'నా కొడుకు సీఎం కావడం ఆనందంగా ఉంది' | he has become CM I'm really very happy, says Father | Sakshi
Sakshi News home page

'నా కొడుకు సీఎం కావడం ఆనందంగా ఉంది'

Published Sun, Mar 19 2017 12:38 PM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

'నా కొడుకు సీఎం కావడం ఆనందంగా ఉంది' - Sakshi

'నా కొడుకు సీఎం కావడం ఆనందంగా ఉంది'

లక్నో: గోరఖ్‌పూర్‌ ఎంపీ, మఠాధిపతి అయిన యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతుండటంతో ఆయన కుటుంబసభ్యుల్లో, మద్దతుదారుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కీలకమైన యూపీ ప్రభుత్వాధినేతగా యోగి బాధ్యతలు చేపట్టబోతుండటంతో ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 'చాలా చిన్నప్పటినుంచే ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో యోగి ఉండేవాడు. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అవుతుండటం చాలా ఆనందంగా ఉంది' అని యోగి తండ్రి తెలిపారు.

యోగి సోదరి మాట్లాడుతూ 'నిన్న సాయంత్రం వరకు టీవీలను చూస్తూ ఒకింత సందేహాస్పదంగా గడిపాం. కానీ సాయంత్రానికి శుభవార్త అందండంతో పటాకులు కాల్చి సంబరాలు జరిపాం' అని మీడియాతో చెప్పారు. ఉత్తరాఖండ్‌ యమకేశ్వర్‌లోని పంచూర్‌లోని యోగి స్వగృహంలోనూ ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. యోగి ప్రస్తుత స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు వారు యోగికి మద్దతుగా సంబరాలు నిర్వహించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement