Central labor department
-
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
ఉద్యోగులకు శుభవార్త.. ఈఎస్ఐ వేతన పరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని చందాదారులకు కేంద్రం శుభవార్త చెప్పంది. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వేతన పరిమితి పెంపుతో జరిగే పరిణామాలపై కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తుకు ఉపక్రమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. 2014కు ముందు ఇది రూ.6,500 కాగా.. అప్పటి ప్రభుత్వం ఈ పరిమితిని రూ.15 వేల వద్ద ఫిక్స్ చేసింది. ఈపీఎఫ్ఓ ఫార్ములా ప్రకారం ఒక ఉద్యోగికి భవిష్యనిధి చందా కింద 12 శాతం యాజమాన్యం చెల్లిస్తుండగా, మరో 12 శాతం ఉద్యోగి వేతనం నుంచి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని (పెన్షన్ మినహా) ఉద్యోగి పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా ఈపీఎఫ్ఓ తిరిగి ఇచ్చేస్తుంది. ఉద్యోగికి లాభం..యాజమాన్యాలపై భారం చందాదారుడి గరిష్ట వేతన పరిమితి పెంపుతో ఉద్యోగికి లాభం కలగనుండగా.. అధిక చెల్లింపుల భారం యాజమాన్యాలపై పడనుంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం ఉద్యోగి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు కాగా అందులో 12 శాతాన్ని (రూ.1800) యాజమాన్యం సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇందులో నుంచి 8.33 శాతం(రూ.1250) పెన్షన్ ఖాతాకు బదిలీ అవుతుండగా... మిగతా 3.67 శాతం (రూ.550) మొత్తం భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం (రూ.1800) భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు. తాజాగా ఉద్యోగి వేతన పరిమితి రూ.21 వేలకు పెంచితే ఇందులోని 12 శాతం (రూ.2520) యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి పెన్షన్ ఖాతాలో రూ.1790, భవిష్య నిధి ఖాతాలో రూ.730 జమ అవుతాయి. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి రూ.2520 భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం ఈఎస్ఐ చట్టం కింద చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.21 వేలుగా ఉంది. రూ.21 వేలు దాటిన వారు ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. కాగా ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఈపీఎఫ్‌వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్‌వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్‌వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
ఈపీఎఫ్‌వోలో 13.95 లక్షల మంది చేరిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2023 నవంబర్ నెలలో 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఇందులో 7.36 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 1.94 లక్షల మంది మహిళలు కావడం గమనించొచ్చు. నవంబర్‌లో మొత్తం మహిళా సభ్యుల చేరిక 2.80 లక్షలుగా (20 శాతం) ఉంది. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి నికర సభ్యుల చేరిక, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర కారి్మక శాఖ విడుదల చేసిన పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సభ్యుల్లో 18–25 ఏళ్ల నుంచి చేరిన వారు 57.30 శాతం ఉన్నారు. 10.67 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థకు తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి 58.81 శాతం చేరారు. ఇందులో మహారాష్ట్ర వాటాయే 21.60 శాతంగా ఉంది. -
ఈపీఎఫ్‌వో కిందకు 16.99 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు. కేంద్ర కారి్మక శాఖ ఆగస్ట్ నెల ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్ట్‌లో 3,210 సంస్థలు మొదటి సారి ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ చేసుకున్నాయి. సుమారు 11.88 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం ద్వారా ఈపీఎఫ్‌లో కిందకు మళ్లీ వచ్చి చేరారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారు 58.36 శాతంగా ఉన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి చేరిన చేరిన మహిళలు 2.44 లక్షల మంది ఉన్నారు. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.43 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి 9.96 లక్షల మంది ఆగస్ట్‌లో ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. వ్యాపార దుకాణాలు, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు సేవలు, టెక్స్‌టైల్స్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 39.87 మంది సభ్యులు నైపుణ్య సేవలకు సంబంధించి ఉన్నారు. -
సింగరేణిలో పోరు సైరన్
ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం/కరీంనగర్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సింగరేణి కార్మిక సంఘాలు, యాజమాన్యం ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ సమావేశమైంది. తీవ్ర ఉత్కంఠల నడుమ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్ లేబర్‌కమిషనర్ (సెంట్రల్) శ్రీనివాసులు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ ఇలా: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 28న నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 30న ప్రకటిస్తారు. అభ్యంతరాల స్వీకరణ, మార్పులుచేర్పుల తర్వాత తుది జాబితా అక్టోబర్ 5న విడుదల చేస్తారు. 6, 7 తేదీల్లో సాయంత్రం 5గంటల వరకు హైదరాబాద్‌లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 10న గుర్తులు కేటాయిస్తారు. 28న సింగరేణి సంస్థ విస్తరించిన 11 ఏరియాలు, కార్పొరేట్ లో పోలింగ్ జరుగుతుంది. సింగరేణిలో ప్రస్తుతం 42,390 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాయిదాకు ససేమిరా: హైకోర్టు తీర్పు అనుసరించి గుర్తింపు సంఘం ఎన్నికలపై బుధవారం హై దరాబాద్‌లో జరిగిన సమావేశంలో హైడ్రామా చో టు చేసుకుంది. మొత్తం 16 కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఏఐటీయూసీ, బీఎంఎస్ కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వ హించాలని తమ అభిప్రాయం తెలిపాయి. టీబీజీకేఎస్‌తో పాటు మరికొన్ని సంఘాలు ఎన్నికలు వాయిదా వేయాలన్నాయి. కొందరు కార్మిక సంఘాల ప్రతినిధులు తటస్థంగా ఉన్నా రు. దీంతో కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేసేందుకు యాజమాన్యం తరఫున హాజరైన ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు. వాయిదాపై ఏకాభిప్రాయం వస్తే కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేద్దామంటూ మంతనాలు సాగించారు. అయితే సమావేశం చివరివరకు కూడా ఎన్నికల వాయిదాకు ఏఐటీయూ సీ, బీఎంఎస్‌లు అంగీకరించలేదు. ఎన్నికలు నిర్వహించాల్సిందేన ని పట్టుబట్టాయి. దీంతో కోర్టు తీర్పు ప్రకారం ఎ న్నికల షెడ్యూల్ జారీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలై ఉంది. సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమే అంటూ ఇదివరకే ఆ జిల్లాల పరిదిలోని అధికారులు చేతులెత్తేశారు. మెజారిటీ సంఘాలు కూడా ఎన్నికల వాయిదాకే పట్టుబట్టాయి. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉంది. 2 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించే అవకాశం సింగరేణికి లభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 20కిపైగా బొగ్గుగనుల బృందాలు రానున్నాయి. ఇదే కాకుండా అతి కీలకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతోంది. -
మే నెలలో కొత్తగా 8.83 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో 8.83 లక్షల మంది కొత్త వారికి ఉపాధి లభించింది. వీరంతా ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా వచ్చి చేరారు. ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మే నెలలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన సభ్యుల సంఖ్య 16.30 లక్షలుగా ఉంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను గురువారం విడుదల చేసింది. కొత్తగా 3,673 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ సంస్థలు అన్నీ కూడా మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో ఎక్కువ సభ్యుల చేరిక మేలోనే నమోదైంది. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 56 శాతంగా ఉన్నారు. సంఘటిత రంగంలో యువత గణనీయ స్థాయిలో ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా విద్య పూర్తయిన తర్వాత ఈ వయసు వారే ఉద్యోగాన్వేషణ చేస్తుంటారని తెలిసిందే. కొత్త సభ్యుల్లో 2.21 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద మే నెలలో చేరిన మహిళా సభ్యుల 3.15 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు అధికంగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల నుంచే 57.85 శాతం మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చి చేరారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 19.32 శాతం మంది సభ్యులయ్యారు. బిల్డింగ్, నిర్మాణం, వ్రస్తాల తయారీ, ఎల్రక్టానిక్ మీడియా, టెక్స్టైల్స్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. మొత్తం సభ్యుల్లో 42 శాతం మేర నైపుణ్య సేవల విభాగం కిందే ఉన్నారు. -
చిక్కుకుపోయిన వలస కార్మికులు 26 లక్షలు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఎంతగా అవస్థలు పడ్డారో దేశమంతా చూసింది.. ఇంతకీ లాక్డౌన్ కారణంగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు 26 లక్షల మంది. చిక్కుకుపోయిన వారిలో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో, అత్యల్పంగా చండీగఢ్‌లో ఉన్నారు. లాక్డౌన్ ప్రకటించే నాటికి తెలంగాణలో దాదాపు 1.93 లక్షల మంది చిక్కుకుపోగా, ఏపీలో లక్ష మంది ఉన్నారు. వలస కార్మికులపై కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ఓ నివేదిక వెల్లడించింది. దానిలోని అంశాలిలా ఉన్నాయి.. ► మార్చి 25న లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నాటికి దేశంలో 26 లక్షల మందికి పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారు. ► వారిలో 46 శాతం మంది ఆ వలస ప్రాంతాల్లో తాము నివాసం ఉంటున్న చోటే ఉండిపోయారు. ► మరో 43 శాతం మందికి.. వారికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల యాజమాన్యాలు ఆశ్రయం కల్పించాయి. ► 10 శాతం మంది ప్రభుత్వ పునరావాస, సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. తమిళనాడు, పంజాబ్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రభుత్వ సహాయక శిబిరాల్లో ఒక్కరు కూడా లేరు. వలస కార్మికుల్లో ఏఏ రాష్ట్రాలకు చెందినవారు ఎంతమంది ఉన్నారన్న విషయం కేంద్ర కార్మిక శాఖ వెల్లడించలేదు. -
ఉద్యోగుల కనీస వేతనం రూ. 9,880
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా ఉండాలని జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ నిర్ధారించింది. దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ గతంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించిన నిపుణుల కమిటీ... జాతీయ స్థాయిలో ఐదు రీజియన్లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలను రెండో రీజియన్‌లో చేర్చింది. జూలై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కనీస వేతనాన్ని నిర్ధారించింది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ. 4,570గా ఉండేది. గత ఏడేళ్లలో జీవన వ్యయంలో భారీ మార్పులు వచ్చాయి. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వేతన సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఆ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి కనీస వేతన మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు అందజేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం కనీస వేతన విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. తక్కువ వేతనం ఉండొద్దు... జాతీయ కనీసవేతన నిపుణుల కమిటీ సూచన ప్రకారం ఉద్యోగికి నిర్దేశిత వేతనం కంటే తక్కువగా ఉండొద్దు. తక్కువ వేతనమున్న ఉద్యోగులకు సదరు కంపెనీ యాజమాన్యం నిర్దేశిత వేతనాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల నిర్దేశిత వేతనం కంటే ఎక్కువగా చెల్లిస్తే మాత్రం వేతన పెంపు యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
కనీస వేతనాలు ఇవ్వాల్సిందే!
- కేంద్రం నిర్దేశించిన మేర చెల్లించాలంటూ - సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన - 7 గంటల పాటు కేంద్ర కార్మిక శాఖ అధికారుల నిర్బంధం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమకు కనీస వేతనాలు చెల్లించాలంటూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సోమవారం కేంద్ర కార్మిక శాఖ, సింగరేణి బొగ్గు గనుల సంస్థల ఉన్నతాధికారులను నిర్బంధించారు. సుమారు ఏడు గంటల పాటు నిర్బంధించి ఆందోళన చేశారు. చివరికి ఈనెల 31లోగా కనీస వేతనాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ ఉన్నతాధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెద్ద సంఖ్యలో కార్మికులతో.. కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నిర్వహణపై సోమవారం హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ)లో సన్నాహక సమావేశం జరిగింది. సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్ విభాగం) అనిల్‌కుమార్, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్లు లక్ష్మయ్య, బి.శ్రీనుతో పాటు 15 సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకాగా.. కొద్దిసేపటికే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చారు. కేంద్ర కార్మిక శాఖ గత జనవరి 19న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. తమ రోజువారీ కనీస వేతనాన్ని రూ.319 నుంచి రూ.359కు పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేదాకా, రాతపూర్వకంగా హామీ ఇచ్చేదాకా కదిలేది లేదంటూ బైఠాయించారు. గత మార్చిలో 9 రోజుల పాటు కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయడంతో ఆయా డిమాండ్లను నెరవేరుస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని... కానీ తర్వాత పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. ససేమిరా అన్న సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల ఆందోళన నేపథ్యంలో.. సింగరేణి సంస్థ అధికారులు, జేఏసీ నేతలతో కేంద్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ ఎ.గోవర్ధన్, కేంద్ర కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ నిర్దేశించిన ప్రకారమే గత 40 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తున్నామని సింగరేణి యాజమాన్యం తరఫున సంస్థ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక శాఖలు నిర్దేశించిన కనీస వేతనాల్లో ఏది ఎక్కువగా ఉంటే దానినే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లించాలని కోరారు. చివరికి ఈ నెల 31వ తేదీలోగా కేంద్రం నిర్దేశించిన కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర అధికారులు ఎ.గోవర్ధన్, శ్యాంసుందర్‌లు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో జేఏసీ నేతలు బి.మధు (సీఐటీయూ), పులి రాజిరెడ్డి(బీఎంఎస్), శంకర్, వెంకన్న (ఐఎఫ్టీయూ) తదితరులు పాల్గొన్నారు. -
50 లక్షల మందికి ఉద్యోగాలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: వేతన, ఉద్యోగ, సామాజిక భద్రతలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. రానున్న కాలంలో 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ తదితర సంస్థల ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన సదస్సులో దత్తాత్రేయ ప్రసంగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పాల్గొన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. కార్మిక మంత్రిత్వ శాఖ గత మూడేళ్లలో కార్మికులకు అనుకూలంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని నక్వీ ఈ సందర్భంగా కొనియాడారు. మూడేళ్లలో ఈపీఎఫ్ఓ అమలు చేసిన కార్యక్రమాలపై చిత్రీకరించిన డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. సికింద్రాబాద్, ఈపీఎఫ్ఓకు చెందిన ఆల్టర్ నెట్ డేటా సెంటర్, మెహదీపట్నం, కూకట్పల్లి, పటాన్‌చెరుల్లో ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలను ఆన్లైన్ ద్వారా మంత్రులు ప్రారంభించారు. అలాగే ఈపీఎఫ్ఓ కొత్త వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. -
ప్రతి కార్మికుడికి ఆన్లైన్లో వేతనం
కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్యామ్ సుందర్ సాక్షి, హైదరాబాద్: వేతన పంపిణీలో పారదర్శకత కోసం ప్రతి కార్మికుడికి ఆన్లైన్ పద్ధతిలోనే వేతన చెల్లింపులు జరుపుతామని కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. ఇకపై చేతికి వేతన నగదు ఇచ్చినట్లు తెలిస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర కార్మిక శాఖ మూడేళ్ల పనితీరుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బోనస్ చట్టం మార్పులతో కనీస వేతన పరిమితి రూ.10వేల నుంచి రూ.21వేలకు పెరిగిందని, అదేవిధంగా బోనస్‌ను రూ.3500 నుంచి రూ.7వేలకు పెంచామన్నారు. బాలకార్మిక చట్ట సవరణతో ఇటీవల 990 పారిశ్రామిక వివాదాలు పరిష్కరించామని, ఫలితంగా 73,814 మంది ప్రయోజనం పొందారన్నారు. కనీస వేతనాల చట్టం కింద నమోదైన కేసులలో 14,147 మంది కార్మికులకు రూ.2.71 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందన్నారు. ఇక గ్రాట్యుటీ దరఖాస్తుల్లో 368 మంది కార్మికులకు రూ.3.50 కోట్ల లబ్ధి కలిగిందన్నారు. చట్టాల అమలుపై క్షేత్రస్థాయిలో 5,589 తనిఖీలు నిర్వహించగా, 53,054 అవకతవకలు గుర్తించామని, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నేడు మహిళల మెగా జాబ్‌మేళా
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళల కోసం కేంద్ర కార్మిక శాఖ జాబ్‌మేళా నిర్వహిస్తోంది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో శనివారం మధ్యాహ్నం 2గంటలకు కేంద్రమంత్రి దత్తాత్రేయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, అలహాబాద్ బ్యాంకు తదితర 7 బ్యాంకుల ద్వారా ముద్ర, స్టార్టప్, స్టాండప్ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ష్యూర్ ఐటీ, హెచ్జీఎస్ ఇంటర్నేషనల్, టపాడియాటెక్, పంజర్ టెక్నాలజీస్, టీబీఎస్ఎస్ కార్వే, మెర్లిన్, కెయూఎన్ యునైటెడ్, ఇన్స్టేమి, ఏఆర్ఐఎస్ ఈహెచ్‌ఆర్, అడ్వెంట్ గ్లోబల్ తదితర 60 కంపెనీలు పాల్గొంటాయి. 2 వేల ఉద్యోగాలిచ్చేలా కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
కనీస వ్యవసాయ కూలీ 350
దత్తాత్రేయ వెల్లడి న్యూఢిల్లీ: కేంద్ర పరిధిలోని సి-క్లాస్ పట్టణాల్లో నైపుణ్యంలేని వ్యవసాయ కూలీకి రోజువారీ కనీస వేతనం రూ. 350 గా ఉండాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది నవంబర్ 1వ నుంచి అమలులోకి తేవాలని సంకల్పించింది. ప్రస్తుతం కేంద్ర పరిధిలోని వ్యవసాయ కార్మికులకు జాతీయ కనీస కూలీ కింద రోజుకు రూ. 160 చెల్లిస్తున్నారు. కనీస వేతనాలను పెంచుతూ తమ మంత్రిత్వశాఖ నవంబర్ 1వ తేదీన నోటిఫై చేస్తుందని కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అలాగే.. దేశవ్యాప్తంగా కూడా ప్రామాణిక కనీస వేతనాన్ని నిర్ధారించేందుకు కనీస వేతనాల చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పారు. దీనిని సార్వజనీన కనీస వేతనంగా పరిగణిస్తామన్నారు. ‘‘ఒకసారి సవరించిన తర్వాత అది చట్టమవుతుంది. అప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ వేతనాల ప్రమాణాలను వర్తింపజేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్తించే ప్రామాణిక కనీస వేతనం ఏదీ లేనందున.. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ తరగతుల కార్మికులకు వేతనాలను నిర్ణయించే స్వేచ్ఛ ఉంది. కేంద్రం కనీస వేతనాల చట్టానికి సవరణ చేసి ప్రామాణిక కనీస వేతనాన్ని నిర్ణయించినట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అనుసరించాల్సి ఉంటుంది. ‘వేతనాల స్మృతి (కోడ్ ఆన్ వేజెస్)’, పారిశ్రామిక సంబంధాల స్మృతి (కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్) పై త్రైపాక్షిక సమావేశం ముగిసిందని, ఇప్పుడవి కేబినెట్ ఆమోదానికి వెళతాయని, ఆ తర్వాత వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తాయని దత్తాత్రేయ వెల్లడించారు. -
కనీస వేతనం ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రోజులు గడుస్తున్నా కనీస వేతనంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కార్మికులు నిరుత్సాహంలో కూరుకుపోతున్నారు. కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన రూ. 10 వేల కనీస వేతనం కంటే కాస్త ఎక్కువగానే రాష్ట్రంలో ఉండేలా చూస్తామని ‘మే డే’ సందర్భంగా రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. దీన్ని జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రకటిస్తామని చెప్పారు. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు కనీస వేతన అంశాన్ని వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతం కనీస వేతనం కింద చాలా వాటిల్లో రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు అనుగుణంగా నైపుణ్య రహిత కార్మికులకు కనీస వేతనం రూ. 10 వేలకు పైగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. అందుకు అనుగుణంగా రూ. 10,700 ఉండేలా చూడాలని రాష్ట్ర కార్మికశాఖ భావించింది. ఈ నిర్ణయం వెలువడితే దాదాపు రాష్ట్రంలో 4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. -
బడ్జెట్లో వైద్యానికి రూ.6 వేల కోట్లేనా?
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ విమర్శ సాక్షి, హైదరాబాద్: లక్షా 30 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వైద్యానికి కేవలం రూ.6 వేల కోట్లే కేటాయించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవంలో దత్తాత్రేయ మాట్లాడారు. వైద్యసేవల్లో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్సహా వివిధ రకాల వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు వేల రూపాయల ఖర్చు చేసి ప్రైవేటులో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యరంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో హెల్త్ రికార్డ్సు మొత్తం కంప్యూటరైజేషన్ చేస్తున్నామన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించారన్నారు. వైద్యులు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రి నెలకొల్పాలన్నా... ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలన్నా తాను సహకరిస్తానన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ వివేక్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, మాజీ డీఎంఈ పుట్టా శ్రీనివాస్, కేర్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు సి.రామకృష్ణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.