21 సెంచరీలో నాకు ఇదే బెస్ట్‌ న్యూస్‌! | it is the best news of the 21st century | Sakshi
Sakshi News home page

21 సెంచరీలో నాకు ఇదే బెస్ట్‌ న్యూస్‌!

Published Sun, Mar 19 2017 11:17 AM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

21 సెంచరీలో నాకు ఇదే బెస్ట్‌ న్యూస్‌! - Sakshi

21 సెంచరీలో నాకు ఇదే బెస్ట్‌ న్యూస్‌!

లక్నో: 'నా వరకు 21వ శతాబ్దిలో ఇదే ఉత్తమవార్త ఏదంటే.. అది నరేంద్రమోదీజీ ప్రధానమంత్రి కావడం, సోదరుడు యోగిజీ యూపీ సీఎం అవుతుండటమే' అని కేంద్రమంత్రి ఉమాభారతి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయవాదం, అభివృద్ధి కలయికగా యూపీని యోగి నడిపిస్తారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు యూపీ సీఎం కాబోతున్న యోగి ఆదిత్యనాథ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కేశవప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. తనకు అప్పగించిన డిప్యూటీ సీఎం పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యమిస్తానని తెలిపారు.

కాగా, యూపీ సీఎంగా మధ్యాహ్నం 2.15 గంటలకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం యోగి లోక్‌భవన్‌ చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అవుతారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement