Gangamma
-
‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు!’ నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..?
'సర్వసాధారణంగా మనం ఏదయినా ఒక విషయాన్ని పరిశీలించాలనుకుంటే అనేక గ్రంథాలు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా అటువంటి అనుబంధం కలిగిన ఒక మహాపురుషుని నోటివెంట వచ్చిన కీర్తన అదే పెద్ద గంగ. శాబ్దిక గంగ. గంగలాగే ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తన .. శాబ్దిక గంగ కూడా ప్రవహించింది. అది పెద్ద పల్లవి, పెద్ద పెద్ద చరణాలతో ఉండదు. సులభంగా ఉంటుంది. గంగే మాం పాహి.. అంటారు ఆయన. ‘ఓ గంగమ్మా! నన్ను రక్షించు’ అని. నిజానికి రక్షించేది ఎవరు? దేవతలు. ఎప్పుడయినా ఏదయినా దుష్కర్మ అనుభవించాల్సి వస్తే, కష్టం తరుముకొస్తుంటే.. దానిని తొలగించగలిగిన వాడు భగవంతుడు. కానీ గంగమ్మ కూడా అలాగే రక్షించగలదు – అన్న నమ్మకంతో దీక్షితార్ వారు ‘అమ్మా గంగమ్మా! నన్ను రక్షించు’ అన్నారు. నిజానికి ఆమె శక్తి ఏపాటిది అంటే..' భాగవతంలో పరీక్షిత్తు ఏడు రోజుల్లో మరణిస్తానని గంగానదీతీరంలో ప్రాయోపవేశం చేసాడు. దాన్ని ఆంధ్రీకరించిన పోతన ఎంత గొప్పగా చెప్పారంటే.. ‘‘అమ్మా! నిను? జూచిన నరు? బొమ్మా యని ముక్తి కడకు? బుత్తు వ?ట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!" అర్థం.. అమ్మా! అని తన వంక చూస్తే చాలట. పామ్మా.. అని మోక్షానికి పంపించివేస్తుందట. అంతే.. పూజలు మరేమీ అఖ్కర్లేదు.‘ నీ రూపంతో ఒక్కసారి నాకు ఎదురుగా రామ్మా... గంగమ్మా... నిన్ను చూడాలని ఉందమ్మా.. అంటారు. ఆమె శక్తి అంత గొప్పది. శ్రీనాథుడు కాశీఖండంలో ఓ మాటంటారు.. ‘‘గంగానది, గంగానది, గంగానది..’’ అని ఉచ్చరిస్తే చాలు.. అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయనక్కరలేదు. రాత్రి పడుకోబోయేముందో.. పాద్దున లేస్తున్నప్పుడో.. ఆ గంగానది వైభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.. ‘గంగానది గంగానది గంగానది’ అని ఎవరు తలచుకుంటారో వారి పాపాలన్నీ ఆమె తీసేస్తుంది.. అంటారు. అదీ ఆమె ఘనత. గంగానదిలో ఉన్నది నీరు కాదు.. ఆ నదికి ఒక అధిష్ఠాన దేవత ఉంది. ఆమె అనుగ్రహిస్తుందన్న నమ్మకం సనాతన ధర్మానిది. దీక్షితార్ వారు‘గంగే మాం పాహి’ అన్నారంటే... ఆయనకు అంత నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని కలిగించినది ఎవరు.. ఆయన ఏ కావ్యాలూ పఠించలేదు.. ఎక్కడా చేరి చదువుకోలేదు. గురువుగారయిన చిదంబర యోగి శుశ్రూషలో తెలుసుకున్న విషయాలు అవి. గురువు గారి మీద నమ్మకం అంత గట్టిగా ఉండబట్టే... ఆయన నీవు గంగానదిలో మునిగి చెయ్యిపెట్టి తడుము.. అనగానే మారుమాట మాట్టాడ కుండా వెళ్ళి వెతికితే.. ఆయనకు వీణ లభించింది.. అది ఆయనను వాగ్గేయకారుణ్ణి చేసింది. ఆ నమ్మకంతోనే ఆయన గంగమ్మను కొనియాడుతూ కీర్తన చేస్తూ.. గంగేమాం పాహి! అన్నారు. అది ఆయన నోటివెంట గంగా ప్రవాహంలా.. శాబ్దికగంగగా ప్రవహించింది. ఆయన ఎక్కడా శాస్త్రాలు చదువుకోక పోయినా ఈ కీర్తనలో ఆయన ఎన్నో పౌరాణిక విషయాలను.. అవి కూడా గాఢతతో ఉన్న విషయాలను సులభమైన భాషలో ప్రస్తావించారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విశాఖపట్నం: తల్లీ నిన్నే నమ్ముకున్నాం చల్లంగ చూడమ్మా (ఫొటోలు)
-
లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద హైవే నంబర్ 44లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వన్‌వేలో గుర్తు తెలియని భారీ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొనడంతో రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న పెద్ద నాలాలో ఆటో కూరుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లివస్తూ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ కుటుంబం, మరో కుటుంబంతో కలిసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల కోసం శుక్రవారం రాత్రి బయల్దేరి వెళ్లింది. శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ప్రార్థనలు పూర్తి కావడంతో ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇచ్చోడ బైపాస్ దాటుకుని హైవే పైనుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఏముల పొచ్చన్న (58) ఆయన భార్య గంగమ్మ (48), కూతురు శైలజ (28), మరో కుటుంబానికి చెందిన మడావి సోంబాయి (63) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆటోను ఢీకొన్న తర్వాత భారీ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు ఆ వాహనం ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనా స్థలి నుంచి కొద్ది దూరంలోనే కొద్ది నెలల కిందటే జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ప్రధానంగా ఈ మార్గం పల్లంగా ఉండటంతో లారీలు న్యూట్రల్లో నడుపుతారు. ఈ ప్రమాదానికి కూడా అదే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత్యువును జయించిన చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందిన శైలజ కుమార్తెలు కూడా అదే ఆటోలో ఉన్నారు. మూడేళ్ల వయసున్న ఆరాధ్య, ఎనిమిది నెలల పసిబిడ్డ అర్పిత ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినప్పటికీ వారి తల్లి మృతిచెందడం చూస్తున్నవారిని కంటతడి పెట్టించింది. -
విశాఖపట్నం : గంగమ్మా.. చల్లంగా చూడమ్మ (ఫొటోలు)
-
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చౌడేపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు ఆదివారం బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని తొలిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఎంఎస్ బాబు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి ఆలయ సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. తొలుత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తులకు పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయన్నారు. పంటలు బాగా పండి అందరూ అభివృద్ధి చెందాలని.. కోవిడ్ నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. -
పాపం గంగమ్మ.. బాధాకరం
సాక్షి, బెంగళూరు: గంగమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో బెంగళూరు నుంచి సొంతూరికి కాలినడకన బయల్దేరి మార్గమధ్యలో గంగమ్మ (29) తనువు చాలించింది. 200 కిలోమీటర్లు పైగా నడిచి ఆకలిబాధతో కన్నుమూసింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు, రోజువారీ కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. గంగమ్మ మరణం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా దురదృష్టకర, బాధాకరం. సింధనూరు గ్రామానికి చెందిన గంగమ్మ లాక్డౌన్ సందర్భంగా తన సొంతూరికి నడిచి వెళుతుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె అన్ని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాను’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని.. ఆహారం, సరుకులు అవసరమైన వారి కోసం హెల్ప్‌లైన్ నంబరు పెట్టామని యెడియూరప్ప తెలిపారు. వలస కార్మికుల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అందరూ ప్రభుత్వం సూచనలు పాటించాలని, ఎటువంటి అవసరం వచ్చినా హెల్స్‌డెస్క్‌లను సంప్రదించాలని సూచించారు. (విషాదం; కబళించిన ఆకలి) -
గిల్ట్ తో పల్టీ
చాలాసార్లు క్రైం ఉంటుంది.అన్నిసార్లు అనుమానాలు ఉంటాయి.కొన్నిసార్లు క్లూ ఉండదు.తెలివైన ఆఫీసరు అనుమానాన్ని క్లూగా మార్చాడు.అనుమానానికి పూతపూసి దుర్మార్గుణ్ణి పల్టీ కొట్టించాడు.మే 15, 2018. వరంగల్ జిల్లా హసన్‌పర్తి.రాత్రి తొమ్మిది దాటి ఏడు నిమిషాలు అయ్యింది. శివారులో రామూర్తి ఇల్లు అది. రామ్మూర్తికి 65 ఏళ్లు. అతనికి భార్య గంగాదేవికి 58.పిల్లలు పుట్టలేదు కనుక ఒకరికొకరుఅన్నట్టు ఇద్దరే ఆ ఇంట్లో బతుకుతున్నారు. అదే ఇంట్లో కిరాణా షాపును నడుపుతుంటారు. కాస్త దూరమైనా రామ్మూర్తి ఇంటికి కిరాణ సరుకుల కోసం జనం వచ్చిపోతుంటారు. సాధారణంగా రాత్రి ఏడు గంటలు దాటితే పెద్దగా జన సంచారం ఉండదు ఆ ప్రాంతంలో. అందుకే ఏడు దాటక ముందే కొట్టు మూసేస్తాడు రామ్మూర్తి. తిరిగి ఉదయం 5 గంటలకు పాల వ్యాన్ వచ్చినప్పుడు తెరుస్తాడు. ఇప్పుడు రాత్రి 9 దాటడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. రామ్మూర్తి టీవీ చూస్తున్నాడు.గంగాదేవి పెరటివైపు తలుపు తీసింది బాత్రూమ్కి వెళ్లడానికి.అప్పటికే మూలన చీకట్లో నక్కి ఉన్న ఓ ఆకారం అప్రమత్తమైంది. గంగాదేవి బాత్రూమ్లోకి వెళ్లి తలుపు దగ్గరగా వేసింది. ఒక్క ఉదుటున ఆ ఆకారం బాత్రూమ్లో దూరింది. గంగాదేవి మీద దూకింది. గంగాదేవికి ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యింది. భయంతో అరవబోయేలోగా మెడపై కత్తి రావడం, కంఠం తెగడం క్షణాల్లో జరిగిపోయాయి.అరిచే అవకాశమే లేకుండా గంగాదేవి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్నానాల గది అంతా రక్తంతో నిండిపోయింది.టైమ్ 9.15.ఆ ఆకారం బాత్రూమ్ డోర్ తెరిచి మెల్లగా పెరటి తలుపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. టీవీలో వార్తలు చూసున్న రామ్మూర్తిని వెనక నుంచి సమీపించింది. అలికిడి వినిపించినా గంగాదేవే అనుకుని వెనక్కి తిరగలేదు రామ్మూర్తి. ఆ ఆకారం చేయి పైకి లేచింది. చేతిలో ఇటుకరాయి. రామ్మూర్తి తలమీద ఒకే ఒక్క దెబ్బ పడింది. అంతే. రామ్మూర్తి అడ్డంగా పడిపోయాడు. తెల్లవారింది.‘ఏమోయ్.. టైం 7 దాటుతోంది. కాస్త నా ముఖాన చాయ్ పోస్తవా లేదా?’ అంటూ అరిచాడు పక్కింటి సురేశ్. బాబాయ్ ఇంకా షాప్ తెరవలేదు. లేకుంటే ఎపుడైనా ఆలస్యం చేశానా’ వంటింట్లో నుంచి బయటికి వచ్చింది లక్ష్మి. ‘బాబాయ్ ఊర్లోనే ఉన్నాడు కదా.. బహుశా పాలు రాలేదేమో వెళ్లి చూస్తానుండు’ అంటూ కదిలాడు సురేశ్. పాలవ్యాను వచ్చి వెళ్లింది. పాల ప్యాకెట్ల ట్రేలన్నీ అలాగే షాప్ ముందు వదిలేసి ఉన్నాయి. వచ్చి చూసి రామ్మూర్తి లేడని వెళుతున్నారు ఒకరిద్దరు. ‘అదేంటి బాబాయ్ నిద్ర లేవలేదా? పిన్ని అయినా లేవాలి కదా?’ అంటూ తలుపు కొట్టాడు. లోపలి నుంచి అలికిడి రాలేదు. అతని మనసు ఏదో కీడు శంకించింది. పాల ప్యాకెట్ల కోసం వచ్చిన వాళ్లు ‘ఏం జరిగి ఉంటుందంటారు’ అన్నారు. డోర్ బద్దలు కొట్టి చూద్దాం’ అన్నాడు సురేశ్.వద్దు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్లు వచ్చి చూస్తారు’ అన్నారు అక్కడ గుమికూడిన వాళ్లలో నుంచి ఓ వ్యక్తి.సురేశ్ పోలీసు స్టేషన్‌కి ఫోన్ కలిపాడు. నిమిషాల్లో పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు రామ్మూర్తి ఇంటికి. లోపలి నుంచి డోర్ పెట్టి ఉంది. ఎలా వెళ్లడం అని చూస్తున్నారు పోలీసులు.‘ఇంటి వెనక చిన్న గోడ ఉంది సార్’ అని గుంపులోని వారు చెప్పడంతో వెనకవైపుగా వెళ్లారు. గోడ దూకి చూసిన పోలీసులు ఇంట్లో కనిపించింది చూసి ఉలిక్కిపడ్డారు.ఒకే ఇంట్లో రెండు శవాలు.వెంటనే వైర్లెస్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాడు కానిస్టేబుల్. హసన్‌పర్తిలో డబుల్ మర్డర్.క్షణాల్లో వార్త ఊళ్లో కలకలం రేపింది.వరంగల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు.అక్కడంతా పర్యవేక్షించి ‘హంతకుడు సాయంత్రంలోగా దొరకాలి’ సిబ్బందిని హెచ్చరించి వెళ్లాడు.క్లూస్ టీంతో పాటు మొత్తం 10 బృందాలు రంగంలోకి దిగాయి. కొందరు వాహన తనిఖీలు, మరికొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇంకొందరు లాడ్జీలు ఇలా ఎవరికి కేటాయించిన పనుల్లో వారు మునిగిపోయారు. ఈలోగా కమిషనర్ ఆరుగురు సీఐలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. వారంతా క్రైం, సైబర్, క్లూస్, ఫోరెన్సిక్ రంగాల్లో మెరికల్లాంటి వారు. కమిషనరేట్‌లో ఉన్న వారిలో ది బెస్ట్. క్లూస్ టీం రిపోర్ట్ వచ్చింది.హంతకుడు చాలా తెలివైనవాడు. పరిసరాలపై ముందే అవగాహన ఉంది. అందుకే పొంచి ఉండి మరీ దాడిచేశాడు. ఇంట్లో నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. కొట్టులో చిల్లరనూ ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగింది. హత్యచేసాక సంఘటనా స్థలంలో కారంపొడి చల్లాడు ఆధారాలు దొరకకూడదని. దాడికి కొత్త ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే హత్యాస్థలంలో వేలి ముద్రలు దొరికినా వాటిని పాత నేరస్థుల వేలిముద్రలతో సరిపోల్చితే ఎక్కడా సరి పోలలేదు. ఈ వివరాలతో కేసు జటిలంగా మారింది. హంతకుడి గురించి ఏమీ తెలియడం లేదు. కాని ఇంత కిరాతకంగా మర్డర్ చేశారు కాబట్టి ఒకరి కంటే ఎక్కువమంది హత్యలో పాల్గొని ఉంటారని పోలీసు లు అంచనాకు వచ్చారు. వరంగల్ చుట్టుపక్కల వివిధ పనులకు వచ్చిన ఉత్తర భారతీయలను విచారించడం మొదలు పెట్టారు.సీఐ బృందం రామ్మూర్తి, గంగాదేవిల కుటుంబ వివరాలు సేకరించింది. ‘వీరికి ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. శత్రువులూ లేరు. అలాంటప్పుడు ఇంత కిరాతకంగా హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?’అన్న విషయం పోలీసులకు అంతుచిక్క లేదు. వారికి పక్కింటి సురేశ్‌పై అనుమానం వచ్చింది. అతణ్ణి పట్టుకెళ్లి అన్ని కోణాల నుంచి ప్రశ్నలు సంధించారు. సురేశ్ హడలిపోయాడు. అతడికేం తెలియదనిఅర్థమైంది.ఆ వీధిలో సీసీ కెమెరా లేదు. కాని అది వెళ్లి కలిసే మెయిన్ రోడ్డు మీద ఈ వైపు నుంచి ఓ బైక్ ఆ రాత్రి 9:30 గంటల వెళ్లడం పోలీసులు గమనించారు. మరోవైపు సెల్‌టవర్ పరిధిలోని కాల్స్‌ను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. బైక్‌నంబర్ ద్వారా మనిషి వివరాలు తెలిశాయి. కాని అనుమానించడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని ఆ ఊళ్లోనే ఉన్న అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేడు. ముసలి తల్లి ఉంది.‘హైదరాబాద్ వెళ్లాడు’ అని చెప్పింది.ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి పోలీసులు ట్రై చేస్తే కాల్ కనెక్ట్ కాలేదు. ఫోన్‌ను ట్రాక్ చేయడం మొదలెట్టారు. వరంగల్ శివారులోని అటవీ ప్రాంతం దగ్గర ఆ ఫోన్ ఆపరేట్ అవుతూ ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడ ఎందుకు ఉన్నట్టు?మరో గంటలో మఫ్టీలో ఉన్న పోలీసులు అతణ్ణి చుట్టుముట్టారు. ‘ఎంత ఇంటరాగేట్ చేసినా నిజం చెప్పడం లేదు సార్..’ అలిసిపోయిన కానిస్టేబుళ్లు సీఐతో చెప్పారు.అప్పుడే సీఐ బృందం ఇంటరాగేషన్ రూమ్‌కి వచ్చింది. వాళ్లను చూడగానే అతడు ‘సార్.. నాకే పాపం తెలియదు. నన్నిలా ఇరికించడం న్యాయం కాదు’ అని కన్నీరు మున్నీరు అయ్యాడు. వాలకం చూస్తే జాలి వేసేలా ఉంది. ఇంటరాగేషన్ టీమ్‌కు ఏం చేయాలో తోచలేదు. ఈ లోగా సి.ఐ వచ్చి అతని ముందు ఓ మూట పడేశాడు. దాంట్లో నుంచి కొన్ని చిల్లర నాణేలను తీసి అతనిపై విసిరేశారు. ‘ఇవి నువ్వు కొట్టేసిన నగలు, ఇవి కిరణాషాపులో నువ్వు కొట్టేసిన చిల్లర. ఇవి చాలా.. ఇంకా ఆధారాలు చూపించాలా?‘ అని గద్దించాడు.అంతే. అతని ముఖం మాడిపోయింది.సార్, తప్పయిపోయింది...’అన్నాడు ఏడుస్తూ. అతని మాటలు వింటూనే పోలీసులు అవాక్కయ్యారు. ‘నీతోపాటు ఇంకెవరెవరు ఉన్నారు ఈ హత్యల్లో?’‘నేనొక్కడినే సార్. ఎవరూ లేరు’ అంత దారుణంగా ఇద్దరి వ్యక్తులను పొట్టన పెట్టుకుంది బక్కపల్చగా, పాతికేళ్లయినా లేని ఇతనా! ‘బంగారం ఎక్కడ పెట్టావు’ ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.‘అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైంది అతనికి. పోలీసులు చీకట్లో బాణమేస్తే తానే దొరికిపోయానని.‘ఒక్క క్లూ కూడా వదల్లేదు కదా సార్ ఎలా పట్టుకున్నారు?’ కానిస్టేబుల్ అడిగాడు సిఐని.నిజమే! ఒక్క క్లూ వదల్లేదు.. అతనిపై మాది కేవలం అనుమానమే. పనీపాటా లేని ఇతను అపుడపుడూ ఆ రామ్మూర్తి కిరాణ కొట్టులో పనిచేసే వాడని తెలిసింది. వారం రోజులుగా అక్కడే ఉన్న ఇతను మూడురోజుల నుంచి అసలు ఊళ్లోనే లేడు. హత్య జరిగిన రాత్రే వీధిలో నుంచి వెళ్లిన ఓ బైక్ మెయిన్ రోడ్‌లోని సీసీ ఫుటేజీలోరికార్డ్ అయ్యింది. ఆ బైక్ ఇతనిదేనని చెప్పారు కాలనీవాళ్లు. దానిని బట్టి మేం సెల్ నెంబరుకు ట్రై చేసినా ఇతను దొరకలేదు’ అంటూ నిందితుడివైపు తిరిగిన సీఐ ‘నీ లవర్‌తో నువ్వు వేరే ఫోన్నుంచిమాట్లాడుతున్నా వని గుర్తించాం.ఇంట్లోవాళ్లకు ఊరెళ్తున్నానని చెప్పి. వేరే ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావా? అని అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. కానీ, నువ్వే నేరం అంగీకరించి మాకు దొరికిపోయావు’ అంటూ అసలు విషయం చెప్పారు పోలీసులు. జల్సాల కోసం, ప్రియురాలిని మెప్పించడం కోసం ఈ రెండు హత్యలను చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు తన విలువైన జీవితాన్ని కారాగారంలో గడుపుతున్నాడు ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైందిఅతనికి. పోలీసులు చీకట్లోబాణమేస్తే తానే దొరకిపోయానని. – అనిల్ కుమార్ భాషబోయిన -
గంగమ్మకు బోనాలు
తాడిపత్రి రూరల్, పుట్టపర్తి రూరల్ : జిల్లాలోని తాడిపత్రి మండలం బొందెలదిన్నెతో పాటు పుట్టపర్తిలో ఆదివారం గంగమ్మ బొనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున గంగమ్మ అమ్మవారి దేవాలయానికి బొనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ప్రత్యేక పూజలను చేశారు. వర్షం కోసం బొనాల పండుగ నిర్వహించడం ఆనావాయితీగా వస్తోందన్నారు. -
గంగమ్మ మెరిసె.. గౌరమ్మ మురిసె..
జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుకుని చెరువుల వద్దకు తరలివెళ్లారు. గౌరీదేవికి నిర్వహించి ఉయ్యాల పాటలు పాడారు. పిల్లపాపలను చల్లంగా చూసి, ఇళ్లలో సిరులు కురిపించాలని భక్తి శ్రద్ధలతో గౌరమ్మను వేడుకున్నారు. ‘‘మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా..’’ అంటూ బతుకమ్మను గంగమ్మ ఒడికి ఆనందంగా సాగనంపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చెరువుల వద్ద భారీ ఏర్పాట్లు చేసింది. -
ముస్తాబాద్ చెరువుకు గండి...
- పోత్గల్ గ్రామం జలమయం కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం వేకువజామున భారీ గండి పడింది. వరద ఉధృతికి పోత్గలం గ్రామం మొత్తం జలమయమైంది. గ్రామంలోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ముస్తాబాద్-సిద్ధిపేట రోడ్డు తెగిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువుకు గండి పడి చుక్క నీరు లేకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారం.. పుష్కలం
– 12 రోజులు.. అరకోటి వ్యాపారం – జోరుగా గంగమ్మ పూజా సామగ్రి అమ్మకాలు – దాదాపు 200 మంది పొదుపు మహిళలకు ఉపాధి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కృష్ణా పుష్కరాల్లో గంగమ్మ పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పుష్కరం 12 రోజుల్లో దాదాపు అరకోటి వ్యాపారం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీశైలంలోనే పాతాళగంగ, లింగాలగట్టు పుష్కర స్నాన ఘాట్లలో ప్రతి రోజు దాదాపు 10 వేల మంది భక్తులు గంగమ్మకు పూజలు చేసుకుంటున్నారు. పూజా సామగ్రిలో టెంకాయ, చిన్న చాటా, రెండు రకాల పూలు, బిల్వపత్రి, ఒక నూనెలో అద్దిన ఒత్తి ఉంటుంది. వీటి వెలను రూ.40గా నిర్ణయించారు. ప్రతి రోజు దాదాపు 10 వేల మంది భక్తులు గంగమ్మకు పూజలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 4 లక్షల వ్యాపారం సాగుతోంది. ఇలా పుష్కరాల్లో 12 రోజుల్లో రూ. 48 లక్షల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎనిమిది రోజులు ముగిశాయి. చివరి రెండు రోజుల్లోనూ ఎక్కువగా మహిళలు స్నానం చేసే అవకాశం ఉంది. అప్పుడు వ్యాపారంలో వృద్ధి ఉండే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాగానికిపైగానే ఆదాయం: పుష్కారాల్లో స్థానికంగా ఉండే పొదుపు మహిళలతో గంగమ్మ పూజా సామగ్రి అమ్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా దాదాపు 200 మంది పొదుపు మహిళలు వ్యాపారాలు పెట్టుకున్నారు. కాగా, పూజా సామగ్రిలో ఒక్క టెంకాయ తప్పా మిగతా వస్తువులన్నీ స్థానికంగా అతి తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. అంతేకాక ఒక్కసారి గంగమ్మ పూజకు వదిలిన చాటా, పూలు, పత్రి తదితర వస్తువులను గజ ఈతగాళ్లతో మళ్లీ తెప్పించుకొని వాటినే వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు మహిళలకు సగానికిపైగానే వ్యాపారం జరిగిన దానిలో లాభం ఉండే అవకాశం ఉంది. అంటే ఒక్కో మహిళా దాదాపుగా ఈ పన్నెండురోజుల్లో 15 వేలకు తక్కువ కాకుండా లాభం పొందే అవకాశం ఉంది. -
వైభవంగా గంగమ్మ జాతర
మేళ్లచెర్వు: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మంద గంపలు, బోనాలు ఎత్తుకోని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి, గంగమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పాలు పొంగళ్లు, బొనాలతో మెుక్కలు సమర్పించుకున్నారు. అనంతరం పోతురాజు వద్ద యాట పోతులను, కోడిపుంజులను బలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపిశెట్టి లక్ష్మమ్మ, తిరుపతి వెంకయ్య, మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు యాదవ్, వెంకటేశ్వర్లు, బసవయ్య, శ్రీను, గజ్జల శంకర్‌రెడ్డి, కొండారెడ్డి, బాల వెంకటరెడ్డి, కాకునూరి వెంకటరెడ్డి, సైదులు, కృష్ణయ్య, చంద్రయ్య, లింగయ్య, శంభయ్య, వీరయ్య, బక్కయ్య, కె.వెంకటేశ్వర్లు, ఎం.రాంబాబు, సోమయ్య, నర్సింహారావులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎడు గంగమ్మల జాతర
-
ఆటోలో నుంచి జారీ పడి మహిళ మృతి
విజయనగరం: వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జరిగింది. వివరాలు..కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన కొత్తర గంగమ్మ(45) ఆటోలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కురుపాం) -
యాభై ఏళ్ల చిన్నారి..
భీమవరం అర్బన్ : పుట్టుక నుంచి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేని యాభై ఏళ్ళ వయసు గల తమిరి గంగమ్మ కుటుంబానికి పుట్టెడు కష్టాలు వచ్చిపడ్డాయి. పూట కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఆమె తల్లితండ్రులకు వయసు మీద పడటంతో ఏ పని చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు గంగమ్మ ఆలనా పాలనా చూస్తూ వచ్చిన వారిని ఆర్థిక సమస్యలు కుంగదీస్తున్నాయి. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ప్రస్తుతం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. భీమవరంలో స్థానిక కోడవల్లి రోడ్డులో నివాసముంటున్న తమిరి నారాయణరావు, వెంకటరత్నం దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి ముందుగా గంగమ్మ జన్యులోపంతో పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చిన్నపిల్లలాగానే ఉంది. ఎంతో మంది వైద్యులకు చూపించినా ఎదుగుదల లేదు.. కనీసం మాట్లాడలేదు. కొంత కాలం గోడలు పట్టుకుని నడచినా ప్రస్తుతం అచేతనంగానే ఉండిపోయింది. నారాయణరావు స్వర్ణకారుడిగా పనిచేస్తూ ఇప్పటి వరకు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. పస్తుతం నారాయణరావు అనారోగ్యానికి గురై ఇంట్లోనే ఉండటంతో వారికి పూట గడవటం కష్టమైంది. గంగమ్మ వైకల్యం కారణంగా వారికి అద్దె ఇల్లు కూడా దొరకని పరిస్థితి. ప్రస్తుతం గంగమ్మకు వృద్ధ దంపతులే సపర్యలు చేస్తున్నారు. తాము ఉండటానికి జాగా కల్పించేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు వీరు వేడుకుంటున్నారు. దాతలు సహృదయంతో ఆదుకోవాలని, సహాయం చేసేవారు సెల్ 90306 78489 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. -
గంగమ్మ తల్లిని దర్శించుకున్న మోడీ