hate speeches
-
హరియాణా మత ఘర్షణల కేసులపై కమిటీ: సుప్రీం
న్యూఢిల్లీ: సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం, పరస్పర మర్యాదపూర్వక ప్రవర్తన అత్యంత అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్వేషపూరిత ప్రసంగాల్ని ఎవరూ అంగీకరించరని పేర్కొంది. హరియాణాలో ఆరుగురు ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసుల విచారణకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. హరియాణా సహా వివిధ రాష్ట్రాల్లో ఒక మతం వారిని చంపేయాలంటూ చేసిన విద్వేష పూరిత ప్రసంగాల వల్ల హింస చెలరేగుతోందన్న ఆరోపణలతో దాఖలైన పిటి:షన్లను శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 18లోగా కమిటీ ఏర్పాటుపై కోర్టుకు సమాచారం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్‌ను ఆదేశించింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య సమరస్యపూర్వక వాతావరణం ఉండాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. -
Haryana communal violence: బలగాల్ని దింపండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలోని హరియాణాలో మత ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హరియాణాలో మత ఘర్షణలకు నిరసనగా వీహెచ్‌పీ, బజరంగ్దళ్ ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టీల సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా ఆదేశాలిచ్చింది. నూహ్ జిల్లాలో జలై 31వ తేదీన వీహెచ్‌పీ ర్యాలీని అడ్డుకునేందుకు వేరే వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు జరక్కుండా కట్టడిచేయాలని పాలనా యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, సంబంధిత సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లను భద్రపరచాలని ఆదేశించింది. ‘ ఢిల్లీని ఆనుకుని ఉన్న హరియాణా, యూపీ ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగొచ్చు. అవసరమైతే అదనపు పోలీసు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపండి. ఎలాంటి ఆస్తి నష్టం, హింస జరగకుండా చూడండి. ఏ మతానికి వ్యతిరేకంగానైనా విద్వేష ప్రసంగాలు జరక్కుండా అడ్డుకట్టవేయండి’ అని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు పాలనాయంత్రాగాలకు త్వరగా అందేలా చూడాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ‘విద్వేష ప్రసంగాలు చేసినపుడు ఫిర్యాదు కోసం వేచిచూడకుండా వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడూ యథాతథంగా అమలుచేయండి’ అని కోర్టు గుర్తుచేసింది. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం యంత్రాంగాలతో సంప్రదించాలని కేంద్రానికి సూచించింది. పలుచోట్ల ర్యాలీలు ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో 23 భారీ ర్యాలీలు చేపడతామన్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్ పిలుపుమేరకు బుధవారం ఢిల్లీలో పలుచోట్ల ర్యాలీలు జరిగాయి. ట్రాఫిక్ స్తంభించింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద బజరంగ్దళ్ శ్రేణులు హనుమాన్ చాలీసా పఠించారు. వికాస్‌మార్గ్ ప్రాంతం ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. 116 అరెస్టులు: ఖట్టర్ రాష్ట్రంలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 41 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి 116 మందిని అరెస్ట్చేశామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందన్నారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హరియణా సర్కార్ ఏర్పాటుచేసేపనిలో ఉంది. -
Hate Speech: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలకు దేశ లౌకిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. అందుకే విద్వేష ప్రసంగాల విషయంలో ఫిర్యాదులు అందకపోయినా కేసు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2022లో ఇచ్చిన ఆదేశాల పరిధిని పెంచింది. అలాగే విద్వేష ప్రసంగాలపై కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కరణ చర్యగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కులం, మతం, వర్గంతో సంబంధం లేదని, చట్టాన్ని అతిక్రమించి ఎవరు విద్వేష ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. విద్వేషప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 2022 అక్టోబర్‌లో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. చదవండి: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం -
సమాజాన్ని చీలుస్తున్నాయి
న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా. కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం. ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్ జోసెఫ్ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు. పోలీసును పొడిచేసినా పట్టించుకోరా! ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్‌స్నాచర్ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమస్యగా మారొద్దు ‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది. -
తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ టేకోవర్ తరువాత వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్ ప్రణాళికలను వెల్లడించారు. ట్విటర్ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కానీ నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని తేల్చి చెప్పారు. విద్వేష పూరిత కంటెంట్ ఉన్న పోస్టులను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. (గుడ్‌న్యూస్,తొలిసారి ట్విటర్లో...మస్క్ క్లారిటీ!) ఫ్రీడం ఆఫ్ స్పీచ్, బట్ నాట్ రీచ్: కొత్త పాలసీ తాజా పాలసీ అప్డేట్లో విద్వేషపూరిత ట్వీట్లు డీబూస్ట్, డీమోనిటైజ్ చేస్తామని మస్క్ తెలిపారు. నెగెటివ్, హేట్ పోస్ట్‌లను ప్రమోట్ చేయమని, వాటిని మోనిటైజ్ పరిధిలోకి రావని స్పస్టం చేశారు. అలాంటి పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అంతేకాదు అడ్వర్టయిజ్మెంట్లను కూడా నియంత్రిస్తామన్నారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని కూడా మస్క్ పేర్కొన్నారు. యూజర్లు అలాంటి ట్వీట్లను ప్రత్యేకంగా వెతికితే తప్ప దొరకవు అని వెల్లడించారు. New Twitter policy is freedom of speech, but not freedom of reach. Negative/hate tweets will be max deboosted & demonetized, so no ads or other revenue to Twitter. You won’t find the tweet unless you specifically seek it out, which is no different from rest of Internet. — Elon Musk (@elonmusk) November 18, 2022 మరోవైపు గతంలో ట్విటర్లో బ్యాన్ చేసిన కొన్ని ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు మస్క్. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై పోల్ పెట్టారు. అయితే ట్రంప్ ఖాతాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 అలాగే వర్క్ ఫ్రం హోం రద్దుతోపాటు, ఎక్కువ పనిగంటలు పనిచేసేందుకు సిద్ధపడతారా, రాజీనామా చేస్తారా అంటూ మస్క్ అల్టిమేటానికి సమాధానంగా తాజాగా 1200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. సాఫ్ట్వేర్ కోడ్ రాసే ఉద్యోగులు ఎవరైనా మధ్యాహ్నం శాన్ఫ్రాన్సిస్కోలోని కార్యాలయంలోని 10వ అంతస్తులో తనను కలవాలని మస్క్ శుక్రవారం ట్విటర్ సిబ్బందికి మెయిల్ పంపారు. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) కాగా 44 బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్ తరువాత సంచలన నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు టెక్ వర్గాలను గందరగోళానికి గురిచేస్తూ విమర్శలు పాలవు తున్నా, మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే వేలాది ఉద్యోగులను తొలగించడంపై అమెరికా కోర్టులో కేసులు కూడా నమోదైనాయి. అంతేకాదు మస్క్ అనాలోచిత నిర్ణయాలతో ట్విటర్ మూత పడనుందనే అంచనాలు వెల్లువెత్తాయి. అయితే ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లైవ్ కవరేజీ, కమెంటరీని ఎంజాయ్ చేయమంటూ ప్రకటించి ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు. -
మత విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: మత విద్వేష పూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. రాజ్యాంగ ప్రకారం భారత్ లౌకిక దేశమని ఎవరైనా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదుల కోసం ఎదురు చూడకుండా నేరస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా వస్తున్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఆదేశాలిచ్చింది. మత విద్వేషాలు వెళ్లగక్కే వారిపై చర్యలు తీసుకోవడానికి పరిపాలనాపరమైన జాప్యం చేస్తే కఠిన చర్యలుంటాయని, అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని ఆ మూడు రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు పంపింది. విద్వేషపూరిత ప్రసంగాలపై జర్నలిస్టు షాహీన్ అబ్దుల్లా వేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ శుక్రవారం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ‘‘ఇది 21వ శతాబ్దం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (ప్రాథమిక విధులు) శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని మనకి చెబుతోంది. మరి మనం మతం పేరుతో ఎక్కడికి చేరుకుంటున్నాం. మతాన్ని ఎంత వరకు దిగజారుస్తున్నాం. నిజంగా ఇదొక విషాదం’’ అని జస్టిస్ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మతపరంగా తటస్ఠంగా ఉండే దేశంలో మతవిద్వేషకులు చేసే వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి’’ అని అన్నారు. వారి వారి మతాలతో సంబంధం లేకుండా విద్వేషపూరిత ప్రసంగాలు ఎవరు చేసినా చర్యలు తీసుకొని మన దేశ లౌకిక తత్వాన్ని కాపాడాలని సుప్రీం కోర్టు హితవు పలికింది. ‘‘భారత రాజ్యాంగం మనది లౌకిక దేశమని, పౌరులందరూ సహోదరులని చెప్పింది. వారి వారి మర్యాద, గౌరవాలకు భంగం వాటిల్లదని హామీ ఇచ్చింది. ఐక్యత, సమగ్రత అన్నవే మనల్ని ముందుకు నడిపించేవి. పరమత సహనం పాటించకుండా రెండు వేర్వేరు మతాలకు చెందిన వారి మధ్య సహోదర భావం ఏర్పడలేదు’’ అని కోర్టు పేర్కొంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసంగాలు చేశారో, వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఎలా వదిలేసిందో ఉదాహరణలతో సహా పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన హిందూ సభలో బీజేపీ నేతలు ఎంతటి విద్వేషాన్ని వెళ్లగొట్టారో వివరించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాపాడడం కోసమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం చేశారు-ప్రధాని మోదీ -
‘రాజీ’ ఎరుగని రాజా సింగ్.. దేశవ్యాప్తంగా కేసులే కేసులు
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అవసరమైతే ధర్మం కోసం తాను చనిపోయేందుకైనా సిద్ధం కానీ... వెనక్కి తగ్గనని ఆయన తేల్చిచెప్పారు. పోలీసులు ఇప్పటికే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. అయితే రాజాసింగ్‌కు వివాదాలు కొత్తేం కాదు. ఆయనపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. ► రాజాసింగ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014 నుంచి హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ► 2015లో ఓ పెళ్లి వేడుకలో డీజేను ఆపేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి రాజాసింగ్ మొదటిసారి వార్తల్లో నిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మ్యూజిక్ ప్లే చేస్తే ఆపేందుకు వెళ్లిన పోలీస్‌పై దాడి చేశాడు. దీంతో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ► అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఓ వర్గం విద్యార్థులు ప్రకటించినప్పుడు రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోమాతను రక్షించేందుకు ప్రాణలైనా అర్పిస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని బెదిరించారు. ► 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై మొత్తం 43 కేసులు నమోదైనట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, విద్వేష ప్రసంగాలు, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, హత్యాయత్నం వంటి కేసులు తనపై ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ► 2020లో రాజాసింగ్‌ను ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్బుక్ లేబుల్ చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఆయనపై నిషేధం విధించింది. రోహింగ్యా ముస్లింలపై, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. ► 2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. భారత్ త్వరలోనే హిందూ దేశంగా మారుతుందని ఆయన పాట కూడా పాడారు. ► గతవారం హైదరాబాద్‌లో మునావర్ ఫరుఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని బెదిరించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ► తాజాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా అగ్గిరాజేశారు రాజాసింగ్. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. -
బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్విటర్లో కేటీఆర్ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పాల్సింది బీజేపీ నేతలని, దేశం కాదని స్పష్టం చేశారు. విద్వేషాలను వెదజల్లుతున్నందుకు బీజేపీ నాయకులు ప్రజలకు క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మహత్మా గాంధీ హత్యను బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ప్రశంసించినప్పుడు మోదీ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మీరు(మోదీ) దేనికి అనుమతిస్తున్నారో అదే మీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. PM @narendramodi Ji, Why should India as a country apologise to international community for the hate speeches of BJP bigots? It is BJP that should apologise; not India as a Nation Your party should first apologise to Indians at home for spewing & spreading hatred day in day out — KTR (@KTRTRS) June 6, 2022 కాగా ఆదివారం కూడా కేటీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ ట్విటర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే, అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. దీనికి జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. చదవండి: వామ్మో ‘జూన్’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది! If the BJP truly respects all religions equally, should you also not suspend Telangana BJP chief who made an open public statement wanting to dig up all the mosques & impose a ban on Urdu? Why this selective treatment @JPNadda Ji? Any clarification? https://t.co/6tqMLWSW3w — KTR (@KTRTRS) June 5, 2022 -
విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా ఉన్నారు. -
నకిలీ వార్తల ఏరివేతపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది. బుధవారం కేంద్ర హోం, ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 14న జరగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌లు భారత్‌లో తమ అధికార ప్రతినిధుల వివరాలను బహిర్గతపరిచేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ గుప్తా డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు స్వర్గ ధామాలైపోయినా సామాజిక మాధ్యమాల్లో చట్టాలను అమలు చేసే వ్యవస్థ పోతోందని, అందుకు జవాబుదారీ అయిన అధికారులు ఎవరనేది తెలియకపోవడమూ ఇందుకు కారణమని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్లకు, ఆస్తుల విధ్వంసానికి సామాజిక మాధ్యమాలు ఒక పనిముట్టుగా మారకూడదని, భావప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పుకోవడమూ సరికాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న భావనను ఈ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తున్నాయని, భారతీయ చట్టాలను పాటించడం లేదని ఆరోపించారు. తగిన చర్యలేవీ లేని కారణంగానే రెచ్చగొట్టే ప్రసంగాలూ ఎక్కువ అవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. -
ప్రధాని పర్యటన అబద్ధాలమయం
వయనాడ్ (కేరళ): గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలన్నీ అబద్ధాలు, విద్వేషం, విషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజలను విడగొట్టాలనే ఉద్దేశంతో మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ పార్టీ మాత్రం ప్రేమ, నిజం, ఆప్యాయత వైపు నిలిచిందని పేర్కొన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా తనను గెలిపినందుకు గానూ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కల్పెట్టా, కంబలకాడు, పనమారమ్ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అనంతరం పలు రోడ్‌షోలలో పాల్గొన్నారు. ‘మోదీ దగ్గర డబ్బు, మీడియా, ధనికులైన స్నేహితులు ఉండవచ్చు. కానీ దేశంలో బీజేపీ సృష్టించిన విద్వేషం, అసహనంపై కాంగ్రెస్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ప్రేమ, ఆపాయ్యతతో వాటిని అధిగమిస్తుంది’అని రాహుల్ అన్నారు. వయనాడ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అందరం కలిసికట్టుగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. రాహుల్ రోడ్‌షోలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. -
నోరు మూయించిన ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. యోగి, మేనక, మాయ మతవిద్వేష వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేత జయప్రద వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఆజంఖాన్ మాట్లాడారు. విద్వేష వ్యాఖ్యల అంశంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఈసీ చీవాట్లు పెట్టింది. యోగి, ఆజంఖాన్‌లు గతంలోనూ ఇలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వారిని ఈసీ హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో వారిద్దరిపై 72 గంటల నిషేధం విధించామని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. అదే మాయ, మేనకలు తొలిసారి విద్వేష వ్యాఖ్యలు చేసినందున వారిపై 48 గంటల నిషేధమే విధించామన్నారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఈసీ అధికారి చెప్పారు. ఈ ఎన్నికలు అలీకి, బజరంగ్ బలికి మధ్య జరిగే యుద్ధమని మీరట్‌లో యోగి అన్నారు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయకూడదని దేవబండ్‌లో మాయావతి కోరారు. ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తర్వాత వారు ఏదైనా పనికోసం తన వద్దకు వచ్చినప్పుడు వారికి సాయం చేయాలని తనకు అనిపించదని మేనక పేర్కొన్నారు. ఇక జయప్రదకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాలపై ఆజంఖాన్ మాట్లాడుతూ జయప్రద ఖాకీ నిక్కర్ వేసుకుంటుందని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ నేత ఆజం ఖాన్‌లపై ఈసీ నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే.. విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు బెంచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధగంటలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తమ ముందు ఉండాలని కూడా ఓ సందర్భంలో హెచ్చరించింది. -
‘విద్వేషం’ కట్టడికి ఫేస్బుక్ టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. రాజకీయ నేతలు, ప్రజల మధ్య సత్సంబంధాలను తాము ప్రోత్సహిస్తామని వెల్లడించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తామని ఫేస్బుక్ గ్లోబల్ పాలసీ సొల్యూషన్స్ ఉపాధ్యక్షుడు రిచర్డ్ అలన్ అన్నారు. తమ కొత్తవిధానంలో మతం, కులం, జాతి, రంగు ఆధారంగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసే విద్వేష ప్రసంగాలు, అప్లోడ్ చేసే హింసాత్మక వీడియోలను తొలగిస్తామని వెల్లడించారు. భారత్ సహా చాలాదేశాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 20,000 మంది సిబ్బందిని నియమించుకుంటామన్నారు. -
జకీర్‌ను అప్పగించం: మలేసియా
కౌలాలంపూర్: వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్(52)ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధానమంత్రి మహతీర్ బిన్ మొహమ్మద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. ‘జకీర్ మలేసియాలో శాశ్వత నివాసహోదా కలిగిఉన్నారు. జకీర్‌తో ఎలాంటి సమస్యలు రానంతవరకూ ఆయన్ను భారత్‌కు అప్పగించబోం’ అని స్పష్టం చేశారు. అక్రమ నగదు చెలామణితో పాటు విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ను తమకు అప్పగించాలని గత జనవరిలో ప్రభుత్వం మలేసియాను కోరింది. 2016, జూలైలో భారత్ నుంచి వెళ్లిపోయిన జకీర్.. తనపై విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం కలిగినప్పుడే దేశానికి తిరిగివస్తానని ఇంతకుముందు ప్రకటించారు. -
తండ్రి అంత్యక్రియలకూ డుమ్మా
భారతదేశానికి వస్తే పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో.. తన తండ్రి అంత్యక్రియలకు సైతం జకీర్ నాయక్ డుమ్మా కొట్టారు. జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ (88) ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం మలేసియాలో ఉన్నారని భావిస్తున్న జకీర్ నాయక్.. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. నాయక్ తండ్రి బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు. ప్రస్తుతానికి నాయక్‌పై ఎఫ్ఐఆర్ ఏదీ దాఖలు కాకపోయినా.. కేంద్రం మాత్రం ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించాలని యోచిస్తోంది. నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నడిపించే పీస్ టీవీ మతపరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని అంటున్నారు మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించిన జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీమ్ మంచి వైద్యుడిగాను, విద్యావేత్తగాను పేరొందారు. ఆయనను కొన్ని రోజుల క్రితం మజ్గావ్లోని ప్రిన్స్ అలీఖాన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు గుండె ఆగిపోవడంతో ఆదివారం తెల్లవారుజామను 3.30 గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. పలువురు న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు వచ్చారు. కానీ జకీర్ నాయక్ మాత్రం.. భారతదేశానికి వస్తే తనను పోలీసులు అరెస్టుచేస్తారన్న భయంతో రాకుండా ఆగిపోయారు. సిటీ క్రైం బ్రాంచికి చెందిన పోలీసులు, జాతీయ నిఘాసంస్థ అధికారులు, స్థానిక పోలీసులు కూడా జకీర్ కోసం అంత్యక్రియలు జరిగిన ప్రాంతం చుట్టూ గాలిస్తూ కనిపించారు. -
విద్వేష ప్రసంగాలపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
విద్వేష ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. జకీర్ నాయక్ ప్రసంగాల అంశం తీవ్ర వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం కెన్యా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తన ప్రసంగంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్వేష ప్రసంగాలు, హింసాత్మక బోధనల వల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని, ఇలాంటి తీవ్రవాద సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు యువత సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేవారిని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకునేవారిని కూడా ఖండించాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావించారు. యూనివర్సిటీ ఆఫ్ నైరోబిలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, విద్వేషాలు లేని ప్రపంచం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు సురక్షితంగా, భద్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉగ్రవాదం పీచమణిచే శక్తి యువతకే ఉంటుందని ఆయన అన్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా నిలకడగా పోరాడాలని, అదే సమయంలో దేశవాసుల భద్రతను కూడా మర్చిపోకూడదని తెలిపారు.