సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్‌లకు పంపినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆయన అధికార ప్రతినిధి పదవితోపాటు పార్టీ జాతీయ లీగల్ సెల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే, రాజీనామాకు గల కారణాలను భాటియా పేర్కొనలేదు. పార్టీ ఆశయాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై రాజీ పడలేక పోతున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని భాటియా స్పష్టం చేశారు. ‘నా తండ్రి దివంగత వీరేంద్ర భాటియా.. సమాజ్‌వాదీ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో సేవ చేశారు. నాకు నేతాజీ(ములాయం), అఖిలేశ్ ఇద్దరూ ముఖ్యమే. వారిద్దరికీ నా రాజీనామా లేఖలు పంపాన’ని గౌరవ్ తెలిపారు.