కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపోతుంది. దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీ, ఆస్పత్రి విద్యార్థులు, జూనియార్ డాక్టర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం బీజేపీ నేత, అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడారు.
‘‘ పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు భద్రత కల్పించటంలో సీఎం మమత విఫలం అయ్యారు. మీరు (మమతా బెనర్జీ) మీ నైతిక బాధ్యతను నిర్వర్తించలేదు. తక్షణమే రాజీనామా చేయాలి. అదీకాక.. ఈ కేసుల ఆమె నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చేస్తుందనే విశ్వాసం ఉంది. ఇటీవల దీదీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తానని అన్నారు. అది సాక్ష్యాలను తారుమారు చేసే వ్యూహాత్మక చర్య. దర్యాప్తులో మొదటి 48 గంటలే చాలా కీలకం. ఆలస్యం చేయటం వల్ల సరైన న్యాయం జరగకపోవచ్చు. దీదీ ప్రభుత్వంలో బెంగాల్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయి’’ అని విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment