జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం వేకువజామున భారీ గండి పడింది.
- పోత్గల్ గ్రామం జలమయం
కరీంనగర్
జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం వేకువజామున భారీ గండి పడింది. వరద ఉధృతికి పోత్గలం గ్రామం మొత్తం జలమయమైంది. గ్రామంలోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ముస్తాబాద్-సిద్ధిపేట రోడ్డు తెగిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువుకు గండి పడి చుక్క నీరు లేకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.