లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది.
లోయర్ మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు, నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 919.40 అడుగులు, 23.51 టీఏంసీల నీరు ఉంది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10,800 క్యూసెక్కులు ఉండగా.. కాకతీయ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.