (మమతా బెనర్జీ) మీ నైతిక బాధ్యతను నిర్వర్తించలేదు. తక్షణమే రాజీనామా చేయాలి. అదీకాక.. ఈ కేసుల ఆమె నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చేస్తుందనే విశ్వాసం ఉంది. ఇటీవల దీదీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తానని అన్నారు. అది సాక్ష్యాలను తారుమారు చేసే వ్యూహాత్మక చర్య. దర్యాప్తులో మొదటి 48 గంటలే చాలా కీలకం. ఆలస్యం చేయటం వల్ల సరైన న్యాయం జరగకపోవచ్చు. దీదీ ప్రభుత్వంలో బెంగాల్లో శాంతిభద్రతలు కుప్పకూలాయి’’ అని విమర్శలు చేశారు. -
అత్యంత అవినీతిమయం.. సోనియా కుటుంబంపై బీజేపీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: గాంధీల కుటుంబం దేశ రాజకీయాల్లో అత్యంత అనైతిక, అత్యంత అవినీతిమయ కుటుంబమంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై మనీ ల్యాండరింగ్ కేసును కొట్టి వేసేందుకు రాజస్తాన్ హైకోర్టు గత వారం నిరాకరించడాన్ని ప్రస్తావించారు. వాద్రాపై అవినీతి, మనీ ల్యాండరింగ్ కేసులపై సోనియా, రాహుల్ మౌనం వీడాలన్నారు. ‘‘భారత రాజకీయాల్లో సోనియాది అత్యంత అవినీతిమయ, అనైతిక కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. 2008–13 మధ్య రాబర్ట్ వాద్రా రాజస్తాన్‌లో భారీగా భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. అప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. దాంతో రాబర్ట్ కన్నుసన్నల్లో ల్యాండ్ మాఫియా నడిచింది. చట్టానికి అతీతులమని అనుకుంటున్న గాంధీల కుటుంబం.. ఇప్పుడు అదే చట్టం ముందు నిలబడేందుకు వణికిపోతోంది’’ అన్నారు. -
కేజ్రీవాల్‌కు సంకెళ్లే
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కీలక సూత్రధారి అని బీజేపీ ఆరోపించింది. అతి త్వరలో ఆయనకు సంకెళ్లు తప్పవని జోస్యం చెప్పింది. కరోనా ఉధృతి సమయంలో ప్రజలంతా సాయం కోసం అల్లాడిపోతుంటే కేజ్రీవాల్ మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం ఆరోపించారు. ఆయన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ‘‘ఎక్సైజ్ విధానం కుంభకోణంలో మూలాలు కేజ్రీవాల్ ఇంటికే దారి తీస్తున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందే’’ అన్నారు. మరోవైపు తనపై సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసిందని ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్ సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నా సీబీఐ ఇలా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మోదీజీ! నేనెక్కడున్నానో తెలియడం లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా’’ అటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తి ఒక్క రూపాయి కూడా సీబీఐకి దొరకలేదన్నారు. సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఇప్పటిదాకా నిందితులెవరికీ లుకౌట్ నోటీసులివ్వలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు అనుమతి లేకుండా దేశం దాటలేరు. కాబట్టి వారికి ఆ నోటీసులు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ కేసులో 8 మంది ప్రైవేటు వ్యక్తులకు లుకౌట్ నోటీసులిచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మాత్రం, కుంభకోణాలకు పాల్పడితే లుకౌట్ నోటీసులొస్తాయి తప్ప గ్రీటింగ్ కార్డులు కాదనడం విశేషం. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కరడుగట్టిన అవినీతిపరులని ఆరోపించారు. సిసోడియా తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక మోదీ వర్సెస్ కేజ్రీ: సిసోడియా కేజ్రీవాల్ ప్రధాని అవుతారని సిసోడియా జోస్యం చెప్పారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు అవకాశమిచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌గా జరగడం ఖాయం’’ అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం రోజూ ఉదయమే సీబీఐ–ఈడీ అంటూ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. మరిన్ని హైదరాబాద్ లింకులు? ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన పలు హోల్‌సేల్, రిటైల్ మద్యం వర్తకుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మద్యం లైసెన్సులను దక్కించుకున్న పలువురు వ్యక్తులు, కంపెనీలకు హైదరాబాద్ మూలాలున్నాయి. ఇక్కడి అడ్రస్లతోనే వారు టెండర్లు దాఖలు చేశారు. ఈ పాలసీకి పాపులారిటీ పెంచేందుకు 50 మంది దాకా స్టాండప్ కమేడియన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లు తదితరులను పనిముట్లుగా వాడుకున్నట్టు తేలింది. వీరి విదేశీ యాత్రలు, విదేశాల నుంచి అందిన నిధులపై విచారణ సాగుతోంది’’ అని వివరించారు. -
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
సమాజ్‌వాదికి ఝలక్.. బీజేపీలోకి కీలక నేత
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీకి తాజాగా ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చడం లేదంటూ ఎస్పీలో కీలక అధికార ప్రతినిధిగా పనిచేసిన గౌరవ్ భాటియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఫిబ్రవరిలోనే సమాజ్‌వాది పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ న్యాయవాదిగా ఉన్న గౌరవ్ భాటియా బీజేపీలో చేరకముందు సమాజ్‌వాది పార్టీ తరుపున జాతీయ చానెళ్లలో రాజకీయ చర్చల్లో పాల్గొనేవారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. విషయ పరిజ్ఞానంతోపాటు మంచి చతురత కలిగిన నాయకుడు అని కూడా గౌరవ్‌కు పేరుంది. అయితే, సమాజ్‌వాది పార్టీలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని, సామ్యవాద భావాలు కొరవడుతున్నాయని, పరిపాలన కుటుంబానికి పరిమితమై పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పదవులకు తాను ఫిబ్రవరిలోనే రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. ‘నూతన భారత నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఆలోచనను ఇస్తున్నారు. ఆయన ఆలోచన విధానమే నన్ను బీజేపీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని భాటియా తెలిపారు. అంకిత భావానికి, కలుపుగోలుతనానికి బీజేపీ పెట్టిందని కొనియాడారు. సమాజ్‌వాది పార్టీలో మాత్రం రాజకీయ కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, పార్టీపై పట్టుకోసం సాక్షాత్తు అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ పోటీ పడ్డారని గుర్తు చేశారు. ఇక నుంచి తాను కూడా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. గౌరవ్ భాటియా తండ్రి వీరేంద్ర భాటియా ములాయంసింగ్‌కు చాలా సన్నిహితుడు. ఆయన 2010లో చనిపోయారు. ములాయం సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. -
ఎస్పీకి ఝలక్.. బీజేపీలోకి జంప్!
చాలాకాలంపాటు సమాజ్‌వాదీ పార్టీకి గొంతుకగా టీవీ చర్చలలో ప్రముఖంగా కనిపించిన గౌరవ్ భాటియా తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్పీ పదవులకు రాజీనామా చేసిన భాటియా ఆదివారం కమలం కండువా కప్పుకున్నారు. ఎస్పీ అధికార ప్రతినిధిగా, ఆ పార్టీ లీగల్ వింగ్ అధ్యక్షుడిగా గతంలో భాటియా పదవులు నిర్వహించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పరాజయం పాలై.. అంతర్గత కుటుంబ విభేదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఆ పార్టీకి మీడియా ముఖంగా వ్యవహరించిన భాటియా తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొంతముందే గత ఫిబ్రవరిలో తాను ఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు భాటియా ఫేస్బుక్లో ప్రకటించారు. తన ప్రధాన సిద్ధాంతమైన సోషలిజానికి ఎస్పీ దూరం జరిగిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరుతారని గత రెండునెలలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన తాజాగా కమలం గూటికి చేరారు. -
సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్‌లకు పంపినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆయన అధికార ప్రతినిధి పదవితోపాటు పార్టీ జాతీయ లీగల్ సెల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, రాజీనామాకు గల కారణాలను భాటియా పేర్కొనలేదు. పార్టీ ఆశయాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై రాజీ పడలేక పోతున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని భాటియా స్పష్టం చేశారు. ‘నా తండ్రి దివంగత వీరేంద్ర భాటియా.. సమాజ్‌వాదీ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో సేవ చేశారు. నాకు నేతాజీ(ములాయం), అఖిలేశ్ ఇద్దరూ ముఖ్యమే. వారిద్దరికీ నా రాజీనామా లేఖలు పంపాన’ని గౌరవ్ తెలిపారు.