న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రూపొందించిన నివేదిక త్వరగా విడుదలయ్యేలా చూడాలని ఆ చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ సభ్యుడు, షెట్కారీ సంగటన్ నేత అనిల్ ఘన్వత్ కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వచ్చే రెండు నెలల పాటు ధర్నా చేస్తామని, ఇందుకోసం లక్ష మంది రైతులను ఢిల్లీకి తీసుకొస్తానని తెలిపారు.
చదవండి: సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది
కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని, అన్ని పంటలకు ఎంఎస్‌పీకే కొనుగోలు చేయాలన్న రైతుల డిమాండ్లు అమలుచేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంటే ప్యానెల్ ఇచ్చిన నివేదిక అసంబద్ధం అవుతుందని, ప్రజా ప్రయోజనార్థం సలహాలు ఉపయోగపడతాయని వివరించారు. సాగు చట్టాలపై కొంతమంది నేతలు రైతులను తప్పుదోవ పట్టించారని, ఈ నివేదిక ద్వారా వారికి అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ ప్యానెల్ తన నివేదికను సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment