Manair Dam
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ
-
ఈత సరదాకు ఆరుగురు బలి
సిరిసిల్ల: ఈత సరదా ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. దిగిన వారిని దిగినట్లే మానేరు వాగు మింగేసింది. ఈ హృదయ విదారక సంఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే... సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఎనిమిది మంది పిల్లలు స్థానిక కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో 6వ, 8వ, 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం అనంతరం మధ్యాహ్నం నుంచి బడికి సెలవు ఇచ్చారు. దీంతో కొలిపాక గణేశ్, కొంగ రాకేశ్, శ్రీరాము క్రాంతికుమార్, తీగల అజయ్, జడల వెంకటసాయి, కోట అరవింద్, దిడ్డి అఖిల్, వాసాల కల్యాణ్‌లు ఇంటర్ ఫస్టియర్ చదివే సింగం మనోజ్‌తో కలసి రాజీవ్‌నగర్ శివారులో క్రికెట్ ఆడారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నెహ్రూనగర్ మానేరు తీరంలోని చెక్‌డ్యామ్ వద్దకు ఈత కొట్టేందుకు సైకిళ్లపై వెళ్లారు. చెక్‌డ్యామ్ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉన్న విషయాన్ని గమనించకుండానే లోపలికి దిగారు. వారిలో ఎవరికీ ఈత రాదు. కొలిపాక గణేశ్ (14), కొంగ రాకేశ్ (12), శ్రీరాము క్రాంతికుమార్ (14), తీగల అజయ్ (14), జడల వెంకటసాయి (15), సింగం మనోజ్ (16) ఇలా.. దిగినవారు దిగినట్టే నీటిలో మునిగిపోతూ కాపాడాలని కేకలు వేశారు. భయపడిన మిగిలిన విద్యార్థులు కోట అరవింద్ (14), దిడ్డి అఖిల్ (13), వాసాల కల్యాణ్ (15)లు ఇళ్లకు పరుగుపరుగున వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో అందరూ కలిసి మానేరుకు చేరుకుని గాలింపు చేపట్టి సోమవారం సాయంత్రానికి కొలిపాక గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ సభ్యులు మంగళవారం ఉదయం వాగులో గాలింపు ముమ్మరం చేయగా వెంకటసాయి, రాకేశ్, క్రాంతికుమార్, అజయ్ శవాలు బయటపడ్డాయి. మనోజ్ మృతదేహం కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఘటనాస్థలిని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సందర్శించారు. మంగళవారం సాయంత్రం నాలుగు మృతదేహాలను ఒకే ప్రాంతంలో ఖననం చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో మానేరు తీరం దద్దరిల్లింది. బడికి సెలవు ఇవ్వకపోయినా పిల్లలు బడిలోనే ఉండేవారని బాధితుల బంధువులు వాపోయారు. కాగా, మృతిచెందిన ఆరుగురిలో గణేశ్, వెంకటసాయి, మనోజ్, క్రాంతికుమార్ కిందటి నెల జరిగిన వెంకన్న జాతరలో కల్యాణ్, అరవింద్‌లతో సెల్ఫీ దిగారు. ఆప్తమిత్రులతో అదే చివరి ఫొటో అయిందంటూ మిగిలిన మిత్రులు వాపోతున్నారు. కేటీఆర్ సంతాపం.. విద్యార్థులు జలసమాధి కావడంపై మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రభుత్వపరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రాజెక్టు వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఘటనపై సంతాపం తెలిపారు. ఈ పాపం ఎవరిది? సిరిసిల్ల నెహ్రూనగర్ వద్ద ప్రభుత్వం ఈ ఏడాదే రూ. 12 కోట్లతో మానేరు వాగులో 600 మీటర్ల మేర చెక్‌డ్యామ్ నిర్మించింది. అయితే నాణ్యతా లోపం, కాంట్రాక్టర్ల ధనదాహానికి తోడు ఇటీవలి వర్షాలు, వరదలకు చెక్‌డ్యామ్ తెగిపోయింది. ఆ ప్రదేశం మీదుగానే వరద ప్రవహిస్తోంది. దీంతో వాగుకు కుడివైపు నుంచే ఎక్కువ వరద వెళ్లడం.. అక్కడి నుంచే కొందరు అక్రమార్కులు ఇసుకను తోడేయడంతో భారీ గోతులు ఏర్పడి పిల్లలు నీటి లోతును గుర్తించక అందులో ఈతకు వెళ్లి బలయ్యారు. -
ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు
సిరిసిల్ల: సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లారు.. ఒకరి వెంట ఒకరు ఐదుగురు అందులో దూకారు.. లోతు ఎక్కువగా ఉండటంలో దూకిన విద్యార్థులంతా గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి శివారులోని మానేరు వాగులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఈ విద్యార్థులంతా జిల్లా కేంద్రంలోని కుసుమ రాజయ్య జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటకు ఇంటికి వెళ్లిన పిల్లల్లో 8 మంది భోజనం చేసి మానేరు వాగు వద్దకు ఈతకు వెళ్లారు. ముందుగా రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వాగులో గాలించగా.. గణేశ్ మృతదేహం లభ్యమైంది. వెంకటసాయి, అజయ్, రాకేశ్, శ్రీరామ్ క్రాంతిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈత కోసం వెళ్లిన ఐదుగురు స్నేహితులు నీటిలో గల్లంతవడం సిరిసిల్ల పట్టణంలో విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి వరకు నలుగురి పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చిమ్మచీకటి.. ఇంకోవైపు మత్తడి దూకుతున్న వరద.. ఇలాంటి పరిస్థితిలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్‌ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను దేశానికే ఆదర్శంగా, అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ జలసౌధలో టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డీపీఆర్ ఫైనలైజేషన్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. మొత్తం 15 కిలోమీటర్లు ప్రతిపాదించిన మానేరు రివర్ ఫ్రంట్‌లో తొలి విడతగా 4 కి.మీ మేర నిర్మాణాలు చేపట్టనున్నారు. సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించిన అనంతరం, ఈ ప్రతిపాదనలపై ఐ అండ్ క్యాడ్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు మిగతా డిజైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. రోజువారీ పనుల్లో వేగం పెంచేందుకు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్, టూరిజం అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయి డిజైన్లు రూపొందించాలని, టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలుపెట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్‌రెడ్డి, టీఎస్‌టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్ హరీశ్ గోయల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మానేరు నదికి పర్యాటక శోభ : మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్ : చెక్ డ్యామ్ ల నిర్మాణంతో మానేరు నదికి పర్యాటక శోభ లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మానేర్ నది 365 రోజులు జలకళతో పర్యాటకులను ఆకర్షించనున్నదని చెప్పారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ దిగువన మానేరు నది పై 87.90 లక్షలతో నిర్మిస్తున్న 5 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి తీగలవంతెన వద్ద మంత్రి గంగుల కమలాకర్ శంఖుస్థాపన చేశారు. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలకు తాగు.. సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వృధాగా గోదావరిలో కలిసే నీటిని అరికట్ట వచ్చని తెలిపారు. అలాగే ఏడాది పొడవున మానేరు నదిలో 10 కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుందని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ఈ ఐదు చెక్ డ్యాంలతో పాటు ఇరుకుల్ల వాగు పై మరో మూడు చెక్ డ్యాంలు కరీంనగర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని చెప్పారు. వాగులో నీళ్లు నిలపడం వల్ల కేబుల్ బ్రిడ్జి చుట్టూ పర్యాటక ప్రాంతంగా మారడంతో పాటు శివారు కాలనీల్లో, చుట్టూ పక్కల గ్రామాలకు భూగర్బ జలాలు పుష్కలంగా పెరుగుతాయని తెలిపారు. సాగు ,తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిఅయితే రేటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రోపోజల్ పంపిస్తామని తెలిపారు. చెక్ డ్యాం ల నిర్మాణం తో మానెరు రివర్ ఫ్రంట్ కు తొలి అడుగు పడిందని రానున్న రోజుల్లో మానేరు నది పర్యాటక రంగంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు. -
మానేరు బ్రిడ్జ్‌పై నుంచి కారు బొల్తా
-
ప్రేమజంటను కాపాడిన పోలీసులు
కరీంనగర్‌క్రైం: నగరశివారులోని మానేరుడ్యాం పరిసర ప్రాంతాల్లో ఓ ప్రేమజంటను దాడినుంచి కాపాడారు. షీటీం, టాస్క్‌ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్‌తో ఓ యువకుడిని రక్షించారు. గురువారం ఓ వర్గానికి చెందిన యువతి, మరోవర్గానికి చెందిన యువకుడితో నగ రశివారులోని డీర్‌పార్క్‌కు వచ్చింది. కాగా యువతి వర్గానికి చెందిన కొం దరు అతడిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న షీటీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి యువకుడిని కాడాపారు. దాడికి యత్నించిన వారిని వన్‌టౌన్‌లో అప్పగించారు. కొద్దిమాసాలుగా కరీంనగర్లో ఓ వర్గానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. తమవర్గానికి చెందిన యువతులతో మా ట్లాడుతున్న యువకులపై దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన పో లీసు ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించారు. వీరు నగరశివారులోని మానేరుడ్యాం, పార్క్‌ల వద్ద నిఘా పెట్టినట్లు తెలిసింది. -
సబర్మతి తరహాలో మానేర్ డ్యాం
-
సబర్మతి తరహాలో మానేర్ డ్యాం
టాటా గ్రూప్ ప్రతినిధులతో కేసీఆర్ - హైదరాబాద్‌కు మించిన ఆకర్షణలు.. ‘కరీంనగర్ అభివృద్ధి’పై సమీక్ష సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం రివర్ ఫ్రంట్‌ను అత్యద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘హైదరాబాద్‌లోని పర్యాటక స్థలాల్లో సైతం లేని ఆకర్షణలు కల్పించండి. కరీంనగర్ సమీప ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులంతా రివర్ ఫ్రంట్‌ను తప్పనిసరిగా సందర్శించేలా ప్రత్యేకతలు ఉట్టిపడాలి. ఆ మేరకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. హైదరాబాద్‌వాసులకు కూడా కరీంనగర్ వెళ్లి రివర్ ఫ్రంట్ చూసొద్దామనే ఆసక్తి కలగాలి’’ అని అభిప్రాయపడ్డారు. మానేర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై కరీంనగర్ జిల్లా నేతలతో పాటు టాటా బృందంతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతి భవన్లో చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు భేటీలో పాల్గొన్నా రు. టాటా గ్రూప్ ప్రతినిధులు షనేశ్, సూర్యప్రకాశ్ తమ ప్రజంటేషన్ను సీఎంకు చూపించారు. ‘‘మానేర్ డ్యాంను పర్యాటక కేంద్రంగా, కరీంనగర్ నగరాన్ని టూరిస్ట్ హబ్‌గా రూపొందించడం మా ప్రాజెక్టు లక్ష్యం. కరీంనగర్లో మరిన్ని సాంస్కృతిక, ఆహ్లాదకర కార్యక్రమాలు రూపొందించాం. తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను ప్రతిబిం బించేలా డిజైన్ చేశాం’’ అని వారు వివరించారు. దేశంలోనే తొలి రివర్ ఫ్రంట్‌గా గుర్తింపు పొందిన గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేయాలని వారికి సీఎం సూచించారు. ‘‘అక్కడి ఆకర్షణలు, సదుపాయాలన్నీ మానేర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. కరీంనగర్ చరిత్రకు అద్దం పట్టేలా రూపొందించండి’’ అని కరీంనగర్ నగరాభివృద్ధి జిల్లా నేతలకు సీఎం పలు సూచనలు చేశారు. ‘‘నగరాన్ని అందంగా ఎలా మలచుకోవచ్చో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలోచించాలి. పచ్చదనముండాలి. రాగి, వేప, సిల్వర్ ఓక్ మొక్కలు పెంచాలి. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి. ఇందుకు ఒక అటవీ శాఖ అధికారిని ప్రత్యేకించాలి. శాతవాహన వర్సిటీ చుట్టూ కేబీఆర్ పార్క్ తరహాలో గ్రీన్ వాక్ వే ఏర్పాటు చేయాలి. వీటన్నింటికీ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి’8 అని సూచించారు. అభివృద్ధి ప్రణాళికపై చర్చించేందుకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సీఎం బుధవారం మళ్లీ భేటీ కానున్నారు. -
లోయర్ మానేరుకు తగ్గిన వరద
లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. -
మానేరు డ్యాంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ మానేరులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మంగమ్మతోటకు చెందిన బీరెల్లి అరుణ్(16) శ్రీగాయాత్రి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సునంద్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. వీరిద్దరు ఈ రోజు ఉదయం మరో ఐదుగురు స్నేహితులతో కలిసి లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వె ళ్లారు. ఈ క్రమంలో ఈతకొడుతూ వీరిద్దరు నీట మునిగారు. ఇది గుర్తించిన తోటి స్నేహితులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
చక్రపాణి.. విజయవాణి!
జన్మనిచ్చిన ఊరిని ప్రాజెక్ట్ మాయం చేసేసింది. అన్నం పెట్టిన పొలమూ అందులోనే కలసి‘పోయింది.’ చదువూ వెక్కిరించే ప్రయత్నం చేసింది. మెడిసిన్ సీటు ఊరించి... ఉసూరుమనిపించింది. ఉన్న ఊరిని వదిలి మరో చోటుకు వెళితే... అక్కడి పరిస్థితులు ‘దూరంగా వెళ్లిపోమని’ సలహా ఇచ్చాయి. కుటుంబం.. తల్లిదండ్రులు.. బాధ్యతను గుర్తు చేశాయి.. సాధారణంగా ఎవరికైనా ఇలాంటి స్థితి ఎదురైతే ఈ ముళ్లబాటలో ముందుకెళ్లలేమని ఆగిపోతారు. క్రుంగిపోతారు. కానీ ఆయన హాస్టల్‌ను అమ్మ ఒడిగా మలుచుకున్నారు. అక్షరాలను ఆసరాగా చేసుకున్నారు. ‘దూరంగా వెళ్లిపొమ్మని’ చెప్పిన పరిస్థితులను ఎదగడానికి బాటగా చేసుకున్నారు. వైద్య శాస్త్రం తనను వద్దనుకుంటే.. సామాజిక శాస్త్రాన్ని అస్త్రంగా అందుకున్నారు. అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఆయనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. సాక్షి, సిటీబ్యూరో: ఇప్పుడు ఆ ఊరు లేదు. కానీ ఒకప్పుడు కరీంనగర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండేది యాష్వాడ. చిన్న పల్లెటూరు. మానేరు డ్యామ్ నిర్మాణంలో మాయమైన 18 ఊళ్లలో అదొకటి. ఊరు మాయమైనట్లే అక్కడ పుట్టి పెరిగిన ఎంతోమంది అస్తిత్వమూ ప్రశ్నార్థకమైంది. సరిగ్గా అక్కడ మొదలైన జీవన పోరాటం... సంఘర్షణ... కోట్లాది తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాట ప్రతీకై... ఆత్మగౌరవ పతాకై ఎగసింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను సమున్నతంగా ఆవిష్కరించింది. ఒక గొంతుకై నిలిచింది. ఆ గొంతు ప్రొఫెసర్ చక్రపాణిది. ఆ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, సామాజిక, రాజకీయ విశ్లేషకుడుగా మాత్రమే తెలిసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఇంకో మెట్టు ఎక్కారు. ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న ఆ ఊళ్లో కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో అక్షరాలు దిద్దుకున్నారు. బతకడమే పోరాటమైన చోట చదువూ భారమైంది. సంక్షేమ హాస్టల్ ఆదుకొని ఒడ్డున చేర్చింది. ఎక్కడ చేజారిపోతుందోననుకున్న విద్యను గట్టెక్కించింది. అలా ఒక్కో మెట్టూ పెకైక్కారు. టీపీఎస్సీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. తన అనుభవాలను... అంతరంగాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. అందని వైద్య విద్య... చరిత్ర, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్స్ అంటే పెద్దగా ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కానీ తమ్ముడిని మెడిసిన్ చదివించాలనుకున్న అన్నయ్య సత్యనారాయణ కోరిక మేరకు బైపీసీలో చేరారు. ఇష్టం లేకపోయినా కష్టపడి చదివారు. ఎంసెట్ రాశారు. తనకు మెడిసిన్‌లో సీటొచ్చిందన్న సంగతి ఆరు నెలల తరువాత తెలిసింది. దాని కోసం పెద్ద న్యాయపోరాటమే చేయవలసి వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో మరో విషయం గుర్తించారు. ఆర్థిక భారంతో కూడిన మెడిసిన్ కంటే టీచర్ ఉద్యోగమే మంచిదనుకున్నారు. టీటీసీ రాశారు. 1985లో ధ ర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లెలో రూ.398 వేతనంతో ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ రోజుల్లోనే కరీంనగర్లో ‘జీవగడ్డ’ సాయంకాలపు దినపత్రికలో పాత్రికేయుడిగా ప్రవేశించారు. అల్లం నారాయణ, నరేందర్, కేఎన్ చారి, మరికొందరు మిత్రులతో కలిసి ‘జీవగడ్డ’ విలేకరిగా విధి నిర్వహణ. అప్పటికే తెలంగాణ సమాజం ఒక భయానకమైన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. నక్సలైట్ ఉద్యమాలతో అప్పటి యువత బాగా ప్రభావితమవుతోంది. ఆ ప్రభావం చక్రపాణిపైనా ఉంది. అదే సమయంలో మార్క్సిజంపైకి దృష్టి మళ్లింది. రెండు, మూడేళ్ల పాటు బాగా అధ్యయనం చేశారు. టీచర్‌గా కంటే విలేకరిగా పని చేయడమే తనకు ఎంతో సంతృప్తినిచ్చింది. 1987 నాటికి కరీంనగర్లో నిర్బంధం మరింత తీవ్రమైంది. ఆ పరిస్థితుల్లో స్నేహితుల సలహా మేరకు కరీంనగర్‌ను వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. సామాజిక ఉద్యమ పథం బ్రెజిల్లో 2003లో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరమ్, ఇట లీలోని యూరోపియన్ సోషల్ ఫోరమ్‌తో పాటు, లెఫ్ట్ థింకర్స్ సారథ్యంలో అమెరికాలో స్థాపించిన ‘న్యూ స్కూల్’ విశ్వవిద్యాలయంలో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, చైనా సోషలిజంలో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై పరిశోధనాత్మక అధ్యయనం గొప్ప సంతృప్తి. 2006లో హైదరాబాద్‌లో వరల్డ్ సోషల్ ఫోరమ్ నిర్వహణలో కీలకమైన బాధ్యతలు. అంతకంటే ముందు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి నడుమ చర్చల కోసం పీస్ ఇనిషియేటివ్ కమిటీలో ఎస్ఆర్ శంకరన్ వంటి పెద్దలతో కలిసి పని చేశారు. చర్చల సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగకుండా ఏర్పాటైన కాల్పుల నియంత్రణ కమిటీకి కన్వీనర్‌గా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో... 2009లో మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. ఉద్యమ గమనంపై ఆయన సంధించిన ‘ఘంటాపథం’, వార్తా కథనాల విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా, ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి సాగించిన పోరాటం ఆయనను తిరుగులేని ఉద్యమకారుడిగా నిలిపాయి. రాత్రింబవళ్లు టీవీ చానళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అభిరుచులు అధ్యయనం, రాయడం, సామాజిక అంశాలపై విశ్లేషణ. బాధపడిన క్షణాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మన సును ద్రవింపజేశాయి. అప్పటి వరకు ఉద్యమంలో కలియ తిరుగుతూ, అంతటా తానై కనిపించిన విద్యార్థి యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని సజీవ దహనమైన సంఘటన ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుందంటారు. కుటుంబ నేపథ్యం... రెండెకరాల మెట్ట పొలం మాత్రమే ఉన్న పెద్ద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు...ముగ్గురు అక్కచెల్లెళ్లు. అమ్మ జనని. నాన్న మొగులయ్య. తాము అనుభవించిన సామాజిక అణచివేత, వివక్ష పిల్లల అనుభవంలోకి రావద్దనుకున్నారా దంపతులు. వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని కష్టపడ్డారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా... ఒక వైపు పొలం దున్నుతూ, పశువులను మేపుతూ, పొలంలో పండిన కూరగాయలను అమ్ముతూ... మరోవైపు బడికెళ్లారు చక్రపాణి. ఊళ్లో ఐదో తరగతి పూర్తయింది. పై చదువులు అసాధ్యమనుకొంటున్న తరుణంలో అప్పటి సాంఘిక సంక్షే మ హాస్టల్ వార్డెన్ బీఎస్ రాములు (ప్రముఖ రచయిత) ఆపన్న హస్తం అందించారు. తాను వార్డెన్‌గా పని చేస్తున్న ఎలగందుల హాస్టల్లో చేర్చుకున్నారు. అలా చదువు వైపు మళ్లారు. పదో తరగతి వరకు ఆ హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు. అప్పటి కి మానేరు డ్యామ్ పనులు మొదలయ్యాయి. యాష్వాడతో పాటు 18 ఊళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. దాంతో చక్రపాణి కుటుంబం ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దూలికట్టకు మకాం మార్చింది. సుల్తానాబాద్‌లోనే 1983లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆదర్శ వివాహం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోజుల్లోనే ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పతో పరిచయం ప్రేమగా మారింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. స్నేహితులు, సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో 1994 ఆగస్టు 13వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దండలు మార్చుకొని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పాప అమేయ ఇంటర్ చదువుతోంది. కొడుకు రాహుల్ మిళింద్ ఏడో తరగతి. మధుర జ్ఞాపకం హైదరాబాద్‌లో ఒకవైపు దినపత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1990లో ఎంఏ సోషియాలజీ, 1992 నాటికి ఎంసీజే పూర్తి చేశారు. యూజీసీ నెట్‌కు ఎంపికయ్యారు. అప్పటికి 25 ఏళ్ల వయస్సు. ఆ సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ లెక్చరర్‌గా ఉద్యోగం. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు టీచింగ్. బియ్యాల జనార్దన్, డాక్టర్ బుర్రా రాములు, ప్రొఫెసర్ బొబ్బిలి వంటి అధ్యాపక మిత్రుల పరిచయం. 20 నెలల పాటు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలు. చిన్న వయస్సులోనే లెక్చరర్‌గా పని చేయడం ఒకవైపు... మరోవైపు అప్పటి ఉద్యమ వాతావరణం, సామాజిక, రాజకీయ అంశాలపైన చర్చలు, విశ్లేషణలు. 1993లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి పయనం. ప్రజా సంబంధాల అధికారిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, రిజిస్ట్రార్‌గా ఇటీవల వరకు అనేక కీలకమైన బాధ్యతల నిర్వహణ. అక్కడి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు. -
నిండుకుండలా మానేరు డ్యామ్