Union Minister Dattatreya
-
బీసీల డిమాండ్లు కేంద్రానికి వివరిస్తా
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బీసీల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు తదిత ర అంశాలపై ఆదివారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘ నేతలు దత్తాత్రేయను కలిశారు. ఈ సందర్భంగా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆగస్టు 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రిజర్వేషన్ల పెంపుతో పాటు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ఢిల్లీలో అన్ని పార్టీల అధినేతలను కలసి మద్దతు కోరతామ న్నారు. ఇందుకు బీసీ సంక్షేమ సంఘం నేతలతో కోర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
జాబ్‌మేళా.. జనమేళా
♦ రైల్వే జాబ్‌మేళాకు వివిధ ప్రాంతాల నుంచి 25 వేల మంది హాజరు ♦ ప్రారంభించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ హైదరాబాద్: రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ మేళాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. వివిధ కంపెనీల్లోని 10 వేల ఉద్యో గాల కోసం నిర్వహించిన ఈ మేళాకు 21 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా... 25 వేల మంది హాజరయ్యారు. దీంతో ప్రాంగణం కిటకిట లాడింది. పరిసర ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణమధ్య రైల్వే 6వ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయ వాడ, గుంతకల్లు, నాందేడ్ సర్కిళ్ల రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు ఐదువేల మందికి నియామక ఉత్తర్వులిచ్చాయి. మిగిలిన ఐదువేల మందికి వారం తరువాత ఉత్తర్వులిచ్చి, శిక్షణ కార్య క్రమాలు చేపడతామన్నాయి. అయితే ఇందులో పాల్గొన్న 109 కంపెనీల్లో చాలావరకు టెలీకాలర్, సేల్స్, డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలే ప్రకటించడంతో ఎంతో ఆశతో వచ్చిన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు. 100 కెరీర్ గైడెన్స్ కేంద్రాలు: దత్తాత్రేయ దేశoలో 60 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వివిధ పథ కాలు తెస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవా లని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బ్రెజిల్ తదితర దేశాలతో ఉద్యోగ నియామకాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశ వ్యాప్తంగా 100 జాతీయ కెరీర్ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ కేంద్రం ప్రారంభించామని, త్వరలో వరంగల్, కరీంన గర్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, చిత్తూరు, వైజాగ్‌లలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందులో ఉద్యోగాలు రాని వారి కోసం ఆగస్టు మొదటి వారంలో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు. -
పబ్ సంస్కృతిని నిషేధించాలి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: పబ్ సంస్కృతిని పూర్తిగా నిషేధించాలని, పబ్‌లు, పాశ్చాత్య సంస్కృతితో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతోందని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం దిల్కుషా అథితి గృహంలో ఆయన మాట్లాడుతూ మరో పదేళ్లలో భారత్ ప్రపంచంలోనే యువశక్తి దేశంగా మారుతుందన్నారు. హైదరాబాద్, విశాఖ లాంటి నగరాల్లో పబ్ కల్చర్ అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో యువత మాదకద్రవ్యాలకు అల వాటు పడడం ఆందోళన కలిగిస్తోంద న్నారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను అధిగమించాలన్నారు. రాష్ట్రంలో నార్కొ టిక్స్ కంట్రోల్ బ్యూరో బలహీనంగా ఉందన్నారు. ఈ విభాగాన్ని బలోపేతంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. -
దత్తన్న ప్రొటోకాల్ వివాదం: ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: మహంకాళి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రొటోకాల్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్‌రావుపై బదిలీ వేటు పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దత్తాత్రేయ వాహనాలను నిలిపివేసినందుకు గాను బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర మంత్రి ప్రొటోకాల్‌ను పాటించకుండా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై దుమారం రేగింది. ఈ వ్యవహారంపై నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అదనపు కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావుతో విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో గోపాలపురం ఏసీపీని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు వెలువడినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి -
నేడు మహిళల మెగా జాబ్‌మేళా
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళల కోసం కేంద్ర కార్మిక శాఖ జాబ్‌మేళా నిర్వహిస్తోంది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో శనివారం మధ్యాహ్నం 2గంటలకు కేంద్రమంత్రి దత్తాత్రేయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, అలహాబాద్ బ్యాంకు తదితర 7 బ్యాంకుల ద్వారా ముద్ర, స్టార్టప్, స్టాండప్ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ష్యూర్ ఐటీ, హెచ్జీఎస్ ఇంటర్నేషనల్, టపాడియాటెక్, పంజర్ టెక్నాలజీస్, టీబీఎస్ఎస్ కార్వే, మెర్లిన్, కెయూఎన్ యునైటెడ్, ఇన్స్టేమి, ఏఆర్ఐఎస్ ఈహెచ్‌ఆర్, అడ్వెంట్ గ్లోబల్ తదితర 60 కంపెనీలు పాల్గొంటాయి. 2 వేల ఉద్యోగాలిచ్చేలా కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
ప్రజోపయోగంగా కాళేశ్వరం రీ డిజైన్
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సూచన ♦ గతంలో ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులన్నీ నీటిపాలయ్యాయి ♦ అలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దు ♦ మేడిగడ్డ వద్ద 88 టీఎంసీల నిల్వతో భారీ డ్యామ్ కట్టాలి ♦ ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సూచన ♦ ‘గోదావరి’ జలాలపై శ్రీరాం పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్ : గోదావరిపై గత ప్రభు త్వాలు నిర్మించిన ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులన్నీ నీటి పాలయ్యాయని, అలాంటి పరిస్థితి పునరావృతం కారాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లభ్యత జలాలను సంపూర్ణంగా వినియోగం లోకి తెస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందుకు తగ్గట్లే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని సూచించారు. ఆదివారం కేంద్ర జల వనరుల శాఖ సలహా దారు, రాజస్తాన్ జల వనరుల అభివృబ్ధి విభా గం చైర్మన్ శ్రీరాం వెదిరె రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియోగం– జాతీయ, తెలం గాణ రాష్ట్ర దృక్పథాలు’అనే పుస్తకా విష్కరణ కార్యక్రమం ఇక్కడి మారియట్ హోటల్లో జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం శ్రీరాం వెదిరె సలహాలు స్వీకరిం చాలని, అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ సూచించారు. మేడిగడ్డ వద్ద 20 టీఎంసీల డ్యామ్ సరిపోదు: శ్రీరాం వెదిరె గోదావరి జలాల వినియోగం, ప్రణాళికలపై శ్రీరాం వెదిరె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘భావి తరాలకు గోదావరి నీటిని పూర్తి స్థాయిలో అందించాలంటే కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యామ్ నిర్మాణం సరిపోదు. 115 మీటర్ల ఎత్తులో 88 టీఎంసీల సామర్థ్యంతో భారీ డ్యామ్ కడితేనే రాష్ట్రానికి ప్రయోజనం. 350 టీఎంసీల వరకు నీటిని వాడుకోవచ్చు. భారీ డ్యామ్ కట్టకుంటే తెలంగాణకు భవిష్యత్ లేదు. అనుకున్న లబ్ధిపొందలేం’ అని పేర్కొన్నారు. 115 మీటర్ల ఎత్తులో తెలంగాణలో 210 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్రలో 113 చదరపు కిలోమీటర్లు మాత్రమే ముంపు ఉం టుందని, ఇందులో సగం రివర్ బెడ్‌లోనే ఉం టుందని తెలిపారు. ఈ డ్యామ్ కడితే చేవెళ్ల వరకు నీటిని తరలించి అక్కడి నుంచి పాల మూరు, రంగారెడ్డి జిల్లాలోని రిజర్వాయ ర్లకు సైతం 50 టీఎంసీల మేర నీటిని తర లించవచ్చని తెలిపారు. ఇక బూర్గంపాడ్ మొదలు, దుమ్ముగూడెం, ఇచ్ఛంపల్లి, కంత నపల్లి, మంథని, ఎల్లంపల్లి వరకు, అక్కడి నుంచి ఎస్సారెస్పీ మధ్య మరో తొమ్మిది బ్యారేజీల నిర్మాణం చేస్తే నదీ పరీవాహకం అంతా రిజర్వాయర్లా మారుతుందని తెలిపారు. దీంతో జల రవాణా సులభతరం అవుతుందన్నారు. జల రవాణాతో ఏకంగా కోటి ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు. నదుల అనుసంధానం చేస్తూ, నౌకాయానానికి అవకాశం ఇవ్వడంతో బృహ త్ ప్రయోజనాలు ఉంటాయని, గరిష్ట విద్యు దుత్పత్తి సాధ్యం అవుతుందని తెలిపారు. పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ముంపు తక్కువ, ఎక్కువ ప్రయోజనాలనిచ్చే శ్రీరాం సూచనలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. ప్రధానిస్థాయిలో చర్చ జరగాలి: రామచంద్రమూర్తి ‘రాష్ట్రంలో 1998 నుంచి 3.50 లక్షల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. అయినా పార్లమెంట్, అసెంబ్లీలో గంట కూడా చర్చ జరగలేదు’అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాజెక్టుల్లో రీ డిజైన్ చేస్తున్నారు. దాన్ని అంగీకరించని వాళ్లని తెలంగాణ విరో ధులుగా ముద్ర వేస్తున్నారు. అది సమంజసం కాదు. అందరి ఆలోచనలు స్వీకరించాలి. నదు ల అనుసంధానం, ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రధానమంత్రి స్థాయిలో చర్చ జరగాలి. గతం లో హనుమంతరావు, రాజారెడ్డి వంటి ఇంజ నీర్ల సేవలను మన ప్రభుత్వాలు ఉపయోగిం చుకోలేదు. కానీ వారి సేవలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి. శ్రీరాం వెదిరె సేవలను రాష్ట్రం గుర్తించకున్నా రాజస్తాన్ గుర్తించింది’ అని అన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి, ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సౌదీలో మెదక్ జిల్లా వాసి మృతి
చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం కామారం తండాకు చెందిన కటవత్ రవి(40) సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం కలిబులిలో రోడ్డు పక్కన ఇసుకను లోడ్ చేస్తుండగా రవిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అత ను మరణించాడు. రవి విజిట్ వీసాపై వెళ్లి అక్కడే పది నెలలుగా ఉన్నట్లు అతని సోదరుడు హరినాయక్ తెలిపారు. రవి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహకరించాలని గిరిజనులు కోరారు. -
దుర్గామాత శక్తికి నాంది: దత్తాత్రేయ
-
ఎన్ని గంటలన్నది ముఖ్యం కాదు!
మోదీ పర్యటనపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్ : ప్రధానిగా తొలి సారి తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్ని గంటలు పర్యటిస్తున్నారన్నది ముఖ్యం కాదని, ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నదే ముఖ్యమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఒకే పర్యటనలో ఐదు భారీ కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనుండటం తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వచ్చే నెల 7న రాష్ట్ర పర్యటనలో భాగంగా మోదీ పాల్గొనే కార్యక్రమాల వివరాలను శనివారం దత్తాత్రేయ విలేకరులకు వెల్లడించారు. వచ్చే నెల 7న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మోదీ గజ్వేల్‌లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని, సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో రూ.10 వేల కోట్ల వ్యయంతో చేపట్టే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారాన్నరు. పెండింగ్‌లో ఉన్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే గతంలో మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6 వేల కోట్ల వ్యయంతో పునరుద్ధరించే పనులను సైతం ప్రధాని ప్రారంభిస్తారన్నారు. వీటితో పాటు వరంగల్‌లో 300 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన రెడీమేడ్ వస్త్రాల టెక్స్టైల్ పార్కు పనులకు శంకుస్థాపనతో పాటు మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభోత్సవం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మించిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లోనే రిమోట్ ద్వారా పైన పేర్కొన్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని చేస్తారన్నారు. -
త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ దేశాలతో కార్మిక సంబంధాలను పటిష్టపర్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు ఒప్పందాలకు సిద్ధమవుతోంది. వలస కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమం కోసం త్వరలో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బ్రిక్స్ ఎంప్లాయీమెంట్ వర్కింగ్ గ్రూపు(బీఈడబ్ల్యూజీ) సమావేశాలు బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సమావేశాల విశేషాలను ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఈడబ్ల్యూజీ తొలి సమావేశాలు భారతదేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల్లో ఉపాధి సృష్టి, కార్మికుల సామాజిక భద్రతపై పరస్పర అవగాహన ఒప్పందం, కార్మిక శిక్షణ సంస్థల అనుసంధానం అనే మూడు అంశాలపై ఆ దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారని తెలిపారు. ఈ చర్చల ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే సెప్టెంబర్‌లో ఆగ్రాలో జరగనున్న బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి కల్పన మంత్రుల సమావేశంలో వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంటామని మంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన జీ-20 దేశాలు పరస్పరం సహకరించుకుంటున్న విధంగా ‘బ్రిక్స్’ దేశాలు సైతం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దేశ యువజన జనాభా 80 కోట్ల వరకు ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా వీరందరికీ దేశ, విదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. 10 మంది, అంతకు మించిన సంఖ్యలో కార్మికులతో నడుస్తున్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఏడాదిలో 365 రోజులూ రాత్రింబవళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని’ తీసుకొచ్చామన్నారు. భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించి రాత్రివేళల్లో మహిళలకు ఉపాధి కల్పించవచ్చని దత్తాత్రేయ చెప్పారు. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది దుకాణాలు, వ్యాపార సంస్థల ఇష్టమన్నారు. ఈ చట్టంతో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. -
26 నుంచి మోదీ రెండేళ్ల పండుగ
కేంద్ర మంత్రి దత్తాత్రేయ హైదరాబాద్: ‘మోదీ రెండేళ్ల పండుగ’ను ఈ నెల 26 నుంచి జూన్ 26 వరకు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. కేంద్రం, రాష్ట్ర బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ ఉత్సవాలు జరపనున్నట్లు తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, వాటి వల్ల లబ్ధిపొందిన వారిని నేరుగా కలవనున్నట్లు వెల్లడించారు. ‘యువతా మేలుకో నైపుణ్యం పెంచుకో’ అనే నినాదంతో రూపొందిం చిన స్కిల్ డెవలప్మెంట్ పథకానికి కేంద్రం రూ.1,600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ఏర్పాటు చేస్తున్న 8 ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న పదేళ్లలో దాదాపు 5 కోట్ల మంది వీటి ద్వారా ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో త్వరలో మూడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, అట్టడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు నేరుగా అభివృద్ధి ఫలాలను అందించేందుకు ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దేశంలోని 5 లక్షల గ్రామాలకు రూ.2 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా అందజేసిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్, వామపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. -
ఎస్బీ పల్లిని దత్తత తీసుకుంటా!
కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటన కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం ఎస్బీ పల్లిని దత్తత తీసుకుంటానని కేంద్ర కార్మికశాఖ మం త్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం ఇక్కడ నిర్వహించిన గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ అభియాన్ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలు బలపడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 23 గ్రామీణ పథకాలను అమలు చేస్తే ఎస్బీ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా ఉద్యోగాల కల్పనకుగాను నేషనల్ క్యారియర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం
కేంద్రమంత్రి దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. ఈ సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ైహైకోర్టు విభజనపై చర్చించినట్టు పేర్కొన్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనను న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరిత గతిన విభజన ప్రక్రియ పూర్తిచేయాలని కోరామన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు. -
రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పంచాంగ శ్రవణం జరిగింది. జ్యోతిష పండితుడు సంతోష్‌కుమార్‌శాస్త్రి చేసిన పంచాంగ పఠనానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ ఏడాది చివరి నుంచి బీజేపీకి రాష్ట్రంలో, కేంద్రంలో అనుకూల పరిస్థితులు ఉంటాయని పండితులు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య వైరుధ్యాలొస్తాయని, వాటిని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు కేంద్రానికే ఉంటాయన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ... రాజకీయాలు, పార్టీలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని, తెలంగాణలోనూ ప్రభుత్వానికి సహకరిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర సహకారం ఉంటుందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరం, కొత్త కార్యాచరణతో ముందుకు పోతామన్నారు. ఇప్పటిదాకా నిర్మాణంపై దృష్టిపెట్టామని, భవిష్యత్తులో ప్రజాసమస్యలపై కార్యాచరణ ఉంటుందన్నారు. బీజేపీ సుదర్శన హోమం: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన హోమాన్ని కిషన్‌రెడ్డి నిర్వహించారు. కరువు పరిస్థితులు పోవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ హోమాన్ని చేశా రు. పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, నేతలు పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు కేంద్ర నిధులతో ఇళ్లు
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి ♦ పెన్షన్, పీఎఫ్ సెటిల్మెంట్లకు ‘శ్రమ్ సువిధ’ పోర్టల్ ♦ కింగ్‌ఫిషర్ ఉద్యోగుల హక్కుల కోసం స్క్వాడ్ సాక్షి, హైదరాబాద్: బీడీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర నిధులతో పక్కా గృహాలు కట్టిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్, సిద్దిపేటలను గుర్తించామని, రాష్ట్రం ప్రభుత్వం స్థలం ఇస్తే మోడల్ హౌస్‌లు నిర్మిస్తామన్నారు. అలాగే ఏపీలో ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భవిష్య నిధి కార్యాలయంలో తెలంగాణ, ఏపీలకు చెందిన ఈపీఎఫ్ అధికారులతో దత్తాత్రేయ సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు పెన్షన్, క్లెయిమ్‌లు, సెటిల్మెంట్లను పారదర్శకంగా నిర్వహించేం దుకు ‘శ్రమ్ సువిధ’ వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కార్మిక సేవలను సులభతరం చేస్తున్నామన్నారు. తెలంగాణలో 29,269 పరిశ్రమలలో 36.91 లక్షల మందికి, ఏపీలో 22,706 పరిశ్రమల్లో 13.29 లక్షల మందికి భవిష్య నిధి సభ్యత్వం ఉందన్నారు. యాజ మాన్యాలతో సంబంధం లేకుండా వీరికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా పీఎఫ్ సొమ్ము నేరుగా పొందేలా కృషి చేస్తున్నామన్నారు. కార్మికుల కనీస వేతనాన్ని పెంచాలని భావిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టామన్నారు. బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ‘కింగ్‌ఫిషర్’ యజమాని విజయ్‌మాల్యా విదేశాలకు పారిపోవడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ఒక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తమ శాఖ తరఫున వేసిన కమిటీ నివేదిక ఆధారంగా ‘కింగ్‌ఫిషర్’ నుంచి ఏ మేరకు నిధులు రావాల్సి ఉందో.. వాటన్నింటినీ రాబట్టి ఉద్యోగులకు అందిస్తామన్నారు. పార్లమెంటులో ఆధార్ బిల్లుకు ఆమోదం వల్ల కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ కాంగ్రెస్, వామపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తూ కీలక బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గుంటూరు రీజనల్ అధికారులు ఎం.ఎస్.కె.వి.వి. సత్యనారాయణ, కె.నారాయణ, పి.వీరభద్రస్వామి పాల్గొన్నారు. -
పీఎఫ్ చెల్లించకుంటే ఉద్యమిస్తాం: ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: కార్మికుల మూల వేతనం, కరువు భత్యం కలిపి రూ.15 వేలు మించితే పీఎఫ్ జమకట్టే బాధ్యత నుంచి వైదొలగాలనే ఆర్టీసీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎన్ఎంయూ పేర్కొంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక చర్యలకు ఉపక్రమిస్తే ఉద్యమిస్తామని యూనియన్ నేతలు శంకర్‌రెడ్డి, రమేశ్, మహమూద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. గతంలో పీఎఫ్ సొమ్మును వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని, దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఆశా, అంగన్వాడీలకూ ఈఎస్ఐ సేవలు
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ♦ రూ.250 నెలసరి మొత్తంతో కుటుంబం మొత్తానికి వైద్య సదుపాయం ♦ ఈఎస్ఐ ఆసుపత్రుల్లోని అన్ని సేవలూ అందేలా కొత్త పథకం సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగంలోని కార్మికులకూ వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఇందులో భాగంగా ఆశా, అంగన్వాడీ వర్కర్ల కుటుంబాలకు ఈఎస్ఐ సేవలను విస్తరించేందుకు ఒక పథకాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నిర్మాణ రంగ కూలీల కోసం వైద్యబీమా పథకాన్ని ఇప్పటికే ప్రారంభించగా, రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లకు ఢిల్లీ, హైదరాబాద్‌లలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ సేవలు అందిస్తామని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) 168వ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ఆ సమావేశం వివరాలను విలేకరులకు వివరించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నెలకు రూ.250 చెల్లించడం ద్వారా ఈఎస్ఐ పథకంలో భాగస్వాములు కావచ్చునని, దీని ద్వారా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వైద్య సేవలను పొందడానికి కార్మికుడి కుటుంబానికి అర్హత లభిస్తుందని మంత్రి వివరించారు. ఈఎస్ఐ సేవలు పొందడానికి ఉన్న గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ఆలోచన చేస్తున్నామని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విజయవాడలో ప్రాంతీయ కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఈఎస్ఐ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. దీంతో ఇప్పటివరకూ విజయవాడలో ఉన్న ఉప ప్రాంతీయ కేంద్రం ఆ రాష్ట్రానికి ప్రధాన కేంద్రమవుతుందని, తిరుపతిలో కొత్తగా ఒక ఉప ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. విజయవాడ కేంద్రానికి డెరైక్టర్‌గా పి.