శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వదర ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు, నిల్వ 20.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 147.51 మీటర్లు, నిల్వ 18.81 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్ట్‌కు బారీగా వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 77,701 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి 53,720 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 100 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 10,257 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని.. 80 ప్రాంతాల్లో 111 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయని అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. గురువారం నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీపాద ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద
Published Thu, Sep 29 2016 9:11 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement