సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ పబ్ బాగోతం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి దాడులు చేశారు. ఈ క్రమంలో 100 మంది పురుషులు, 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లకు ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. పబ్‌కు వచ్చిన యువకులతో వారు సన్నిహితంగా ఉండేలా డ్యాన్స్‌లు చేపిస్తున్నారు. పబ్ వచ్చిన వారితో ఎక్కువ మద్యం తాగించి అధిక బిల్లు అయ్యేలా పబ్ నిర్వహకులు ప్లాన్ చేశారు.
గత మూడు వారాలుగా పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో 100 మంది కస్టమర్లు, 42 మంది యువతులు, ఏడుగురు పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. పబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్‌లో నాలుగు గంటలు పనిచేస్తే 2 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇక, పబ్‌కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ.. ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారి పని అప్పగించారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తాము ఇచ్చే సాప్ట్ డ్రింక్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించారు. కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఎక్కువ ఇస్తున్నట్టు గుర్తించారు. అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.
మరోవైపు.. పబ్‌లో పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పబ్‌లో పట్టుబడ్డ తన భర్త కోసం ఆధార్ కార్డు తీసుకుని భార్య పీఎస్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్‌కి వచ్చి తందనాలు ఆడుతున్నాడు. ఇంటికి రానీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment