పబ్ సంస్కృతిని నిషేధించాలి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: పబ్ సంస్కృతిని పూర్తిగా నిషేధించాలని, పబ్‌లు, పాశ్చాత్య సంస్కృతితో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతోందని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం దిల్‌కుషా అథితి గృహంలో ఆయన మాట్లాడుతూ మరో పదేళ్లలో భారత్ ప్రపంచంలోనే యువశక్తి దేశంగా మారుతుందన్నారు.
హైదరాబాద్, విశాఖ లాంటి నగరాల్లో పబ్ కల్చర్ అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో యువత మాదకద్రవ్యాలకు అల వాటు పడడం ఆందోళన కలిగిస్తోంద న్నారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను అధిగమించాలన్నారు. రాష్ట్రంలో నార్కొ టిక్స్ కంట్రోల్ బ్యూరో బలహీనంగా ఉందన్నారు. ఈ విభాగాన్ని బలోపేతంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు.