కేటీఆర్‌ కౌంటర్‌ ట్వీట్‌ | Telangana Minister KTR Counter Tweet To Farm Laws Back Statement | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి సంచలన ప్రకటన.. ట్వీట్‌తో పంచ్‌ విసిరిన తెలంగాణ మంత్రి

Published Sat, Dec 25 2021 8:26 PM | Last Updated on Sun, Dec 26 2021 7:42 AM

Telangana Minister KTR Counter Tweet To Farm Laws Back Statement - Sakshi

Telangana Minister KTR Counter Tweet On Agri Minister Farm Laws Bring Comments: సాగు చట్టాల రద్దుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ యూటర్న్‌ ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సవరణలతో చట్టాలను ఎలాగైనా తెచ్చితీరతామంటూ తోమర్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. 


గౌరవనీయులైన ప్రధాని క్షమాపణలు, సాగుచట్టాల రద్దు,.. కేవలం ఎన్నికల స్టంటే అనుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు కేటీఆర్‌. ప్రధాని నరేంద్రగారేమో(మోదీ) చట్టాల్ని రద్దు చేశామని చెప్తున్నారు.. వ్యవసాయ మంత్రి నరేంద్రగారేమో(తోమర్‌) ప్రతిపాదన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అంటూ సెటైర్‌ వేశారు. బీజేపీ రాజకీయాలు, ఆ ప్రభుత్వం పట్ల దేశ రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్త: వ్యవసాయం చట్టం తెచ్చి తీరతాం..  నరేంద్ర సింగ్‌ తోమర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement