Pub Culture
-
జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదాలు.. పబ్స్ విషయంలో హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు తాగి జల్సాలు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. పబ్‌ల విషయంలో మరిన్ని నిబంధనలను విధించాలనా ఆదేశించింది.హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూబ్లీహిల్స్‌లో 55 నుంచి 60 పబ్‌లు ఉన్నాయి. రోడ్ నంబర్-12, రోడ్ నంబర్-36లో రోజుకో ప్రమాదం జరుగుతోంది. బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు జల్సాలు చేస్తున్నారు. మద్యం తాగి ఱ్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పబ్బుల బయట డ్రైవ్‌లు పెట్టి ప్రమాదాలను నివారించాలి. పబ్‌లకు మరిన్ని నిబంధనలు విధించాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. -
పబ్స్ లో చీకటి బాగోతాల వెనుక ఉన్న చెయ్యి.. డ్రగ్స్ దందా సాగుతుందెలా..?
-
పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చిన యజమానుల రిమాండ్
బంజారాహిల్స్: అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చి అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తున్న పబ్ యజమానులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని టేల్స్ ఓవర్ ద స్పిరిట్ (టాస్) పబ్‌లో గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులో ఉండగా ఇష్టానుసారంగా బిల్లులు వేసి వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు రెండు రోజుల క్రితం ఈ పబ్‌పై దాడులు చేసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ యువకులకు ఎరవేస్తున్న 47 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 95 మంది యువకులను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించారు. పబ్ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు డీజే ప్లేయర్ ఆసిఫ్, నలుగురు బౌన్సర్లు, మేనేజర్, బార్టెండర్లను కూడా అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న 42 మంది యువతుల్లో 10 మంది తరచూ పట్టుబడుతుండటంతో వారిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా పబ్‌ను డ్యాన్స్ఫ్లోర్గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు బింగి బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేయడమే కాకుండా పబ్‌ను సీజ్ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు. లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా ఎక్సైజ్ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతిదానికీ ఓ రేటు!
బంజారాహిల్స్: పక్కన కూర్చుంటే రూ. 500.. మీద చెయ్యి వేస్తే రూ. 1000.. సరసాలు ఆడితే రూ. 1500.. అర్ధనగ్న నృత్యాలు చేస్తే రూ. 2,000.. ఇవీ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3లో టేల్స్ ఓవర్ ద స్పిరిట్స్ (టాస్) పబ్‌కు వచ్చే కస్టమర్ల నుంచి పబ్ నిర్వాహకులు వసూలు చేస్తున్న ఫీజులు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాని అసాంఘిక కార్యకలాపాలుకు పాల్పడుతూ యువతులను ఎరగా వేసి యువకులను రెచ్చగొడుతున్న సదరు పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్‌్కఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వివరాలివీ... టాస్ పబ్‌లో కొంతకాలంగా అమ్మాయిలను ఎరగా వేస్తూ అబ్బాయిలను ఆకర్షిస్తూ పెద్ద ఎత్తున మద్యం తాగేలా ప్రోత్సహిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో శుక్రవారం రాత్రి 12 గంటలకు ఈ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఊగిపోతున్న యువకులు, అర్ధనగ్న నృత్యాలతో యువతులు, అధిక శబ్ధంతో డీజే, పబ్ ఆవరణ అంతా ఒక రకమైన మత్తుతో ఊగిపోతుండటాన్ని పోలీసులు గమనించారు. మొత్తం 100 మంది యువకులను అదుపులోకి తీసుకుని వీరందరికీ నోటీసులు ఇచ్చి పంపించారు. మరో 42 మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా అందులో 10 మంది యువతులు ఇలాంటి కేసుల్లోనే గతంలో రెండు మూడు పబ్‌ల్లో పట్టుబడ్డట్లు తేల్చారు. 32 మంది యువతులకు నోటీసులు ఇచ్చి 10 మంది యువతులను అరెస్టు చేశారు. అలాగే పబ్ యజమానులు ఉప్పల్‌కు చెందిన డింగి బలరామ్‌గౌడ్, జగద్గిరిగుట్టకు చెందిన డింగి శ్రీనివాస్‌గౌడ్, మేనేజర్ అలీం, బార్ టెండర్ రామకృష్ణ, డీజే ప్లేయర్ ఆసిఫ్, బౌన్సర్లు ఆరీఫ్, అబ్దుల్ సమీ, యూసఫ్ ఖాసీంఖాన్, సయ్యిద్ షాహిద్‌లపై సెక్షన్ 294, 290, 420, 188, 268, 120 (బి), 70 (బి) కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్ యజమానులు బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు పరారీలో ఉండగా వీరిద్దరి కోసం పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు. మిగతా ఏడు మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
బయటకని చెప్పి పబ్‌కి వెళ్తావా.. ఇంటికిరా నీ సంగతి చెప్తా!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ పబ్ బాగోతం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి దాడులు చేశారు. ఈ క్రమంలో 100 మంది పురుషులు, 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లకు ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. పబ్‌కు వచ్చిన యువకులతో వారు సన్నిహితంగా ఉండేలా డ్యాన్స్‌లు చేపిస్తున్నారు. పబ్ వచ్చిన వారితో ఎక్కువ మద్యం తాగించి అధిక బిల్లు అయ్యేలా పబ్ నిర్వహకులు ప్లాన్ చేశారు.గత మూడు వారాలుగా పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో 100 మంది కస్టమర్లు, 42 మంది యువతులు, ఏడుగురు పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా.. పబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్‌లో నాలుగు గంటలు పనిచేస్తే 2 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇక, పబ్‌కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ.. ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారి పని అప్పగించారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తాము ఇచ్చే సాప్ట్ డ్రింక్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించారు. కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఎక్కువ ఇస్తున్నట్టు గుర్తించారు. అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.మరోవైపు.. పబ్‌లో పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పబ్‌లో పట్టుబడ్డ తన భర్త కోసం ఆధార్ కార్డు తీసుకుని భార్య పీఎస్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్‌కి వచ్చి తందనాలు ఆడుతున్నాడు. ఇంటికి రానీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. -
పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ కేసు దేశంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా తెలంగాణ పోలీసులు.. హైకోర్టును ఆశ్రయించారు. ఆరుగురు(ఐదుగురు మైనర్లతో సహా సాదుద్దీన్) నిందితుల డీఎన్ఏ సేకరణ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల డీఎన్ఏ సేకరణ కోసం జువైనల్ బోర్డుతోపాటు కోర్టు అనుమతిని సైతం పోలీసులు కోరారు. దీంతో, ఆరుగురు నిందితుల డీఎన్ఏను సేకరించి పోలీసులు ల్యాబ్‌కు పంపనున్నట్టు స్పష్టం చేశారు. ఇన్నోవాలో సేకరించిన ఆధారాలతో అధికారులు.. డీఎన్ఏను సరిపోల్చనున్నారు. కాగా, విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్‌గా డీఎన్ఏ రిపోర్టు కీలకం కానుంది. ఇదిలా ఉండగా, అవసరమైతే బాధితురాలి డీఎన్ఏ శ్యాంపిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుల పాస్‌పోర్టులను కూడా సీజ్ చేయాలని పోలీసులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారికి బెయిల్ లభిస్తే.. దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా, నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఇది కూడా చదవండి: గచ్చిబౌలి: పబ్‌లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం! -
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన.. టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి 15 రోజులు కావొస్తున్నా.. నిత్యం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులోని A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మొత్తం ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అయిదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్‌ను విచారించనున్నారు. పోలీసులు శనివారం నిందితులందరికి ఉస్మానియాలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇక ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ మెడికల్ రిపోర్టు ప్రకారం లైంగిక దాడి సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు ఒప్పుకున్నారు. చదవండి: మైండ్ బ్లోయింగ్: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్ -
అత్యాచార నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలోని నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం ఉదయం సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులోని ఆరుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుకస్టడీలో ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్ కార్లలో మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్‌లు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. వీరందరికి డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో రెండుగంటలపాటు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, సైదాబాద్ జువెనైల్ హోంలో ఉన్న నిందితులను మొదటిరోజైన శుక్రవారం ఉత్తర్వు కాపీలు ఆలస్యంగా అందటంతో పోలీసులు కస్టడీకి తీసుకోలేకపోయారు. -
మైండ్ బ్లోయింగ్: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, పోలీసులు శనివారం నలుగురు నిందితులను కస్టడీలో విచారించారు. A1 సాదుద్దీన్ మాలిక్‌తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మైనర్లు పోలీసులకు ట్విస్టులు ఇచ్చినట్టు సమాచారం. లైంగిక దాడి కేసులో మైనర్లు తమ తప్పులేదని పోలీసులకు చెప్పారు. తమను సాదుద్దీన్ మాలికే రెచ్చగొట్టాడని తెలిపారు. దీంతో తాము మైనర్‌పై లైంగిక దాడి చేశామని ఒప్పుకున్నారు. అయితే, సాదుద్దీన్‌ను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు గందరగోళానికి గురవుతున్నారు. విచారణలో భాగంగా సాదుద్దీన్.. ఎమ్మెల్యే కుమారుడే ముందుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపాడు. తర్వాత తామూ అనుసరించామని చెప్పాడు. కాన్సూ బేకరీ వద్ద ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయినట్టు తెలిపాడు. ఇక, విచారణ అనంతరం.. నిందితులకు పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ టెస్టులు నిర్వహించారు. ఆసుపత్రిలో టెస్టుల కారణంగా శనివారం కేవలం గంటసేపు మాత్రమే నిందితులను విచారించినట్టు ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గరిమెళ్ల ప్రత్యూష మృతి -
అమ్నేషియా పబ్ కేసు: మెడికల్ రిపోర్టు ఔట్.. మరీ ఇంత దారుణామా..?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు.. పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్.. లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను రెండోరోజు పోలీసులు విచారిస్తున్నారు. ఇక, మైనర్‌పై లైంగిక దాడి కేసులో దర్యాప్తు అధికారులు తొలిరోజు మైనర్లను విచారించారు. జువైనల్ హోంలో ముగ్గురు మైనర్లను అధికారులు విడివిడిగా విచారించారు. కాగా, A1 సాదుద్ధీన్ చెప్పిన వివరాలతో అధికారులు ముగ్గురిని ప్రశ్నించారు. మైనర్‌ను ట్రాప్ చేసింది ఎవరూ అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ.. చార్మినార్ వద్ద టెన్షన్.. టెన్షన్.. వీడియో -
జూబ్లీహిల్స్ పబ్ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి: రేవంత్‌రెడ్డి
-
అమ్నేషియా పబ్ కేసు: కార్లు ఎవరివి.. ప్రశ్నల వర్షం కురిపించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్ చెప్పలేదు. ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్లు తొలగించింది ఎవరు?. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు. పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్ చెప్పడం లేదు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారు’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: పబ్ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు: హోం మంత్రి మహమూద్ అలీ -
పబ్ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు పొలిటికల్ లీడర్ల కొడుకులు కావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మహమూద్ అలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగింది. కాబట్టి వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి తొలగింపు నా పరిధిలో లేదు. అమ్నేషియా పబ్‌లో మైనర్‌పై లైంగిక దాడి కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘యాక్షన్.. ఓవరాక్షన్’ అసలు సంగతి ఇదే!..కానిస్టేబుల్‌పై వేటు -
హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ మైనర్ బాలిక డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూకట్‌పల్లిలోని క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులతో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలకు మారిపోయిన పబ్‌లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్‌లలో మద్యం, ధూమపానం, కస్టమర్లను ఆకర్షించేందు కు మహిళలతో నృత్యాలను నియంత్రించని, నిబ ంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయా ప్రాంతాలలో పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే వెంటనే తనిఖీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో అందులో వివరించారు. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటన్నింటినీ కలిపి ఒకటే గ్రూప్‌లోకి తీసుకొచ్చారు. పబ్బుల్లో ఏం జరుగుతోంది? ఎవరు బుకింగ్ చేసుకుంటున్నారు? వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన వివరాలు, ఎంత మంది హాజరవుతున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. సత్ప్రవర్తనకు బాండ్ పేపర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో సీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనతో మెలగడానికి, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేందుకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు జామీనుదారులతో పాటు, రూ.50 వేల హామీ బాండ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 107/122 సీఆర్పీసీ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీపీ రవిచంద్ర పాల్గొన్నారు. -
Tequila Pub: పబ్‌పై రైడ్స్.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్ గర్ల్స్, కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతో పబ్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లఘించి ఇష్టారీతిలో పబ్‌లను రన్ చేస్తున్నారు. తాజాగా నగరంలోని రాంగోపాల్‌పేటలో ఉన్న తకీల పబ్‌పై శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ నిర్వహించారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తుండటంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది గ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పబ్‌కు అనుమతి లేకున్నా అమ్మాయితో నిర్వాహకుడు డ్యాన్స్ చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, పబ్‌ను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని రాం గోపాల్పేట పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. ఇది కూడా చదవండి: ఆరు నెలలు కాకముందే భర్త అసలు క్యారెక్టర్ బట్టబయలు.. భార్య సూసైడ్ -
క్లబ్బులు, పబ్బులకు కేరాఫ్‌గా తెలంగాణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సంస్కృతిని నిర్వీర్యం చేసి కేసీఆర్ ప్రభుత్వం పబ్‌లు, క్లబ్‌లు, గంజాయిని ప్రోత్సహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన పాలకులు.. బెల్టుషాప్‌లు, మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తాగుబోతులను తయా రు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి, డ్రగ్స్, పబ్స్‌కు యువతను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల కిందట రూ.10 వేల కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచుకున్నారని, హైదరాబాద్‌లో ఆరు పబ్‌లుంటే వాటిని 89కి పెంచారని విమర్శించారు. వరంగ ల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, ఏఐసీసీ నేతలు ఏలేటి మహే శ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో కలిసి రేవంత్ గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడు నెలలకోసారి రాహుల్ పర్యటన వరంగల్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా చీప్‌గా ఉన్నాయని, అన్నీ అసత్యాలేనని రేవంత్ అన్నారు. ‘తెలంగాణ ఇస్తే చాలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మీ అయ్య సీఎం కుర్చీ లాక్కోలేదా.. ఉద్యమానికి వెన్నంటి ఉన్న కేకే మహేందర్ రెడ్డిని తప్పించి ఆయన గొంతుకోసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిన నీకు పదవీ వ్యామోహం లేదా? పైగా పదవులు ఎడమకాలి చెప్పు తో సమానమంటావా?’ అంటూ విమర్శలు చేశారు. తెలం గాణలో ఎక్కడ భూఆక్ర మణలు, కబ్జాలు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరిగినా.. వాటి వెనుక టీఆర్ ఎస్ నాయకులే ఉంటున్నారని విమర్శించారు. మే 6, 7న రాహుల్ పర్యటన: రాహుల్ గాంధీ ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్రంలో పర్యటిస్తారని, మే 6, 7న రాహుల్ రాష్ట్ర పర్యటన ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మే 6న జరిగే రైతు సంఘర్షణ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. జీవో 111 రద్దు మరో మోసం: జీవో నంబర్ 111 రద్దు నిర్ణయం మోసగాడి మరో మోసం అని రేవంత్‌రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ఈ జీవోపై హైకోర్టు 2007లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదన్నారు. కుర్చీల కోసం కుమ్ములాట టీపీసీసీ అధ్యక్షుడి సాక్షిగా జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు బయటపడింది. రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ముందువరుసలో కూర్చునే విషయమై రెండు వర్గాలు గొడవపడ్డాయి. వరద రాజేశ్వర్‌రావు అనుచరులపై నాయిని రాజేందర్‌రెడ్డి వర్గం వాగ్వాదానికి దిగి పిడిగుద్దులు కురిపించింది. అలాగే, రేవంత్ వెంట కాన్వాయ్ బయలుదేరేటపుడు తామంటే తాము ముందు వెళ్తామంటూ జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు తోపులాటకు దిగారు. -
పబ్ వ్యవహారాలకు పగ్గాలు లేవా?
బంజారాహిల్స్: తెల్లవారుజాము వరకు మందుబాబులు పబ్‌లను వదిలి బయటకు రావడం లేదు. గొడవలు లేకుండా లేనిరోజులేదు. దీంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. జూబ్లీహిల్స్‌తో పాటు పలు సంపన్న ప్రాంతాల్లో పబ్‌లలో రాత్రి ఒంటిగంటదాటిందంటే లోపల, బయట గొడవల్లేని రోజంటూ ఉండటం లేదు. తాజాగా శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్‌లోని రెండు పబ్‌లలో గొడవలు శృతి మించి రాగాన పడ్డాయి. నెల క్రితం రోడ్ నెం 36లోని ఎయిర్ లైవ్ పబ్‌లో అయిదుగురు యువకులు పీకలదాకా మద్యం సేవించి సమీపంలోని ఓ వైన్‌షాప్‌కు వెళ్ళి వైన్‌బాటిల్ తస్కరిస్తూ పట్టుబడి గొడవకు దిగాడు. నిన్నగాక మొన్న ప్రిజమ్ పబ్‌లో రాహుల్ సిప్లిగంజ్ గొడవ పలు విమర్శలకు దారి తీసింది. నెల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని ఓ పబ్‌కు ఉన్నతాధికారి వెళ్ళి మద్యం మత్తులో గొడవకు దిగాడు. అదే రాత్రి ఆ పబ్ సర్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. తాజాగా మూడు రోజులక్రితం కూడా మరో ఉన్నతాధికారి అదే పబ్‌లో సిబ్బందితో గొడవపడ్డాడు. ఆ కేసు కూడా పోలీసులుదాకా రాకుండానే మూతపడింది. మూడు నెలల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ఓ పబ్‌లో యువ హీరో మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 36లోని రెండు పబ్‌లలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అర్ధరాత్రి ఒంటింగంట దాటిందంటే అమ్మాయిలు బయటికి రాగానే అబ్బాయిలు మత్తులో చెలరేగిపోతుంటారు. పోలీసులుదాకా కొన్ని కేసులు వస్తుంటే మరికొన్ని అక్కడిక్కడే పరిష్కారం అవుతుంటాయి. దీనికి తోడు బౌన్సర్ల దాడులు పెరిగిపోతున్నాయి. మత్తులో యువతీ, యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని నియంత్రించే క్రమంలో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు పది మంది బౌన్సర్లపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో గొడవలపై ఇప్పటికే పది కేసులు నమోదయ్యాయి. మద్యం మత్తులో యువతితో అసభ్య ప్రవర్తన..పబ్ వద్ద గొడవ బంజారాహిల్స్: పబ్‌లో పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పబ్ నుంచి బయటకు వచ్చిన ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పబ్ బయట జరిగిన ఈ గొడవ వివరాలు ఇలా ఉన్నాయి... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ఉన్న హార్ట్‌కప్ పబ్‌లోకి శనివారం రాత్రి పాతబస్తీకి చెందిన ఫిరోజ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఫిరోజ్ ఓ యువతిని వేధించాడు. అయితే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బయటకు వచ్చిన ఫిరోజ్ ఆమె కోసం బయటే వేచి ఉన్నాడు. సదరు యువతి రాగానే వెనక నుంచి వెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
సిటీకి ‘డిసెంబర్’ మానియా
డిసెంబరు నెల వచ్చిందంటే చాలా మందికి పగలు త్వరగా పూర్తయి..రాత్రి వేగంగా వచ్చేస్తుంది. చలి ముసుగుపెట్టిస్తుంది. కొంత మందికి మాత్రం చీకటిపడుతుంటేనే తెల్లవారుతుంది. ఉత్తేజం పెరుగుతుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది. పార్టీలను ఇష్టపడేవారికి ఈ నెలంతా పున్నమే. వెలుగు జిలుగుల వేడుకల వెన్నెలే. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, హైదరాబాద్ : సంవత్సరాంతపు నెలను ఈవెంట్లకు ప్రారంభపు నెలగా పార్టీ సర్కిల్ పేర్కొంటుంది. ఈ నెలలో ఎటు చూసినా పేజ్ త్రీ పార్టీలు, పబ్స్, క్లబ్స్‌లో డీజేల హంగామా ఉధృతంగా ఉంటుంది. మరి ఈ నెలకి ఇంత ప్రయార్టీ దేనికి అంటే... సునామీకి ముందు తుఫాన్లు... సునామీకి ముందు వచ్చే తుఫాన్లలాగా... పార్టీలకే పెద్దన్న లాంటి న్యూ ఇయర్ జోష్ ఈ నెలలో పార్టీ ప్రపంచపు సందడికి ప్రధాన కారణం. సిటీలో వేల సంఖ్యలో న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుగుతాయనేది తెలిసిందే. సదరు ఈవెంట్స్‌లో భాగం అయ్యేందుకు సంసిద్ధమయ్యే పార్టీ ప్రియులను ఆకట్టుకునేలా పార్టీ నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముందస్తుగానే తమ నైట్ ఈవెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో రుచి చూపించాలని తహతహలాడతారు. ఈ నేపథ్యంలో ఈ నెలంతా టాప్ క్లాస్ డీజేలు, లైవ్ బ్యాండ్స్ సిటీ మీద ఓ రకంగా చెప్పాలంటే దండెత్తుతాయి. ప్రీ... కల్చర్ మరో వైపు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన ప్రీ పార్టీ కల్చర్. ప్రధాన ఈవెంట్‌కు ముందు నమూనాగా నిర్వహించే ఈ ప్రీ ఈవెంట్ పార్టీ కల్చర్ న్యూ ఇయర్‌కూ పాకింది. ఇప్పుడు సిటీలో ప్రీ న్యూ ఇయర్ పార్టీల వెల్లువ సహజంగా మారిపోయింది. ఇక పార్టీలు, గెట్ టు గెదర్‌లకు చిరునామా లాంటి క్రిస్మస్ కూడా ఇదే నెలలో కావడంతో కేక్ మిక్సింగ్ ఈవెంట్స్, ప్రీ క్రిస్మస్ వేడుకలు కూడా హోరెత్తుతాయి. సిటీలోని ప్రతి లేడీస్ క్లబ్ ప్రీ క్రిస్మస్ పార్టీ, న్యూ ఇయర్ పార్టీలను తప్పనిసరిగా నిర్వహిస్తాయి. అలా ఈ రెండు ముఖ్యమైన సందర్భాలు కలిసి సిటీలోని పార్టీ సర్కిల్‌కి రాత్రి నిద్రను దూరం చేస్తాయి. నేటి నుంచే నెల సందడి... ఈ ఏడాది డిసెంబరు నెల ప్రారంభమయ్యేది ఆదివారం అయినా వారాంతపు రోజైన శనివారమే సిటీలో పార్టీ జోష్ ఊపందుకుంది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు శంషాబాద్‌లోని జీఎమ్ఆర్ ఎరీనాలో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ ఫెస్టివల్ ‘డోన్ట్ లెట్ డాడీ నౌ’ ఈ జోష్‌కి క్లాప్ కొట్టనుంది. అగ్రగామి అంతర్జాతీయ డీజే ఆఫ్రోజాక్, బ్రూక్స్, సెమ్ వోక్స్ సహా ప్రపంచస్థాయి ప్రజాదరణ పొందిన డీజేలు గ్రెఫ్, గౌరవ్ మెహతా, రోనిక్, రిష్లు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటూ సిటీలో పార్టీ సైరన్‌ని మోగించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని కార్పె డైమ్లో శనివారం రాత్రి 8 గంటల నుంచి 12:30 వరకు బాలీవుడ్ ఫేమస్ డీజే సాష్ క్రేజీ బీట్స్ గుండెల్ని తాకనున్నాయి. వేడుకల హోరు... క్రిస్మస్కు ముందే సిటీలో వెల్లువెత్తుతున్న వేడుకల్లో కొన్ని ఈ నెల నగరం ఎంత హుషారుగా ఉండబోతోందో వెల్లడిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని అలియన్స్ ఫ్రాంచైజ్‌లో ఈ నెల 13న సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రీ క్రిస్మస్ పార్టీ నిర్వహిస్తోంది.. ఫ్రెంచ్ స్నాక్స్, వైన్, గేమ్స్, క్రిస్టమస్ కరోల్స్ ఈ పార్టీ స్పెషల్. అలాగే ఆదివారం బంజారాహిల్స్‌లోని రియాత్లో సాయంత్రం 6 నుంచి 12:30 వరకు సండే సన్డోనర్ బ్రెయిన్ బ్లాస్ట్ లైనప్‌తో నైట్పార్టీ నిర్వహిస్తున్నారు. నగరానికి దగ్గర్లోని వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో న్యూ ఇయర్ప్రీ పార్టీ అండ్ నైట్ క్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డెస్టినేషన్ పార్టీ డిసెంబర్ 28న ప్రారంభం కానుంది. ట్రెక్కింగ్, ఉత్కంఠభరితమైన సూర్యాస్తమయాలు, మనసుకు హాయిగొలిపే సంగీతం, బార్బెక్యూ రాత్రులు...ఇలా పూర్తిగా ప్రకృతి ఒడిలో 2 రోజుల పాటు ప్రీ పార్టీ జరగనుంది. డిసెంబర్ 21న బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో ర్యాపర్‌తో రీ మిక్స్డ్ లైవ్ మరో స్పెషల్ ఈవెంట్. దీనిలో ఇంటర్నేషనల్ ర్యాప్స్టా చెర్రీ డిసౌజా హిప్ హాప్ మ్యూజిక్‌తో కేక పుట్టించనున్నారు. -
నగరంలో ప్రిజమ్ పబ్ ప్రారంభం
-
మైనర్ హర్రర్!
చిన్న వయసులో పెద్ద నేరాలు ♦ ప్రభావితం చేస్తున్న ఇంటర్నెట్, సోషల్ మీడియా ♦ దారి తప్పుతున్న పార్టీ, పబ్ సంస్కృతి ♦ క్షణికావేశంలో కొన్ని.. భయంతో మరికొన్ని.. ♦ 2014–2017లో అరెస్టయిన వారు 8,688 మంది ♦ కొత్త నేరస్తులు 6,726 మంది 634 మంది 18 ఏళ్ల లోపువారే.. ♦ తల్లిదండ్రుల అజమాయిషీ ఉండాలంటున్న పోలీసులు పాశ్చాత్య సంస్కృతి మైనర్లను పెడదారి పట్టిస్తోంది. సమాజంలోని ఆధునిక ధోరణులు యువతను నేరాల వైపు పురిగొల్పుతున్నాయి. తల్లిదండ్రుల అజమాయిషీ లేకపోవడం, పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం, పార్టీ, పబ్ కల్చర్ సైతం మైనర్లను తీవ్రంగా ప్రభావితం చేసి నేరబాట పట్టిస్తున్నాయి. ఏటా పోలీసులకు చిక్కుతున్న నేరస్తుల్లో 70 శాతానికి పైగా కొత్తవారే. వీరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మైనర్లు ఉండడం గమనార్హం. 2014–2017 జూలై మధ్య సిటీ పోలీసులు మొత్తం 8,688 మందిని అరెస్టు చేయగా.. 6,726 మంది (77.41 శాతం) కొత్త నేరగాళ్లు. ఇందులో 634 మంది 18 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ⇔ ప్లస్‌టూ విద్యార్థిని చాందిని జైన్‌ని శనివారం దారుణంగా హత్య చేసిన ఆమె స్నేహితుడు, పూర్వ సహ విద్యార్థి మైనర్. ⇔ ఎల్బీనగర్ ఠాణా పరిధిలో నివసించే 14 ఏళ్ల మైనర్ గత శుక్రవారం తన ఇంటి పక్కనే ఉండే చిన్నారిపైఘాతుకానికి పాల్పడ్డాడు. ⇔ బార్కస్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు మరో మైనర్‌పై జూన్ 28న అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటపడుతుందనే భయంతో అతడిని చంపేశాడు. ⇔ ఈ ఏడాది మార్చిలో జరిగిన డ్రైవర్ భూక్యా నాగరాజు హత్య.. ఈ ఘాతుకానికి పాల్పడిన ఐఏఎస్ అధికారి ఎంవీ రావు కుమారుడు సుక్రు వయసు 19 ఏళ్లే. సాక్షి, సిటీబ్యూరో : సమాజంలో విపరీత ధోరణలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు పరోక్షంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న విచ్చలివిడితనం, అక్కడి సంస్కృతి పిల్లలను, యువతను ప్రభావితం చేస్తున్నాయి. చాందిని జైన్ ఉదంతాన్నే తీసుకుంటే.. పరిస్థితులు ఇక్కడ వరకు రావడానికి సోషల్ మీడియా ప్రభావమూ ఉందని తేలింది. ఫేస్బుక్ కేంద్రంగా ఏర్పాటైన ‘నేషనల్ డిప్లమాట్స్’ అనే పేజ్ అనేక మంది మైనర్లు, మేజర్లను ఏకం చేసింది. వీరంతా ఈనెల 1 నుంచి 3 వరకు నగరంలోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. పగలంతా కొన్ని రకాలైన మాక్ సెషన్స్‌తో సజావుగానే సాగినా.. రాత్రి వేళల్లో మాత్రం శృతిమించింది. సోషలైజింగ్ పేరుతో మైనర్లు, మేజర్లు కలిసి పబ్‌కు వెళ్లడం, ఎక్సేంజింగ్ పేరుతో లింగభేదం లేకుండా గదులు మార్చుకోవడం వంటి విపరీతాలు చోటు చేసుకున్నాయి. మైనర్లను పబ్స్‌లోకి అనుమతించకూడదని, మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన ఉన్నా.. ఈ మూడు రోజులూ అవి ఎక్కడా అమలుకాలేదు. ఆ గెట్ టుగెదర్‌లో చాందినికి పరిచయమైన మరో మైనర్ కారణంగానే వివాదం మొదలై హత్యకు దారితీసింది. తల్లిదండ్రుల అజమాయిషీ లేకా.. నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. పెరిగిన ఖర్చులు, జీవన ప్రమాణాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఇల్లు వదిలి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక మంది మైనర్లు, యువత ఒంటరిగా మారుతున్నారు. దీనికితోడు వీరు సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ఫలితంగా విశృంఖలంగా ఉంటున్న అశ్లీల సైట్లు, ఆ తరహా చాంటిగ్స్కు బానిసలుగా మారుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పరిచయాలు, మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ కొత్త ఆకర్షణలకు లోనవుతున్నారు. మరొపక్క పిల్లలపై పెద్దల అజమాయిషీ కూడా తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న మైనర్ల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. విలాసాలు జీవితంలో భాగమనుకొని.. సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతతో పాటు మైనర్లనూ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సహ విద్యార్థులు, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారితో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా వారు భావిస్తున్నారు. మారిన జీవనశైలి, ఉద్యోగ–వృత్తి–వ్యాపారాల నేపథ్యంలో ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది దగ్గరుండి నేర్పేంత ఖాళీ తల్లిదండ్రులకు ఉండట్లేదు. వారి తర్వాత ఆ స్థాయిలో ఈ బాధ్యతలు నిర్విర్తించాల్సిన ఉపాధ్యాయులు సైతం ఆ విషయం పట్టించుకోవట్లేదు. గురుశిష్యుల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు లేకపోవడం, విద్యా సంస్థ అంటే కేవలం చదువు చెప్పి పంపించే వ్యాపార సంస్థగా మారిపోవడం కూడా మైనర్లు, యువతపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా దశ, దిశ నిర్దేశించే వారు లేకపోవడంతో లోకం పోకడ తెలియని చిన్నారులు సైతం పెడదోవపడుతూ తీవ్రమైన నేరాలు చేస్తున్నారు. ఈ పరిణామాలకు కారణాలనేకం... మైనర్లలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్న వారు, నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడిన తర్వాత వాటి ప్రభావంతో పెడదారులు పడుతున్నారని వివరిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మైనర్లలోనూ విపరీతమైన ధోరణులు పెరుగుతున్నాయని గుర్తించారు. దీంతో పాటు సినిమాలు, టీవీల ప్రభావంతో తెలిసీ తెలియని వయసులోనే ప్రేమాయణాలు, కక్షలు కార్పణ్యాలు వంటివి పెరిగిపోతున్నాయని, ఇలాంటివే అనేక సందర్భాల్లో హత్యలకు దారి తీస్తున్నాయని వివరిస్తున్నారు. -
పబ్ సంస్కృతిని నిషేధించాలి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: పబ్ సంస్కృతిని పూర్తిగా నిషేధించాలని, పబ్‌లు, పాశ్చాత్య సంస్కృతితో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతోందని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం దిల్కుషా అథితి గృహంలో ఆయన మాట్లాడుతూ మరో పదేళ్లలో భారత్ ప్రపంచంలోనే యువశక్తి దేశంగా మారుతుందన్నారు. హైదరాబాద్, విశాఖ లాంటి నగరాల్లో పబ్ కల్చర్ అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో యువత మాదకద్రవ్యాలకు అల వాటు పడడం ఆందోళన కలిగిస్తోంద న్నారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను అధిగమించాలన్నారు. రాష్ట్రంలో నార్కొ టిక్స్ కంట్రోల్ బ్యూరో బలహీనంగా ఉందన్నారు. ఈ విభాగాన్ని బలోపేతంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. -
సింహపురిలో పబ్ కల్చర్
నెల్లూరు(పొగతోట): మహనగరాలు, పట్టణాలకే పరిమితమైన పబ్ కల్చర్‌ను సింహపురి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని సింధూర పబ్ ఓనర్ మాలకొండారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సింధూర పబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పబ్ కల్చర్ ఉందన్నారు. పబ్‌లు లేని కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతోదన్నారు. అటువంటి ఆదాయం రాష్ట్రానికి వచ్చేందుకు అధికారుల సహకారంతో నెల్లూరు నగరంలో పబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. మెట్రో సిటీల్లో అందుబాటులో ఉండే రాబీర్ తదితర విందు, వినోద కార్యక్రమాలు నెల్లూరు ప్రజలకు దరి చేర్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. యువత కేరింతలు కోట్టేలా వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాబోవు ఆరు నెలల్లో బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఇంజనీర్ సుధాకర్ పాల్గొన్నారు. -
వి లవ్ పార్టీ
డీజే పబ్ కల్చర్ ఈ మధ్య కాలంలో సిటీలో ఎక్కువగా విస్తరించింది. వీకెండ్ నైట్స్‌లో కుర్రకారు అలా పబ్‌లకు వెళ్తూ ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు యూత్ ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా డిఫరెంట్ థీమ్ పార్టీలు, రెట్రో స్టైల్, పూల్, రాక్ బ్యాండ్, హేలొవెన్ నైట్స్ వంటి పాపులర్ పార్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి అకేషన్‌ను థీమ్ పార్టీలతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు...’’’అంటున్నారు..ముగ్గురు సిటీ కుర్రాళ్లు. అదీ అంత గట్టిగా ఎలా చెబుతారని అంటున్నారా...? వైజాగ్ పార్టీస్ అనే ఫేస్బుక్ ఈవెంట్స్ మార్కెటింగ్ పేజీని నడుపుతున్న ముగ్గురు కుర్రాళ్లు వైజాగ్‌లో పార్టీల విషయంలో యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆన్లైన్ సర్వే ద్వారా పేజీని ఫాలో అవుతున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. సుమారు 1200 మంది యూత్ ఈ సర్వేలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు. వైజాగ్‌లో పార్టీలకు ఎంత వరకు ఖర్చు చేయొచ్చని అడిన ప్రశ్నకు సుమారు 53.1 శాతం మంది యూత్ 500 రూపాయలు రిజిస్ట్రేషన్ సరిపోతుందని చెప్పగా 30.6 శాతం యూత్ వేయి రూపాయల వరకు వెచ్చించిన ఫర్వాలేదని సమాధానం చెప్పారు. అలానే వైజాగ్‌లో నైట్ పార్టీల్లో ఈ మధ్య కాలంలో బాగా దేనిలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉన్నదనే విషయానికి 46.2 శాతం మంది పార్టీలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైందని సూచించగా, 37.6 శాతం మంది ఆర్టిస్ట్‌లు, డీజేలు ఎక్కువగా వైజాగ్‌లో పార్టీలకు వస్తున్నారని చెప్పారు. అలానే వైజాగ్‌లో పార్టీల్లో క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుంటే అందులో 38.4 శాతం మంది 3 పాయింట్స్ రేటింగ్ ఇవ్వగా 23.2 మంది 4 పాయింట్ రేటింగ్ ఇచ్చారు. అలానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు సంఖ్యలో వైజాగ్ పార్టీల్లో ఎలా ఉందో తెలుసుకుంటే అందులో 86.5 శాతం మంది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందని సమాధానం చెప్పారు. ఇలా వైజాగ్‌లో పార్టీ కల్చర్ గురించి షేర్ చేసుకున్నారు. థీమ్ పార్టీలకే యూత్ ఓటు... యూత్ అంటే బేసిగ్గా లేట్‌నైట్ పార్టీలు, పబ్‌పై ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ నైట్ పార్టీల్లో ముంబాయ్, కోల్‌కతా, బెంగుళూర్, డిల్లీ నుంచి ఫేమస్ డీజేలను తీసుకొచ్చి ఈవెంట్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నైట్ పార్టీలను ఇష్టపడే యూత్ వీటికి ఎట్రాక్ట్ అవుతున్నారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా 500 రూపాయిలు మాత్రమే ఉండడంతో మధ్యతరగతి, హైఫై యూత్ అందరూ వీకెండ్ పార్టీలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలానే మిగిలిన సిటీస్‌తో పోల్చుకుంటే కొన్ని లిమిట్స్‌లో పార్టీలు జరగడంతో యూత్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలానే కొన్ని స్పెషల్ ఈవెంట్స్‌లో ఆర్టిస్ట్‌లను కూడా తీసుకొచ్చి స్పెషల్ అట్రాక్షన్ అందిస్తున్నారు. దాంతోపాటు థీమ్ పార్టీలకు ఈ మధ్య కాలంలో నగరంలో డిమాండ్ బాగా పెరిగింది. కొత్తదనం కోరుకునే సిటీ యూత్ కోసం డిఫరెంట్ థీమ్స్‌తో వీకెండ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. - మహేష్ తేజ, వైజాగ్ పార్టీస్ మేనేజింగ్ డెరైక్టర్ -
కరో కరో..జాల్సా
పబ్ కల్చర్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్న సిటీ యుూత్.. వీకెండ్ వస్తే చాలు కరో కరో జర జల్సా అంటున్నారు. డీజే హోరు.. కుర్రకారు జోరు కలగలిసి.. శనివారం సోమాజిగూడలోని కిస్మత్ పబ్ ఊగిపోరుుంది. అదిరిపోయే ఆటపాటలతో సండే సెలబ్రేషన్స్‌కు గ్రాండ్ వెల్కం చెప్పారు. వుసక వుసక చీకటి.. యుంగ్ హైదరాబాదీస్ కేరింతలకు వేదికైంది. న్యూ ట్రెండ్స్ డిజైనింగ్స్‌లో తళుక్కువున్న యుువతులు కిర్రాక్ డ్యాన్సులతో వుతులు పోగొట్టారు. -
పబ్ కల్చర్‌ను నియంత్రించాలి: శ్రీపాద్ నాయక్
పనాజీ: దేశంలో పబ్ కల్చర్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం గోవాలో ఆయన మాట్లాడుతూ.. పబ్ సంస్కృతి మనదేశానికి సరిపడదని, అందువల్ల దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. మనదేశ సంస్కృతికి పబ్ కల్చర్ సరిపడదని, బీచ్‌ల్లో బికినీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసి గోవా మంత్రి సుదీన్ ధావలీకర్ విమర్శలపాలైన సంగతి తెలిసిందే.