jublie hills
-
అజహరుద్దీన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు మాగంటి గోపీనాథ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక అంశం కోర్టుకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అజారుద్దీన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరో తేదీ వరకు రిజయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదాలు.. పబ్స్ విషయంలో హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు తాగి జల్సాలు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. పబ్‌ల విషయంలో మరిన్ని నిబంధనలను విధించాలనా ఆదేశించింది.హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూబ్లీహిల్స్‌లో 55 నుంచి 60 పబ్‌లు ఉన్నాయి. రోడ్ నంబర్-12, రోడ్ నంబర్-36లో రోజుకో ప్రమాదం జరుగుతోంది. బడా బాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు జల్సాలు చేస్తున్నారు. మద్యం తాగి ఱ్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పబ్బుల బయట డ్రైవ్‌లు పెట్టి ప్రమాదాలను నివారించాలి. పబ్‌లకు మరిన్ని నిబంధనలు విధించాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. -
జూబ్లీహిల్స్ దోపిడి కేసులో అగంతకుడి కోసం పోలీసుల గాలింపు
-
హైదరాబాద్‌లో భారీ వర్ష బీభత్సం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన సైతం కురిసింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక, శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలో వడగండ్లతో భారీ వర్షం కురిసింది. అటు, హైదరాబాద్‌లో కూడా శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములతో కూడిన వడగండ్ల వర్షం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, జగిత్యాల జిల్లా భీమారంలో వడగండ్ల వాన దంచికొట్టింది.కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ సందర్భంగా ఈదురు గాలుల తాకిడితో పలు రేకుల షేడ్లు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం నెలకొంది. గంగాధర మండల కేంద్రంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. ఇక, ఏపీలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. Hailstorm rain 🌧️ at #Hyderabad Total grass covered with ice. pic.twitter.com/niIjsoA3Gx — ma_saravanan (@masaravanan73) March 18, 2023 Ice rain Hyderabad lo pic.twitter.com/NKCZpWtBho — Prabhas (@Kranthi_1322) March 18, 2023 Good rain in Chanda nagar Hyderabad pic.twitter.com/DU1abxHsYk — CV Reddy (@cvreddy2) March 18, 2023 -
జూబ్లీహిల్స్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో పేదలకు ఇళ్లు
హైదరాబాద్: హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీలైతే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్‌లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు, క్లబ్‌లకు పదుల ఎకరాల స్థలం ఉందని వివరించారు. వాటిలో చాలా భాగం నిరుపయోగంగా ఉందని, ఈ స్థలాలను పేదల గృహనిర్మాణాలకు ఉపయోగిస్తామని కేసీఆర్ చెప్పారు. నిలువ నీడలేని పేదలకు ఇల్లు కట్టించేందుకు విలువైన స్థలాలు ఉపయోగిస్తే తప్పులేదని అన్నారు. బుధవారం కేసీఆర్ హైదరాబాద్‌లోని పేదల గృహ నిర్మాణాలపై కూడా సమీక్ష నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా హైదరాబాద్‌లో ఇళ్లు లేని పేదలు 2 లక్షలమంది ఉన్నారని తేలిందని కేసీఆర్ అన్నారు. పేదలందరికీ ప్రభుత్వం తరపున ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. వచ్చే ఏడాదికల్లా తెలంగాణలో నిరంతర విద్యుత్: వచ్చే ఏడాది నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేసీఆర్ ఈ రోజు విద్యుత్ సరఫరా తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది రెండో పంటకు పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లగొండలో నిర్మించనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. దీనికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌గా పేరును ఖరారు చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.