సిటీకి ‘డిసెంబర్‌’ మానియా | Ful Events In December In Hyderabad | Sakshi
Sakshi News home page

నెలంతా.. వెన్నెలే!

Published Sat, Nov 30 2019 9:33 AM | Last Updated on Sat, Nov 30 2019 9:33 AM

Ful Events In December In Hyderabad - Sakshi

అంతర్జాతీయ డీజే ఆఫ్రోజాక్‌

డిసెంబరు నెల వచ్చిందంటే చాలా మందికి పగలు త్వరగా పూర్తయి..రాత్రి వేగంగా వచ్చేస్తుంది. చలి ముసుగుపెట్టిస్తుంది. కొంత మందికి మాత్రం చీకటిపడుతుంటేనే తెల్లవారుతుంది. ఉత్తేజం పెరుగుతుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది. పార్టీలను ఇష్టపడేవారికి ఈ నెలంతా పున్నమే. వెలుగు జిలుగుల వేడుకల వెన్నెలే.  
– సాక్షి, సిటీబ్యూరో 

సాక్షి, హైదరాబాద్‌ : సంవత్సరాంతపు నెలను ఈవెంట్లకు ప్రారంభపు నెలగా పార్టీ సర్కిల్‌ పేర్కొంటుంది. ఈ నెలలో ఎటు చూసినా పేజ్‌ త్రీ పార్టీలు, పబ్స్, క్లబ్స్‌లో డీజేల హంగామా ఉధృతంగా ఉంటుంది. మరి ఈ నెలకి ఇంత ప్రయార్టీ దేనికి అంటే... 

సునామీకి ముందు తుఫాన్లు... 
సునామీకి ముందు వచ్చే తుఫాన్లలాగా... పార్టీలకే పెద్దన్న లాంటి న్యూ ఇయర్‌ జోష్‌ ఈ నెలలో పార్టీ ప్రపంచపు సందడికి ప్రధాన కారణం. సిటీలో వేల సంఖ్యలో న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌ జరుగుతాయనేది తెలిసిందే. సదరు ఈవెంట్స్‌లో భాగం అయ్యేందుకు సంసిద్ధమయ్యే పార్టీ ప్రియులను ఆకట్టుకునేలా పార్టీ నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముందస్తుగానే తమ నైట్‌ ఈవెంట్స్‌ ఏ స్థాయిలో ఉంటాయో రుచి చూపించాలని తహతహలాడతారు. ఈ నేపథ్యంలో ఈ నెలంతా టాప్‌ క్లాస్‌ డీజేలు, లైవ్‌ బ్యాండ్స్‌ సిటీ మీద ఓ రకంగా చెప్పాలంటే దండెత్తుతాయి.  

ప్రీ... కల్చర్‌ 
మరో వైపు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన ప్రీ పార్టీ కల్చర్‌. ప్రధాన ఈవెంట్‌కు ముందు నమూనాగా  నిర్వహించే ఈ ప్రీ ఈవెంట్‌ పార్టీ కల్చర్‌ న్యూ ఇయర్‌కూ పాకింది. ఇప్పుడు సిటీలో ప్రీ న్యూ ఇయర్‌ పార్టీల వెల్లువ సహజంగా మారిపోయింది. ఇక పార్టీలు, గెట్‌ టు గెదర్‌లకు చిరునామా లాంటి క్రిస్మస్‌ కూడా ఇదే నెలలో కావడంతో కేక్‌ మిక్సింగ్‌ ఈవెంట్స్, ప్రీ క్రిస్మస్‌ వేడుకలు కూడా హోరెత్తుతాయి. సిటీలోని ప్రతి లేడీస్‌ క్లబ్‌ ప్రీ క్రిస్మస్‌ పార్టీ, న్యూ ఇయర్‌ పార్టీలను తప్పనిసరిగా నిర్వహిస్తాయి. అలా ఈ రెండు ముఖ్యమైన సందర్భాలు కలిసి సిటీలోని పార్టీ సర్కిల్‌కి రాత్రి నిద్రను దూరం చేస్తాయి. 

నేటి నుంచే నెల సందడి... 
ఈ ఏడాది డిసెంబరు నెల ప్రారంభమయ్యేది ఆదివారం అయినా వారాంతపు రోజైన శనివారమే సిటీలో పార్టీ జోష్‌ ఊపందుకుంది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు శంషాబాద్‌లోని జీఎమ్‌ఆర్‌ ఎరీనాలో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ‘డోన్ట్‌ లెట్‌ డాడీ నౌ’ ఈ జోష్‌కి క్లాప్‌ కొట్టనుంది. అగ్రగామి అంతర్జాతీయ డీజే ఆఫ్రోజాక్, బ్రూక్స్, సెమ్‌ వోక్స్‌ సహా ప్రపంచస్థాయి ప్రజాదరణ పొందిన డీజేలు గ్రెఫ్, గౌరవ్‌ మెహతా, రోనిక్, రిష్‌లు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటూ సిటీలో పార్టీ సైరన్‌ని మోగించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని కార్పె డైమ్‌లో శనివారం రాత్రి 8 గంటల నుంచి 12:30 వరకు బాలీవుడ్‌ ఫేమస్‌ డీజే సాష్‌ క్రేజీ బీట్స్‌ గుండెల్ని తాకనున్నాయి. 

వేడుకల హోరు... 
క్రిస్మస్‌కు ముందే సిటీలో వెల్లువెత్తుతున్న వేడుకల్లో కొన్ని ఈ నెల నగరం ఎంత హుషారుగా ఉండబోతోందో వెల్లడిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని అలియన్స్‌ ఫ్రాంచైజ్‌లో ఈ నెల 13న సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు  ప్రీ క్రిస్మస్‌ పార్టీ నిర్వహిస్తోంది.. ఫ్రెంచ్‌ స్నాక్స్, వైన్, గేమ్స్, క్రిస్టమస్‌ కరోల్స్‌ ఈ పార్టీ  స్పెషల్‌. అలాగే ఆదివారం బంజారాహిల్స్‌లోని రియాత్‌లో సాయంత్రం 6 నుంచి 12:30 వరకు సండే సన్‌డోనర్‌ బ్రెయిన్‌ బ్లాస్ట్‌ లైనప్‌తో నైట్‌పార్టీ నిర్వహిస్తున్నారు. నగరానికి దగ్గర్లోని వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో న్యూ ఇయర్‌ప్రీ పార్టీ అండ్‌ నైట్‌ క్యాపింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డెస్టినేషన్‌ పార్టీ డిసెంబర్‌ 28న ప్రారంభం  కానుంది. ట్రెక్కింగ్, ఉత్కంఠభరితమైన సూర్యాస్తమయాలు, మనసుకు హాయిగొలిపే సంగీతం, బార్బెక్యూ రాత్రులు...ఇలా పూర్తిగా ప్రకృతి ఒడిలో 2 రోజుల పాటు ప్రీ పార్టీ జరగనుంది. డిసెంబర్‌ 21న బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో ర్యాపర్‌తో రీ మిక్స్‌డ్‌ లైవ్‌ మరో స్పెషల్‌ ఈవెంట్‌. దీనిలో ఇంటర్నేషనల్‌ ర్యాప్‌స్టా చెర్రీ డిసౌజా  హిప్‌ హాప్‌ మ్యూజిక్‌తో కేక పుట్టించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement