![Telangana High Court Serious comments On PUB Culture](/styles/webp/s3/article_images/2024/10/28/Tg%20highcourt.jpg.webp?itok=DCOGmIWz)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు తాగి జల్సాలు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. పబ్‌ల విషయంలో మరిన్ని నిబంధనలను విధించాలనా ఆదేశించింది.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూబ్లీహిల్స్‌లో 55 నుంచి 60 పబ్‌లు ఉన్నాయి. రోడ్ నంబర్-12, రోడ్ నంబర్-36లో రోజుకో ప్రమాదం జరుగుతోంది. బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు జల్సాలు చేస్తున్నారు. మద్యం తాగి ఱ్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పబ్బుల బయట డ్రైవ్‌లు పెట్టి ప్రమాదాలను నివారించాలి. పబ్‌లకు మరిన్ని నిబంధనలు విధించాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది.
![రోడ్డు ప్రమాదాల పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు](https://www.sakshi.com/s3fs-public/inline-images/ro.jpg)
Comments
Please login to add a commentAdd a comment