సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పాల్సింది బీజేపీ నేతలని, దేశం కాదని స్పష్టం చేశారు. విద్వేషాలను వెదజల్లుతున్నందుకు బీజేపీ నాయకులు ప్రజలకు క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మహత్మా గాంధీ హత్యను బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ప్రశంసించినప్పుడు మోదీ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మీరు(మోదీ) దేనికి అనుమతిస్తున్నారో అదే మీ నాయకులు ప‍్రచారం చేస్తున్నారని మండిపడ్డారు..
PM @narendramodi Ji, Why should India as a country apologise to international community for the hate speeches of BJP bigots?
It is BJP that should apologise; not India as a Nation
Your party should first apologise to Indians at home for spewing & spreading hatred day in day out
— KTR (@KTRTRS) June 6, 2022
కాగా ఆదివారం కూడా కేటీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ ట్విటర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే, అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. దీనికి జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సెలెక్టివ్ ట్రీట్‌మెంట్ ఎందుకని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
చదవండి: వామ్మో ‘జూన్’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది!
If the BJP truly respects all religions equally, should you also not suspend Telangana BJP chief who made an open public statement wanting to dig up all the mosques & impose a ban on Urdu?
Why this selective treatment @JPNadda Ji? Any clarification? https://t.co/6tqMLWSW3w
— KTR (@KTRTRS) June 5, 2022
Comments
Please login to add a commentAdd a comment