నేడు మహిళల మెగా జాబ్‌మేళా | Today's mega jabmela of womens | Sakshi
Sakshi News home page

నేడు మహిళల మెగా జాబ్‌మేళా

Published Sat, Feb 25 2017 5:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

నేడు మహిళల మెగా జాబ్‌మేళా

నేడు మహిళల మెగా జాబ్‌మేళా

ప్రారంభించనున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళల కోసం కేంద్ర కార్మిక శాఖ జాబ్‌మేళా నిర్వహిస్తోంది. నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్‌ స్కూల్‌లో శనివారం మధ్యాహ్నం 2గంటలకు కేంద్రమంత్రి దత్తాత్రేయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు తదితర 7 బ్యాంకుల ద్వారా ముద్ర, స్టార్టప్, స్టాండప్‌ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారు.

మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ష్యూర్‌ ఐటీ, హెచ్‌జీఎస్‌ ఇంటర్నేషనల్, టపాడియాటెక్, పంజర్‌ టెక్నాలజీస్, టీబీఎస్‌ఎస్‌ కార్వే, మెర్లిన్, కెయూఎన్‌ యునైటెడ్, ఇన్‌స్టేమి, ఏఆర్‌ఐఎస్‌ ఈహెచ్‌ఆర్, అడ్వెంట్‌ గ్లోబల్‌ తదితర 60 కంపెనీలు పాల్గొంటాయి. 2 వేల ఉద్యోగాలిచ్చేలా కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement