
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. రాజకీయ నేతలు, ప్రజల మధ్య సత్సంబంధాలను తాము ప్రోత్సహిస్తామని వెల్లడించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తామని ఫేస్‌బుక్ గ్లోబల్ పాలసీ సొల్యూషన్స్ ఉపాధ్యక్షుడు రిచర్డ్ అలన్ అన్నారు. తమ కొత్తవిధానంలో మతం, కులం, జాతి, రంగు ఆధారంగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసే విద్వేష ప్రసంగాలు, అప్‌లోడ్ చేసే హింసాత్మక వీడియోలను తొలగిస్తామని వెల్లడించారు. భారత్ సహా చాలాదేశాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 20,000 మంది సిబ్బందిని నియమించుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment