న్యూఢిల్లీ: గాంధీల కుటుంబం దేశ రాజకీయాల్లో అత్యంత అనైతిక, అత్యంత అవినీతిమయ కుటుంబమంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై మనీ ల్యాండరింగ్ కేసును కొట్టి వేసేందుకు రాజస్తాన్ హైకోర్టు గత వారం నిరాకరించడాన్ని ప్రస్తావించారు. వాద్రాపై అవినీతి, మనీ ల్యాండరింగ్ కేసులపై సోనియా, రాహుల్ మౌనం వీడాలన్నారు.
‘‘భారత రాజకీయాల్లో సోనియాది అత్యంత అవినీతిమయ, అనైతిక కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. 2008–13 మధ్య రాబర్ట్ వాద్రా రాజస్తాన్‌లో భారీగా భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. అప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. దాంతో రాబర్ట్ కన్నుసన్నల్లో ల్యాండ్ మాఫియా నడిచింది. చట్టానికి అతీతులమని అనుకుంటున్న గాంధీల కుటుంబం.. ఇప్పుడు అదే చట్టం ముందు నిలబడేందుకు వణికిపోతోంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment