‘టాస్’ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు
పోలీసుల దాడుల్లో వెలుగుచూసిన వైనం
బంజారాహిల్స్: పక్కన కూర్చుంటే రూ. 500.. మీద చెయ్యి వేస్తే రూ. 1000.. సరసాలు ఆడితే రూ. 1500.. అర్ధనగ్న నృత్యాలు చేస్తే రూ. 2,000.. ఇవీ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3లో టేల్స్ ఓవర్ ద స్పిరిట్స్ (టాస్) పబ్‌కు వచ్చే కస్టమర్ల నుంచి పబ్ నిర్వాహకులు వసూలు చేస్తున్న ఫీజులు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాని అసాంఘిక కార్యకలాపాలుకు పాల్పడుతూ యువతులను ఎరగా వేసి యువకులను రెచ్చగొడుతున్న సదరు పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్‌్కఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
వివరాలివీ... టాస్ పబ్‌లో కొంతకాలంగా అమ్మాయిలను ఎరగా వేస్తూ అబ్బాయిలను ఆకర్షిస్తూ పెద్ద ఎత్తున మద్యం తాగేలా ప్రోత్సహిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో శుక్రవారం రాత్రి 12 గంటలకు ఈ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఊగిపోతున్న యువకులు, అర్ధనగ్న నృత్యాలతో యువతులు, అధిక శబ్ధంతో డీజే, పబ్ ఆవరణ అంతా ఒక రకమైన మత్తుతో ఊగిపోతుండటాన్ని పోలీసులు గమనించారు. మొత్తం 100 మంది యువకులను అదుపులోకి తీసుకుని వీరందరికీ నోటీసులు ఇచ్చి పంపించారు. మరో 42 మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా అందులో 10 మంది యువతులు ఇలాంటి కేసుల్లోనే గతంలో రెండు మూడు పబ్‌ల్లో పట్టుబడ్డట్లు తేల్చారు.
32 మంది యువతులకు నోటీసులు ఇచ్చి 10 మంది యువతులను అరెస్టు చేశారు. అలాగే పబ్ యజమానులు ఉప్పల్‌కు చెందిన డింగి బలరామ్‌గౌడ్, జగద్గిరిగుట్టకు చెందిన డింగి శ్రీనివాస్‌గౌడ్, మేనేజర్ అలీం, బార్ టెండర్ రామకృష్ణ, డీజే ప్లేయర్ ఆసిఫ్, బౌన్సర్లు ఆరీఫ్, అబ్దుల్ సమీ, యూసఫ్ ఖాసీంఖాన్, సయ్యిద్ షాహిద్‌లపై సెక్షన్ 294, 290, 420, 188, 268, 120 (బి), 70 (బి) కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్ యజమానులు బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు పరారీలో ఉండగా వీరిద్దరి కోసం పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు. మిగతా ఏడు మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment