కరీంనగర్‌క్రైం: నగరశివారులోని మానేరుడ్యాం పరిసర ప్రాంతాల్లో ఓ ప్రేమజంటను దాడినుంచి కాపాడారు. షీటీం, టాస్క్‌ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్‌తో ఓ యువకుడిని రక్షించారు. గురువారం ఓ వర్గానికి చెందిన యువతి, మరోవర్గానికి చెందిన యువకుడితో నగ రశివారులోని డీర్‌పార్క్‌కు వచ్చింది. కాగా యువతి వర్గానికి చెందిన కొం దరు అతడిపై దాడికి యత్నించారు.
సమాచారం అందుకున్న షీటీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి యువకుడిని కాడాపారు. దాడికి యత్నించిన వారిని వన్‌టౌన్‌లో అప్పగించారు. కొద్దిమాసాలుగా కరీంనగర్‌లో ఓ వర్గానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. తమవర్గానికి చెందిన యువతులతో మా ట్లాడుతున్న యువకులపై దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన పో లీసు ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించారు. వీరు నగరశివారులోని మానేరుడ్యాం, పార్క్‌ల వద్ద నిఘా పెట్టినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment