న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2023 నవంబర్ నెలలో 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఇందులో 7.36 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 1.94 లక్షల మంది మహిళలు కావడం గమనించొచ్చు. నవంబర్‌లో మొత్తం మహిళా సభ్యుల చేరిక 2.80 లక్షలుగా (20 శాతం) ఉంది. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఇది తెలియజేస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి నికర సభ్యుల చేరిక, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర కారి్మక శాఖ విడుదల చేసిన పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సభ్యుల్లో 18–25 ఏళ్ల నుంచి చేరిన వారు 57.30 శాతం ఉన్నారు. 10.67 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థకు తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి 58.81 శాతం చేరారు. ఇందులో మహారాష్ట్ర వాటాయే 21.60 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment