Task Force Police
-
బయటకని చెప్పి పబ్‌కి వెళ్తావా.. ఇంటికిరా నీ సంగతి చెప్తా!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ పబ్ బాగోతం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి దాడులు చేశారు. ఈ క్రమంలో 100 మంది పురుషులు, 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లకు ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. పబ్‌కు వచ్చిన యువకులతో వారు సన్నిహితంగా ఉండేలా డ్యాన్స్‌లు చేపిస్తున్నారు. పబ్ వచ్చిన వారితో ఎక్కువ మద్యం తాగించి అధిక బిల్లు అయ్యేలా పబ్ నిర్వహకులు ప్లాన్ చేశారు.గత మూడు వారాలుగా పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో 100 మంది కస్టమర్లు, 42 మంది యువతులు, ఏడుగురు పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా.. పబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్‌లో నాలుగు గంటలు పనిచేస్తే 2 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇక, పబ్‌కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ.. ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారి పని అప్పగించారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తాము ఇచ్చే సాప్ట్ డ్రింక్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించారు. కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఎక్కువ ఇస్తున్నట్టు గుర్తించారు. అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.మరోవైపు.. పబ్‌లో పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పబ్‌లో పట్టుబడ్డ తన భర్త కోసం ఆధార్ కార్డు తీసుకుని భార్య పీఎస్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్‌కి వచ్చి తందనాలు ఆడుతున్నాడు. ఇంటికి రానీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. -
నకిలీ మందుల తయారీదారులపై దాడులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల తయారీ కేంద్రం గుట్టుర ట్టు చేసేందుకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), హైదరాబాద్ సీపీ టాస్‌్కఫోర్స్ బృందం అధికారులు కలిసి ‘ఆపరేషన్ జై’పేరిట అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ పేరిట ఈ నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు పక్కా ఆధారాలు సేకరించారు. దాడిలో మొత్తం రూ.44.33 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ జైకు సంబంధించిన వివరాలను డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. మలక్‌పేట్‌లో లింకులు ఉత్తరాఖండ్ వరకు.. నకిలీ మందుల విక్రయానికి సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు డీసీఏ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మలక్‌పేట్‌లోని ఓ మెడికల్ దుకాణంలో ఫిబ్రవరి 27న సోదాలు చేపట్టగా రూ.7.34 లక్షల విలువైన ఎంపీఓడీ–200 ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. ఈ నకిలీ మందులను విక్రయిస్తున్న అర్వపల్లి సత్యనారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మీర్‌పేట్‌కు చెందిన గాండ్ల రాములు నుంచి తాను ఈ నకిలీ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసినట్టు అతను అంగీకరించాడు. ఈ సమాచారంతో డీసీఏ అధికారులు గాండ్ల రాములును అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌కు చెందిన విషాద్ కుమార్, సచిన్ కుమార్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. సచిన్ కుమార్, విషాద్ కుమార్‌లు వాట్సప్ కాల్స్ ద్వారా తన నుంచి ఆర్డర్లు తీసుకుని ఉత్తరాఖండ్ నుంచి మందులను పంపుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ సమాచారం మేరకు డీసీఏ, టాస్‌్కఫోర్స్ అధికారులు ఉత్తరాఖండ్‌లో ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ సంస్థలో ఫిబ్రవరి 29న డీసీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సచిన్ కుమార్ నకిలీ ట్యాబ్లెట్లను తయారు చేసి, వివిధ కంపెనీల లేబుల్స్ అతికించి లక్ష నకిలీ ట్యాబ్లెట్లను రూ.35 వేలకు విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఆ సంస్థనుంచి మొత్తం రూ. 44.33 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. -
గుడిమాల్కాపూర్లోని అక్రమ స్పాసెంటర్లపై పోలీసుల దాడులు
-
రాజేష్ దగ్గర 100 మంది నకిలీ ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు వెస్ట్‌జోన్ డీసీపీ చందన దీప్తి. వీళ్లంతా బీహార్‌కు చెందిన వాళ్లని, ఇలాంటి వాళ్లు వంద మందిదాకా ఉన్నారని ఆమె తెలిపారు. రాజేష్, అనితలు ఈ ముఠా నాయకులు. రాజేష్ దగ్గర 100 దాకా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పగలంతా ట్రాన్స్జెండర్ల వేషంలో ఉంటూ జనం దగ్గరి నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈజీ మనీ కోసమే వాళ్లు ఈ గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు అని డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారామె. పగలంతా ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్జెండర్ల గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్ స్టేషన్ ప్రాంతంలో వీళ్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. -
స్పా ముసుగులో వ్యభిచారం..సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
ప్రశాంత విశాఖ..
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత విశాఖే లక్ష్యంగా అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు సిద్ధమైంది. విశాఖను టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విస్తరించింది. విశాఖ పోలీస్ కమిషనరేట్నంతా టాస్క్ ఫోర్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు మే 24 నుంచి అమల్లోకొచ్చినట్టుగా పరిగణిస్తున్నట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, వైఎస్సార్సీపీ నేత, బిల్డర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. మరో బిల్డర్ కిడ్నాప్ కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. మరోవైపు అరకు జిల్లా పరిధిలో గంజాయి సాగును ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసినా.. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని భావించింది. అసాంఘిక శక్తులపై కేసులు నమోదుచేయనున్న టాస్క్‌ఫోర్స్ ఇప్పటివరకు ఏ ప్రాంతంలోని కేసులను అక్కడి పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ, శిక్షలు పడేలా చేయడం మొదలైన ప్రక్రియలో కొంత సమన్వయలోపం కనిపిస్తోంది. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపైన అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడి బాధ్యత టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. అందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు అదనపు అధికారులు, సిబ్బదిని కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు టీమార్ట్ అగ్ని ప్రమాదం కేసు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని టీమార్ట్ అగ్నిప్రమాదం కేసు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరింది. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఆర్యనగర్‌లో గల టీమార్ట్ సూపర్ మార్కెట్లో 2022 ఆగస్టు 28న రాత్రి 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీమార్ట్‌లో ఉన్న సుమారు రూ. 2 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. కేసులో నగరంలోని ఓ ప్రజాప్రతినిధి బంధువుతో పాటు మరి కొందరు, ఓ పోలీస్ అధికారి ఎంట్రీ కావడంతో కేసు డీలా పడింది. ప్రమాదానికి కారణమైన ఆధారాలను సేకరించిన పోలీసులు.. కొన్నింటిని లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో కేసు ఆలస్యం కావడంతో బాధితుడు కొంత కాలంగా పోలీసు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో టీమార్ట్ కేసు ఫైల్ మళ్లీ తెరపైకి వచ్చింది. కేసును ట్రాస్క్ఫోర్స్కు అప్పగించడంతో కేసు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రంగంలోకి టాస్క్‌ఫోర్స్ టీమార్ట్ అగ్నిప్రమాదం కేసును నీరుకార్చడానికి ప్రయత్నించిన ఓ ప్రజాప్రతినిధి బంధువు, ఓ పోలీసు అధికారి, కొంత మంది వివరాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేసును పక్కదారి పట్టించడానికి ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. దీంతో 10 నెలలుగా కేసును పోలీసులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఈ కేసును మళ్లీ టాస్క్‌ఫోర్స్‌కు చేరడంతో ప్రజాప్రతినిధి బంధువుతో పాటు ఓ పోలీసు అధికారి, మరి కొందరు కలిసి బాధితుడితో ఒప్పందం పేరుతో రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంత్రి, సీపీకి ఫిర్యాదు చేయడంతో..! బాధితుడు శేఖర్ అగ్నిప్రమాదం కేసు విషయమై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును పరిశీలించాలని పోలీసులకు మంత్రి ఆదేశాాలు జారీ చేయడంతో టీమార్ట్ కేసులో పురోగతి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు వివరాలను సేకరించే పనిలో పడినట్లు తెలిసింది. కేసు ఈ సారైనా కొలిక్కి వస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అయితే కేసు విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్‌ను సంప్రదించగా ఇన్చార్జి సీపీ, ఏసీపీల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
Hyderabad-Constable: ఈశ్వర్ లీలలు ఎన్నెన్నో..!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలియక చోరీ సెల్ఫోన్లు ఖరీదు చేసిన వారిని బెదిరించడంతో మొదలైన ఇతడి వ్యవహారం స్నాచింగ్ గ్యాంగ్స్ నిర్వహించే వరకు వెళ్లింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈశ్వర్ ఆది నుంచీ వివాదాస్పదుడే. గడిచిన పుష్కరకాలంలో అతగాడు దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడగట్టాడని తెలుస్తోంది. ‘ఉద్యోగం ఉన్నా పోయినా నాకు పెద్ద ఫరక్ పడదు’ అంటూ ఇతగాడు సహోద్యోగుల్నే కాదు అధికారులనూ బెదిరించే వాడని సమాచారం. బెదిరింపు వసూళ్లతో మొదలై... ఈశ్వర్ టాస్క్‌ఫోర్స్‌లోకి రావడానికి ముందు ఎస్సార్‌నగర్, బేగంపేట సహా వివిధ పోలీసుస్టేషన్లలో పని చేశాడు. అప్పట్లో చోరీ ఫోన్లు ఖరీదు చేసిన వాళ్లను బెదిరించడంతో ఇతడి దందాలు మొదలయ్యాయి. ఇతగాడు తనకున్న పరిచయాలను వినియోగించుకుని తస్కరణకు గురైన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు సేకరించే వాడు. వీటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించే వాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో లభిస్తున్న సెల్ఫోన్లలో అనేకం చోరీ ఫోన్లు కూడా ఉంటున్నాయి. విషయం తెలియక ఇలాంటి చోట వాటిని ఖరీదు చేసి, వినియోగిస్తున్న వారి నెంబర్లు ఈశ్వర్ వద్దకు చేరేవి. ఆ ఫోన్లు వాడుతున్న వారిని పిలిపించుకునే ఇతగాడు ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. ఇలా రికవరీ చేసిన ఫోన్‌ను సైతం అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. చదవండి: (సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా!) వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలు... ఇలా చోరీ ఫోన్ల మార్కెట్‌పై ఇతడికి పట్టువచ్చింది. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో ఆవాసం కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు స్నాచింగ్స్ చేయాలని టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను వారికి జీతంగా లెక్కించి దాని విలువకు సమానమైన మొత్తాన్ని వారికి ఇచ్చేవాడు. ఈ చోరీ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీరి నుంచీ ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దేవాలయాలు, పబ్లిక్ మీటింగ్స్ జరిగే ప్రాంతాలనే ఎక్కువగా టార్గెట్ చేయించే ఈశ్వర్ సెల్ఫోన్లతో పాటు బంగారు నగలను స్నాచింగ్ చేయించే వాడు. ఒక్కో సీడీఆర్ రూ.50 వేలకు విక్రయం... దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న ఈశ్వర్ మరో దందా కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్) విక్రయమని తెలుస్తోంది. వీటిని పొందాలంటే ఉన్నతాధికారుల ఈ–మెయిల్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు అభ్యర్థన వెళ్లాల్సిందే. అయితే ఈశ్వర్‌కు మాత్రం ఇవి చాలా తేలిగ్గా వచ్చి చేరుతున్నాయని సమాచారం. చోరులకు సంబంధించిన సీడీఆర్‌ల ద్వారా వారి నుంచి సొత్తు కొనే రిసీవర్లను గుర్తిస్తున్న ఇతగాడు బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. వీటి ద్వారానే కొత్త చోరుల వివరాలు తెలుసుకుని వారి తనకు అనుకూలంగా వాడుకునే వాడు. అలాగే కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీలకు ఒక్కో సీడీఆర్‌ను రూ.50 వేలకు అమ్ముతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక అక్రమాలకు పాల్పడిన ఈశ్వర్ రూ.20 కోట్లకు పైగా కూడగట్టిన ఆస్తుల్లో అనేకం బినామీ పేర్లతోనే ఉన్నాయని తెలిసింది. ఇతడిని సస్పెండ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు అంతర్గత విచారణ మొదలెట్టారు. -
హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కారు, నగదు స్వాధీనం చేసుకున్నారు. షాహినాత్‌గంజ్‌కు చెందిన కమలేశ్, అశోక్ కుమార్, రతన్‌సింగ్, గోషామహల్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డబ్బు ఎవరి ఆదేశాలతో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ హవాలా సొమ్ముతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు? -
హైదరాబాద్ లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం
-
హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టివేత
-
Hyderabad: చెత్త వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు.. అంత డబ్బు ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: జల్పల్లికి చెందిన ఓ స్క్రాప్ వ్యాపారి వద్ద సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.1.24 కోట్లు స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన సమీప బంధువు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఒకరి నుంచి తీసుకున్న ఇతగాడు మరో నలుగురికి అందించేందుకు ప్రయత్నించాడని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. మీరట్ నుంచి నగరానికి వలసవచ్చిన షోయబ్ మాలిక్ మాసబ్‌ట్యాంక్‌లో ఉంటున్నాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి జల్పల్లిలో బిస్మిల్లా ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న ఇతడి సమీప బంధువు కమిల్ మాలిక్ గుజరాతీ గల్లీ ప్రాంతానికి చెందిన వ్యాపారి భరత్ నుంచి రూ.1.24 కోట్లు తీసుకోమని చెప్పాడు. దీంతో గురువారం తన వద్ద పని చేసే ఉద్యోగి అక్లాక్‌ను పంపి డబ్బు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని కమిల్ ఆదేశాల మేరకు నగరానికే చెందిన సంభవ్, ఆదిల్, మినాజ్, షఫీలకు అందించాలని భావించాడు. సీజ్ చేసిన డబ్బు దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ నేతృత్వంలో ఎస్సై ఎస్.సాయికిరణ్ నేతృత్వంలోని బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. షోయబ్ సహా అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.24 కోట్ల నగదును హుమాయున్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం హవాలా దందాగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆదాయపుపన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు. -
GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
-
GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో చోటు చేసుకున్న కృత్రిమ వేలిముద్రల వ్యవహారాన్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పని చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది? ఇంకా ఎందరి పాత్ర ఉంది? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. గోషామహల్ సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండే పారిశుద్ధ్య కార్మికుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వారి హాజరును తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఒక్కో కార్మికుడికీ నిర్దేశిత పని వేళలు ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్‌లో లాగ్ ఇన్, పూర్తయ్యాక లాగ్ ఔట్ నిర్దేశిస్తూ వీళ్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీన్ని గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీరిని ప్రతి రోజూ ఫీల్డ్‌లోకి తీసుకువెళ్లడం, అక్కడే వారితో వేలిముద్రలు వేయించి హాజరు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో కృత్రిమ వేలిముద్రలు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. యూ ట్యూబ్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఫెవికాల్, ఎంసీల్ తదితరాలు కలపడం ద్వారా ఓ రకమైన సింథటిక్ పదార్థం తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు. వీటిని తమ జేబులో వేసుకుని ఫీల్డ్‌కు వెళ్తున్న ఉద్యోగులు అదును చూసుకుని లాగ్ ఇన్, లాగ్ ఔట్ కోసం వీటితో వేలిముద్రలు వేసేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు స్కామ్ గుట్టరట్టు చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై స్పష్టత వస్తుందని, ఆపై అందరినీ అరెస్టు చేస్తామని టాస్క్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. -
పక్కా స్కెచ్‌తో ‘ఏయ్ జూనియర్’ నిర్మాతను పట్టుకున్న పోలీసులు