శివప్రసాద్‌ను నియమించినట్లు మంత్రి తెలిపారు. సనత్‌నగర్ ఆసుపత్రి స్థాయి పెంపు.. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిని 500 పడకల స్థాయికి పెంచనున్నామని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని దత్తాత్రేయ తెలిపారు. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, దాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు మార్చి.. ఖాళీ అయ్యే స్థలంలో అధునాతన హంగులతో 500 పడకల ఆసుపత్రిని నిర్మించాలన్నది తమ ప్రణాళిక అని వివరించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ వైద్యకళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి పనిచేయడం మొదలుపెడుతుందన్నారు. ఈఎస్ఐ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన వీడియో ప్రకటనను మంత్రి విడుదల చేశారు. 15వ తేదీ నుంచి టీవీ చానళ్లు, సినిమాహాళ్లలో ఈ ప్రకటన ప్రసారమవుతుందన్నారు. -
బీజేపీపై కేసీఆర్ విషప్రచారం..
కేంద్ర మంత్రి దత్తాత్రేయ గత ప్రభుత్వాలు చేసిన పనుల్ని తామే చేశామని చెప్పుకోవడం టీఆర్ఎస్కే చెల్లింది సైదాబాద్: బీజేపీపై కక్షగట్టి సీఎం కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆరోపించారు. స్మార్ట్‌సిటీల ఎంపికలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపలేదన్నారు. సీఎం కే సీఆర్నే హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ పేరును సూచిస్తూ కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు అబద్ధాలు చెబుతూ బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ సైదాబాద్ డివిజన్ అభ్యర్థి సంరెడ్డి శైలజా సుందర్‌రెడ్డి తరఫున శనివారం ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. రెడ్డి బస్తీ, పూసల బస్తీ, మాదిగ బస్తీ, ఏకలవ్యనగర్, సైదాబాద్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్ఎస్ విషప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, నగరాభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదని, కే వలం తన నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రమే ఉందని విమర్శించారు. 18 నెలల పాలనా కాలంలో ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన పనులు తామే చేశామని చెప్పుకోవడం టీఆర్ఎస్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. భాగ్యనగరిలో సిటీ కంట్రోల్ రూం నిర్మించకముందే, దానిని పూర్తి చేసినట్టు హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేసుకోవడమేంటని నిలదీశారు. ‘మెట్రో ఎవరు ప్రారంభించారు? ఎవరు నిధులు కేటాయించారు?’ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేయాలని కోరారు. రెడ్డి బస్తీలో గాంధీ వర్ధంతి సభలో పాల్గొని మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, కాసం వెంకటేశ్వర్లు, సుదర్శన్‌రెడ్డి, బండారి నవీన్‌కుమార్, శ్రీను, అరవింద్‌కుమార్, కోళ్ల గోపి, కడారి రాముయాదవ్ పాల్గొన్నారు. -
మాతోనే అభివృద్ధి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ అబిడ్స్: బీజేపీ, టీడీపీ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌సింగ్ తరఫున ఆయన శుక్రవారం ప్రచారం చేశారు. గోషామహల్ నుంచి ప్రారంభమైన రోడ్ షో షాహినాయత్‌గంజ్, గోడేకీకబర్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్న లక్ష్మణ్‌సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. అతనిని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు వైకుంఠం, బీజేపీ నేత లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో అలైన్మెంట్ మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్‌ను రాజకీయ కారణాలతో మార్పు చేయడం సరికాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ముందుగా నిర్ణయించిన మెట్రో మార్గం అయితే ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉం టుందని, ప్రభుత్వం మార్చాలనుకుంటున్న నూతన మార్గంలో రద్దీ తక్కువగా ఉంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, మెట్రోరైలు, ఎంఎంటీఎస్ రెండోదశపై ఆయన ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో తొలిదశ పథకాన్ని మియాపూర్-ఎస్.ఆర్ .నగర్ (12 కి.మీ), నాగోల్-మెట్టుగూడా (8కి.మీ) మార్గాల్లో వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. పన్నెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. సుమారు రూ.820 కోట్ల అం చనా వ్యయంతో చేపట్టనున్న ఈ పథకానికి గతేడాది బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయిం చినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును 2017 డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని ప్రకటిం చారు. ఎంఎంటీఎస్ రెండోదశను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్, కేంద్ర పౌరవిమానయాన శాఖలు చర్చించి తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల నిధులు కోరినట్లు తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లో ఏటా 9 శాతం మేర ట్రాఫిక్ పెరుగుతోందని, రోజురోజుకూ పెరుగుతోన్న ట్రాఫిక్ చిక్కులు, రవాణా పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరిపి సమీకృత ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనిదత్తాత్రేయ అన్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ఉన్న పలు రహదారులను రాష్ట్ర ప్రభుత్వం విస్తరించాలని సూచించారు. 2016 మార్చి నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్ పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను 2016 మార్చి నాటికి పూర్తికానుందని దత్తాత్రేయ తెలిపారు. ఈ పథకాన్ని పూర్తిచేసేందుకు కేంద్ర రైల్వేశాఖ పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసిందన్నారు. కాగా రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కాచిగూడ-మహబూబ్‌నగర్ డబ్లింగ్ రైల్వే లైను పనులకు త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. -
కారుకు బ్రేక్లువేయాలి: దత్తాత్రేయ
కూతురి కోసం కేసీఆర్ మోదీ కాళ్లు పట్టుకున్నాడు: రేవంత్ సాక్షి, హన్మకొండ: టీఆర్ఎస్ ‘కారు’కు బ్రేకులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. భూపాలపల్లిలో ఆదివారం జరిగిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి దేవయ్యను గెలిపించి కేసీఆర్‌కు షాక్ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హన్స్‌రాజ్ మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కవితమ్మకు మంత్రి పదవి కోసం అమరావతి పోయి చంద్రబాబు చేతులు, ఢిల్లీకి పోయి మోదీ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఓ నకిలీ నోటు: రేవంత్ మంత్రి కేటీఆర్ ఓ నకిలీ నోటు అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. భూపాలపల్లిలో ఆదివారం జరి గిన సభలో ఆయన మాట్లాడుతూ... ‘కేటీఆర్ ఓ నకిలీ నోటు. తారకరామరావు అనే నీ పేరు నీది కాదు. టీడీపీది, నీ చదువు అంతా గుం టూరు, పుణేలలో సాగింది. నీ ఉద్యోగం అమెరికాలో... 610 జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నువ్వు స్థానికేతరుడివి. ఈ రాష్ట్రంలో చప్రాసీ, బంట్రోతు ఉద్యోగం చేసే అర్హత నీకు లేదు. కానీ నీ తండ్రి నీకు మంత్రివర్గంలో చోటు కల్పించాడు’ అని విమర్శించారు. -
కొత్తగా ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి సాక్షి, హైదరాబాద్: కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ఆస్పత్రులు, డిస్పెన్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. కేంద్రమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మంగళవారం ఈఎస్ఐ కార్పొరేషన్ రీజనల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్మికశాఖలో జవాబుదారీతనం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏడాది కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. కార్మికుల పీఎఫ్‌కు అధిక వడ్డీ వచ్చేలా దేశ చరిత్రలో ఎవరూ సాహసించని షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు.అదే విధంగా చెల్లింపులు జరగని (అన్క్లైమ్) పీఎఫ్ నిధులు రూ.27 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. పీఎఫ్‌కు సంబంధించి యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్) తీసుకురావడం గొప్ప విజయమన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని బీడీ కార్మికుల పిల్లల స్కాలర్షిప్ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని లక్షా 20 వేల మందికి గాను రూ.13 కోట్ల 99 లక్షలు విడుదల చేశామన్నారు. కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల సమీకరణ వల్లే బిహార్‌లో ఓడిపోయాం.. బిహార్ శాసనసభ ఎన్నికల్లో కుల సమీకరణ వల్లే బీజేపీ ఓటమి పాలయిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. మూడు పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడినప్పటికీ బీజేపీ 50 స్థానాల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. -
హోదాకు సమానంగా ఏపీ అభివృద్ధి
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ♦ టీడీపీ, బీజేపీల మధ్య విభేదాల్లేవని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు సమానంగా ఉండేలా తగినంత సహాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందిస్తుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఉన్నత విద్యాసంస్థలు ఇచ్చామని, ఇతర ప్రాజెక్టులన్నీ ఇస్తామని.. ఇవన్నీ ప్రత్యేక హోదాకు ఇంచుమించు సమానంగా ఉన్నాయన్నారు. ఢిల్లీలోని కార్మిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని పట్నాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి దత్తాత్రేయ సమర్థిస్తూనే పై విధంగా బదులిచ్చారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఏపీని కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించే అవకాశాల్లేవా అని అడగ్గా.. ‘నేను అనడంలేదు కదా’ అంటూ బదులిచ్చారు. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య భేదాభిప్రాయాల్లేవని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బాలకార్మిక చట్టం-2015, బోనసు చట్టం-2015లను ప్రవేశ పెట్టనున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. వేతనాల నిబంధనలు, పారిశ్రామిక సంబంధాలపై నిబంధనలను, ఈపీఎఫ్ బిల్లు-2015, భవన, ఇతర నిర్మాణరంగాల కార్మికుల బిల్లు -2013లను కేంద్ర కేబినెట్ ముందుంచనున్నామని వివరించారు. దేవాదులపై టీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యతేది దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలేదని నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ బాధ్యత ఎందుకు నెరవేర్చడంలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పంచాయతీల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
కేంద్రమంత్రి దత్తాత్రేయ కొలనుపాక(ఆలేరు)/యాదగిరికొండ : తెలంగాణలో గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు మంజూరు చేయనుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామాన్ని శనివారం మంత్రి సందర్శించారు. అలాగే యాదగిరిగుట్ట దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. గుట్టకు రైల్వే స్టేషన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. -
నాలుగు కోడ్లుగా కార్మిక చట్టాలు
* కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడి పటాన్చెరు/రామచంద్రాపురం: దేశంలోని వివిధ రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మెదక్ జిల్లా పటాన్చెరు పీఎఫ్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1928 నుంచి 2008 వర కు మొత్తం 44 కార్మిక చట్టాలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ ఇండస్ట్రియల్ వేజ్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, వర్కింగ్ కండిషన్స్ అండ్ సేఫ్టీ కోడ్లుగా విభజించి కొత్త చట్టాలను అమల్లోకి తె స్తామని చెప్పారు. ఈ నెల 20న జాతీయ స్థాయిలో లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే ఈ సదస్సులో కార్మిక సంఘాలు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్రాల అధికారులు పాల్గొంటారని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేసే అంశం రాష్ట్రాలదేనన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు ఇళ్లు మొత్తం 4.3 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారని, వారందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని దత్తాత్రేయ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ పాల్గొన్నారు. లేబర్ ఎన్ఫోర్స్మెంట్ కార్మిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా లేబర్ ఎన్ఫోర్స్మెంట్ అవసరమని దానిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని దత్తాత్రేయ అన్నారు. మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సుమారు 7,832 పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై కూడా ఆలోచిస్తామన్నారు. పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, ఐడీఏ బొల్లారంలో ఈఎస్ఐ డిస్పెన్సరీలను మెరుగు పర్చేలా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డును ప్రవేశపెడుతుందన్నారు. ఈఎస్ఐ జాయింట్ డెరైక్టర్ పద్మజా, రీజినల్ డెరైక్టర్ రాయ్ పాల్గొన్నారు.