సాక్షి, వరంగల్: సినిమా నడవాలంటే కథా బలంతోపాటు క్లైమాక్స్ మరీ ముఖ్యం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా భారీ సెట్టింగులు వేసి ప్లాన్ చేస్తారు. సేమ్ టు సేమ్.. అదే తరహాలో రైల్వే, ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ‘ఏయ్ జూనియర్’ సినిమా నిర్మించిన ఎస్కే. గౌస్‌ను పట్టుకునేందుకు వరంగల్ పోలీసులు సినిమా చూపించారు. ముఠాను గత సోమవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా మోసాలు, అరెస్ట్ తతంగమంతా ఓ సినిమాలా సాగింది. రూ.4కోట్ల వరకు సమర్పణ ఉమ్మడి వరంగల్ నుంచి దాదాపు 15 మంది రూ.4కోట్ల వరకు సమర్పించారు. ఇలా వచ్చిన డబ్బులను రెట్టింపు చేయడంతోపాటు తన సినిమా కోరిక నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ వైపు అడుగులు వేశాడు. ఈ డబ్బుతో 2018లో ‘ఏయ్ జూనియర్’ సినిమాను మొదలెట్టాడు. ఇలా సినిమా 2020లో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వద్ద ఆగిపోయింది. అంతలోనే కరోనా రావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు అయ్యే వ్యయం రూ.30లక్షలు చేతిలో లేకపోవడంతో నిలిచిపోయింది. ‘సినిమా’ చూపించి.. మోసం గుంటూరు జిల్లా పట్టాభిరామ్‌కు చెందిన ఎస్కే. గౌస్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది నెరవేరడం కష్టమనుకున్నాడు. అదే సమయం(2017)లో సెక్రటేరియట్లో అటెండర్‌గా పనిచేస్తున్న వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి సతీశ్‌తో పరిచయం ఏర్పడింది. ఖద్దర్ డ్రెస్‌లో వచ్చిన గౌస్‌ను చూసి మీరు ఏమి చేస్తారు సర్.. అంటే ఉన్నతస్థాయి రాజకీయ నేతలు, అధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఎక్కడంటే అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతాడు. దీంతో సతీశ్ తన అల్లుడు రాజేశ్ తరఫున రూ.7లక్షలు ఇవ్వడంతో శిక్షణ కోసం కోల్‌కతా తీసుకెళతాడు. రెండు నెలలపాటు రూ.10 వేల జీతం ఇచ్చి అక్కడినుంచి బిహార్ బదిలీ అయ్యావని నమ్మిస్తాడు. అక్కడికెళితే నార్త్ ఇండియా అంటూ దాడులు చేస్తారని బెదిరించడంతో మూడు నెలలు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. ఇలా.. సతీశ్ మరి కొందరిని కూడా గౌస్ వద్దకు పంపుతాడు. అతడు పశ్చిమ బెంగాల్‌లోని క్రిష్ వద్దకు పంపించి.. పరీక్షలు, మెడికల్ టెస్టులు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిస్తాడు. అక్కడ 2 నెలల శిక్షణ ముగియగానే సౌత్ ఇండియా వాళ్లని, ఇక్కడివారు దాడులు చేస్తారంటూ భయపడేలా చేసి పంపిస్తారు. ఇలా సినిమా చూపించి నిరుద్యోగులను మోసం చేశాడు. నిందితుడికి సినిమా చూపించి అరెస్ట్.. మోసపోయిన నిరుద్యోగులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగితే ‘ఏయ్ జూనియర్’ నిర్మాత ఎస్కే.గౌస్ నిందితుడిగా తేలాడు. అతన్ని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు అయ్యే రూ.30లక్షలు లేని నిర్మాత గౌస్‌కు పెట్టుబడి పెడతామంటూ మఫ్టీలో ఉన్న మన పోలీసులు ఆశ చూపారు. మాటల్లో దింపి ఢిల్లీ నుంచి వరంగల్‌కు రప్పించారు. వరంగల్ శివనగర్‌లోని ఓ హోటల్లో చర్చలు జరిపారు. రూ.30లక్షలిస్తే రూ.3కోట్లు వస్తాయా.. అంటూ మాటల్లోకి దింపారు. డైరెక్టర్ రూ.30లక్షలకు అదనంగా మరో రూ.20లక్షలు మాత్రమే వస్తాయని సమాధానమిచ్చాడు. అప్పటికే ఓటీటీకి మూవీ విక్రయించామని చెప్పిన డైరెక్టర్ అక్కడినుంచి పోలీ సుల కనుసైగతో వెళ్లిపోయాడు. దీంతో అక్కడే ఉన్న గౌస్‌తోపాటు నిరుద్యోగులను వంచించిన కేసులో నిందితులుగా ఉండి.. అక్కడికొచ్చిన కోల్‌కతా కు చెందిన క్రిష్, వరంగల్ పాపయ్యపేటకు చెందిన ఎర్రబెల్లి సతీశ్‌లకు సంకెళ్లు వేసేందుకు యత్నించారు. పారిపోయేందుకు వీరు ప్రయత్నిస్తున్న సందర్భంలో సినిమాలో మాదిరిగానే వీరి వెంటబడి పట్టుకున్నారు. చేతులకు సంకెళ్లు వేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
ఐదుగురు అనుచరులతో ‘ఆవుల’ స్కెచ్
సాక్షి,హైదరాబాద్: ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు తన అనుచరులతో కలసి ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను రెచ్చగొట్టడం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి ప్రేరేపించినట్లు తేలింది. సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ సహా ఐదుగురు కీలక నిందితులను పట్టుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం వారిని సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) అప్పగించారు. వీరిని విచారిస్తున్న అధికారులు శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. అగ్నిప«థ్ పథకం ప్రక టనతోనే భారీ ఆందోళనలకు పథకం వేసిన సుబ్బారావు, వీలున్నంత వరకు తన పేరు బయటకు రాకుండా ఉండాలని భావించాడు. దీంతో తన అకాడమీలకు డైరెక్టర్లుగా, ఇన్‌స్ట్రక్ట ర్లుగా ఉన్న ఐదుగురిని రంగంలోకి దింపాడు. వీరిలో మల్లారెడ్డి, శివ కీలకమని పోలీసులు చెప్తున్నారు. వీరి ద్వారానే తమ అకాడమీలతోపాటు ఇతర ఇన్స్టిట్యూట్లలో శిక్షణ తీసుకుంటున్న ఆర్మీ ఉద్యోగార్థులను సంప్రదించడం, రెచ్చగొట్టడం వంటివి చేశాడు. తాను బోడుప్పల్‌లోని అకాడమీలో ఉండి అనేకమందిని హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఉంచాడు. నాగోలు మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో బస చేసిన మల్లారెడ్డి.. విధ్వంసం జరిగిన రోజు అభ్యర్థులకు సహాయసహకారాలు అందించాడు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఇస్తానం టూ సుబ్బారావు చెప్పాడని.. ఇలా పలువురిని విధ్వంసానికి ప్రేరేపించాడని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంతో రైల్వే, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు అనేక మంది పాస్‌పోర్టులు, విలువైన పత్రాలు దగ్ధమైనట్లు గుర్తించారు. ఆందోళన జరిగిన రోజు ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రైల్వే మెయిల్ సర్వీస్ కోచ్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అందులో ఉన్న తపాలా శాఖకు చెందిన 400 బ్యాగులు దగ్ధమయ్యాయి. వీటిలో 173 పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఆయా వ్యక్తులకు బట్వాడా కావాల్సిన ఎల్ఐసీ బాండ్లు, విద్య, ధ్రువపత్రాలు బుగ్గిపాలయ్యాయి. ఈ క్రమంలో పోస్టల్ అధికారులు.. దీని ప్రభావం సామాన్యులపై లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
Tequila Pub: పబ్‌పై రైడ్స్.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్ గర్ల్స్, కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతో పబ్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లఘించి ఇష్టారీతిలో పబ్‌లను రన్ చేస్తున్నారు. తాజాగా నగరంలోని రాంగోపాల్‌పేటలో ఉన్న తకీల పబ్‌పై శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ నిర్వహించారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తుండటంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది గ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పబ్‌కు అనుమతి లేకున్నా అమ్మాయితో నిర్వాహకుడు డ్యాన్స్ చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, పబ్‌ను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని రాం గోపాల్పేట పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. ఇది కూడా చదవండి: ఆరు నెలలు కాకముందే భర్త అసలు క్యారెక్టర్ బట్టబయలు.. భార్య సూసైడ్ -
బంజారాహిల్స్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, 10 మందికి పైగా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం అయితే ఈ మసాజ్ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి స్పా సెంటర్లపై దాడులు జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. -
పేకాటలో ప్రజాప్రతినిధులు?
సాక్షి, హైదరాబాద్: అది పేరుకు దీపావళి పార్టీ.. కానీ అక్కడ జరిగింది మాత్రం పేకాట. ఓవైపు అంతటా టపాసుల మోత మోగుతుంటే.. ఆ అపార్ట్మెంట్ టెర్రస్‌పై మాత్రం పత్తాలాట జోరుగా సాగింది. ఆ పేకాట పార్టీలో ఉన్నది మామూలు వాళ్లు కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని మోతీలాల్ నెహ్రూనగర్‌లో ఉన్న మారుతి బసేరా అపార్ట్మెంట్ టెర్రస్‌పై జరిగిన ఈ తతంగం సంచలనంగా మారింది. ఆ పార్టీకి ఓ మంత్రి కూడా హాజరయ్యారని, ఆ మంత్రి సహకారంతోనే సదరు ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి వీఐపీలు సహా అంత మంది హాజరైనా.. పోలీసులు కేవలం ఐదుగురు మాత్రమే పట్టుబడినట్టు చూపడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో.. దీపావళి రోజున బసేరా అపార్ట్మెంట్ టెర్రస్‌పై జరిగిన పార్టీలో.. పదుల సంఖ్యలో ఉన్నవారి అరుపులు, కేకలతో అపార్ట్మెంట్ వాసులతోపాటు పక్కనున్న ఇళ్లవారు గందరగోళానికి గురయ్యారు. కాలనీకి వచ్చే రోడ్డు బ్లాక్ అవడం, మొత్తం వీవీఐపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు, ఉన్నతాధికారులు, వ్యాపారస్తుల హడావుడి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇదేమిటని ఆరా తీసి.. పార్టీ చాటున పేకాట హంగామా సాగుతోందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా వీఐపీలే.. స్థానికులు ఫిర్యాదు చేయడంతో బేగంపేట పోలీసులు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి బసేరా అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అసలేం జరుగుతోందని తేల్చేందుకు ఒకరిద్దరు మామూలుగా పైకి వెళ్లి చూశారు. అక్కడ ఓ మంత్రితోపాటు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. మంత్రిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించి.. వెంటనే దాడి చేసినట్టు సమాచారం. అయితే పట్టుబడ్డ వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతోపాటు పాలవ్యాపార నిర్వహణలో పేరు గడించిన ఓ ప్రముఖ వ్యక్తి, నిజామాబాద్‌కు చెందిన ఓ నేత, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు మంత్రి ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీలను వదిలేశారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో 30 మందికిపైగా పట్టుబడినా కేవలం ఐదుగురిని చూపడం ఏమిటని మండిపడుతున్నారు. దాడికి ముందే ఉన్నతాధికారులు! అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు సదరు పార్టీకి వెళ్లిన ముగ్గురు సీనియర్ అధికారులు.. పోలీసుల దాడికి కొద్దినిమిషాల ముందే హడావుడిగా వెళ్లిపోవడం మరో రకమైన చర్చకు తావిస్తోంది. అందులో ఓ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో ఇద్దరు సెక్రటరీ హోదా అధికారులు, ముగ్గురు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆరితేరిన వాడే.. బసేరా అపార్ట్‌మెంట్‌పై పేకాట పార్టీ నిర్వాహకుడు, వ్యాపారవేత్తగా పేరు పొందిన అరవింద్ అగర్వాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయి. క్యాసినో, పోకర్, మూడు ముక్కలాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తిగా పేరుంది. ఈయన కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులేనని, అన్ని రాజకీయ పార్టీల కీలక నాయకులతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీస్ వర్గాలే చెప్తున్నాయి. పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత తనదే అంటూ భరోసా కల్పించడం అతడి నైజమని పేర్కొంటున్నాయి. వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంకలకు తీసుకెళ్లి కోట్ల రూపాయలు క్యాసినోలు ఆడిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాంటిదేమీ లేదు: బేగంపేట పోలీసులు పేకాట వ్యవహారంపై బేగంపేట పోలీసులను వివరణ కోరగా.. తమకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశామని, పార్టీకి వచ్చిన 85 మందిలో అందరూ వెళ్లిపోయారని తెలిపారు. దాడి సమయంలో అక్కడున్న ఐదుగురు ఓ టేబుల్‌పై పోకర్ గేమ్ ఆడుతున్నారని, టేబుల్‌పై ఉన్న రూ.10 వేలను స్వాధీనం చేసుకొని.. వారిని తనిఖీ చేయగా రూ.12.56 లక్షలు దొరికాయని వెల్లడించారు. 53 ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేతప్ప తమకు పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులు గానీ, ఇతర ప్రముఖులు గానీ ఎవరూ లేరని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అరవింద్ అగర్వాల్‌తోపాటు డబీర్‌పురాకు చెందిన జాఫర్ యూసఫ్, బేగంపేటకు చెందిన సిద్ధార్థ్ అగర్వాల్, మలక్‌పేటకు చెందిన భగేరియా సూర్యకాంత్, కరీమాబాద్‌కు చెందిన అబ్దుల్ అలీ జిలానీ ఉన్నట్టు తెలిపారు. -
కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్లు
సాక్షి, హైదరాబాద్: ‘బాప్ బాప్ హీ హోతా బేటా.. నామ్‌తో సునాహీ హోగా న.. సోనూ మోడల్ బోల్తే’ అంటూ బాలీవుడ్ డైలాగ్‌ను కత్తులు పట్టుకున్న ఫొటోపై రాసిన సయ్యద్ ఖలీల్ అనే యువకుడు తన వాట్సాప్‌కు స్టేటస్‌గా పెట్టాడు. ఇలాంటి వాటిని చూపించి స్థానికంగా బెదిరింపుల దందాకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టా'స్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకోగా.. భారీ కత్తుల గోదాం వ్యవహారం బయటపడింది. ఈ విషయాన్ని ఆదివారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని బ్యాంక్ కాలనీకి చెందిన సయ్యద్ ఖలీల్ ప్లంబర్. ఇతను కొన్నాళ్లుగా వివిధ రకాల కత్తులతో దిగిన ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టేవాడు. వీటిని చూపించి స్థానికంగా బెదిరింపులకు పాల్పడేవాడు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్‌కు సమాచారం అందింది. అతడి కదలికలపై నిఘా ఉంచిన నేపథ్యంలో శనివారం రాత్రి కత్తులతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడని గుర్తించారు. జియాగూడకు చెందిన లాండ్రీ వర్కర్ అంకిత్ లాల్‌తో కలిసి ఉండగా పట్టుకున్నారు. చదవండి: తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్ తనిఖీలు చేయగా.. వీరి వద్ద భారీ కత్తులు బయటపడ్డాయి. దీంతో ఇరువురినీ తమ కార్యాలయానికి తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారణ చేశారు. వీటిని అంకిత్‌కు సిద్ది అంబర్‌బజార్‌కు చెందిన రతన్ రాజ్ కుమార్ రూ.1400కు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. వాటి ఫొటోలను తమ స్టేటస్‌లుగా పెడుతున్న ఖలీల్, అంకిత్‌లు రూ.2500 నుంచి రూ.3500కు విక్రయిస్తున్నారు. ప్రధానంగా పెళ్లి బారాత్‌లు, ఉత్సవాల సమయంలో విన్యాసాలు చేయడానికి యువత వీటిని ఖరీదు చేస్తున్నారు. ఆయుధ చట్టం ప్రకారం ఇలాంటి వాటిని అనుమతి లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం నేరం. రతన్ రాజ్ సిద్ధి అంబర్‌బజార్‌లో మహావీర్ గిఫ్ట్ అండ్ నావెల్టీస్ సంస్థ నిర్వహిస్తున్నాడంటూ ఈ ద్వయం బయటపెట్టింది. దీంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆ సంస్థపై దాడి చేసి రతన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించానని అతడు చెప్పాడు. పెళ్లిళ్లు, పండగల సీజన్ కావడంతో భారీ కత్తులకు డిమాండ్ ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్‌లో రప్పించానని బయటపెట్టాడు. తన గోదాములో దాచి విక్రయాలు చేస్తున్నానన్నాడు. చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం! దీంతో గోదాంపై దాడి చేసిన పోలీసులు భారీ స్థాయిలో పెద్ద, చిన్న కత్తులను స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 87 పెద్ద కత్తులు, ఎనిమిది చిన్న కత్తులు సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ముగ్గురు నిందితులను కత్తులతో సహా సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి వ్యవహారాలు ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
యూట్యూబ్‌లో చూసి.. వాహనాలు చోరీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ స్టేషన్ల నుంచి సమీప ప్రాంతాలకు ప్రయాణించడానికి ఉద్దేశించిన వోగో కంపెనీ యాక్టివా వాహనాలను చోరీ చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ సభ్యులు యూట్యూబ్‌లో చూసి జీపీఎస్ పరికరాల తొలగింపు నేర్చుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం కొత్వాల్ అంజనీకుమార్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ కేసు వివరాలను వెల్లడించారు. పాతబస్తీలోని భవానీనగర్, యాకత్పురా ప్రాంతాలకు చెందిన మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ యాసీన్, మీర్ హంజా ఇంటర్మీడియట్ విద్యార్థులు. వోగో వాహనాలను యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని, ఇంజిన్ ఆన్ అయితేనే దాని జీపీఎస్ పరికరం పని చేస్తుందని రిజ్వాన్ గుర్తించాడు. ఇదే విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి వాహనాలన్నీ యాక్టివా 5జీలే కావడంతో చోరీ చేద్దామని చెప్పాడు. ముగ్గురూ కలిసి రంగంలోకి దిగారు. చిక్కడపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అబిడ్స్ ఠాణాల పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ప్లేసుల్లో ఉండే వోగో వాహనాలను అపహరించేవారు. ఇలా నాలుగు నెలల్లో 38 వాహనాలను తస్కరించారు. వాటిపై ఉన్న వోగో స్టిక్కర్లు తొలగించి, హ్యాండిల్ లాక్ బిగించి నకిలీ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసేవారు. వీటిని వినియోగించి ఆ వాహనాలను సయ్యద్ అహ్మద్ మెహేదీ, ఎజాజ్, నోయన్, వజీద్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకీయుద్దీన్, వి.నరేందర్, కె.చంద్రశేఖర్‌లు వల పన్ని నిందితులను పట్టుకున్నారు. మెహేదీ, ఎజాజ్, నోమన్ మినహా నలుగురిని అరెస్టు చేసింది. 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
జూబ్లీహిల్స్: పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్బులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తబులా రస, ఏయిర్ లైవ్, కెమెస్ట్రీ, అమ్నీసియా పబ్‌లపై దాడులు చేసి వాటిపై కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్‌ను తేవడం, కోవిడ్ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేయడం, మాస్కులు లేకుండా పబ్బుకు అనుమంతిచడం చేస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్బు యజమానులు.. కాసుల కోసం కక్కుర్తి పడి కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు -
బంజారాహిల్స్‌లో రూ .3.75 కోట్లు పట్టివేత!
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా రూ.3,75,30,000 డబ్బును తరలిస్తున్న ఓ ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు తన టీంతో రెండు గంటల్లోనే హైదరాబాద్ దాటకుండా వారిని పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో నలుగురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతో కలసి అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. గుజరాత్‌లోని కంబోయి గ్రామానికి చెందిన సోలంకి ఈశ్వర్ దిలీప్‌జీ, ధర్మోడా గ్రామానికి చెందిన హరీష్‌రామ్‌భాయ్ పటేల్, పలియాడ్ గ్రామానికి చెందిన అజిత్ సింగ్ ఆర్.దోడియా, సిమార్ గ్రామానికి చెందిన రాథోడ్ కనక్‌సింగ్ నతుబాలు.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లోని ఆనంద్ బం జారాకాలనీలో ‘పి.విజయ్ అండ్ కంపెనీ’లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈశ్వర్, హరీష్‌రామ్‌లు కారు డ్రైవర్లుగా పనిచేస్తుండగా.. అజిత్‌సింగ్, రాథోడ్ కనక్ సింగ్‌లు ఆఫీస్ బాయ్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెద్ద పని నిమిత్తం రూ.3,75,30,000 నగదు తరలించేందుకు సిద్ధమయ్యారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఆనంద్‌బంజారా కాలనీ నుంచి ముంబైకి పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారంటూ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ పి.రాధాకిషన్‌రావుకు మంగళవారం ఉదయం ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో ఆయన తన సిబ్బం దిని అలర్ట్ చేశారు. ఆనంద్‌బంజారా కాలనీ నుంచి నలుగురు నిందితులు ప్రయాణిస్తున్న స్కార్పియో, హ్యుందాయ్ అసెంట్ కార్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుసరించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 లోని స్కోడా కారు షోరూం వద్ద ఆ రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాటిలో రూ.3,75,30,000 నగదు దొరికింది. నిందితులను అదుపులోకి తీసు కుని ఆ డబ్బును, కార్లను స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. నిందితులను, నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పజెప్పినట్లు సీపీ అంజనీకుమార్ వివరించారు. -
కరోనా మందులతో దందా.. ముఠా అరెస్టు
గోల్కొండ/హైదరాబాద్: కోవిడ్–19 చికిత్స కోసం వాడే రేమ్‌డిసివీర్, సిఫ్రినీ ఇంజెక్షన్లను అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న ఓ ముఠాను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... నానల్‌నగర్‌లోని ఆలివ్ ఆసుపత్రిలోని ఓపీ ఫార్మసీలో అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫార్మసీలో రేమ్‌డిసివీర్ (కోవిఫర్) ఇంజెక్షన్ కోసం జనం అడుగుతుండటంతో వాటిని ఎలాగైనా తెచ్చి అధిక ధరకు అమ్మాలని పథకం వేశాడు. ఆలివ్ హాస్పిటల్లోనే స్టాఫ్ నర్సుగా పని చేసే ఈ.రాజును కలవగా.. అతను రేమ్‌డిసివీర్‌ను రూ. 19,000 లకు అమ్ముతానని చెప్పాడు. ఎల్బీ నగర్‌లోని మెడిసిస్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేసే ఎల్.సునీల్ సైతం రెమ్‌డిసివీర్‌ను రూ. 6500 సరఫరా చేస్తున్నాడని తెలిపాడు. అదే విధంగా ఎం.రవి కూడా తాను రూ. 10,000 రెమ్‌డిసీవీర్ ఇంజెక్షన్ అజీజ్‌కు సరఫరా చేస్తానన్నాడు. కాగా ఈ విధంగా అజీజ్ 11 రెమ్‌డిసివీర్ ఇంజెక్షన్లతో పాటు ఒక సిఫ్రినీ ఇంజెక్షన్‌ను ఎం.రాజు, ఎం.రవిల వద్ద కొన్నాడు. కాగా వీటిని అజీజ్ మహ్మద్ మాజిద్ అలీకి ఒక్కో ఇంజెక్షన్ రూ.20,000లకు అమ్మాడు. మాజిద్ అలీ వీటిని మరో నిందితుడు మహ్మద్ అఫాక్ అలీకి అధిక ధరలకు అమ్మాలని ఇచ్చాడు. కాగా ఈ ఇంజెక్షన్లను ఆసిఫ్‌నగర్‌లోని సమీర్ ఆస్పత్రిలోని ఫార్మసీలో పని చేసే మహ్మద్ ఒబెద్‌కు రూ. 28,000 లకు అమ్మాడు. ఒబెద్ సమీర్ ఆస్పత్రి యాజమాన్యంతో కుమ్మక్కై వాటిని అధిక ధరలకు అమ్మకానికి పెట్టాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇన్స్పెక్టర్ వి. గట్టు మల్లు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆసిఫ్‌నగర్‌కు వచ్చారు. ఏడుగురు నిందితులు ఒబెద్, మహ్మద్ అఫాక్ అలీ, మహ్మద్ ఆజిద్ అలీ, అబ్దుల్ అజీజ్, రాజు, సునీల్, రవిలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
బ్లాక్‌లో ఆక్సిజన్ సిలిండర్లు.. టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తూ దోచుకుంటున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముషీరాబాద్‌లోని ఇందిరానగర్ లోని బాబా ట్రేడర్స్ పై దాడులు జరిపారు. లైసెన్స్‌లు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లు అమ్మకాలు చేస్తున్న షేక్ అక్బర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, 38 ఆక్సిజన్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. కరోనా సోకిన వ్యక్తులు, క్వారంటైన్లో ఉన్నవారికి కొన్ని ముఠాలు అక్రమంగా అధిక ధరలకు ఆక్సిజన్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వెస్ట్‌జోన్‌లో 43 సిలెండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!) -
లాక్డౌన్ రూల్స్ బ్రేక్.. పబ్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ సీక్రెట్ అఫైర్స్ పబ్‌పై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వాహకులు మద్యం విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌పై దాడి చేసి రూ. 15 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో ఢిల్లీ తరహా అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన తరహాలో నగరంలోనూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. సిటీలో మత ఘర్షణలు రేపేందుకు వీరు ఓ ప్రార్థన స్థలంపై 3 కిరోసిన్ బాంబులు విసిరారు. అంతకుముందే రెండు ఏటీఎంలకు నిప్పుపెట్టగా, ఆర్టీసీ బస్సు దగ్ధానికి యత్నించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలతో ప్రేరణ పొందిన వీరిద్దరూ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. ప్రసంగాలతో స్ఫూర్తిపొంది.. రియాసత్‌నగర్‌కు చెందిన అర్షద్, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వసీ స్నేహితులు. ఒకరు చిరువ్యాపారి కాగా, మరొకరు విద్యార్థి. వీరిద్దరు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్లో ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలు చూసేవారు. వాటి ద్వారా స్ఫూర్తి పొంది..తాము ఏదో ఒక సంచలనం సృష్టించాలని ఆలోచించేవారు. ఈ క్రమంలోనే ఓసారి మిథాని డిపోలో ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడానికి, ఫిబ్రవరి 11న చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని రెండు ఏటీఎంలకు నిప్పు పెట్టడానికి యత్నించారు. ఇటీవల సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో జరిగిన ఘర్షణల వంటివి హైదరాబాద్‌లోనూ సృష్టించాలని కుట్రపన్నారు. రెండు వర్గాల మధ్య మత ఘర్షణ సృష్టిస్తేనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారం నుంచి వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. మాదన్నపేటలోని ఓ ప్రార్థన స్థలాన్ని టార్గెట్‌గా చేసుకుని, గత నెల 14 రాత్రి అక్కడకు వెళ్లి మూడు కిరోసిన్ బాంబులు విసిరారు. అవి పేలకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, అనుమానితుల వాహనం నంబర్ గుర్తించారు. దీని ఆధారంగా ప్రత్యేక టీమ్ సోమవారం రాత్రి అర్షద్, వసీని పట్టుకుంది. వీరి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాలకు అర్షద్.. వసీని ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు. -
కరీంనగర్ దాటాలంటే దడ...
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా మారింది. వరుసగా అక్రమాలపై దాడులు చేసి కారకులను కటకటాలకు పంపుతూ శభాష్ అనిపించుకుంటోంది. టాస్క్‌ఫోర్స్ దాడులతో గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారాలు, నిషేధిత గుట్కా రవాణా, విక్రయాలను వెలికితీస్తూ అక్రమార్కులపై కొరడా ఝలిపిస్తోంది. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి సారథ్యంలో సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందుతోంది. నిందితులపై నిరంతర నిఘా... కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి 2017, జూలై 01న ప్రారంభించారు. ఇందులో ఇద్దరు సీఐలు , ఒక ఎస్సై, ఒక ఏఆర్ఎస్సై, పది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో జరిగే అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలపాలపై ఈ టీం ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రజలతో కలిసిపోతూ సమాచారం సేకరిస్తోంది. యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్సుల్లోనే అక్రమ వ్యాపారాలు, కల్తీ, వ్యభిచారం, పేకాట స్థావరాలు, గుట్కా, గంజాయి రవాణా, ప్రజాపంపిణీ బియ్యం అక్రమరవాణాపై దృష్టి పెట్టి ఆధారాలతో సీపీకి సమాచారమందించి దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం టీంలో సీఐలు ఆర్.ప్రకాశ్, కె.శశిధర్‌రెడ్డి, ఎస్సై వంశీకృష్ణ ఉన్నారు. ఎక్కువ శాతం నిషేధిత గంజాయి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగానే వెళ్తోంది. సీపీ కమలాసన్‌రెడ్డి సూచనల మేరకూ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ వివిధ సాంకేతిక పరిజ్ఞానం, పట్టిష్టమైన ప్రజాసంబంధాలు ఉండడంతో ముందుగానే అక్రమ రవాణా గురించి తెలుసుకొని చాకచక్యంగా దాడులు చేసి అక్రమార్కులను అరెస్టులు చేస్తున్నారు. వరుసగా దాడులు చేస్తూ పట్టుకోవడంతో అక్రమార్కులు కరీంనగర్ నుంచి తమ వాహనాలు వెళ్లాలంటేనే భయపడేలా టాస్క్‌ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. కొన్ని కేసుల్లో అత్య«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకాలపాలనూ ఎప్పుటికప్పుడు కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా చోరీలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, దొంగలను కటకటాలపాలు చేస్తున్నారు. మెరుపుదాడులు.... టాస్క్‌ఫోర్స్ టీం కమిషనరేట్ పరిధిలో వివిధ అక్రమాలపై మెరుపుదాడులు నిర్వహించి అక్రమార్కులను కటకటాలాపాలు చేస్తోంది. సెల్‌టవర్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్‌కు చెందిన లైన్మెన్ను నమ్మించి అంతరరాష్ట్ర ముఠా రూ.17 లక్షలు వసూలు చేసింది. ఈ మోసాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. కరీంనగర్ మీదుగా తరలుతున్న గంజాయిని పట్టుకుని ఐదు కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి రూ.కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పేకాటా ఆడుతున్న 40 కేసుల్లో 231 మందిని ఆరెస్టు చేసి సుమారు రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కాపై 44 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్టు చేసి రూ.4.5 కోట్ల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని సరఫరా చేస్తుండగా 29 కేసుల్లో 33 మందిని ఆరెస్టు చేసి రూ.19 లక్షల విలువ చేసే 1,500 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. మట్కా కేసులో 12 మందిని అరెస్టు చేసి రూ.75 వేలు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన 2 కేసుల్లో ఏడు గురిని అరెస్టు చేసి రూ.85 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన 13 కేసుల్లో 16 మందిని అరెస్టు చేశారు. ఈ విధంగా అక్రమాలు చేస్తున్న వారిని కటకటాలపాలు చేస్తున్నారు. నిరంతర నిఘా.. కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పనితీరులో బాగుంది.. కల్తీ దందా చేసేవారు, గంజాయి, నిషేధిత గుట్కా రవాణా చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుంది. దాడుల్లో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారమందిస్తే వెంటనే దాడులు చేసి పట్టుకుంటాం. –వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'
సాక్షి, నెల్లూరు(క్రైమ్): గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసులు గ్యాంగ్‌సభ్యులను అరెస్ట్ చేసినా మూలాల్లోకి వెళ్లకపోవడంతో అతని వ్యవహారం బయటకు పొక్కలేదు. అదేక్రమంలో కొందరు పోలీసుల అండదండలు సైతం పుష్కలంగా ఉండటంతో మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్నచందాన వ్యాపారం సాగింది. అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనమ మేరకు బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన అంజిబాబు ఉపాధి నిమిత్తం కొన్నేళ్లకిందట కటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఓ గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా చేరారు. తనకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని ఏపీలోని పలు జిల్లాలకు విస్తరింపజేశాడు. వ్యాపారంలో చురుకుగా ఉన్న వారితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను వారికి సరఫరా చేసేవాడు. వారు వాటిని రిటైల్ వ్యాపారులకు విక్రయించేవారు. చెన్నైలో పోలీసుల దాడులు అధికమవడంతో పాటు వివిధ కారణాతో ఆయన తన మకాంను బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకు మార్చాడు. అక్కడ ఉంటూ ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏడాదికి రూ.20కోట్ల మేర గుట్కాలను గ్యాంగ్‌కు సరఫరాచేసి వారి ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తూ అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగారు. కొంతకాలంగా గంజాయిని సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ గుట్కా విక్రయాలను, అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని సిబ్బంది డాన్‌తో పాటు అతని గ్యాంగ్ కదలికలపై దృష్టిసారించారు. శనివారం నేలటూరులో అంజిబాబుతో పాటు, గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులను అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రూ.1.32కోట్లు విలువచేసే గుట్కాలు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వారిని రహస్యప్రాంతానికి తరలించి తమదైన శైలిలో విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమ వ్యాపారానికి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని నిందితులు ఆరోపించినట్లు తెలిసింది. అందుకు గాను సదరు పోలీసులకు నెలవారీ నజరానాలు ముట్టచెబుతున్నామని పేర్కొనట్లు తెలిసింది. ఈ విషయం ఎస్పీ భాస్కర్‌భూషణ్ దృష్టికి వెళ్లడంతో లోతైన దర్యాప్తు చేయాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆదిశగా టాస్క్ఫోర్సు పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పేర్లను సైతం ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. పరారీలో మరికొందరు గ్యాంగ్‌లో మరో 18మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. డాన్‌ను టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న గ్యాంగ్‌లోని సభ్యులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. పరారీలో ఉన్న వ్యక్తుల్లో కొందరు గతంలో పోలీసులకు చిక్కిజైలుపాలై ఉన్నారు. వ్యాపారుల్లో వణుకు... పోలీసుల దాడుల నేపథ్యంలో జిల్లాలో గుట్కా, ఖైనీ విక్రయ వ్యాపారుల వెన్నులో వణుకు మొదలైంది. మొత్తంమీద ఆరేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గుట్కాడాన్, అతని గ్యాంగ్‌లోని సభ్యులను అరెస్ట్ చేయడంతో కొంతకాలం ఈ అక్రమవిక్రయాలు, రవాణాకు అడ్డుకట్టపడనుంది. గ్యాంగ్‌లోని మిగిలిన సభ్యులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. -
బెజవాడలో భారీగా పట్టుబడ్డ బంగారం
సాక్షి, విజయవాడ : నగరంలో సాగుతున్న అక్రమ బంగారు వ్యాపారం గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో రూ. 3.18 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. పట్టుబడ్డ వారిని ముంబైకి చెందిన జయేష్ జైన్, విజయవాడ ఇస్లాంపేటకు చెందిన పోగుల శ్రీనివాస్‌గా గుర్తించారు. నిందితులు సొంత లాభం కోసం బిల్లులు లేకుండా ముంబై నుంచి బంగారాన్ని తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే వారు ఇప్పటి వరకు ఎంత బంగారం ఈ రకంగా తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముంబైలో మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
గుట్కా లారీని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, విజయవాడ : నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను రవాణా చేస్తున్న లారీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం గన్నవరం వద్ద పట్టుకున్నారు. లారీలోని ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ. 18 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉయ్యూరుకు చెందిన కాంతారావు, భూక్యా చంద్రశేఖర్, పూణేకు చెందిన హజీ అత్తర్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, వీటిని బరంపురం, ఇచ్చాపురం నుంచి విజయవాడకు తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. -
రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న రాగామాకుల కుంట వద్ద మంగళవారం ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఆధికారులు అతన్ని అరెస్టు చేసి సుమారు రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రంలోని జమునామత్తూరుకు చెందిన స్వామినాథన్‌గా గుర్తించారు. కాగా ఎర్రచందనం కూలీలు తనిఖీ చేసే టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో అధికారులు రాళ్లదాడిని ప్రతిఘటించి కుంబింగ్ కొనసాగిస్తున్నారని సమాచారం. -
బెజవాడలో మళ్లీ నకిలీ కరెన్సీ కలకలం
సాక్షి, విజయవాడ : బెజవాడలో మరోసారి నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. చిరు వ్యాపారులనే టార్గెట్‌గా చేసుకొని నకిలీ కరెన్సీ ముఠా దొంగనోట్లను ప్రజల్లోకి చలామణి చేస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ముఠాలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని మూడు లక్షల రూపాయల విలువ చేసే దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. దొంగనోట్ల ముఠా కృష్ణా జిల్లా మచిలీపట్నం చిన్నాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠాలోని మరో ఇద్దరిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.13 లక్షల ఇరవై ఎనిమిది వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వంద, ఐదు వందల, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉన్నారు. అయితే అసలు ముఠా సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల వ్యవహారంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని.. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. దొంగనోట్ల చలామణీని పూర్తిస్థాయిలో అరికడతామని.. నకిలీ నోట్ల ముఠా కోసం నగరంలో ప్రత్యేక టీంలు తిరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. -
గుట్కా ఫ్రమ్ గుజరాత్!
గుజరాత్లో ఏర్పాటు చేసిన యూనిట్స్‌లో వేర్వేరు ఉత్పత్తులుగా గుట్కా తయారు చేసి.. రైళ్లలో హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి ప్రధాన సూత్రధారి అవల అభిషేక్ సహా నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.4 కోట్ల విలువైన నిషే ధిత ఉత్పత్తులు స్వాధీనం చేసు కున్న ట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించా రు. సమావేశంలో డీసీపీ పి.రాధాకిషన్ రావు పాల్గొన్నారు. –సాక్షి, హైదరాబాద్ ఇక్కడ చిక్కడంతో.. సైదాబాద్‌కు చెందిన అవల అభిషేక్.. 2008 నుంచి బేగంబజార్ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్‌మసాలా వ్యాపారం చేస్తూ మాణిక్‌చంద్ సంస్థకు ప్రధాన ఏజెంట్‌గా ఉన్నాడు. 2015లో సెవెన్‌హిల్స్ మార్కెట్ ప్రాంతంలో సొంతంగా సంస్థ ఏర్పాటు చేశాడు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్‌చంద్’పేరుతో పాన్ మసాలా, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించాడు. మాణిక్‌చంద్ పేరును వినియోగించడంపై పోలీసులు లోతుగా ఆరాతీశారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో గతేడాది బీబీనగర్ పోలీసులు యూనిట్‌పై దాడి జరిపి కేసు నమోదు చేసి అభిషేక్, అతడి తండ్రి ఏవీ సురేశ్ తదితరులను అరెస్టు చేశారు. దీంతో అభిషేక్ తన దందాను గుజరాత్‌కు మార్చాడు. అక్కడ ఉన్న తన ఏజెంట్ శైలేష్ జైన్ ద్వారా అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో యూనిట్లు ఏర్పాటు చేశాడు. రైల్వేస్టేషన్ నుంచే సరఫరా పోలీసుల కన్నుకప్పేందుకు గుజరాత్లో ‘7 ఎంసీ టొబాకో’పేరుతో ఒకటి, ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’పేరిట మరొకటి తయారు చేస్తున్నాడు. ఈ రెండింటినీ వేర్వేరుగా ప్యాక్ చేసి అహ్మదాబాద్ నుంచి రైల్వేలో వివిధ రకాల పేర్లతో సికింద్రాబాద్‌కు పంపిస్తున్నాడు. ఇలా వచ్చిన ఉత్పత్తులను హైదరాబాద్‌లో నిల్వ చేసేందుకు గోడౌన్ నిర్వహించట్లేదు. రైల్వేస్టేషన్లో ఉండే ఏజెంట్లు షబ్బీర్ మొయినుద్దీన్, సయ్యద్ జబ్బార్ అహ్మద్‌లు ఈ ఉత్పత్తులను తీసుకుని అభిషేక్ ఆదేశాల ప్రకారం నేరుగా డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు సయ్యద్ మహ్మద్‌కు చెందిన వాహనం వాడుతున్నారు. షబ్బీర్, జబ్బార్‌లు ఉత్తరప్రదేశ్, ఢిల్లీల నుంచి వచ్చే పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటూ గోషామహల్‌కు చెందిన తబ్రేజ్, బేగంబజార్ వాసి మనీష్‌లకు సరఫరా చేసి అమ్మిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా సాగుతున్న ఈ దందాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్ రావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, పి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వల పన్నారు. గోపాలపురం ప్రాంతంలో రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషిద్ధ ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో అభిషేక్, షబ్బీర్, జబీర్, మొహ్మద్‌లను అరెస్టు చేశారు. ఫ్రాంచైజీల పేరుతో మోసం కాగా, నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే అనేక మందిని అభిషేక్ మోసం చేశాడు. ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’ఉత్పత్తులకు సంబంధిం చిన ఫ్రాంచైజీలు, డిస్ట్రి బ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజె న్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అనేక మంది అభిషేక్‌ను సంప్రదిం చారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. వారితో అక్కడ దుకా ణాలు ఏర్పాటు చేయించి ముందు కొంత సరుకు సరఫరా చేసి తర్వాత అదీ వెనక్కు తీసుకున్నాడు. నగదు ఇచ్చేయాలని అడిగిన వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ముషీరాబాద్, ఏపీలోని విశాఖ పట్నంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. -
సిటీ బస్సులో కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భద్రతా విధులు నిర్వర్తించే ఓ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయాడు. సిటీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే కాకుండా లోపలకు జరగాలంటూ కోరిన సహచర ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అనాలోచితంగా తన సర్వీస్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. విచక్షణ కోల్పోయి... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ నాయుడు (59) ఆ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో (ఏపీ ఐఎస్‌డబ్ల్యూ) విధులు నిర్విర్తిస్తున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖులకు, రాజకీయ/కీలక కార్యాలయాలకు ఈ విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఏడాదిగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలసి కూకట్‌పల్లిలో ఉంటున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్... తన జీతం డబ్బు డ్రా చేసుకోవడానికి 10.30 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి విధులకు వెళ్లేందుకు పంజాగుట్ట హిమాలయ బుక్‌హౌస్ వద్ద ఉన్న బస్టాప్‌లో కంటోన్మెంట్ డిపోకు చెందిన 47సీ (సికింద్రాబాద్ నుంచి మణికొండ) రూట్ నంబర్ బస్సు ఎక్కారు. అయితే ఆయన బస్సు ఫుట్‌బోర్డుపైనే నిలబడి ఉండటంతో మరో స్టాప్ వద్ద ఓ చానల్ కెమెరామెన్ బస్సు ఎక్కుతూ శ్రీనివాస్‌ను లోపలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో శ్రీనివాస్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి తన నడుముకు ఉన్న .9 ఎంఎం సర్వీస్ పిస్టల్ తీసి పైకి గురిపెట్టి బెదిరింపు ధోరణిలో ట్రిగ్గర్ నొక్కారు. అప్పటికే ఆ ఆయుధం కాగ్ (తూటా పేలేందుకు సిద్ధమై ఉండటం) అయి ఉండటంతో ట్రిగ్గర్ నొక్కగానే పెద్ద శబ్దం చేస్తూ టాప్‌లో నుంచి దూసుకుపోయింది. అయితే బస్సు టైరు పేలిందేమోనని డ్రైవర్ బస్సును పక్కకు ఆపగా శ్రీనివాస్ వెంటనే బస్సు దిగి పంజాగుట్ట చౌరస్తా వైపు పరిగెత్తారు. బస్సులో వచ్చిన శబ్దంపై సహచర ప్రయాణికుల్ని ఆరా తీయగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారని, బస్సు టాప్‌లోంచి తూటా దూసుకుపోయిందని వారు చూపించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తులు వేసుకొని పోలీస్‌లా ఉన్నారని తెలిపారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మణికొండ వరకు వెళ్లి ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చి తిరిగి డిపోకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. బస్సు పైకప్పులోకి దూసుకెళ్లిన బుల్లెట్, బస్సు దిగి పరిగెడుతున్న శ్రీనివాస్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు... ఈ ఘటనపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కండక్టర్, డ్రైవర్‌తోపాటు సదరు చానల్ కెమెరామెన్‌ను కూడా విచారించారు. కాల్పులు జరిపింది పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానించారు. హిందూ శ్మసాన వాటిక వద్ద బస్సు దిగిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చినట్లు తేలడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో రికార్డు అయిన అనుమానితుడి ఫీడ్ నుంచి ఫొటోలు సంగ్రహించారు. వాటి ఆధారంగా అతడిని ఏపీ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ నుంచి సర్వీస్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోగా ఇలా కేసులో చిక్కుకోవడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఆరా తీసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ జనాల మధ్య శ్రీనివాస్ కాల్పులు జరపడం చట్టారీత్యా తీవ్ర నేరంగా అభివర్ణించారు. నిందితుడిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
బిగుస్తున్న ఉచ్చు
గుట్కా మాఫియా నుంచి మామూళ్లు దండుకున్న పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు ఉచ్చుబిగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ విచారణలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు మామూళ్లు దండుకున్న వ్యవహారంలో పక్కా ఆధారాలు వెలుగుచూశాయి. నెలవారీగా ఏ అధికారికి ఎంత మొత్తంలో మామూళ్లు ముట్టజెప్పిందీ లిఖితపూర్వకంగా గుట్కామాఫియా ఆధారాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో మామూళ్లు దండుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: అవినీతి పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. గుట్కా మాఫియా నుంచి నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటున్న పోలీసు అధికారుల గుట్టు రట్టయింది. అటు గుట్కామాఫియా కీలక సభ్యులు, ఇటు అధికారులకు డబ్బులు వసూలు చేసిపెట్టిన సిబ్బంది ఎవరికి వారు అక్రమ వసూళ్ల వ్యవహారంపై లిఖిత పూర్వకంగా టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఆధారాలు అందజేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా జరగడంలో ఇద్దరు డీఎస్పీలతోపాటు, పలువురు సీఐలు, ఎస్ఐల పాత్రపై స్పష్టమైన ఆధారాలు దొరకడంతో ఉన్నతాధికారులు సైతం వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా అధికారులకు డబ్బులు వసూలు చేసిన హెచ్‌సీలు, పీసీలపై సస్పెన్షన్వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల వద్ద డ్రైవర్లుగా, సహాయకులుగాపనిచేస్తున్న కొందరు హోంగార్డులు సైతం పోలీసు అధికారులకు డబ్బులు వసూలు చేసి పెట్టినట్లు స్వయంగా అంగీకరించడంతో వారిని మూడు నెలలపాటు విధులనుంచి తప్పించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి గుట్కా మాఫియాపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించడంతో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గుంటూరు రూరల్ జిల్లాలోని రెండు సబ్ డివిజన్లలో గుట్కా మాఫియా రెండు నెలలుగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న వ్యవహారం బయటపడింది. పోలీసు ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో సందట్లో సడేమియాలా కొందరు అవినీతి అధికారులు గుట్కామాఫియా నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ గుట్కా అక్రమ రవాణా నుంచి అమ్మకాల వరకు యథేచ్ఛగా సాగేలా సహకారం అందిస్తున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారుల పేర్లను సైతం వాడడంతో గుట్కా మాఫియాపై గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు కన్నెర్ర చేశారు. ఈ వ్యవహారంలో డివిజన్‌స్థాయి పోలీసు అధికారుల నుంచి ఎస్ఐల వరకు అందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ ఇలా వదిలేస్తే పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందనే తలంపుతో గాడిలో పెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. ఇందులో భాగంగా జిల్లాలో గుట్కా, మట్కా, సింగిల్ నంబర్ లాటరీలు, క్రికెట్ బెట్టింగ్‌లు, రేషన్, ఇసుక మాఫియాల నుంచి పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు వసూలు చేసి పెడుతున్న పోలీసు సిబ్బందిని గుర్తించి జిల్లా వ్యాప్తంగా 44 మందిని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. రోజూ వారికి కౌన్సిలింగ్ ఇస్తూ పరేడ్ చేయిస్తూ సత్ప్రవర్తన పొందేలా శిక్షణ ఇస్తున్నారు. వారిలో గుట్కా మాఫియా నుంచి అధికారులకు డబ్బులు వసూలు చేసిపెట్టిన సిబ్బందిని గుర్తించి, వారిని విచారించి గుట్కా మాఫియా నుంచి డబ్బులు దండుకున్న పోలీసు అధికారుల జాబితాను తయా రు చేసినట్లు తెలిసింది. గుట్కా మాఫియాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకుని ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారనే దానిపై పూర్తి ఆధారాలు లిఖిత పూర్వకంగా తీసుకున్నట్లు సమాచారం. గుట్కా మాఫియా వ్యవహారంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందో తెలి యక అవినీతి పోలీసు అధికారులు హడలి పోతున్నారు. ఎన్నికల్లో వసూళ్లపైనా ఆరా గుట్కా మాఫియా నుంచే కాకుండా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతల నుంచి పోలీసు అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై సైతం విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు ఎవరి నుంచి ఎంతెంత తీసుకున్నారనే జాబితాను ఎస్పీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే జిల్లాలో దాదాపు 90 శాతం మంది పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతల నుంచి డబ్బులు తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే. మరి అలాంటప్పుడు ఈ వ్యవహారాన్ని కదిలిస్తే అందరిపై వేటు వేయాల్సి ఉంటుందని, అది సాధ్యమా అనేదానిపై పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ఎస్పీ ఏవిధంగా ముందుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.మొత్తానికి జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి భాగోతంపై విచారణ నడుస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. రెండు మూడు రోజుల్లోనే అవినీతి పోలీసు అధికారులపై నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు ఎస్పీ సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. -
బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికె ట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఈవెంట్స్ నౌ సంస్థ బుకింగ్ క్లర్కులు కాగా, మరొకరు కౌంటర్ వద్ద ఏజెంట్ కావడం గమనార్హం. డీసీపీ పి.రాధాకిషన్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుకారాంగేట్‌కు చెందిన రంజిత్ కుమార్ రే, యాప్రాల్ వాసి ఆర్.వరుణ్‌కుమార్ అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లోని ఈవెంట్స్ నౌ సంస్థ కౌంటర్లో బుకింగ్ క్లర్కులుగా పని చేస్తున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన ఎ.రాహుల్ చారి ఇదే స్టేషన్‌లోని కౌంటర్ వద్ద ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో టిక్కెట్టును రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.37,500 నగదు, 16 ఐపీఎల్ టిక్కెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. -
రెండు రోజులు..రూ.4.9 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నగదు అక్రమ రవాణాపై డేగకన్ను వేశారు. ఫలితంగా శని, ఆదివారాల్లోనే టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు రూ.4,92 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తంలో రూ.2.60 కోట్లు పక్కా సమాచారం ఆధారంగా, మరో రూ.2.3 కోట్లు వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం వెల్లడించారు. మొత్తం ఎనిమిది కేసులకుగాను రెండింటిలో పార్లమెంట్ ఎన్నికల లింకులు స్పష్టంగా బహిర్గతమైనట్లు చెప్పారు. వీటితోపాటు మిగిలిన వాటిలోనూ సూత్రధారుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌లతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా భారీ మొత్తం చేతులు మారుతోందని ఉప్పందడంతో పశ్చిమమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌పై దాడి చేసి వ్యాపారవేత్తలు ఎం.సాత్విక్‌రెడ్డి, సౌరవ్ గోయల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రూ.ఇరవై ఆరు లక్షల 19 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ పార్టీలకు అందించడానికే ఈ మొత్తాన్ని సిద్ధం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముసారాంబాగ్ మీదుగా వెళ్తున్న స్విఫ్ట్ కారులో భారీ మొత్తం రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దారికాచి దానిని తనిఖీ చేయగా రూ.34 లక్షల 30 వేల నగదు బయటపడింది. కారులో ఉన్న ఎల్బీనగర్వాసి టి.కాశినాథ్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా భూక్యా తండా వాసి భూక్యా రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేస్తున్న ఓ అభ్యర్థి కోసం రవాణా చేస్తున్నట్లు బయటపెట్టారు. ఆయన సూచనల మేరకు బూత్ లెవల్ కమిటీ మెంబర్లకు పంపిణీ చేయడానికి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్‌లో రూ.కోటి స్వాధీనం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 ప్రాంతంలో నిఘా వేసి అనుమానాస్పదంగా వస్తున్న ఇన్నోవా కారును ఆపి సోదా చేశారు. అందులో రూ.కోటి నగదు బయటపడింది. కారులో ఉన్న ఎస్సార్నగర్వాసి మల్లారెడ్డి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఈ మొత్తానికి సంబంధించి లెక్కలు చూపలేదు. దీంతో వాహనాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అప్పారావుపేట. ఈ మొత్తాన్ని అక్కడకు తరలిస్తున్నాడా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మీదుగా డబ్బు రవాణా జరుగుతోం దనే సమాచారంతో మధ్యమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ మార్గంలో వస్తున్న ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేయగా అందు లో రూ.కోటి లభించాయి. దాని డ్రైవర్ బోడ్డుపల్లి శ్రీనయ్య స్వస్థలం నల్ల గొండలోని పులిచెర్వ. ఇతడు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 564/38లో నివసిస్తున్నాడు. 20 ఏళ్లుగా నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కీలకనేత, మాజీమంత్రి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జయవీర్‌రెడ్డి అనే వ్యక్తి సూచనల మేరకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి నగదు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించాడు. జయవీర్‌రెడ్డి ఓ మాజీమంత్రి కుమారుడు అని తెలుస్తోంది. ఈ నగదు ఎక్కడ నుంచి డ్రా అయింది? అనే విషయాలను ఆరా తీస్తున్నామని తెలిపారు. పంజగుట్ట, ఓయూ, గోల్కొండ, ఎస్సా ర్‌నగర్, జూబ్లీహిల్స్, టప్పాచబుత్ర పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.2.32 కోట్లకుపైగా స్వాధీనమైంది. ఆయా పీఎస్‌లలో కేసులు నమోదు చేసి నగదును ఐటీ శాఖకు అప్పగిస్తున్నారు. -
మార్చి.. ఏమార్చి
సాక్షి, హైదరాబాద్ : అర్హత, అవకాశం లేకున్నా స్టడీ, విజిట్, బిజినెస్, నివాసం కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారి పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేసి వీసా ప్రాసెసింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాన్సులేట్ల వద్ద ఇమ్మిగ్రేషన్ డేటా అందుబాటులో ఉండదనే చిన్న లూప్‌హోల్‌ను క్యాష్ చేసుకున్న ఈ గ్యాంగ్ ఏడాదిలో దాదాపు 450 వీసాలు ప్రాసెసింగ్ చేసి రూ.కోటి వరకు అక్రమార్జన చేసిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠా కెనడా, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ కాన్సులేట్లను మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జైల్లో దొరికిన లింకుతో... హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీముద్దీన్ 2010లో సైదాబాద్‌లోని సన ప్యాలెస్‌లో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం ఇదే నేరంలో లంగర్‌హౌస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇదే నగర నేర పరిశోధన విభాగం అధికారులు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని వేరే కేసులో రిమాండ్‌కు తరలించారు. ఇతని ద్వారా రహీముద్దీన్‌కు చెన్నై రాయపురం ప్రాంతానికి చెందిన, పాస్‌పోర్టుల ట్యాంపర్‌లో నిపుణుడైన మహ్మద్ షేక్ ఇలియాస్ పరిచయమయ్యాడు. రహీముద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి ఇలియాస్‌తో కలసి కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. తమ ముఠాలో గోల్కొండకు చెందిన ఖాలిద్ ఖాన్, టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ ఒమ్రాన్, ఫలక్‌నుమా వాసి మహ్మద్ జహీరుద్దీన్‌ను కలుపుకున్నారు. ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’ఖరీదు... కాలం చెల్లిన పాస్‌పోర్టులతో పాటు ఇతర దేశాల్లో రిజెక్ట్ స్టాంప్ పడిన వాటిని దళారుల నుంచి ఈ గ్యాంగ్ రూ.5 వేలిచ్చి ఖరీదు చేసేది. పైన ఉండే కవర్, ఇతర సెక్యూరిటీ ఫీచర్స్‌ను వాడుకునేవారు. వీసా ప్రాసెసింగ్ కోసం పాస్‌పోర్టుల్ని ట్యాంపర్ చేసే ఈ గ్యాంగ్ అనుబంధ పత్రాలైన బ్యాంకు స్టేట్మెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్స్, ఐటీ రిటర్న్స్, ప్రాపర్టీ వాల్యూషన్ సర్టిఫికెట్లు లాంటి ఫామ్స్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు తయారు చేసేవారు. చెత్తబజార్‌లో సుప్రీం గ్రాఫిక్స్ నిర్వహించే ఒమ్రాన్ కొంత కమీషన్ తీసుకుని ఈ బాధ్యతలు నిర్వహించేవాడు. వీరికి అవసరమైన స్టాంపుల్ని మహ్మద్ జహీరుద్దీన్ తయారు చేసి అందించేవాడు. పాస్‌పోర్ట్‌ల ట్యాంపర్ ఇలా... జమ్మూకశ్మీర్, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాలతో పాటు ఇంకొందరికి అమెరికా, కెనడా తదితర దేశాలతో పాటు యూరప్ దేశాల వీసాలు లభించవు. ఇలాంటి వారు దళారుల ద్వారా రహీముద్దీన్‌ను సంప్రదించేవారు. వారి నుంచి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసి పాస్‌పోర్ట్ ట్యాంపరింగ్‌కు శ్రీకారం చుట్టేవాడు. ఇందులో భాగంగా ఆయా పాస్‌పోర్ట్‌లకు చెందిన వ్యక్తి వివరాలు ఉండే మొదటి, చివరి పేజీలను అట్టతో సహా వేరు చేసేవారు. సదరు వ్యక్తులకు ఆయా దేశాల వీసాలు రావాలంటే అక్కడకు గతంలో వెళ్లి వచ్చినట్లో, శాశ్వత నివాసి అయినట్లో ఆధారాలు చూపాలి. దీని కోసం రహీముద్దీన్ గ్యాంగ్ దళారుల నుంచి ఖరీదు చేసిన ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’కు చెందిన మొదటి, ఆఖరి పేజీలను వాడుతోంది. ఆఖరి పేజీలో మాత్రం సదరు పాస్‌పోర్ట్ లండన్, లేదా అమెరికాలో రీ–ఇష్యూ అయినట్లు పొందుపరుస్తున్నారు. సాధారణంగా ఆ దేశంలో పాస్‌పోర్ట్ పోయినా, ఎక్స్‌పైరైనా అక్కడి భారత రాయబార కార్యాలయాలు ఇలా రీ–ఇష్యూ చేస్తాయి. ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ లోపల కూడా ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’నుంచి తీసిన పేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై ఆయా దేశాల వీసాతో భారత్‌లోకి వచ్చినట్లు బోగస్ ఇమ్మిగ్రేషన్ స్టాంపులు వేస్తున్నారు. ఇలా ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ ఆధారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి వీసా కోసం కాన్సులేట్లకు దరఖాస్తు చేస్తున్నారు. వీటి వద్ద పాస్‌పోర్ట్‌ల డేటా ఉంటున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ డేటా ఉండట్లేదు. దీంతో పాస్‌పోర్ట్ నంబర్ ఆధారంగా చెక్ చేస్తే ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించలేకపోతున్నారు. ఆయా దేశాలకు వెళ్లిరాలేదని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న కాన్సులేట్ అధికారులు వీసా జారీ చేస్తున్నారు. పంపే ముందు పాతవి పెట్టేసి... వీసా పొందిన వారు ఆయా దేశాలకు ప్రయాణించాలంటే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోగస్ ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులున్న పాస్‌పోర్ట్‌తో వెళితే ఇమ్మిగ్రేషన్‌కు చిక్కే అవకాశం ఉంటుంది. దీంతో రహీముద్దీన్ గ్యాంగ్ వీసా వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి చెందిన ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్‌లో ముందు తొలగించినవి పెట్టేస్తూ, అదనంగా జోడించిన స్టాంపులతో కూడిన పేజీలను తీసేస్తున్నారు. ఇలా పాస్‌పోర్ట్ మళ్లీ మొదటి స్థితికే వచ్చేస్తోంది. ఈ పని చేసిన తర్వాత రహీముద్దీన్ ఒక్కొక్కరి నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి ముఠా సభ్యులకు పంచుతున్నాడు. ఈ వీసాలతో ఇతర దేశాలకు వెళ్తున్న వారిలో కొంతమంది దొరికేసి డిపోర్టేషన్‌పై వస్తున్నారు. ఇలా ఏడాదిలో రూ.కోటి సంపాదించిన రహీముద్దీన్ అల్వాల్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్, షహీన్‌నగర్‌లో ఇల్లు, షాద్‌నగర్‌లో ప్లాట్ కొనుగోలు చేశాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వరుస దాడులు చేసి రహీముద్దీన్ సహా ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 150 రబ్బర్ స్టాంపులు, 80 పాస్‌పోర్టులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కరీంనగర్ క్రైం: ఉద్యోగాల పేరుతో పలువురిని నమ్మించి, రూ.7 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడిని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్నారు. ఏసీపీ శోభన్‌కుమార్ సోమవారం కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వెల్ధి రాధాకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేయడం ప్రారంభిం చాడు. 320 మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేశాడు. రామారావు, రవి చంద్రారెడ్డి, బుట్ట జయరాజ్, నాయిని విద్యాసాగర్, ఈశ్వర వేణుగోపాల్లను అనుచరులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కరీంనగర్, వరంగ ల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నల్లగొండ, హైదరాబాద్, కర్నూల్, కృష్ణా, పశ్చి మగోదావరి, అనంతపురం జిల్లాలకు చెంది న పలువురు ఇతడి వలలో చిక్కి మోసపోయారు. సెక్రటేరియట్, రెవెన్యూ, కమర్షియ ల్ ట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి ఆపైన వసూ లు చేశాడు. కొందరికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను కూడా ఇచ్చాడు. గుట్టు వీడింది ఇలా.. కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన పైడిపాల వెంకటయ్య తనకు తెలిసిన వారిని రాధాకృష్ణకు పరిచయం చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో వెంకటయ్య రూ. 26 లక్షలు వసూలు చేసి ఇచ్చా డు. రాధాకృష్ణ ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో వెంకటయ్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందం రాధాకృష్ణను అరెస్టు చేసింది. నాగర్‌కర్నూల్, గోదావరిఖని, నేరేడ్మెట్, అంబర్‌పేట, నల్లగొండ, బహదూర్‌పుర, కరీంనగర్ టుటౌన్, త్రీటౌన్, బేతంచర్ల పోలీస్స్టేషన్లలో రాధాకృష్ణపై పలు కేసులు నమోదయ్యాయి. అతడి నుంచి చెక్‌బుక్స్, విలువైన లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
గుట్కా కేంద్రాలపై దాడులు
వరంగల్ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్ముతున్న కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం...సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌కు చెందిన కొమురవెల్లి వేణుమాధవ్ హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్ గుట్కా సరఫరా దారుని నుంచి గుట్కాలు తీసుకుని అమ్ముతున్నాడు.ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నాం.. సరఫరా దారుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.72వేల విలువ గల గుట్కాలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం నింధితులను సుబేదారి ఎస్సై సత్యనారాయణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రైవేట్ హాస్టల్లో గుట్కాలు స్వాధీనం హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా గుట్కాలు సరఫరా చేస్తున్న వీరమల్ల కార్తీక్‌ను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వీరమల్ల కార్తీక్ హన్మకొండలోని కిషన్‌పురలో మహర్షి ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నగరంలోని పాన్‌షాపులకు గుట్కాలను సరఫరా చేస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కార్తీక్ గత కొంత కాలంగా గుట్కాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నింధితున్ని అదుపులోకి తీసుకుని నిందితుని నుంచి రూ.50వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితున్ని హన్మకొండ ఎస్సై శ్రీనా«ధ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నందిరాంనాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలో వేడిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి డబ్బు చేతులు మారుతోందన్న సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బును సీజ్ చేశారు. శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం రాగా.. పోలీసుల ఆ డబ్బును సీజ్ చేశారు. భవ్య సిమెంట్స్ డైరెక్టర్ శివకుమార్, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
శేషాచలంలో అలజడి
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. రంగంపేట సమీపంలోని భీమవరం ఘాట్ మామిడిమానుగడ్డ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు తారసపడ్డారు. అడవిలోకి వాహనం వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలో తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సిబ్బందిని చుట్టుముట్టిన స్మగ్లర్లు మారణాయుధాలు, రాళ్లతో దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు ఉండొచ్చని సమాచారం. ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ అదనపు బలగాలను రంగంలోకి దించారు. కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
జగిత్యాలలో అక్రమ ఆయుధాల కలకలం
సాక్షి, జగిత్యాల: ఇద్దరు వ్యక్తులు అక్రమ ఆయుధాలతో పట్టుబడటం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ముంబైకి చెందిన రాజుభాయ్, వేములవాడకు చెందిన తిరుపతిలను అదుపులోని తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, 12 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ధర్మపురిలో కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్‌ను కాల్చి చంపిన కేసులో రాజుభాయ్ ప్రధాన నిందితుడు, కాగా తిరుపతి అతనికి ఆయుధం విక్రయించాడు. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు. మీడియా కంటపడకుండా వారిని రిమాండ్‌కు తరలించారు. -
‘విద్వేషం’ కట్టడికి ఫేస్బుక్ టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. రాజకీయ నేతలు, ప్రజల మధ్య సత్సంబంధాలను తాము ప్రోత్సహిస్తామని వెల్లడించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తామని ఫేస్బుక్ గ్లోబల్ పాలసీ సొల్యూషన్స్ ఉపాధ్యక్షుడు రిచర్డ్ అలన్ అన్నారు. తమ కొత్తవిధానంలో మతం, కులం, జాతి, రంగు ఆధారంగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసే విద్వేష ప్రసంగాలు, అప్లోడ్ చేసే హింసాత్మక వీడియోలను తొలగిస్తామని వెల్లడించారు. భారత్ సహా చాలాదేశాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 20,000 మంది సిబ్బందిని నియమించుకుంటామన్నారు. -
నైజీరియన్ల అరెస్ట్..భారీగా గంజాయి స్వాధీనం
గురుగావ్: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.3 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు యావో, ఓక్లీ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం రావడంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం వీరు ఉంటున్న ఇంటిపై దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకుని వీరిని అదుపులోకి తీసుకుంది. పోలీసు రిమాండ్‌కు తరలించిన తర్వాత వీరిద్దరినీ విచారించారు. దక్షిణాఫ్రికా, మెక్సికో, పెరూ దేశాల నుంచి అక్రమంగా హెరాయిన్‌ను తెప్పించి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఇంకా దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు వారి పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లు కూడా సమర్పించడంలో విఫలమయ్యారని పోలీసులు తెలిపారు. -
రూ.10 ఇచ్చి.. రూ.50 లక్షలు తీసుకుని!
సాక్షి, సిటీబ్యూరో: అది గుజరాతీ గల్లీలోని ఓ దుకాణం... అందులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు... బుధవారం ఉదయం అక్కడికో తునికాకు కాంట్రాక్టర్ హడావుడిగా వచ్చాడు... తన జేబులో ఉన్న రూ.10 నోటు ఇచ్చాడు... దీనిని తీసుకున్న ఓ వ్యక్తి సీరియల్ నంబర్ చూసి సంతృప్తి చెందాడు... అతడికి రూ.50 లక్షలతో కూడిన బ్యాగ్ అందించాడు... అదే సమయంలో దాడి చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. దేశీయంగా జరుగుతున్న హుండీ దందా గుట్టును రట్టు చేసి రూ.72.73 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. ఆదాయపుపన్ను ఎగ్గొట్టడానికి, నల్లధనం లావాదేవీలకు, అసాంఘిక కార్యకలాపాలకు ఈ మార్గంలో ఆర్థిక లావాదేవీలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చి దందా... రాజస్థాన్‌కు చెందిన లాల్ చంద్ పాండ్యా బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి ఇసామియాబజార్‌లో స్థిరపడ్డాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఇతగాడు దేశ వ్యాప్తంగా ఉన్న హవాలా (రెండు దేశాల మధ్య అక్రమ ద్రవ్యమార్పిడి), హుండీ (దేశంలో జరిగే అక్రమ ద్రవ్యమార్పిడి) దందాలు చేసే వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తానూ ఇదే వ్యాపారం చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని భావించిన అతను గుజరాతీ గల్లీలో ఓ దుకాణం అద్దెకు తీసుకుని హుండీ వ్యాపారం ప్రారంభించాడు. రాజస్థాన్ నుంచి వలసవచ్చిన బజరంగ్లాల్ ప్రణీక్, దిలీప్ కుమార్‌లను కలెక్షన్ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఉన్న హుండీ, హవాలా ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 వరకు కమీషన్ తీసుకుంటూ దందా కొనసాగిస్తున్నాడు. ఓ మెట్రో నగరంలో ఉన్న ఇతడి అనుబంధ ఏజెంట్‌కు నగదు అప్పగించి ఎక్కడ, ఎవరికి డెలివరీ ఇవ్వాలో చెబుతారు. అక్కడి వారు స దరు వ్యక్తికి రూ.1 నుంచి రూ.10 వరకు ఏదో ఒక డినామినేషన్లో ఉన్న కరెన్సీ ఇస్తారు. దీని సీరియల్ నంబర్‌ను డెలివరీ ఇవ్వాల్సిన ఏజెంట్‌కు చెబుతారు. ఈ నోటు ఎవరు తీసుకువచ్చి ఇస్తే వారికి కమీషన్ పోగా ఆ మొత్తాన్ని అందజేస్తారు. ఢిల్లీ నుంచి వచ్చిన తునికాకు సొమ్ము... వరంగల్‌కు చెందిన కె.తిరుపతిరావు నగరంలోని హబ్సిగూడలో ఉంటూ ఛత్తీస్‌గడ్‌లో తునికాకు కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అతను ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యాపారికి తునికాకు విక్రయించాడు. దానికి సంబంధించి తిరుపతిరావుకు రూ.50 లక్షలు రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని హుండీ రూపంలో పంపాల్సిందిగా ఇతడు సదరు వ్యాపారికి చెప్పాడు. ఆ వ్యాపారి నగదును ఢిల్లీలో ఉన్న ఏజెంట్ శ్యామ్‌లాల్‌కు అందించాడు. అతడు ఇచ్చిన రూ.10 నోటును (సీరియల్ నెం.45జీ080304) తిరుపతి రావుకు ఇచ్చాడు. దీనిని తీసుకుని వచ్చిన ఈయన బుధవారం లాల్‌చంద్‌కు అందజేయడంతో సీరియల్ నంబర్ సరిచూసుకున్న లాల్‌చంద్ రూ.50 లక్షలు ఓ బ్యాగ్‌లో పెట్టి తిరుపతిరావుకు అందజేశాడు. దీనిపై సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసింది. తిరుపతిరావుతో పాటు లాల్‌చంద్, బజ్రంగ్, దిలీప్‌లను అదుపులోకి తీసుకుంది. దుకాణంలో ఉన్న రూ.72.73 లక్షల నగదు, కౌంటింగ్ మిషన్, రూ.10 నోటు స్వాధీనం చేసుకుని కేసును ఆదాయపుపన్ను శాఖకు అప్పగించారు. వీరి లావాదేవీలన్నీ కోడ్‌భాషలో సాగుతున్నాయని, ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత దానికి సంబంధించిన పత్రాలు ధ్వంసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. -
తిరగబడ్డ ఎర్రకూలీలు
చంద్రగిరి : ఎర్రస్మగ్లర్లు తిరగబడడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపిన ఘటన గురువారం తెల్లవారుజామున శేషాచల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆర్ఎస్సై వాసు వివరాల మేరకు... టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు ఆర్ఎస్సై వాసు బుధవారం రాత్రి శేషాచలంలోని నాగపట్ల బీట్‌లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సచ్చినోడుబండ వద్దకు చేరుకున్న అధికారులు స్మగ్లర్ల పాదముద్రలను గుర్తించారు. తమ వద్ద ఉన్న నైట్‌విజన్ గాగుల్స్‌తో స్మగ్లర్ల కదలికలను గుర్తించారు. అనంతరం చాకచక్యంగా వ్యవహరించి నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి, వారు తెలిపిన వివరాల మేరకు వారి వద్ద కొంత మంది సిబ్బందిని కాపలాగా ఉంచి, మరికొంత మంది అధికారులు కూంబింగ్ చేపట్టారు. చెట్లపొదల్లో ఉన్న స్మగ్లర్లు తమ వారిని రక్షించాలనే ఉద్దేశంతో అధికారులపై ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. స్మగ్లర్లను ఎంత హెచ్చరించినా వినకపోవడంతో ఆత్మరక్షణ కోసం అధికారులు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం పారిపోయిన కూలీల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో స్మగ్లర్లు ముళ్లపొదల్లో దాచి ఉంచిన 22 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లను విచారించి తమిళనాడు రాష్ట్రం జావాదిమలైకు చెందినవారుగా గుర్తించారు. ఐజీ కాంతారావు, ఎస్పీ రవిశంకర్, డీఎస్పీ వెంకటరమణ పరిస్థితిని సమీక్షించి, అదనపు బలగాలను పంపి తగు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందిని వారు అభినందించారు. -
డ్రగ్స్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రమాదకర ఆక్సిటోసిన్ లిక్విడ్‌ను అక్రమంగా తయారు చేస్తున్న ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిషేదించిన ఆక్సిటోషన్‌ను మల్లెపల్లికి చెందిన సురేశ్‌కుమార్ బన్సాల్ అనే వ్యక్తి అక్రమంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నగరంలోని డైరీలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్‌ను అమ్ముతుంటారు. ఈ ఇంజెక్షన్‌ను గెదలకు ఇవ్వడం వల్ల పాల శాతం పెరుగుతుందని రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంజెక్షన్ చేసిన గెద పాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో హార్మోన్ ఎఫెక్ట్, మహిళలకు క్యాన్సర్ సోకడంతో పాటు గెదల జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ ముఠా నుంచి 1500 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిల్స్, మనుషులకు వాడే మూడు ఇంజక్షన్స్, మూడు సీలింగ్ మిసైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 90వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సురేష్ కుమార్, షైక్ అబ్దుల్ ఖలీద్‌లపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణారావు ప్రకటించారు. -
ఫ్రీ కూపన్లతో కోట్లు కొల్లకొట్టిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్ : అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ముఠాకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ పేరుతో ఓ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేయడంలో ఈ ముఠా ఓ పధకాన్ని అమలు చేస్తుంది. ముఠా సభ్యులు షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమాలకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని ఫ్రీ గిప్ట్ కూపన్ల పేరుతో గాలం వేస్తారు. ఆపై క్లబ్ మెంబర్షిప్, హాలిడే ప్యాకేజీ, హెల్త్‌కార్డు, వెండి నాణేలు ఇస్తామంటారు. ఆ తరువాత ఓపెన్ ఫ్లాట్లు, వెంచర్లు తక్కువ ధరకే ఇస్తామంటూ అమాయకులకు ఎరవేసి లక్షలు శఠగోపం పెడతారు. ఇలా వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలను అక్రమంగా వసూలు చేశారు. అయితే ఎన్నిరోజులైనా నిర్వాహకులు చెప్పినవి రాకపోవడంతో బాధితులు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ క్లబ్ నడుపుతున్న షేక్ ఖాదర్ బాష, విజయ్ కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8లక్షల నగదు, గిప్ట్ కూపన్లు, వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
ఎర్రోళ్లు దర్జాగా..!
పోలీసుల ఎత్తులకు ఎర్ర చందనం స్మగ్లర్లు పైఎత్తులు వేస్తున్నారు. పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా ఆగటం లేదు. పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టని రూట్లు చూసుకుని పలు మార్గాల్లో ఎర్ర చందనం రవాణా సాగిస్తున్నారు. అది కూడా సరికొత్త ఎత్తుగడతో పోలీసుల దుస్తుల్లో, అత్యాధునిక ఆయుధాలను ధరించి ఎర్రచందనాన్ని జిల్లాతో పాటు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ప్రత్యేకంగా ఉన్న రెండు ముఠాలు ఒక రూట్‌ను నిర్ణయించుకుని ఆ మార్గంలోనే అక్రమ రవాణా చేస్తున్నాయి. వీళ్లు కాకుండా వేరే ముఠా ఎవరైనా అటుగా అక్రమ రవాణా చేసినా దాడులు చేయటం, లేదంటే సరుకును హైజాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టేందుకు సైతం వెనుకాడని రీతిలో అక్రమ రవాణా దందా సాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల 31వతేదీన ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ముఠాను అరెస్ట్ చేయటంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ఇదే తరహాలో జిల్లాలో రెండు ముఠాలు, ఇతర రాష్ట్రాల్లో మరో రెండు ముఠాలు ఉన్నట్లు నిర్ధారించి, ఆదిశగా పోలీసు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వెలుగొండల్లోని ఎర్రచందనానికి డిమాండ్జిల్లా సరిహద్దులోని వెలుగొండ, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం వృక్షాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతంలో మినహా మరెక్కడా ఎర్రచందనం లభించకపోవటంతో అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, వెలుగొండ అటవీ ప్రాంతంలోని రాపూరు, దక్కిలి, కలువాయి, వెంకటగిరి మండలాల సరిహద్దుల్లో ఎర్రచందనం అధికంగా ఉంది. దీంతో స్థానికంగా పదుల సంఖ్యలో స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఎర్ర చందనం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇక్కడికి కూలీలను రప్పించి అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి రహస్య ప్రాంతాల్లో భారీగా డంప్ చేసి స్మగ్లర్లతో లింకులు పెట్టుకుని విక్రయిస్తుంటారు. ఈ వ్యవహారంలో అక్రమ రవాణే కీలకంగా ఉంటుంది. జిల్లా హద్దులు దాటించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తే అక్కడి నుంచి సముద్ర మార్గాన కొన్ని సందర్భాల్లో విమానాల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది. ఈ క్రమంలో జిల్లాలో పోలీసులు కూంబింగ్ ప్రక్రియను సీరియస్‌గా నిర్వహించటంతో తొమ్మిది నెలల్లో 57 కేసులు నమోదు చేశారు. కీలక గ్యాంగులను అరెస్ట్ చేశారు. కొంత మేరకు అక్రమ రవాణాను నిర్మూలించగలిగారు. ఈ క్రమంలో జిల్లాతో పాటు సరిహద్దులోని కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో స్మగ్లర్లు రూట్ మార్చి అనంతపురం, బళ్లారి మీదుగా బెంగళూరు రూట్లో అధికంగా అక్రమ రవాణాకు తెరతీశారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా హోస్పేట్ తాలుకాకు చెందిన కొందరు కరుడుగుట్టిన నేరగాళ్లు ముఠాలుగా ఏర్పడి అనంతపురం సరిహద్దుల్లోని బాగేపల్లి నుంచి కర్ణాటక సరిహద్దు హోస్పేట్ వరకు సుమారు 150కి.మీ.లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ ప్రాంతంలో ఏ వాహనం తిరగాలన్నా, అక్రమ రవాణా చేయాలన్నా వీరికి కప్పం కడితే సరిహద్దులు దాటుతుంది. ఎర్రదుంగలు తరలించే ఈ ముఠాలు టన్నకు రూ.1.50లక్షలు కప్పం చెల్లిస్తే ఎస్కార్ట్‌గా వెళ్లి సరిహద్దులు దాటిస్తారు. అది కూడా పోలీసు యూనిఫాం వేసుకుని ఈ పని చేస్తున్నారు. వారికి డబ్బులు ఇవ్వని వాహనాలను హైజాక్‌చేసి చెన్నై తదితర ప్రాంతాల్లో వాటిని అమ్మి సొమ్ముచేసుకోసాగారు. నెల్లూరులో అరెస్ట్‌తో.. ఎర్రచందనం అక్రమ రవాణా తదితర నేరాలకు పాల్పడే ఆరుగురు సభ్యులున్న ఓ ముఠాను నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల 31వ తేదీన అరెస్ట్ చేయడంతో ఈ అక్రమరవాణా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా ముఠా కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా çహోస్పేట్ తాలుకా శివపురం గ్రామానికి చెందిన శివపురం మునియప్ప వెంకటరాజు వికలాంగుడు. ఆయన తన సోదరుడు శివపురం మునియప్పరవి, రామప్ప మంజునాథ, రామప్ప రాజేంద్ర, శివపురం రవి నవీన్‌లు బంధువులు. వీరందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా సంబేరి గ్రామానికి చెందిన రాజేంద్ర బాలాజీతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా అక్రమరవాణా కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ మూడు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతోన్న స్మగ్లర్ల వివరాలు సేకరించి వారిని సంప్రదించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో ఎర్రదుంగలను అనంతపురం, హోస్పేట్ మీదుగా బెంగళూరు సరిహద్దులు దాటిస్తామని అందుకు గాను టన్నుకు రూ.1.50లక్షలు కప్పం చెల్లించాలని స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకునేవారు. బెంగళూరుకు వెళ్లాలంటే హోస్పేట్ ప్రధాన మార్గం కావడంతో స్మగ్లర్లు ముఠా చెప్పిన కప్పం చెల్లించేవారు. దీంతో ముఠా సభ్యులు పోలీసుల వలే దుస్తులు ధరించి ఆదునాతన ఆయుధాలు(తుపాకులు)ను చేతబూని ఎర్రచందనం సరిహద్దులు దాటిస్తారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వీరిలో అధిపత్య పోరు రావటంతో విషయం బయటకు వచ్చింది. తొమ్మిది నెలల్లో 57 కేసులు గత తొమ్మిది నెలల్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులు 57 కేసులు నమోదు చేసి రూ.20 కోట్ల విలువజేసే 20 టన్నుల ఎర్రచందనం దుంగలను సీజ్‌చేశారు. వీటితో పాటు 69 వాహనాలను, 10 తుపాకులను, 40 అత్యాధునిక ఆయుధాలను సీజ్‌చేసి 929 మందిని అరెస్ట్ చేశారు. గతనెల 31వ తేదీన అరెస్ట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠా వద్ద నుంచి రూ.1.50 కోట్లు విలువజేసే ఎర్రదుంగలు, అధునాతన ఆయుధాలు ఎస్బీఎంఎల్ గన్, ఎయిర్‌గన్, ఎఫ్ఎక్స్రాయల్ ఎయిర్‌గన్, 177 నంబర్ ఎయిర్‌ఫిస్టల్, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 185 మందితో కూంబింగ్ టీములు ఎర్ర చందనం ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రకియ నిరంతరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 14 బృందాల్లో ఉన్న 185 మంది పోలీసు టీములు కూంబింగ్ ప్రకియ కొనసాగిస్తున్నాయి. జిల్లాలో గతంలో కార్యకలాపాలకు పాల్పడిన ముఠాల కదలికలపైనా నిఘా కొనసాగుతోంది. కర్ణాటక తరహా ముఠాలు కొన్ని ఉన్నాయి. వాటిపై కూడా నిఘా పెట్టాం.–పీహెచ్డీ రామకృష్ణ, ఎస్పీ -
వ్యభిచార గృహంపై దాడి.. దంపతులు అరెస్టు
సాక్షి, ఖమ్మం : ఖమ్మంలోని సాయి గణేశ్ నగర్లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఇద్దరు విటులు, ఆటో డ్రైవర్ సహా మొత్తం ఐదుమందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. ఓ ఇంట్లో వ్యభిచారం జరగుతుందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు వ్యభిచార గృహ నిర్వాహకులైన భార్యభర్తలను కూడా అరెస్టు చేశారు. దంపతులతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు
-
జాబు.. ట్రైనింగ్.. భారీ మోసం
నగరంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా తీసుకుని వారికి ఏమాత్రం అనుమానం రాకుండా మోసాలకు తెగబడుతున్నారు. సాధారణంగా మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటారు. కానీ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన గ్యాంగ్ మాత్రం 90 మందిని టార్గెట్ చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పి మెట్రో నగరాలకు తరలించి శిక్షణ సైతం ఇచ్చింది. ఇందుకోసం వారి నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ ముఠాలో ఆరుగురు నిందితులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు బీటెక్ చదివినవారు సైతం ఉన్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. –సాక్షి, సిటీబ్యూరో సాక్షి,సిటీబ్యూరో : సాధారణంగా మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటారు. అయితే సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన గ్యాంగ్ మాత్రం మరో అడుగు ముందుకు వేసింది. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఆయా అభ్యర్థులను మెట్రో నగరాలకు తరలించి శిక్షణ సైతం ఇచ్చింది. ఈ పంథాలో దాదాపు 90 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసిన మోసం చేసిన ముఠాలో ఆరుగురు నిందితులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు బీటెక్ గ్రాడ్యుయేట్లు సైతం ఉన్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఇన్స్టిట్యూట్ కలిపింది ఐదుగురినీ... ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మారం మోహన్ 2016లో అమీర్‌పేట ప్రాంతంలో ఎంవీ ఎం టెక్నాలజీస్ పేరుతో జాబ్ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతడి ద్వారా అదే జిల్లాకు చెం దిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రణయ్ రాహుల్, ఎల్బీనగర్, ఎస్సార్ నగర్‌లకు చెందిన బీటెక్ పట్టభద్రు లు నరేష్ కుమార్, వెంకట నర్సింహ్మ, శ్రవణ్ ఇదే సంస్థ గూటికి చేరారు. కొన్నాళ్ల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైన వీరు తామే ‘ఉద్యోగాలు ఇవ్వాలని’ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి వలసవచ్చి మూసాపేట, బేగంపేట ప్రాంతాల్లో స్థిరపడిన సెక్యూరిటీ సంస్థ ఉద్యోగులు ప్రసన్నకుమార్, మురళి, హబ్సిగూడకు చెందిన అశోక్ రావ్‌లను త మ ముఠాలో చేర్చుకున్నారు. వీరు ఎనిమిది మం దీ కలిసి తొమ్మిది నెలల క్రితం ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, రైల్వేలో టీసీ, రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్స్, నేషనల్ రూరల్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో సిస్టమ్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేశారు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలు సోషల్‌మీడియాతో పాటు ఈ–మెయిల్స్ రూపం లో, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా వీరి ‘ఉద్యోగ ప్రకటన’ ప్రాచుర్యం పొందింది. దీంతో అనేక మంది వీరిని సంప్రదించగా... ఒక్కో పోస్టుకు గరి ష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని ఒప్ప ందం చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి నగదు తీసుకున్న తర్వాత వెంకటేష్ వీరికి ఇంటర్వ్యూ లెటర్స్ ఈ–మెయిల్ చేసేవాడు. ఇందుకుగాను ఆయా విభాగాలను పోలిన మెయిల్ ఐడీలు (అనానమస్ ఐడీస్) సృష్టించాడు. ఐటీ శాఖలో ఉద్యోగాల పేరుతో ఈ లెటర్స్ అందుకున్న వారిని ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్‌తో పాటు వైజాగ్, బెంగళూరు, మైసూరు, కొచ్చిన్, కోల్‌కతా, న్యూ ఢిల్లీల్లోని ఆయకార్ భవన్ వద్దకు రప్పించేవారు. ఎస్బీఐ ఉద్యోగార్థులను గన్‌ఫౌండ్రీలోని మెయిన్ బ్రాంచ్‌కు పిలిపించే వారు. అభ్యర్థులను లాబీలు, రిసెప్షన్ ఏరియాల్లో కలిసే రాహుల్ తాను సదరు విభాగం తరఫున ఇంటర్వ్యూ చేసే అధికారినంటూ పరిచయం చేసుకునే వాడు. అక్కడే ఇంటర్వ్యూ తంతు పూర్తి చేసి పంపేవాడు. ఆపై వీరికి నియామక పత్రాలు సైతం ఈ–మెయిల్ చేసేవాడు. ఉత్తుత్తి శిక్షణ.. బ్యాంకు ఉద్యోగాలకు ‘ఎంపికైన వారికి’ ఈ గ్యాంగ్ శిక్షణ శిబిరాలు సైతం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, బెంగళూరు, మైసూరు, కొచ్చి, కోల్‌కతా, న్యూ ఢిల్లీలోని హాస్టళ్లను అద్దెకు తీసుకునే వీరు వాటినే బోగస్ స్టేట్ బ్యాంక్ లెర్నింగ్ సెంటర్స్‌గా మార్చేశారు. అక్కడే ‘ఎంపికైన ఉద్యోగులకు’ 45 రోజుల పాటు మోహన్, శ్రవణ్ పర్యవేక్షలో శిక్షణ కూడా ఇచ్చేవారు. ఈ తంతు ముగిసిన తర్వాత ఫలానా బ్యాంక్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కు వెళ్లి జాయినింగ్ లెటర్‌పై సంతకం చేయాల్సిందిగా చెప్పే ముఠా సభ్యులు వారికి తమ ముఠాకు చెందిన వారి నెంబర్లే ఇచ్చేవారు. వీరు ఆ సంస్థ వద్దకు వెళ్లేలోగానే గ్యాంగ్ సభ్యులు మురళి, ప్రసన్న తదితరులు అక్కడి లాబీల్లో కాచుకుని కూర్చునేవారు. సదరు అభ్యర్థులు వెళ్లి వీరిని సంప్రదించగా... జాయినింగ్ ఆర్డర్స్ పేరుతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకుని పంపేవారు. అనంతరం బల్క్ ఎస్సెమ్మెస్ రూపంలో ‘అంతర్గత కారణాల నేపథ్యంలో మీ నియామకాన్ని కొన్నాళ్లు హోల్డ్‌లో పెడుతున్నాం’ అంటూ సందేశాలు పంపేవారు. విదేశాల్లో గ్యాంగ్ లీడర్ జల్సాలు... ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆయా అభ్యర్థుల్ని పూర్తిగా దూరంగా ఉంచడం, మళ్లీ మళ్లీ వాయిదాలు వేయడం చేసేవారు. ఇలా దాదాపు 90 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ సొమ్ములో అత్యధిక శాతం తీసుకున్న వెంకటేష్ థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్, మాల్దీవ్స్ తదితర విదేశాలకు వెళ్లి జల్సా చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సిటితో పాటు సైబరాబాద్ కమిషనరేట్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు బి.కాంతరెడ్డి, జి.తిమ్మప్ప దాడులు నిర్వహించి మోహన్, అశోక్ మినహా మిగిలిన ఆరుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదు, 44 గ్రాముల బంగారం, బోగస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. -
‘సిటీ నీరవ్’ చిక్కాడిలా!
సాక్షి, సిటీబ్యూరో: కర్మన్‌ఘాట్‌లో తన కుమార్తె పేరిట ‘ప్రణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి నాలుగు బ్యాంకులను రూ.1.52 కోట్లకు ముంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రంగారెడ్డిని పోలీసులు ఫేస్బుక్ పేజీ ఆధారంగా పట్టుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన రంగారెడ్డి ఆదిభట్ల ప్రాంతంలోని ఓ పుట్టగొడుగుల పరిశ్రమలో పెట్టుబడి పెట్టి రైతుగా మారిపోయాడు. డిఫాల్టర్లందరూ ప్రణిక సంస్థకు చెందిన ఉద్యోగులేనని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నుంచి కంపెనీ రికార్డులు సేకరించారు. తద్వారా కుంభం రంగారెడ్డి దానికి సీఈఓగా తెలిసింది. మరికొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ స్కామ్‌కు అతడే సూత్రధారిగా గుర్తించారు. అతడికి సంబంధించిన చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఫేస్బుక్లో కుంభం రంగారెడ్డి పేరుతో సెర్చ్ చేశారు. అలా లభించిన ఫేజ్‌లో ప్రణిక సంస్థకు సీఈఓగా పేర్కొని ఉండటంతో అతడే తమకు ‘కావాల్సిన వ్యక్తి’గా నిర్ణయించుకున్నారు. కొత్త బైక్ పోస్ట్ ‘పట్టుకుని’ ముందుకు... రంగారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ సైతం వాడటం మానేశాడు. ఈ నేపథ్యంలోనే 2016 జనవరి 17న ఆఖరి అప్డేట్ ఉంది. దీంతో ఆ పేజ్‌లో ఉన్న ఒక్కో పోస్ట్‌ను అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను 2015 ఫిబ్రవరి 15 నాటి పోస్ట్ ఆకర్షించింది. అంతకు ముందు రోజు ఖరీదు చేసినట్లు చూపిస్తూ రంగారెడ్డి ‘మై న్యూ బైక్’ అంటూ ఓ హోండా సీడీఆర్ వాహనం ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో ఆయా తేదీల్లో ఈ వాహనాలు ఖరీదు చేసిన వారి వివరాలు సేకరించిన పోలీసులు సదరు వాహనం నెంబర్ గుర్తించారు. దీని ఆధారంగా ట్రాఫిక్ పోలీసు డేటాబేస్‌ను సెర్చ్ చేసి దానిపై జారీ అయిన ఈ–చలాన్ల ఆధారంగా ఆదిభట్ల ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. వీటిని బట్టి రంగారెడ్డి ఆ ప్రాంతంలోనే ఉండచ్చనే ఉద్దేశంతో గాలింపు చేపట్టారు. ఆ వాహనం ప్రస్తుతం మరో వ్యక్తి ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాదాపు వారం రోజుల పాటు అతడిని ఫాలో అయ్యారు. ‘360 డిగ్రీస్’తో చిక్కిన ఆధారం మరోపక్క సిటీ పోలీసు విభాగం ఖరీదు చేసిన ‘360 డిగ్రీస్ వ్యూ’ అనే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి పేరును ఉంచి సెర్చ్ చేస్తే... అతడి పేరుతో ఉన్న వాహనాలు, ఇతర అంశాలు తెలుస్తారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి పేరుతో మరో కారు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఓపక్క ద్విచక్ర వాహనం, మరోపక్క కారు నెంబర్ల ఆధారంగా ఆదిభట్ల ప్రాంతంలో గాలించిన టాస్క్‌ఫోర్స్ బృందాలు గురువారం తెల్లవారుజామున రంగారెడ్డిని గుర్తించి పట్టుకున్నాయి. ఇతడిచ్చిన సమాచారంతో మిగిలిన తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. రంగారెడ్డితో పాటు మరో నిందితుడైన విజయ్ బోగస్ వివరాలతో తీసుకున్న క్రెడిట్ కార్డుల్ని పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేసి, నగదుగా మార్చుకున్నారు. ఇలా నగదు ఇచ్చినందుకు మిషన్ నిర్వాహకులకు 3 శాతం కమీషన్ ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో వారికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. -
సిటీ నీరవ్.. రంగారెడ్డి
లేని కంపెనీలను ఉన్నట్లు నమ్మించాడు. పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నట్లు నమ్మబలికాడు. వీరి పేరిట బ్యాంకుల్లో సాలరీ ఎకౌంట్లను ఓపెన్ చేసి...క్రెడిట్ కార్డులు సైతం పొంది దాదాపు కోటిన్నర రూపాయలకు టెండర్ వేశాడు నగరానికి చెందిన కంభం రంగారెడ్డి.ఉత్తరాదికి చెందిన నీరవ్ మోదీ మాదిరిగానే ‘షెల్ కంపెనీ’లతో బ్యాంకులను మోసగించాడు. రెండేళ్లుగా కనిపించకుండా తిరుగుతుండగా..ఎట్టకేలకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగారెడ్డి ఆటకట్టించారు. ఇతనికి సహకరించిన 9 మందిని సైతం అరెస్టు చేశారు. సాక్షి,సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన నీరవ్ మోదీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఒకే బ్యాంకు నుంచి రూ.వేల కోట్లు రుణాలు తీసుకుని పరారయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన కుంభం రంగారెడ్డి దాదాపు అదే బాటలో పయనించాడు. షెల్ కంపెనీ ఏర్పా టు చేయడంతో పాటు అందులో పదుల సంఖ్యలో బోగస్ ఉద్యోగులను క్రియేట్ చేసి వారి పేర్లతో నాలుగు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్స్ తెరిచాడు. వీటి ఆధారంగా క్రెడిట్ కార్డ్స్ పొంది రూ.1.52 కోట్ల మేర వాడేసుకున్నాడు. దాదాపు రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డితో పాటు ఇతడికి సహకరించిన 9 మంది నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో రెండు బ్యాంకులు, జీహెచ్ఎంసీకి చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు సిటీ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురు వారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్.చైతన్యకుమార్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. రెండు కార్డులు ఇచ్చిన అనుభంతో... నల్లగొండ జిల్లా తెలుగుపల్లికి చెందిన కుంభం రంగారెడ్డి డిగ్రీ చదువుతూ మధ్యలోనే మానేశాడు. 1998 నుంచి హయత్‌నగర్ మండలంలోని తుర్కయాంజల్‌లో స్థిరపడిన ఇతను కంప్యూటర్ హార్డ్‌వేర్ ట్రైనింగ్ తీసుకుని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఇందులో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. అదే సందర్భంలో తనతో పాటు భార్య పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డికి బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ డివిజన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న గోపతోటి కిషోర్‌బాబుతో పరిచయమైంది. అతడి ద్వారా క్రెడిట్ కార్డులు పొందే విధానం, జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నాడు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించిన రంగారెడ్డి తన బావమరిది తిప్పర్తి విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి రంగంలోకి దిగాడు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని ‘ప్రణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. డేటా ప్రాసెసింగ్ చేస్తుందంటూ కేవలం నాలుగు కంప్యూటర్లు ఏర్పాటు చేసి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజస్టర్ చేయించుకున్నాడు. ఈ తతంగం మొత్తం 2013 ఏప్రిల్‌లో జరిగింది. టీ స్టాల్, బార్బర్ షాపు నిర్వాహకులే.. తనకు పరిచయస్తులైన అనేక మంది నుంచి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించిన రంగారెడ్డి వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఉండే కొందరు బార్బర్ షాపు యజమానులు, టీ స్టాల్ నిర్వాహకుల ఫొటోలు సైతం సేకరించి వీరు బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు పూర్తి చేసినట్లు నకిలీ వివరాలు సృష్టిస్తూ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లుగా, హెచ్ఆర్ నిర్వాహకులుగా మార్చాడు. ఈ వ్యవహారాల్లో ఫొటోలు ఎవరివి తీసుకున్నా.. పేరు, చిరుమానాలు మాత్రం బోగస్‌వి వాడుతూ సిమ్‌కార్డులు తీసుకోవడంతో పాటు వీరందరినీ ఉద్యోగులుగా మార్చేశాడు. వీరి వివరాలతో ఓటర్ ఐడీ, పాన్‌కార్డు దరఖాస్తులను హయత్‌నగర్‌కు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు మేక సంతోష్‌రెడ్డి ద్వారా అప్లోడ్ చేయించాడు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లో ఎలక్షన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వరికుప్పల శ్రీకాంత్, మేకల నరేష్ ద్వారా ఈ దరఖాస్తులను అప్రూవ్ చేయించి ఓటర్ ఐడీ కార్డులు తీసుకున్నాడు. వీటి ఆధారంగా పాన్‌కార్డులు సైతం పొందాడు. మొత్తం 41 మంది తన సంస్థలో పని చేస్తున్నట్లు క్రియేట్ చేసిన రంగారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వారి పేర్లతో ఓ ప్రైవేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ తెరిచాడు. ఒక్కో కార్డుకు సంబంధించిన సంతోష్‌కు రూ.2 వేలు, శ్రీకాంత్‌కు రూ.1500, నరేష్‌కు రూ.1000 చొప్పున చెల్లించారు. మూడు నెలలు జీతాల కథ నడిపి... ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్ ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను రంగారెడ్డి, విజయ్‌కుమార్ తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకున్నారు. ఇలా రూపొందించిన స్టేట్మెంట్స్, బోగస్ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని ఎస్బీఐ. హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్, ఆర్డీఎల్ బ్యాంకులకు క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ డివిజన్లో, వెరిఫికేషన్ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గోపతోటి కిషోర్‌బాబు, జి.శైలేష్‌కుమార్, ఎస్బీఐకి చెందిన ఆర్.సందీప్ కుమార్, యు.ఆనంద్‌రావు సహాయంతో కార్డులు మంజూరయ్యేలా చేశాడు. ఒక్కో కార్డుకు కొంత కమీషన్‌గా చెల్లిస్తూ వివరాలు సరిచూడకుండా, కార్డులు నేరుగా తమ చేతికే అందేలా రంగారెడ్డి, విజయ్‌లు సఫలీకృతులయ్యారు. తమ సంస్థ పేరుతో సంతోష్‌నగర్‌లోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్ సైతం పొందారు. దీంతో పాటు కొన్ని పెట్రోల్ బంకులు, సంస్థల్లో ఈ కార్డుల్ని స్వైప్ చేస్తూ వచ్చారు. ఇలా మొత్తం 41 మంది పేర్లతో 4 బ్యాంకుల నుంచి 125 క్రెడిట్‌కార్డులు తీసుకుని ‘వాడేశాడు’. మూడు శాతం కమీషన్ ఇస్తూ... రంగారెడ్డి, విజయ్ తాము తీసుకువచ్చిన క్రెడిట్‌కార్డుల్ని పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేసి, నగదు ఇవ్వడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను వారికి 3 శాతం కమీషన్ ఇస్తూ వీరు 97 శాతం నగదు తీసుకునేవారు. ఇలా మొత్తం నాలుగు బ్యాంకుల నుంచి రూ.1,52,10,725 కాజేసి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని మాకాం మార్చేశారు. ఈ స్కామ్ మొత్తం 2015 వరకు జరిగింది. డిఫాల్టర్ల కోసం కొన్నాళ్ళు ప్రయత్నించిన బ్యాంకు ప్రతినిధులు బోగస్ వివరాలని తెలియడంతో మిన్నకుండిపోయారు. ఓ బ్యాంకు ద్వారా సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్ రెడ్డి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేశారు. గురువారం రంగారెడ్డితో పాటు విజయ్, సంతోష్, శ్రీకాంత్, నరేష్, కిషోర్, శైలేష్, సందీప్, పరమేష్కుమార్ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.6.9 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సంపాదించిన సొమ్మును రంగారెడ్డి కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసిందని, దానిని రికవరీ చేయడానికి చట్టపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
సినిమా థియేటర్లపై దాడులు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని సినిమా థియేటర్లలో తినుబండారాలను అధికధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పలు థియేటర్లపై టాస్క్‌ఫోర్స్, తూనికల కొలతల అధికారులు దాడులు చేశారు. వేంకటేశ్వర, మమత, సాయికృష్ణ థియేరట్ల లో కూల్‌డ్రింక్ రూ.20 ఉండగా రూ. 25 నుంచి 30కి, తినుబండ రాలు రూ. 5 నుంచి రూ.10 అదనంగా విక్రయిస్తున్నారని గుర్తించారు. క్యాంటీన్ నిర్వహకుల పై కేసు నమో దు చేశారు. మొదటి తప్పుగా ఒక్కోక్యాంటీన్‌కు రూ. 5 వేల జరిమానా విధించారు. పునరావృతమైతే సీజ్ థియేటర్లలో అధిక ధరలకు విక్రయాలు చేయడమే కాకుండా కొన్ని చోట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు అందాయని, మొదటిసారి జరిమానా విధించామని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఇది పునరావృ తం అయితే క్యాంటీన్లు సీజ్ చేసి, చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాసరావు, మాధవి, కిరణ్, ఎస్సై రమేశ్, తూనికల కొలతల అధికారి విజయకుమార్ ఉన్నారు. -
ప్రేమజంటను కాపాడిన పోలీసులు
కరీంనగర్‌క్రైం: నగరశివారులోని మానేరుడ్యాం పరిసర ప్రాంతాల్లో ఓ ప్రేమజంటను దాడినుంచి కాపాడారు. షీటీం, టాస్క్‌ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్‌తో ఓ యువకుడిని రక్షించారు. గురువారం ఓ వర్గానికి చెందిన యువతి, మరోవర్గానికి చెందిన యువకుడితో నగ రశివారులోని డీర్‌పార్క్‌కు వచ్చింది. కాగా యువతి వర్గానికి చెందిన కొం దరు అతడిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న షీటీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి యువకుడిని కాడాపారు. దాడికి యత్నించిన వారిని వన్‌టౌన్‌లో అప్పగించారు. కొద్దిమాసాలుగా కరీంనగర్లో ఓ వర్గానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. తమవర్గానికి చెందిన యువతులతో మా ట్లాడుతున్న యువకులపై దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన పో లీసు ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించారు. వీరు నగరశివారులోని మానేరుడ్యాం, పార్క్‌ల వద్ద నిఘా పెట్టినట్లు తెలిసింది. -
నకిలీ వాక్సిన్ తయారీ ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్ : నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. చిన్నపిల్లలకు ఇచ్చే టెటానస్ వ్యాక్సిన్‌ని ఈ ముఠా రీసైకిల్ చేస్తున్నట్లు బయటపడింది. కాలం చెల్లిన వ్యాక్సిన్‌ని తీసుకొచ్చి కొత్తవ్యాక్సిన్‌గా లేబుల్స్ అంటించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. కొత్తడేట్తో తయారు చేస్తూ నకిలీ వ్యాక్సిన్ ప్రభుత్వానికే విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అంబర్ పేటలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న కర్మాగారంలో అధికారులు సోదాలు నిర్వహించారు. లక్షల సంఖ్యలో నకిలీ వ్యాక్సిన్ బాటిల్స్‌ను సీజ్ చేశారు. యజమానితోపాటు పలువురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారిమెట్టు వద్ద కలకలం
-
ఛీటింగ్ కేసులో జనసేన నేత అరెస్టు ?
సాక్షి, హైదరాబాద్: ఐ ఫోన్ 7 అమ్ముతానని ఓఎల్ఎక్స్ డమ్మీ ఫోన్ అమ్మిన రౌడీ షీటర్ ను నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన కళ్యాణ్ సుంకర అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాన్నే మార్గంగా ఎంచుకున్నాడు. ఓఎల్ఎక్స్ వైబ్‌సైట్ ఐ ఫోన్ 7ను అమ్మడానికి ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి చాలామంది అతన్ని సంప్రదించారు. ఇది చూసిన ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. తిరా చూస్తే అది డమ్మీ ఫోన్ అని అతనికి తెలిసింది. విషయం తెలుసుకుని డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. నన్ను ప్రశ్నిస్తావా అని కోపంతో ఆ రౌడీ షీటర్ తన ఎయిర్ గన్‌తో బెదిరించాడు. దీంతో బాధితుడు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ రౌడీ షీటర్ నుంచి ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో జనసేన పార్టీ తరపున కళ్యాణ్ సుంకర పలు టీవీ ఛానెల్స్‌లో చర్చావేదికల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనను పటిష్టం చేసుకోవాలని ఓ పక్క అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తోంటే ఆ పార్టీకి నేతగా ఉన్న కళ్యాణ్ సుంకర అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. -
వైజాగ్ టు హైదరాబాద్
- జోరుగా గంజాయి అక్రమ రవాణా - టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన మరో ముఠా - ఇరువురి అరెస్ట్.. 20 కిలోలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ పోలీసుల వలలో గంజాయి ముఠా చిక్కింది. గడిచిన 40 రోజుల్లో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ తరహాకు చెందిన మూడు ముఠాలను పట్టుకున్నారు. తాజాగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆదివారం మరో ఇద్దరిని అరెస్టు చేసి, 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుందని డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బెనబోపాలపల్లికి చెందిన జలారి గోవింద వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి పండించేవారి నుంచి దాన్ని ఖరీదు చేసి తన ఇంటిలోనే నిల్వ ఉంచుతాడు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న గంజాయి విక్రేతలకు దీన్ని సరఫరా చేస్తుంటాడు. కిలో రూ.3 వేలకు ఖరీదు చేసి రూ.ఐదు నుంచి రూ.ఏడు వేలకు విక్రయిస్తుంటాడు. హైదరాబాద్‌లోని కార్వాన్ ప్రాంతానికి చెందిన సంజు సింగ్, కరీంనగర్‌కు చెందిన వై.శ్రీనివాస్ ఇతడి నుంచి గంజాయిని తరచూ ఖరీదు చేసేవారు. సంజు, శ్రీనివాస్‌లకు గంజాయి అందించేందుకు గోవింద్ తన బంధువు పి.దుర్గాప్రసాద్‌తో కలసి సిటీకి చేరుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వం లో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇరువురిని అరెస్టు చేశారు. 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంజుసింగ్, శ్రీనివాస్ కోసం గాలిస్తున్నా రు. సేకరణ, రవాణా సైతం తేలిక కావడంతో అనేకమంది గంజాయివైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు.